లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 126


126వ ప్రకరణము

1841, జులై 9న నావూ, ఇల్లినాయ్‌లో బ్రిగమ్ యంగ్ గృహములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సమయములో బ్రిగమ్ యంగ్ పన్నెండుమంది అపొస్తలుల సమూహమునకు అధ్యక్షుడిగానుండెను.

1–3, బ్రిగమ్ యంగ్ తాను చేసిన పనులకు మెచ్చుకొనబడెను, భవిష్యత్తులో విదేశాలకు చేయవలసిన ప్రయాణమునుండి విముక్తి పొందెను.

1 ప్రియమైన, అత్యంత ప్రియ సహోదరుడా బ్రిగమ్ యంగ్, నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నా సేవకుడైన బ్రిగమ్, గతములో వలే నీవు నీ కుటుంబమును విడిచి ప్రయాణించుట ఇక ఎంతమాత్రము అవసరము లేదు, ఏలయనగా నీ అర్పణ నాకు అంగీకారముగానున్నది.

2 నా నామము కొరకు చేసిన ప్రయాణములలో నీ పనులను, కష్టమును నేను చూచియున్నాను.

3 కాబట్టి నా వాక్యమును విదేశాలకు పంపమని, ఇకనుండి ఎప్పటికీ నీ కుటుంబముపై ప్రత్యేక శ్రద్ధ చూపమని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను. ఆమేన్.