లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 80


80వ ప్రకరణము

1832, మార్చి 7న హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా స్టీఫెన్ బర్నెట్‌కు ఇవ్వబడిన బయల్పాటు.

1–5, స్టీఫెన్ బర్నెట్ మరియు ఈడెన్ స్మిత్, వారు ఎంచుకొను ఏ ప్రదేశమందైనను ప్రకటించుటకు పిలువబడిరి.

1 నా సేవకుడైన స్టీఫెన్ బర్నెట్, నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నీవు వెళ్ళుము, నీవు లోకమునకు వెళ్ళి, నీ స్వరము వినబడు పరిధిలో వచ్చు ప్రతి జీవికిని సువార్తను ప్రకటించుము.

2 నీవు సహచరుడిని కోరిన యెడల, నా సేవకుడైన ఈడెన్ స్మిత్‌ను నేను నీకిచ్చెదను.

3 కాబట్టి, నీవు వెళ్ళి నా సువార్తను ప్రకటించుము, ఉత్తరముకైనను, దక్షిణముకైనను, తూర్పుకైనను, పశ్చిమముకైనను అది ప్రాముఖ్యము కాదు, ఏలయనగా నీవు తప్పిదము చేయలేవు.

4 నీవు విని, నిశ్చయముగా నమ్మి, సత్యమని తెలుసుకొనిన సంగతులను ప్రకటించుము.

5 ఇదిగో, నిన్ను పిలిచియున్నవాడు, నీ విమోచకుడైన యేసు క్రీస్తు చిత్తము ఇదియే. ఆమేన్.