2010–2019
మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?
అక్టోబర్ 2017


2:3

మోర్మన్ గ్రంథము: ఇది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?

చాలా అద్భుతమైన మరియు అసాధారణ రీతిలో, మోర్మన్ గ్రంథము యేసుక్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మనకు బోధిస్తుంది.

1986 లో, నేను ఘనాలోని అక్రలో ఒక విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించబడ్డాను. అక్కడ పలువురు ఉన్నతాధికారులతోపాటు ఒక ఆఫ్రికన్ గిరిజన రాజును కలిసాను. మేము ఉపన్యాసమునకు ముందుగా వెళ్ళినప్పుడు, రాజు తన భాషావేత్త ద్వారా మాత్రమే నాతో మాట్లాడారు, తర్వాత అతడు నా కోసం అనువదించాడు. నేను భాషావేత్తకు ప్రతిస్పందించాను, తర్వాత భాషావేత్త నా అభిప్రాయాలను రాజుకు వివరించాడు.

నా ఉపన్యాసం తర్వాత, రాజు నేరుగా ఈ సారి తన భాషావేత్త లేకుండా నా దగ్గరకు వచ్చారు. నేను ఆశ్చర్యపడేలా ఆయన పరిపూర్ణ ఆంగ్లములో మాట్లాడారు-- క్వీన్స్ ఆంగ్లంలో! అని నేను చెప్పవచ్చు.

రాజుగారు ఆశ్చర్యపోయారు. “నీవెవరు?” అని అడిగారు.

“నేను యేసుక్రీస్తు చేత నియమింపబడిన అపొస్తలుడను,” అని జవాబిచ్చాను.

“నీవు యేసుక్రీస్తు గురించి నాకేమి బోధించగలవు?” అని రాజు అడిగారు.

నేను ఒక ప్రశ్నతో సమాధానమిచ్చాను: “ఆయనను గూర్చి మీకేమి తెలియునని నేను అడగవచ్చా?”

రాజుగారి ప్రతిస్పందన, ఆయన బైబిలును శ్రద్ధగా చదువుతారని మరియు ప్రభువును ప్రేమిస్తారని వెల్లడించింది.

ప్రాచీన అమెరికా ప్రజలకు యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి ఆయనకు తెలుసా? అని నేనడిగాను.

నేను ఊహించిన విధంగానే, ఆయనకు తెలియదు.

రక్షకుడు సిలువ వేయబడి పునరుత్థానం చెందిన తరువాత, ఆయన తన సువార్తను బోధించడానికి ప్రాచీన అమెరికా ప్రజల దగ్గరకు వచ్చారని నేను వివరించాను.ఆయన తన సంఘమును ఏర్పాటు చేసి, వారి మధ్య ఆయన పరిచర్యలను వ్రాసిపెట్టమని తన శిష్యులకు చెప్పారు.

“ఆ గ్రంథము,” “మోర్మన్ గ్రంథమని మాకు తెలుసు. ఇది యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. ఇది పవిత్ర బైబిలుకు ఒక సహగ్రంథము” అని నేను కొనసాగించాను.

ఆ సమయంలో, రాజుగారు చాలా ఆసక్తి చూపారు. నేను నాతోపాటున్నమిషను అధ్యక్షుని వైపు తిరిగి, ఆయన దగ్గర అదనంగామోర్మన్ గ్రంథ ప్రతి ఉన్నదేమో అడిగాను. ఆయన తన పెట్టెనుండి ఒకదాన్ని బయటకు తీసారు.ు

నేను దానిలో 3  నీఫై 11 వ అధ్యాయమును తెరిచాను, మరియు రాజుగారితో పాటు నేను నీఫైయులకు రక్షకుని ప్రసంగాన్ని చదివాను. తరువాత నేను మోర్మన్ గ్రంథ ప్రతిని ఆయనకు అందజేసాను. ఆయన ప్రతిస్పందన నా మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయింది: “మీరు నాకు వజ్రాలు లేదా కెంపులు ఇచ్చియుండవచ్చు, కానీ ప్రభుయైన యేసు క్రీస్తు గురించిన ఈ అదనపు జ్ఞానం కంటే అవేవీ నాకు విలువైనవికావు.”

3 నీఫైలోని రక్షకుని మాటల శక్తి అనుభవించిన తరువాత, రాజు ఇలా ప్రకటించారు, “నేను మార్పుచెంది సంఘములో చేరిన యెడల, నా మొత్తం తెగను నాతో తీసుకొస్తాను.”

“అయ్యో, రాజా,” “ఇది ఆ విధంగా పనిచేయదు. మార్పు అనేది వ్యక్తిగత విషయం. రక్షకుడు నీఫైయులలో ఒక్కొక్కరికి పరిచర్య చేశారు. ప్రతీ వ్యక్తీ యేసు క్రీస్తు సువార్తకు సాక్షిగా మారి, సాక్ష్యమును పొందారు”1 అని సమాధానమిచ్చాను.

 నీఫైయులకు యేసు క్రీస్తు పరిచర్య

నా సహోదర సహోదరీలారా, మీకు మోర్మన్ గ్రంథముఎంత విలువైనది? మీకు వజ్రాలు లేదా కెంపులు లేదా మోర్మన్ గ్రంథము ఇచ్చినట్లయితే, మీరు దేనిని ఎన్నుకుంటారు? నిజాయితీగా,మీకు ఏది ఎక్కువ విలువైనది?

ఏప్రిల్ 2017 సర్వసభ్య సమావేశం యొక్క ఆదివారం ఉదయం సమావేశంలో అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ గారు, ప్రతిరోజూ ప్రా “ర్థనాపూర్వకముగా మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేసి, ధ్యానించమని మనలో ప్రతి ఒక్కరిని.వేడుకున్నారు.” 2 చాలామంది మన ప్రవక్త యొక్క అభ్యర్థనకు స్పందించారు.

ఎవరో మా చిత్రాలు తీస్తున్నారని నాకు లేదా ఎనిమిదేళ్ల రిలే కి తెలియదని చెప్పాలి. రిలే తన మోర్మన్ గ్రంథమును చదివేటప్పుడు, “నేనొక దేవుని బిడ్డను” అనే పేజీ గురుతు సహాయం తీసుకున్నాడని గమనించవచ్చు.

అధ్యక్షులు నెల్సన్ మరియు రిలే లేఖనములను అధ్యయనం చేయుట

ఒక దేవుని బిడ్డ ఆయన మరియు ఆయన ప్రియమైన కుమారుని గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు శక్తివంతమైనదేదో జరుగుతుంది. మోర్మన్ గ్రంథములో కంటే ఆ నిజాలు మరింత స్పష్టంగా మరియు శక్తివంతంగా వేరే ఎక్కాడా బోధించబడలేదు.

ఆరునెలల క్రితం అధ్యక్షులు మాన్సన్ గారు సవాలు చేసినప్పటినుండి ఆయన బోధనను అనుసరించడానికి నేను ప్రయత్నించాను. ఇతర విషయాలతోపాటు, మోర్మన్ గ్రంథము ఏమిటో, అది దేనిని దృఢపరచునో, అది దేనిని ఖండించునో, అది దేనిని నెరవేర్చునో, అది దేనిని స్పష్టపరచునో మరియు అది దేనిని బయల్పరచునో వాటి జాబితాలను నేను చేసియున్నాను. ఈ కటకములతో మోర్మన్ గ్రంథమును చూడడం ఒక జ్ఞానోదయమైన, స్ఫూర్తినిచ్చు వ్యాయామమువలె ఉంటుంది! నేను దానిని మీలో ప్రతి ఒక్కరికి సిఫార్సు చేస్తున్నాను.

ఈ ఆరు నెలల కాలంలో నేను మూడు సంబంధిత ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోమని -- పన్నెండుమంది కోరములో వున్న నా సహోదరులు, చిలీలో మిషనరీలు మరియు అర్జెంటీనాలో సమకూడిన మిషను అధ్యక్షులు, వారి భార్యలతో సహా వివిధ సమూహాలను ఆహ్వానించాను. ఈ రోజు వాటి గురించి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను:

మొదటిది, మోర్మన్ గ్రంథము లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది? రెండవది, ఏది మీకు తెలిసి యుండేదికాదు? మరియు మూడవది, మీరు దేనిని కలిగియుండేవారు కాదు?

ఈ సమూహాల ఉత్సాహవంతమైన సమాధానాలు నేరుగా వారి హృదయాల నుండి వచ్చాయి. ఇక్కడ వారి వ్యాఖ్యలలో కొన్ని మాత్రమే ఉన్నాయి:

“మోర్మన్ గ్రంథము లేకుండా, నేను చాలా విషయాల గురించి విరుద్ధమైన బోధనలు మరియు అభిప్రాయాల గందరగోళంలో ఉండేవాడిని. నేను సంఘమును కనుగొనకముందు ఉన్నట్లే జ్ఞానం, విశ్వాసం మరియునిరీక్షణ కోసం వెతుకుతున్నవాడిలా ఉండేవాడిని.”

మరొకరు చెప్పారు: “పరిశుద్ధాత్మ నా జీవితంలో ఎటువంటి పాత్ర పోషించగలదో నాకు తెలిసేదికాదు.”

మరొకరు: “ఇక్కడ భూమిపై నా లక్ష్యాన్ని నేను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయేవాడిని!”

మరొకరు ఇలా చెప్పారు: “ఈ జీవితం తర్వాత పురోగతి కొనసాగుతుందని నాకు తెలిసేది కాదు. మోర్మన్ గ్రంథము ఉండుటవలన, నేను నిజంగా మరణం తరువాత జీవితం ఉందని తెలుసుకున్నాను. మనము దేని కోసం పనిచేస్తున్నామో ఆ అంతిమ లక్ష్యం అదే.”

ఈ చివరి వ్యాఖ్యానం, దశాబ్దాల క్రితం ఒక యువ శస్త్రవైద్యునిగా శిక్షణ పొందుతున్న నా జీవితం గురించి ఆలోచించేలా చేసింది. శస్త్రవైద్యుని గంభీరమైన బాధ్యతలలో ఒకటి, సమయం వచ్చినప్పుడు వారు ప్రేమించిన వ్యక్తి మరణించారని కుటుంబ సభ్యులకు తెలియజేయడం. నేను పని చేసిన ఒక ఆసుపత్రిలో ఒక ప్రత్యేక గదిని మెత్తగా ఉండే గోడలతో నిర్మించారు, అక్కడ కుటుంబ సభ్యులకు అలాంటి వార్తలను చెప్తారు. అక్కడ, కొంతమంది ఆ గోడలకు వారి తలలను బాదుకొని తమ బాధను వ్యక్తపరిచేవారు. మరణం, జీవించియున్న ప్రియమైనవారికి కష్టంగా ఉన్నప్పటికీ మన అమర్త్య జీవితంలో అవసరమైన భాగమని ఆ వ్యక్తులకు బోధించాలని నేను ఎంతో కోరుకున్నాను. మరణం మన తదుపరి ప్రపంచంలో ముందుకెళ్ళడానికి అనుమతిస్తుంది.3

నా ప్రశ్నకు మరొక ప్రతివాది ఇలా చెప్పారు: “మోర్మన్ గ్రంథము చదివే వరకు నాకు జీవితము లేదు. నేను ప్రార్థన చేస్తూ, జీవితాంతము నా సంఘానికి వెళ్ళినప్పటికీ, మొదటిసారి పరలోక తండ్రితో నిజంగా సంభాషించడానికి మోర్మన్ గ్రంథము నాకు సహాయం చేసింది.”

మరొకరు ఇలా అన్నారు: “మోర్మన్ గ్రంథము లేకుండా, రక్షకుడు నా పాపాల కొరకు శిక్షను అనుభవించుట మాత్రమే కాకుండా, నా రోగములను బాధలను కూడా నయం చేయగలరని నేను అర్థం చేసుకోలేకపోయేవాడిని.”4

ఇంకొకరు: “మనకు దారి చూపించడానికి ప్రవక్తలు ఉన్నారని నాకు తెలిసేది కాదు.”

మనము క్రమముగా మోర్మన్ గ్రంథము యొక్క సత్యాల్లో మునిగియుండడం జీవితాన్ని మార్చగల అనుభవం కాగలదు. మా మిషనరీ మనవరాళ్ళలో ఒకరైన సహోదరి ఒలివియా నెల్సన్, ఒక పరిశోధకుడికి -- అతడు మోర్మన్ గ్రంథమును రోజూ చదివితే, తన విశ్వవిద్యాలయ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని హామీ ఇచ్చింది. అతను అలాగే చేశాడు మరియు అతని మార్కులు పెరిగాయి.

సహోదరి ఒలివియా నెల్సన్

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మోర్మన్ గ్రంథము నిజముగా దేవుని వాక్యమని నేను సాక్ష్యమిస్తున్నాను. జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలకు ఇందులో సమాధానాలు ఉన్నాయి. ఇది క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని బోధిస్తుంది.5 ఇది అనేక శతాబ్దాలుగా బైబిల్ యొక్క అనేక అనువాదాల ద్వారా కోల్పోబడిన “స్పష్టమైన మరియు ప్రశస్థమైన”6 సత్యాల గురించి వివరణలు ఇస్తుంది.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము గురించి ఎక్కడా కనుగొనబడని సంపూర్ణమైన, అత్యంత స్థిరమైన గ్రహింపును మోర్మన్ గ్రంథము అందిస్తుంది. మరల జన్మించడానికి అసలైన అర్థాన్ని ఇది బోధిస్తుంది. చెదిరిపోయిన ఇశ్రాయేలు సమకూడుట గురించి మోర్మన్ గ్రంథములో మనము నేర్చుకుంటాము. మనము ఈ భుమిపైన ఎందుకున్నామో మనకు తెలుసు. ఇవి మరియు ఇతర సత్యాలు మరేయితర గ్రంథములో లేనంత శక్తివంతముగా, నమ్మశక్యంగా మోర్మన్ గ్రంథములో బోధించబడ్డాయి. యేసు క్రీస్తు సువార్త యొక్క పూర్తి శక్తిని మోర్మన్ గ్రంథము కలిగియుంది.

మోర్మన్ గ్రంథము ప్రభువు యొక్క బోధనలను విశదపరుస్తుంది మరియు విరోధి యొక్క వ్యూహాలను బహిర్గతం చేస్తుంది. 7 మోర్మన్ గ్రంథము, చిన్నపిల్లల బాప్తీస్మములను నిర్వహించే తప్పుడు మతాచారాలను తిప్పికొట్టడానికి నిజమైన సిద్ధాంతాన్ని బోధిస్తుంది.8 నిత్య జీవితపు సామర్థ్యాన్ని మరియు “ఎన్నడూ అంతం కాని సంతోషము” ను అర్థం చేసుకోమని మనల్ని ప్రోత్సహించడం ద్వారా మోర్మన్ గ్రంథము మన జీవితానికి లక్ష్యాన్నిస్తుంది.9 మోర్మన్ గ్రంథము, దుర్మార్గంలో సంతోషం కనుగొనబడుతుందనే 10 తప్పుడు విశ్వాసాలు బద్దలుకొట్టి, వ్యక్తిగత మంచితనమొక్కటే దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి అవసరమని తెలియజేస్తుంది.11 ఇది బైబిలుతోనే బయల్పాటు ముగిసినదని, నేడు పరలోకములు మూసివేయబడినవనే అబద్ధ భావనలను శాశ్వతంగా రద్దు చేస్తుంది.

నేను మోర్మన్ గ్రంథము గురించి ఆలోచించినప్పుడు, శక్తి అనే పదాన్ని తలచుకుంటాను. మోర్మన్ గ్రంథము యొక్క సత్యాలు మన ఆత్మలను స్వస్థపరచుటకు, ఓదార్చుటకు, పునరుద్ధరించుటకు, సహాయపడుటకు, బలపరచుటకు, నిమ్మళపరచుటకు మరియు ప్రోత్సహించుటకు శక్తిని కలిగియున్నాయి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రతిరోజూ మోర్మన్ గ్రంథమును మీరు ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేసినప్పుడు, ప్రతిరోజూ మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు అధ్యయనం చేసినదానిని ధ్యానించినప్పుడు ఆకాశపు వాకిండ్లు విప్పబడతాయి, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలను మరియు మీ స్వంత జీవితం కొరకు నడిపింపును మీరు అందుకుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను. మోర్మన్ గ్రంథములో మీరు ప్రతిరోజూ నిమగ్నమైనట్లయితే, మీరు మితిమీరుతున్న అశ్లీలత మరియు ఇతర వ్యసనాలతో పాటు అనుదిన దుష్ప్రభావాల నుండి రక్షించబడగలరని నేను వాగ్దానం చేస్తున్నాను.

నాతో సహా ఎవరైనా “మోర్మన్ గ్రంథము నిజమని నాకు తెలుసు” అని చెప్పడం నేను వినినప్పుడు, “బాగుంది, కానీ అది సరిపోదు!” మోర్మన్ గ్రంథమునిస్సందేహంగా దేవుని వాక్యమని మన హృదయాంతరాలలో లోతుగా మనము భావించాలని12 గట్టిగా చెప్పాలనుంది. మనము చాలా లోతుగా అనుభూతి పొంది, అది లేకుండా ఒక్క రోజు కూడా నివసించలేనట్లుగా ఉండాలి. మోర్మన్ గ్రంథము యొక్క సత్యము మరియు శక్తిని తెలుసుకొనేలా “ప్రజలను మేల్కొల్పడానికి ఏడు ఉరుములతో కూడిన స్వరము నాకు ఉంటే బాగుండేదని”13 అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ వ్యాఖ్యానించిన దానిని నేను చెప్పదలిచాను.

మోర్మన్ గ్రంథం యొక్క సత్యము గురించి చాలా లోతుగా భావించిన ఐరోపాలోని ఈ యువ మిషనరీ మాదిరిగా మనము ఉండవలసియుంది, అతను నిజంగా ఈ పవిత్రమైన గ్రంథము యొక్క ప్రతిని పట్టుకొని అతను మరియు అతని సహచరుడు అప్పుడే ఉద్యానవనంలో కనుగొన్న వ్యక్తికివ్వడానికి పరుగెత్తుకెళ్ళాడు.

పరుగెడుతున్న మిషనరీ

జోసెఫ్ స్మిత్ ఈ చివరి యుగము యొక్క ప్రవక్త అయ్యుండెనని మరియు అయ్యున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే దేవుని బహుమానము మరియు శక్తి ద్వారా ఈ పవిత్ర గ్రంథాన్ని అనువదించారు. ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధపరచుటకు ఈగ్రంథము సహాయం చేస్తుంది.

యేసు క్రీస్తు యదార్థముగా, సజీవుడైన మన దేవుని యొక్క జీవించియున్న కుమారుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, మన గొప్ప మాదిరి, మరియు తండ్రితో మన న్యాయవాది. ఆయనే వాగ్దానమివ్వబడిన మెస్సీయ, మర్త్య మెస్సీయ మరియు వెయ్యేండ్లు పరిపాలించు మెస్సీయ. చాలా అద్భుతమైన మరియు అసాధారణ రీతిలో, మోర్మన్ గ్రంథము యేసుక్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మనకు బోధిస్తుందని నా పూర్ణాత్మతో నేను సాక్ష్యమిస్తున్నాను.

అధ్యక్షులు థామస్  ఎస్. మాన్సన్ గారు నేడు భూమిపైన దేవుని యొక్క ప్రవక్తయని నాకు తెలుసు. హృదయపూర్వకంగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను మరియు ఆమోదిస్తున్నాను. దీని గురించి నేను యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

అధ్యక్షులు నెల్సన్ గారి మోర్మన్ గ్రంథ జాబితాలు

మోర్మన్ గ్రంథము :

  • యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. దాని ముఖ్య రచయితలు---నీఫై, జేకబ్, మోర్మన్, మొరోనై---మరియు దాని అనువాదకుడు జోసెఫ్ స్మిత్ అందరు ప్రభువు యొక్క ప్రత్యక్షసాక్షులు.

  • ప్రాచీన అమెరికాలో నివసించిన జనులకు ఆయన పరిచర్య యొక్క వృత్తాంతము.

  • ప్రభువు చేత నిర్థారించబడినట్లుగా, సత్యము.

మోర్మన్ గ్రంథముదృఢపరచును:

  • పరలోక తండ్రి మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత గుర్తింపు.

  • మనుష్యులు సంతోషమును కలిగియుండునట్లు హవ్వ జ్ఞానము మరియు ఆదాము పతనము యొక్క ఆవశ్యకత.

మోర్మన్ గ్రంథముఖండించుఅభిప్రాయములు:

  • బైబిలుతోనే బయల్పాటు ముగిసినది.

  • చిన్నపిల్లలు బాప్తీస్మము పొందవలెను.

  • దుర్మార్గమందు సంతోషము కనుగొనబడగలదు.

  • ఉన్నతస్థితి కొరకు వ్యక్తిగత మంచితనము సరిపోవును (విధులు మరియు నిబంధనలు అవసరము).

  • ఆదాము యొక్క పతనము మనుష్యజాతిని “మొదటి పాపము” తో కళంకపరిచింది.

మోర్మన్ గ్రంథముఈ బైబిలు ప్రవచనాలను నెరవేర్చును:

  • “వేరే గొఱ్ఱెలు” ఆయన స్వరము వినును.

  • “ధూళిలో నుండి మాట్లాడుతూ” దేవుడు “ఒక ఆశ్చర్యకార్యమును, బహు ఆశ్చర్యము”గా జరిగించును.

  • “యూదా” తునక మరియు “యోసేపు” తునక ఏకమగును.

  • “అంత్య దినములలో” చెదిరిపోయిన ఇశ్రాయేలు సమకూర్చబడును మరియు అది ఏ విధంగా జరుగునో వివరించును.

  • పశ్చిమార్థగోళము యోసేపు వంశస్థుల కొరకు స్వాస్థ్యమగును.

మోర్మన్ గ్రంథము క్రింది వాటిని స్పష్టము చేయును:

  • మర్త్యత్వమునకు ముందు మన ఉనికి

  • మరణము. దేవుని యొక్క గొప్ప సంతోష ప్రణాళికలో ఆవశ్యక భాగము.

  • మర్త్యత్వము తరువాత ఉనికి, పరదైసులో ఆరంభమవుతుంది.

  • శరీరము యొక్క పునరుత్థానము ఏ విధంగా దాని ఆత్మతో ఏకమై అమర్త్యాత్మగా మారుతుంది.

  • ఏ విధంగా మన క్రియలు మరియు మన హృదయముల యొక్క కోరికలను బట్టి ప్రభువు మనల్ని తీర్పుతీర్చును.

  • విధులు సరైన విధంగా ఎట్లు నిర్వహించబడతాయి: ఉదాహరణకు, బాప్తీస్మము, సంస్కారము, పరిశుద్ధాత్మను అనుగ్రహించుట.

  • యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము.

  • పునరుత్థానము.

  • దేవదూతల ముఖ్య పాత్ర.

  • యాజకత్వము యొక్క నిత్య స్వభావము.

  • మనుష్యుల ప్రవర్తన ఏ విధంగా ఖడ్గపు శక్తి కంటే వాక్యము యొక్క శక్తి చేత ఎక్కువగా ప్రభావితము చేయబడును.

మోర్మన్ గ్రంథముఇంతకుముందు తెలియని సమాచారమును బయలుపరచును:

  • యేసు క్రీస్తు పుట్టక ముందు బాప్తీస్మములు నిర్వహించబడెను.

  • ప్రాచీన అమెరికాలో దేవాలయాలు నిర్మించబడి, జనులచేత ఉపయోగించబడెను.

  • యోసేపు, ఇశ్రాయేలు యొక్క 11వ కుమారుడు, జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవక్త పాత్రను ముందుగా చూసెను.

  • అమెరికా కనుగొనబడుటను మరియు అక్కడ నివాసములు ఏర్పరచబడుటను నీఫై (క్రీ. పూ. 600–592 లో) ముందుగా చూసెను.

  • బైబిలులోని స్పష్టమైన మరియు విలువైన భాగములు కోల్పోబడెను.

  • ప్రతి వ్యక్తికి క్రీస్తు యొక్క వెలుగు ఇవ్వబడింది.

  • వ్యక్తిగత కర్తృత్వము యొక్క ప్రాముఖ్యత మరియు అన్ని విషయాలలో వ్యతిరేకత యొక్క ఆవశ్యకత.

  • “రహస్య కూడికల” గురించి హెచ్చరికలు.