“రక్షకుని విధానములో బోధించుట యొక్క ఉద్దేశ్యము,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)
“రక్షకుని విధానములో బోధించుట యొక్క ఉద్దేశ్యము,” రక్షకుని విధానములో బోధించుట
రక్షకుని విధానములో బోధించుట యొక్క ఉద్దేశ్యము
ఈ వనరులో వివరించబడిన సూత్రాలు రక్షకుని విధానములో బోధించుటకు ప్రతీ సువార్త బోధకునికి సహాయపడగలవు. వారిలో తల్లిదండ్రులు, పరిచర్య చేసే సహోదరులు మరియు సహోదరీలు, సెమినరీ మరియు ఇన్‌స్టిట్యూట్ బోధకులు మరియు బోధించుటకు అవకాశము కల్పించు సంఘ పిలుపు కలిగియున్న వారెవరైనా ఉంటారు.
మీరు ఈ వనరును మీ స్వంతంగా అధ్యయనం చేయవచ్చు లేదా మెరుగైన బోధకులుగా ఎలా మారాలనే దాని గురించి ఇతరులతో చర్చలకు మార్గనిర్దేశం చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఈ వనరును గృహ సాయంకాలములు, అధ్యక్షత్వ సమావేశాలు, వార్డు లేదా స్టేకు సలహామండలి సమావేశాలు, సెమినరీ మరియు ఇన్‌స్టిట్యూట్ ఇన్-సర్వీస్ సమావేశాలు మరియు బోధకుల సలహామండలి సమావేశాలలో ఉపయోగించవచ్చు (“నాయకుల కొరకు—బోధకుల విజయానికి సహాయము చేయుట” చూడండి).
ఈ వనరు ఏవిధముగా అమర్చబడినది
1వ భాగము మనం యేసు క్రీస్తు సువార్త సూత్రాలను బోధించిన ప్రతీసారి ఆయనపై కేంద్రీకరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ విభాగం మనం ఏమి బోధిస్తామో వివరిస్తుంది.
2వ భాగము క్రీస్తును పోలిన బోధన యొక్క సూత్రాలను నొక్కి చెబుతుంది. ఈ విభాగం మనం ఎలా బోధిస్తామో వివరిస్తుంది.
3వ భాగము క్రీస్తును పోలిన బోధనా సూత్రములను అన్వయించుటలో బోధకులకు సహాయపడుటకు ఆచరణాత్మక సూచనలు ఇస్తుంది.
క్రీస్తును పోలిన బోధన యొక్క సమీక్ష
క్రింది చార్టులు ఈ వనరులో బోధించబడిన సూత్రాల యొక్క సమీక్షను అందిస్తాయి.