2010–2019
మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట
అక్టోబర్ 2018


7:54

మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట

ప్రభువు యొక్క వాక్యమును మీరు విందారగించి, మీ వ్యక్తిగత జీవితాలలో ఆయన బోధనలను అన్వయించుకొనుట్లు, నా ప్రేమను మరియు దీవెనను మీకిస్తున్నాను.

ఇది ప్రేరేపించబడిన చారిత్రక సమావేశము. అత్యుత్సాహముతో మనము భవిష్యత్తును చూస్తున్నాము. మనము శ్రేష్ఠముగా చేయుటకు, శ్రేష్ఠముగా ఉండుటకు ప్రేరేపించబడ్డాము. మన ప్రధాన అధికారులు మరియు ప్రధాన అధిపతుల చేత ఈ వేదిక నుండి అందచేయబడిన అద్భుతమైన సందేశాలు మరియు సంగీతము అత్యద్భుతమైనవిగా ఉన్నవి! ఈ వారమునుండి, ఈ సందేశాలను అధ్యయనము చేయుట ప్రారంభించమని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను.1 అవి నేడు ప్రభువు తన జనుల కొరకు తన చిత్తమును, మనస్సును వ్యక్తపరచును.

ఈ క్రొత్త గృహ-కేంద్రిత, సంఘ-సహయక అనుసంధానిత పాఠ్యప్రణాళిక ప్రతీ కుటుంబము మనస్సాక్షిగా మరియు జాగ్రత్తగా వారి గృహమును విశ్వాస మందిరముగా మార్చుటకు బాధ్యతగా ప్రయత్నించినప్పుడు, కుటుంబాల యొక్క శక్తిని విడుదల చేసే సామర్థ్యమును కలిగియున్నది. సువార్త నేర్చుకొనుటకు కేంద్రముగా మీ గృహమును పునర్నిర్మించుటకు మీరు శ్రద్ధగా పనిచేసినప్పుడు, క్రమంగా, మీ సబ్బాతు దినములు నిజముగా మనోహరమైనవిగా ఉంటాయని నేను వాగ్దానమిచ్చుచున్నాను. మీ పిల్లలు రక్షకుని యొక్క బోధనలు నేర్చుకొనుటకు మరియు జీవించుటకు ఉత్సాహపడతారు, మరియు మీ జీవితంలో, మీ గృహములో అపవాది యొక్క ప్రభావము తక్కువగును. మీ కుటుంబములో మార్పులు గణనీయంగా, బలపరచేవిగా ఉంటాయి.

ఈ సమావేశమందు మనము ఆయన సంఘమును సూచించిన ప్రతీసారి ప్రభువైన యేసు క్రీస్తును గౌరవించుటకు ముఖ్యమైన ప్రయత్నమును నెరవేర్చుటకు మన తీర్మానమును మనము బలపరిచాము. రక్షకుని యొక్క సంఘము మరియు దాని సభ్యులు సరైన పేరును ఉపయోగించుటకు మన శ్రద్ధగల ఆసక్తి హెచ్చించబడిన విశ్వాసము మరియు ఆయన సంఘ సభ్యులకు గొప్ప ఆత్మీయమైన శక్తిని చేరుకొనుటకు నడిపించునని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను.

ఇప్పుడు మనము దేవాలయముల విషయము వైపు తిరిగెదము. దేవాలయములో మనము గడిపే సమయము మన యొక్క మరియు మన కుటుంబాల యొక్క రక్షణకు, ఉన్నత స్థితికి ముఖ్యమైనదని మనమెరుగుదుము.

మన స్వంత దేవాలయ విధులను పొంది, దేవునితో పరిశుద్ధమైన నిబంధనలు చేసిన తరువాత, మనలో ప్రతీఒక్కరికి నిరంతరము ఆత్మీయంగా బలపరచుట మరియు బోధింపబడుట అవసరము, అది ప్రభువు యొక్క మందిరములో మాత్రమే సాధ్యమగును. మన పూర్వీకులకు ప్రతినిధులుగా సేవ చేయుటకు వారికి మనము అవసరము.

దేవుని యొక్క గొప్ప కనికరము మరియు న్యాయము ఆలోచించుము, ఆయన లోకము యొక్క పునాది వేయకముందు, సువార్త యొక్క జ్ఞానము లేకుండా చనిపోయిన వారికి దేవాలయ దీవెనలు ఇచ్చుటకు ఒక మార్గమును అందించెను. ఈ పరిశుద్ధమైన దేవాలయ ఆచారములు ప్రాచీనమైనవి. నాకైతే ఆ ప్రాచీనమైనది, ప్రేరేపించేది మరియు వాటి ప్రామాణికతకు మరొక నిదర్శనము.2

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, అపవాది యొక్క ముట్టడుల తీవ్రత మరియు అనేక రకాలుగా శర వేగంగా ఉదృతమవుతున్నాయి.3 క్రమముగా, తరచుగా దేవాలయములో ఉండుటకు మన అవసరత ఇంత గొప్పగా ఎప్పుడూ లేదు. మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ప్రార్ధనాపూర్వకంగా ఆలోచించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ భవిష్యత్తు మరియు మీ కుటుంబము కొరకు సమయాన్ని అంకితమివ్వుము. మీరు దేవాలయమునకు దగ్గరగా ఉన్న యెడల, ఆయన పరిశుద్ధ మందిరములో ఆయనతో ఉండుటకు --- ప్రభువుతో క్రమముగా సమయాన్ని ప్రణాళిక చేయుటకు ఒక విధానమును కనుగొనుటకు, తరువాత ఖచ్చితంగా, సంతోషముగా దానిని నిలుపుకొనుటకు ఒక మార్గమును కనుగొనమని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. సేవ చేయుటకు మరియు ఆయన దేవాలయములలో ఆరాధించుటకు మీరు త్యాగములు చేసినప్పుడు, మీకవసరమని ప్రభువు ఎరిగిన అద్భుతములు చేయునని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను.

ప్రస్తుతము మనకు 159 సమర్పించబడిన దేవాలయములున్నాయి. ఆ దేవాలయములను సరిగా శ్రద్ధ తీసుకొని కాపాడుట మనకు చాలా ముఖ్యమైనది. కాలము గడిచేకొద్దీ, దేవాలయములు బాగు చేయుట మరియు క్రొత్తదిగా చేయాల్సిన అవసరము అనివార్యమైనది. చివరికి, ఇప్పుడు సాల్ట్‌లేక్ దేవాలయము మరియు మిగిలిన అగ్రగామి తరము దేవాలయములను క్రొత్తదిగా, నవీకరించుటకు ప్రణాళికలు చేయబడినవి. అవి అభివృద్ధి చేయబడినప్పుడు ఈ ప్రాజెక్టులపై వివరాలు తెలియచేయబడును.

ఈరోజు ఇంకా 12 దేవాలయములు నిర్మించుటకు ప్రణాళికలను ప్రకటించుటకు మేము సంతోషిస్తున్నాము. ఆ దేవాలయములు క్రింది ప్రదేశాలలో నిర్మించబడును: మెండోజా, అర్జంటీనా; సాల్వేడర్, బ్రెజిల్; యుబా సిటీ, కాలిఫోర్నియా; ఫ్నమ్ పెన్, కాంబోడియా; ప్రాయా, కేప్ వెర్డి; గౌమ్, యుగొ; ప్యుబ్లా, మెక్సికో; అక్లాండ్, న్యూజిలాండ్; లాగోస్, నైజీరియా; డావో, ఫిలిఫ్పైన్స్; సాన్ జ్యున్, ప్యుర్టొ రికో; మరియు వాషింగ్టన్ కౌంటీ, యూటా.

దేవాలయములను నిర్మించుట మరియు నిర్వహించుట మీ జీవితమును మార్చలేకపోవచ్చు, కానీ దేవాలయములో మీ సమయాన్ని గడుపుట నిశ్చయంగా మార్చును. దేవాలయము నుండి చాలాకాలము దూరముగా ఉన్నవారికి, సిద్ధపడి, సాధ్యమైనంత త్వరగా తిరిగి వెళ్ళమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తరువాత దేవాలయములో ఆరాధించుటకు మరియు మీ కొరకు రక్షకుని యొక్క అంతులేని ప్రేమను లోతుగా అనుభవించుటకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఆవిధంగా మీలో ప్రతీఒక్కరు ఆయన ఈ పరిశుద్ధమైన, శాశ్వతమైన కార్యమును నడిపిస్తున్నారని మీ స్వంత సాక్ష్యమును పొందుతారు. 4

సహోదర, సహోదరీలారా, మీ విశ్వాసము మరియు బలపరచు ప్రయత్నముల కొరకు మీకు నా ధన్యవాదములు. ప్రభువు యొక్క వాక్యమును మీరు విందారగించునట్లు మరియు మీ వ్యక్తిగత జీవితాలలో ఆయన బోధనలు అన్వయించునట్లు, నా ప్రేమను, నా దీవెనను మీకు ఇచ్చుచున్నాను. సంఘములో బయల్పాటు కొనసాగునని మరియు “దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడునని, మరియు కార్యము నెరవేర్చబడిందని గొప్ప యెహోవా చెప్పు”5 వరకు కొనసాగునని నేను మీకు అభయమిస్తున్నాను.

ఆయన, ఆయన పరిశుద్ధ కార్యమునందు హెచ్చింపబడిన విశ్వాసముతో, జీవితములో మీ వ్యక్తిగత సవాళ్ళను సహించుటకు విశ్వాసము, ఓపికతో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. మార్గదర్శులైన కడవరి-దిన పరిశుద్ధులగుటకు నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆలాగున నేను మిమల్ని దీవిస్తున్నాను మరియు దేవుడు జీవిస్తున్నాడని, యేసే క్రీస్తని, ఇది ఆయన సంఘమని నా సాక్ష్యమును చెప్పుచున్నాను. మనము ఆయన పిల్లలము, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. సర్వసభ్య సమావేశ సందేశాలను LDS.org మరియు Gospel Library app లో ఆనలైన్‌లో చూడండి. అవి ఎన్‌సైన్, లియహోనాలో ముద్రించబడును. న్యూ ఇరా మరియు ఫ్రెండ్‌తో కలిపి తపాలా ద్వారా చేరవేయబడిన సంఘ పత్రికలు లేదా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయబడినవి గృహ-కేంద్రిత సువార్త పాఠ్యప్రణాళికకు ముఖ్యమైన భాగము.

  2. ఉదాహరణకు నిర్గమకాండము 28; 29; లేవియకాండము 8 చూడుము.

  3. మోషైయ 4:29 చూడుము.

  4. విల్‌ఫోర్డ్ వుడ్రఫ్, “దత్తత చట్టము,” ప్రసంగము, సంఘము యొక్క సర్వసభ్య సమావేశములో విడుదల చేయబడింది, Apr. 8, 1894 చూడుము. అధ్యక్షులు వుడ్రఫ్ చెప్పారు: “మనము బయల్పాటు(తో) ముగించబడలేదు. మనము దేవుని కార్యము(తో) ముగించబడలేదు. . . అది పరిపూర్ణమయ్యేంత వరకు దీనికి ముగింపులేదు” (Deseret Evening News, Apr. 14, 1894, 9).

  5. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 142.