లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 37


37వ ప్రకరణము

1830 డిసెంబరు, న్యూయార్క్‌లోని ఫేయెట్ సమీపమున ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లకివ్వబడిన బయల్పాటు. ఈ యుగములో ఒక కూడికను గూర్చిన మొదటి ఆజ్ఞ ఈ బయల్పాటులో ఇవ్వబడినది.

1–4, ఒహైయోలో కూడుకొనుటకు పరిశుద్ధులు పిలువబడిరి.

1 ఇదిగో, శత్రువు మూలముగా మరియు మీ ప్రయోజనము నిమిత్తము మీరు ఒహైయోకు వెళ్ళువరకు మీరు అనువదించుట ఇక ఏమాత్రము నా యందు యుక్తము కాదు.

2 మరలా, ఆ ప్రాంతాలలో నా సువార్తను ప్రకటించి, ఎక్కడైతే సంఘము కనుగొనబడునో అక్కడ, ముఖ్యముగా కొలిస్విల్లిలో దానిని బలపరచు వరకు మీరు వెళ్ళకూడదని నేను మీకు సెలవిచ్చుచున్నాను; ఏలయనగా ఇదిగో, విశ్వాసముతో వారు నాకు ప్రార్థించుచున్నారు.

3 మరలా, ఈ సంఘమునకు నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ వారి యొద్దకు తిరిగి వచ్చు సమయము కొరకు వారు ఒహైయోలో తప్పక సమకూడవలెను అనునది నా యందు యుక్తమైయున్నది.

4 ఇదిగో, ఇందులో జ్ఞానము కలదు మరియు నేను వచ్చువరకు ప్రతి మనుష్యుడు తనకుతానే ఎంపిక చేసుకొనవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.