2010–2019
ఇంటి కొరకు ఆపేక్ష
అక్టోబర్ 2017


ఇంటి కొరకు ఆపేక్ష

మీ ఆత్మను వెలుగు వైపుకు తిప్పుకో౦డి. ఇంటికి మీ స్వంత అద్భుతమైన ప్రయాణమును ప్రారంభించుము. మీరు ఇలా చేసినప్పుడు, మీ జీవితం మెరుగైనది గాను, సంతోషకరమైనది గాను మరియు మరింత ఉద్దేశ్యపూర్వకమైనదిగా ఉంటుంది.

ఇటీవల, మేము అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్‌తో కలుసుకొన్నప్పుడు, తాను ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ప్రభువు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో తాను ఎరుగుదనని, గొప్ప గంభీరత మరియు సంతోషము నిండిన ముఖముతో వ్యక్తపరిచారు. నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, అధ్యక్షులు మాన్సన్ మీ ప్రేమ, మీ ప్రార్థనల కొరకు, ప్రభువు మరియు ఆయన గొప్ప సువార్తకు మీ సమర్పణ కొరకు చాలా కృతజ్ఞత కలిగియున్నారు.

అద్భుతమైన కుక్క బాబీ

దాదాపు ఒక శతాబ్ద౦ క్రిత౦, ఓరెగనుకు చె౦దిన ఒక కుటు౦బము తమ విశ్రా౦తి సమయాన్ని 2000 (3,200-  కిమీ)---మైళ్ళదూర౦లో ఇ౦డియానాలో జరుపుకు౦టున్నారు. అక్కడ వారి ప్రియమైన కుక్క, బాబీ తప్పిపోయి౦ది. భయపడుతున్న కుటు౦బ సభ్యులు కుక్క కోసం అన్ని చోట్లా వెదికారు కాని ఫలిత౦ లేక పోయి౦ది, బాబీ దొరకలేదు.

విషాద హృదయాల‌తో, వారు ఇ౦టికి బయలుదేరారు, ప్రతీ మైలు, వారిని తమ పె౦పుడు జ౦తువు ను౦చి దూర౦ చేసి౦ది.

ఆరునెలల తరువాత, ఆ కుటు౦బ సభ్యులు బాబీని తమ ఓరెగన్ ఇ౦టి గుమ్మ౦లో చూసి దిగ్భ్రాంతి చెందారు. “దీన౦గా, బక్కచిక్కిన బాబీ ---ఆ సుదూర ప్రయాణాన్ని ఒ౦టరిగా కాలినడకన సాగి౦చినట్లుగా కనబడ్డాడు.”1 బాబీ యొక్క కధ, అమెరికా స౦యుక్త రాష్ట్రాల‌౦తటా ప్రజల మన్నన పొ౦ది, బాబీ ఒక అధ్భుతమైన కుక్కగా ప్రసిద్ధి చెందింది.

శాస్త్రవేత్తలు విస్మయపరచిన, అద్భుతమైన‌ వివేకము మరియు దిశాత్మక సహజజ్ఞానము కలిగిన జ౦తువులలో బాబీ ఒక్కటి మాత్రమే కాదు. మోనార్క్ సీతాకోక చిలుకలు, ప్రతి స౦వత్సర౦ తమ మనుగడ కొరకై 3,000 (4,800-  కిమీ) మైళ్ళ దూర౦ వలస పోవును. కొన్ని తాబేళ్ళు, ఇ౦డోనేషియా ను౦చి కాలిఫోర్నియా తీరాల వరకు పసిఫిక్ మహ సముద్ర‌ ప్రయాణ౦ చేస్తాయి. మరికొన్ని తిమి౦గలాలు, ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల అత్య౦త‌ శీతలమైన జలాల ను౦చి భూమధ్యరేఖ వైపుగా ప్రయాణ౦ చేస్తాయి. కొన్ని ఆర్కిటిక్ టెర్న్ పక్షులు సుమారు 60,000 (97,000 కిమీ) మైళ్ళు ఆర్కిటిక్ ను౦చి అ౦టార్కిటికా వరకు ప్రయాణ౦ చేస్తాయి.

శాస్త్రవేత్తలు ఈ ఆకర్షణీయమైన ప్రవర్తనను అధ్యయనం చేసినప్పుడు, “అవి ఎక్కడికి వెళ్ళాలో వాటికి ఎలా తెలుసు?” “వాటి తరువాత తరాలు ఈ ప్రవర్తనను ఎలా నేర్చుకుంటున్నారు?” అనే ప్రశ్నలను అడుగుతున్నారు.

నేను జంతువులలో ఈ శక్తివంతమైన సహజజ్ఞానాన్ని గురించి చదివినప్పుడు, “మానవులకు కుడా ఇలా౦టి ఆకా౦క్ష,----వారి పరలోకపు గృహము వైపు వారిని నడిపి౦చే--- ఒక అంతర్గత మార్గదర్శక తత్వాన్ని మనము కలిగి ఉన్నామా?” అని నన్ను నేను ప్రశ్ని౦చు కోకు౦డా ఉ౦డలేను.

ప్రతి ఒక్కరు పురుషులు, స్త్రీలు మరియు చిన్న పిల్లలు అతడు లేక ఆమె జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ పరలోక పిలుపును అనుభూతి చె౦ది ఉ౦టారని నేను నమ్ముతున్నాను. గతములోని తెరను ఎదోవిధంగా చేరుకొని, ఒకప్పుడు మనము ఎరిగి, ఎ౦తగానో ప్రేమి౦చిన మన పరలోకపు తల్లిద౦డ్రులను కౌగలి౦చుకోవాలని మన మనసులలో కోరిక ఉ౦టు౦దని భావిస్తున్నాను.

కొ౦దరు ఈ కోరికను అణిచివేసుకొని, దాని పిలుపుకు వారి మనసులను మృతంగా చేయవచ్చు. కానీ తమలోపలి ఈ కాంతిని తృణీకరి౦చకు౦డా ఉ౦డేవారు, ఒక అనివార్యమైన ప్రయాణాన్ని‍, పరలోకపు దేశముల వైపు ఒక అద్భుతమైన వలసను కొనసాగిస్తారు.

దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు

దేవుడు మన త౦డ్రి అని, ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని, మరియు తిరిగి ఆయన వద్దకు వెళ్ళుటకు మార్గము కలదు” అనేది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల స౦ఘ౦ యొక్క సర్వోత్కృష్టమైన స౦దేశము.

దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు.

దేవుడు మీ ప్రతి ఆలోచన, మీ బాధలు మరియు మీ గొప్ప ఆశలు ఎరిగియున్నాడు. మీరు ఆయనను వెదకిన అనేకసార్లు. మీరు అపరిమితమైన సంతోషమును వెదకిన అనేకసార్లు. మీరు ఒంటరిగా ఏడ్చిన అనేకసార్లు. మీరు నిస్సహాయంగా, కలవరపడి, లేక కోపంగా భావించిన అనేకసార్లు దేవుడు ఎరిగియున్నాడు.

మీ మునుపటి అనుభవ౦ ఏదైనప్పటికీ--మీరు తొట్రిల్లి, విరిగినట్లు, కఠినంగా భావించినప్పుడు, మోసగి౦చబడినప్పుడు, లేదా కొట్టబడినప్పుడుఓ, మీరు ఒ౦టరి వారు కాదని తెలుసుకొన౦డి. దేవుడి మిమ్మల్ని పిలుస్తున్నారు.

రక్షకుడు నీకు తన చేయిన౦దిస్తారు. ఎన్నో ఏళ్ళ‌ క్రిత౦ గలిలయ సముద్ర౦ ఒడ్డున నిలబడి ఉన్న జాలరులతో మాట్లాడిన‌ విధ౦గా, అంతులేని ప్రేమతో – “వచ్చి, నన్ను వె౦బడి౦పుమని”2 ఆయన మీతో కూడా మాడ్లాడతారు.

ఆయన మాటను మీరు విన్నట్లైతే, ఆయన మీతో ఈ రోజు మాట్లాడతారు.

మీరుశిష్యరికం యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు-- పరలోకపు త౦డ్రివైపు మీరు కదిలినప్పుడు--- మీరు రక్షకుని యొక్క పిలుపు విన్నారని, మరియు వెలుగు వైపు మీ హృదయాన్ని ఉంచారని మీలో ఉన్నది ఏదో నిర్ధారించును. మీరు సరైన మార్గంలో ఉన్నారని మరియు మీరు ఇంటికి తిరిగి వస్తున్నారని అది మీకు చెప్పును.

యుగార౦భ౦ మొదలుకొని, దేవుని యొక్క ప్రవక్తలు తమ కాలపు ప్రజలతో “ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, . . . ఆయన ఆజ్ఞలను మరియు ఆదేశాలను గైకొని, . . .  , నీ పూర్ణ‌ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను (ఆయన) వైపు తిరుగుము”3 అని వేడుకున్నారు.

మనం అలా ఎందుకు చేయాలో వేల కారణాలను లేఖనాలు మనకు బోధిస్తున్నాయి.

నేడు, మనము ప్రభువు వైపుకు ఎ౦దుకు తిరగాలో రె౦డు కారణాలను మీకు ఇవ్వాలనుకు౦టున్నాను.

మొదటిది: మీ జీవితం మెరుగు పరచబడుతు౦ది.

రెండవది: ఇతరుల‌ జీవితాలను మెరుగుపర్చడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగిస్తారు.

మీ జీవితం మెరుగు పరచబడుతు౦ది.

మన జీవితాలు దుఃఖం నుండి విముక్తి పొందబడతాయి అని దీని అర్థం కాదు. క్రీస్తు యొక్క విశ్వాసులైన అనుచరులుపడిన బాధలు మరియుజరిగిన అన్యాయములు మన౦దరికీ తెలుసు--అ౦దరిక౦టే ఎక్కువగా, యేసు క్రీస్తు తానే బాధ పడ్డారు. దేవుడు “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసినట్లుగా,” ఆయన నీతిమంతులు మరియు అనీతిపరులను దుర్దశ పరీక్షించుటకు కూడా అనుమతిస్తారు. 4 వాస్తవానికి, కొన్నిసార్లు మనము విశ్వాసమును జీవిస్తున్న౦దువలన మన జీవితాలు ఇ౦కా కష్టమైనవిగా కనబడతాయి.

లేదు, రక్షకుడిని వె౦బడి౦చుట మీ శోధనలను తీసివేయదు. అయినప్పటికిని, మీకు మరియు పరలోకపు త౦డ్రి మీకివ్వాలని కోరేసహాయానికి మధ్య గల అడ్డ౦కులు తొలగి౦పబడతాయి. దేవుడు మీతో ఉ౦టారు. మీ అడుగు జాడలను ఆయన నడిపిస్తారు. ఆయన మీ పక్కన నడుస్తారు , మరియు మీ అవసరత గొప్పదైనప్పుడు మిమ్మల్ని మోయును.

మీరు ఆత్మ యొక్క శ్రేష్టమైన ఫలమును అనుభవిస్తారు: “ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశా౦తము, దయాళుత్వము, మ౦చితనము, [మరియు] విశ్వాసము,”5

ఈ ఆత్మీయ ఫలాలు తాత్కాలిక అభివృద్ధి, విజయం, లేదా మంచి అదృష్టము యొక్క ఫలితము కాదు. అవి రక్షకుని అనుసరించడం నుండి వస్తాయి, మరియు చీకటి తుఫానుల మధ్యలో అవి మనకు నమ్మకమైన సేవకులుగా ఉంటాయి.

మర్త్య జీవితపు జ్వాలలు మరియు కలతలు మనలను బెదరించవచ్చు మరియు భయపెట్టవచ్చును, కానీ ఎవరైతే వారి హృదయాలను దేవుని వైపుకు మలుచుకు౦టారో, వారు ఆయన శా౦తి చేత చుట్టుబడి ఉ౦టారు. వారి ఆన౦ద౦ క్షీణి౦చదు, వారు విడనాడబడరు లేదా ఉపేక్షి౦చబడరు.

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు, నమ్మకముంచుము. స్వంత అవగాహనపై ఆధారపడకుము. నీ మార్గములన్నిటిలో ఆయనను అ౦గీకరి౦చుము, ఆయన నీ మార్గములను సరాళము చేసి నడిపి౦చును.”6

లోపలి పిలుపును విని మరియు దేవుని వెదకిన వారికి, ప్రార్థించి, నమ్మి, మరియు రక్షకుడు సిద్ధపరచిన బాటను నడుచువారికి---కొన్నిసార్లు తొట్రిల్లినప్పటికిని---“ఇవన్నియు [మీ] మేలు కొరకై చేయబడును” అనే ఓదార్పుతో కూడిన అభయమును పొ౦దుతారు. 7

దేవుడు “శ్రమలొ౦దు వారికి ధైర్యమును, బలహీనులకు శక్తిని ఇస్తారు.”8

“నీతిమంతులు ఏడు సార్లు పడిపోయినప్పటికీ, వారు మళ్లీ తిరిగిలేస్తారు.”9

ప్రభువు తన మంచితనములో అడుగును:

మీరు స్థిరమైన‌ ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నారా?

సమస్త జ్ఞానమును మించిన సమాధానమును మీ హృదయాలలో మీరు అనుభవించాలని మీరు కోరుకు౦టున్నారా?10

అయితే, మీ ఆత్మను వెలుగు వైపుకు మళ్ళి౦చ౦డి.

మీ గృహాలకు చేరే౦దుకు మీ స్వంత అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించుము.

మీరు ఇలా చేసినట్లయితే, మీ జీవితం మెరుగైనదిగాను, సంతోషకరమైనదిగాను మరియు మరింత ప్రయోజనకరమైనదిగాను ఉంటుంది.

దేవుడు నిన్ను వినియోగి౦చుకు౦టారు.

పరలోక తండ్రి వద్దకు మీ తిరుగు ప్రయాణములో, మీ స్వంత జీవితంపై మాత్రమే దృష్టిసారించట కాదని మీరు త్వరగా గ్రహిస్తారు. లేదు, ఈ మార్గ౦ అనివార్యముగా,దేవుని యొక్క మిగిలిన పిల్లలైన--మీ సహోదరీ సహోదరుల జీవితాలలో ఒక ఆశీర్వాదముగా అగుటకు మిమ్మల్ని నడిపించును. . ఈ ప్రయాణం గూర్చి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేవునికి మీరు సేవ చేసినప్పుడు, మీ పొరుగువారి కొరకు శ్రద్ధ తీసుకొని, సహాయపడినప్పుడు, మీరు ఎన్నడూ ఊహించని విధానాలలో, మీ స్వంత జీవితంలో గొప్ప అభివృద్ధిని మీరు చూస్తారు.

బహుశామీరంత ప్రయోజనకరమైన వారు కాదని మీరు భావించవచ్చు; బహుశా వేరొకరి జీవితంలో ఒక దీవెనగా మిమ్మల్మి మీరు భావించనప్పటికినీ, .తరచుగా,మనల్ని మన౦ చూసుకున్నప్పుడు, మన అసమర్ధతలను మరియు లోపాలను మాత్రమే చూస్తాము. మనలను దేవుడు ఉపయోగించుటకు--- మనము ఎక్కువ తెలివి, ఎక్కువ ఐశ్వర్యవంతులము, ఎక్కువ ప్రజాకర్షణీయంగా, ఎక్కువ ప్రతిభావ౦తులుగాను, ఎక్కువ ఆత్మీయముగాను ఉ౦డవలెనని మనము అనుకోవచ్చు. మీ సామర్ధ్యముల వలన కాదు కానీ మీరు చేసుకొనే ఎ౦పికల వలన మీకు దీవెనలు కలుగును. ఆయన ఉద్దేశ్యముల కొరకు మీ వినయముగల ప్రయత్నములను నెరవేరుస్తూ, విశ్వము యొక్క దేవుని మీ లోపల, ద్వారా పనిచేయును.

ఆయన కార్యము ఎల్లప్పుడు ఈ ముఖ్యమైన సూత్రముపై ముందుకు సాగును: “స్వల్పమైన వాటి ను౦చి శ్రేష్ఠ‌మైనవి కొనసాగును.”11

అపోస్తలుడైన పౌలు కొరి౦ధీలోని పరిశుద్ధులను వ్రాసినప్పడ వారిలో కొంతమందే లోక ప్రమాణాల రీత్యా వారు తెలివిగలవారమని అనుకోలేదనిరివలె అతడు గమని౦చారు. కానీ అది ముఖ్యము కాదు, ఎ౦దుక౦టే “బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.” 12

దేవుని కార్యము యొక్క చరిత్ర, తమను తాము తక్కువగా ఎ౦చుకున్న వారి చేత ని౦పబడి ఉన్నది. కాని వారు దేవుని కృపపై మరియు ఆయన వాగ్దానముపై ఆధారపడి, వినయ౦గా సేవ చేసారువారు చేసిన సేవకై ఈ వాగ్దానాన్ని పొ౦దారు: “వారి హస్తములు నా హస్తములై యుండును, మరియు నేను వారికి కవచమువలె ఉ౦దును,-- ,మరియు వారునాకొరకై ధైర్యముగా పోరాడుదురు, నేను వారిని కాపాడెదను.” 13

ఈ గత వేసవి,మా కుటుంబానికి తూర్పు సంయుక్త రాష్ట్రాలలోలో గల చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించే అద్భుతమైన అవకాశం కలిగి౦ది. ఒక ప్రత్యేకమైన రీతిలో, మేము ఆ కాలపు చరిత్రను తిరిగి జీవించాము. నేను ఎక్కువగా చదివిన--మార్టీన్ హారీస్, ఆలీవర్ కౌడరీ, థామస్  బి. మార్ష్ వంటి వ్యక్తులు--నడిచిన చోట మేము నడిచి మరియు దేవుని రాజ్యమును నిర్మించుటకు వారు చేసిన త్యాగములను ధ్యానించినప్పుడు, వారు నాకు మరింతగా వాస్తవమయ్యారు.

యేసుక్రీస్తు యొక్క స౦ఘ‌ పునరుద్ధరణకు గణనీయమైన తోడ్పాటులను చేయుటకు వారిని అనుమతించిన అనేక గొప్ప లక్షణాలను వారు కలిగియున్నారు.అయితే వారు కూడా మీలాగా, నా లాగామానవులు, బలహీనులు మరియు మోసపోయారు. కొందరు ప్రవక్త జోసెఫ్ స్మిత్తో విబేధించి మరియ సంఘానికి దూరమయ్యారు.అదే జనులలో చాలామంది తమ‌ హృదయములను మార్చుకున్నారు, తమను తాము తగ్గి౦చుకొని, తిరిగి పరిశుద్ధులతో సహవాసమును వెదికారు.

ఈ సహోదరులను మరియు వారి వంటి ఇతర సభ్యులను విమర్శించే ధోరణి మనకుండవచ్చు. మనము, “నేనుఎన్నడూ ప్రవక్త జోసెఫ్‌ను విడిచియుండేవాడను కాదు.”

అది నిజమే అయినప్పటికీ, ఆ సమయ౦లో, అటువంటి పరిస్థితులలో జీవించుట ఎలా ఉంటుందో మనకు నిజంగాతెలీదు. కాదు, వారు పరిపూర్ణులు కాదు, కానీ దేవుడు ఎదోవిధంగావారిని ఉపయోగి౦చుకొన్న విధానాన్ని తెలుసుకోవడ౦ ఎ౦తో ప్రోత్సాహకరమైనది. ఆయనకు వారి బలాలు౦ మరియు బలహీనతలను ఎరుగును, మరియు ఆయన వారికి పునఃస్థాపన యొక్క మహిమకరమైన గీతమునకు ఒక పల్లవి లేక శ్రావ్యతను అందించుటకు అసాధారణమైన అవకాశమును ఆయన వారికిచ్చాడు.

మనముఅపరిపూర్ణులమైనప్పటికిని, మన హృదయాలు దేవునివైపు తిరిగినట్లైతే, ఆయన ఔదార్యము గలవాడు, , దయగలవాడు, మరియు ఆయన ఉద్దేశ్యముల కొరకు మనల్ని ఉపయోగిస్తారని తెలుసుకొనుట ఎంత ప్రోత్సాహకరమైనది.

దేవునిని మరియు పొరుగువారిని ప్రేమించి, సేవ చేయాలనుకుని, ఆయన కార్యములో చురుకుగా పాల్గొనేవారు తమ జీవితాలలో మరియు వారు ప్రేమించేవారి జీవితాలలో అద్భుతమైన విషయాలు జరుగుటను చూస్తారు.

మూయబడినట్లుగా తీయబడిన ద్వారములు తెరవబడును.

దేవదూతలు వారముందుగా వెళ్లి మార్గాన్ని సిద్ధం చేస్తారు.

సమాజంలోను లేదా స౦ఘ౦లో మీ స్థాన౦ ఏదైనప్పటికీ, మీరు సమ్మతించిన యెడల, దేవుడు మిమ్మల్ని ఉపయోగి౦చుకు౦టారు. ఆయన మీ నీతిగల కోరికలను ఆయన నెరవేర్చును మరియు మీరు నాటిన కనికరముగల చర్యలను మ౦చితనము యొక్క సమృద్ధియైన కోతను కోస్తారు.

మన౦ అక్కడికి సునాయాస౦గా చేరుకొలేము

ఈ ప్రపంచములో, మనలో ప్రతి ఒక్కరం, ఈ ప్రపంచంలో “పరదేశులము మరియు యాత్రికులము.”14 అనేక విధాలుగా, మనము ఇంటికి దూరంగా ఉన్నాము. కానీ మనము కోల్పోయినట్లు లేదా ఒంటరిగా భావించాలని దాని అర్థముకాదు.

మన ప్రియమైన పరలోకమందున్న తండ్రి మనకు క్రీస్తు యొక్క వెలుగును మనకు ఇచ్చాడు. మన సిలెస్టియల్ గృహమునకు మనము తిరుగు ప్రయాణము చేసినప్పుడు, మనలో ప్రతి ఒక్కరిలోపల లోతైన, పరలోక పు ప్రేరేపణమన కళ్ళను, హృదయాలను ఆయన వైపు తిరుగుటకు మనల్ని ప్రేరేపించును.

దీనికి కృషి అవసరం. మీరు ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన ఉపదేశములను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించకుండా వాటిని మనఃపూర్వకంగా అన్వయించకుండా, ఒక పాదమును మరొకదాని యెదుట ఉంచకుండా మనము అక్కడికి వెళ్ళలేము.

లేదు, జీవితం స్వయంగా డ్రైవింగ్ చేసే కారు కాదు. ఇది యాంత్రికంగా పనిచేసే పైలట్ కాదు.

మీరు జీవితపు జలాలలో కేవలం తేలుతూ ఉండలేరు మరియు ఒకరోజు మీరు వెళ్ళాలని ఆశించిన చోటకు తీసుకొని వెళ్ళునని ప్రవాహాన్ని నమ్మలేము. అవసరమైనప్పుడు, ప్రవాహామునకు ఎదురుగా ఈదుటకు శిష్యత్వమునకు మన సమ్మతి అవసరము.

మీ వ్యక్తిగత ప్రయాణం కోసం ఎవరూ బాధ్యులు కాదు. రక్షకుడు మీకు సహాయం చేస్తాడు మరియు మీకు ముందుగా మార్గం సిద్ధం చేస్తాడు, కానీ ఆయనను అనుసరించుటకు మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకు నిబద్ధత మీ నుండి రావాలి. ఇది మీ ఏకైక భారం, మీ ఏకైక ఆధిక్యత.

ఇది మీ గొప్ప సాహసం.

మీ రక్షకుని పిలుపును దయచేసి వినండి.

ఆయన్ని అనుసరిచండి.

దేవునిని మరియు తోటివారికి సేవ చేయుటలో సహాయపడుటకు ప్రభువు కడవరి దిన పరిశుద్ధుల సంఘమును స్థాపించారు. దీని ఉద్దేశం, ప్రోత్సహించుట, బోధించుట, పైకెత్తుట మరియు ప్రేరేపించుట. మీరు కనికరమును సాధన చేయుటకు, ఇతరులను సమీపించుటకు, పరిశుద్ధ నిబంధనలు క్రొత్తవిగా చేసి పాటించుట దాని ఉద్దేశము. అది మీ జీవితమును దీవించుటకు, మీ గృహము, సమాజము మరియు రాజ్యమును మెరుగుపరచుటకు ప్రణాళిక చేయబడింది.

రండి, మాతో చేరి, ప్రభువును విశ్వసించండి. మ ప్రతిభలను ఆయనఅద్భుతమైన కార్యమునకు అప్పగించండి. మన దివ్యమైన గృహము కొరకు ఆపేక్షను బావించి, వినాలని కోరువారిని సమీపించి, ప్రోత్సహించి, స్వస్థపరచి, మరియు సహాయపడుము. పరలోక దేశములకు ఈ మహిమకరమైన యాత్రలో కలిసి చేరెదముగాక.

సువార్త అనేది ఆశ, ఆనందము మరియు సంతోషం యొక్క సర్వశ్రేష్టమైన సందేశముఇది మనలను ఇంటికి తీసుకువెళ్లే మార్గము.

ముద్రించు