“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)
“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023
పరివర్తనే మన లక్ష్యం
పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పట్ల మన పరివర్తనను హెచ్చించడం మరియు వారి వలె ఎక్కువగా కావడానికి మనకు సహాయపడడమే సమస్త సువార్త అభ్యాసము మరియు బోధన యొక్క లక్ష్యము. ఈ కారణంచేత మనం సువార్తను అధ్యయనం చేసినప్పుడు, మనం కేవలం కొత్త సమాచారం కోసం చూడడం లేదు; మనం “నూతన సృష్టిగా” మారాలి అని అనుకుంటున్నాము (2 కొరిథీయులకు 5:17). దీని అర్థము మన హృదయాలు, మన అభిప్రాయాలు, మన చర్యలు మరియు మన స్వభావాలను మార్చుకొనుటలో మనకు సహాయపడేందుకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై ఆధారపడడం.
కానీ, మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన అనే అద్భుతానికి నడిపించే అటువంటి సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరుగదు. ఇది తరగతి గదుల నుండి మన హృదయాలు మరియు గృహాలకు వ్యాపిస్తుంది. సువార్తను అర్థం చేసుకొని, జీవించడానికి నిలకడగల, అనుదిన ప్రయత్నాలు అవసరము. నిజమైన పరివర్తనకు నడిపించే సువార్త అభ్యాసానికి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము అవసరము.
పరిశుద్ధాత్మ మనల్ని సత్యమునకు నడిపించి, ఆ సత్యము గురించి సాక్ష్యమిచ్చును (యోహాను 16:13 చూడండి). ఆయన మన మనస్సులను వెలుగుతో నింపును, మన అవగాహనను వేగవంతము చేయును మరియు సమస్త సత్యమునకు మూలాధారమైన దేవుని నుండి బయల్పాటుతో మన హృదయాలను తాకును. పరిశుద్ధాత్మ మన హృదయాలను శుద్ధి చేయును. సత్యమును బట్టి జీవించాలనే కోరికను ఆయన మనలో ప్రేరేపించును మరియు దానిని చేసే విధానాలను గుసగుసలాడుట ద్వారా మనకు తెలియజేయును. నిజముగా, “పరిశుద్ధాత్మ … సమస్తమును (మనకు) బోధించును” (యోహాను 14:26).
ఈ కారణాలను వలన, సువార్తను జీవించి, అభ్యసించి, బోధించేందుకు మన ప్రయత్నాల్లో మనము అన్నిటికంటే ముందుగా ఆత్మ యొక్క సహవాసాన్ని వెదకాలి. ఈ లక్ష్యము మన ఎంపికలను ప్రభావితం చేయాలి, మన ఆలోచనలను మరియు క్రియలను నడిపించాలి. ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించే ప్రతిదానిని మనం కోరుకోవాలి మరియు ఆ ప్రభావాన్ని పారద్రోలే ప్రతిదానిని తిరస్కరించాలి—ఎందుకనగా, పరిశుద్ధాత్మ సమక్షంలో మనము యోగ్యులుగా ఉండగలిగినట్లయితే, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సమక్షంలో జీవించడానికి కూడా మనము యోగ్యులము కాగలము.