సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము


“ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము,” రక్షకుని విధానములో బోధించుట

ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము

ప్రియమైన సహోదర సహోదరీలారా,

యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించుటకు అద్భతమైన అవకాశాన్ని మీరు కలిగియున్నారు! బోధించుటకు నిర్దిష్టమైన పిలుపును మీరు కలిగియున్నా లేకపోయినా, మీరు బోధకులే. ప్రావీణ్యముగల బోధకుడైన యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మీరు ఎక్కడికి వెళ్ళినా—గృహములో, సంఘములో, ఇతరులకు పరిచర్య చేస్తున్నప్పుడు మరియు మీ స్నేహితుల మధ్య ఉన్నప్పుడు—ఆయన వెలుగును పంచుకునే అవకాశాలను మీరు కలిగియున్నారు. సువార్త బోధించుట ఒక పవిత్రమైన నమ్మకము. ఇది ప్రభువు కార్యములో ముఖ్యమైన భాగము మరియు మనం దానిని ఆయన విధానములో చేసినప్పుడు అది ఉత్తమంగా పనిచేస్తుంది.

యేసు క్రీస్తు గురించి మరియు ఆయన సువార్తను ఎలా బోధించారో అనే దాని గురించి మరింత తెలుసుకొనుటకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఆయన మాటలు, ఆయన క్రియలు మరియు ఆయన లక్షణాలను ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేయండి మరియు ఆయనను మరింత దగ్గరగా అనుసరించడానికి కృషి చేయండి. రక్షకుని విధానములో బోధించుట మీ మార్గదర్శి కాగలదు.

ప్రథమ అధ్యక్షత్వము

ముద్రించు