లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 79


79వ ప్రకరణము

1832, మార్చి 12న హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.

1–4, ఆదరణకర్త చేత సువార్తను ప్రకటించుటకు జెరెడ్ కార్టర్ పిలువబడెను.

1 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా సేవకుడైన జెరెడ్ కార్టర్ తాను నియమించబడిన నియామకపు అధికారమందు మరలా తూర్పు దేశములలో ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు, ఒక పట్టణము నుండి మరియొక పట్టణమునకు వెళ్ళి, మహాసంతోషకరమైన సువర్తమానములను అనగా నిత్యసువార్తను ప్రకటించవలెను.

2 అతనిపై నేను ఆదరణకర్తను పంపెదను, అది అతనికి సత్యమును, అతడు వెళ్ళవలసిన మార్గమును బోధించును;

3 అతడు విశ్వాసముగానుండిన యెడల, పనలతో మరలా అతనికి కిరీటము ధరింపజేతును.

4 కాబట్టి, నా సేవకుడైన జెరెడ్ కార్టర్, నీ హృదయమును సంతోషించనివ్వమని, భయపడకుమని నీ ప్రభువైన యేసు క్రీస్తు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.