2010–2019
పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు లోతుగా మరియు శాశ్వతంగా మార్పు చెందుట
అక్టోబర్ 2018


16:14

పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు లోతుగా మరియు శాశ్వతంగా మార్పు చెందుట

మా ఉద్దేశ్యమేదనగా, విశ్వాసమును మరియు ఆత్మీయతను బహుగా హెచ్చించి, మార్పును బలముగా చేసే విధానములో సంఘము మరియు గృహ అనుభవాలను సరి చూచుట.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇప్పుడే అందముగా, వాక్చాతుర్యముతో చెప్పినట్లుగా, సంఘ నాయకులు చాలాకాలముగా పని చేస్తున్న “సిద్ధాంతమును నేర్చుకొనుటకు, విశ్వాసమును బలపరచుటకు మరియు గొప్ప వ్యక్తిగత ఆరాధనను పెంపొందించుటకుగృహ-కేంద్రీకృతమైన మరియు సంఘము బలపరిచే ప్రణాళిక,” పై చాలాకాలముగా పనిచేస్తున్నారు. తరువాత అధ్యక్షులు నెల్సన్ “గృహములో మరియు సంఘములో సువార్త ఉపదేశము మధ్య ఒక క్రొత్త సమతుల్యతను మరియు సంబంధమును”1 సాధించటానికి ఒక సవరణను ప్రకటించారు.

ఈ ఉద్దేశములను నెరవేర్చుటకు--- అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నడిపింపు క్రింద మరియు ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కూటమి యొక్క సలహాసభచేత నిర్ణయించబడి, మరియు వివరించబడి---2019, జనవరి ప్రారంభమునుండి, ఆదివారపు సమావేశ ప్రణాళిక క్రింది విధాలుగా, సర్దుబాటు చేయబడును.

ఆదివారపు సమావేశ ప్రణాళిక

ఆదివారపు సమావేశాలు ప్రతీవారము రక్షకునిపై, సంస్కార విధి, మరియు ఆత్మీయ సందేశములపై దృష్టిసారించి, 60-నిముషాల సంస్కార సమావేశమును కలిగియుండును. తరగతులకు మారుటకు కొంత సమయము తరువాత, సంఘ సభ్యులు 50 నిముషాల తరగతికి హాజరవుతారు, అది ప్రతీ ఆదివారము మార్చి మార్చి జరుగును:

  • సండే స్కూల్ మొదటి మరియు మూడవ ఆదివారమున జరపబడును.

  • యాజకత్వ కోరములు, ఉపశమన సమాజము, మరియు యువతుల సమావేశాలు రెండవ మరియు నాలగవ ఆదివారములు జరపబడును.

  • ఐదవ ఆదివారమున సమావేశాలు బిషప్పు యొక్క నడిపింపు క్రింద జరుగును.

ప్రతీ వారము అదే-50 నిముషాల సమయములో పాట పాడే సమయము మరియు తరగతులు కలిపి ప్రాధమిక జరపబడును.

ఆదివారపు ప్రణాళిక

ఆదివారపు సమావేశ ప్రణాళికకు సంబంధించి, మన ప్రశస్తమైన సభ్యులలో కొందరికి సంఘములో మూడు గంటల ఆదివారపు ప్రణాళిక కష్టమైనది కావచ్చని సంఘము యొక్క సీనియర్ నాయకులు ఎరిగియున్నారు. ప్రత్యేకంగా ఇది చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, ప్రాధమిక పిల్లలకు, వృద్ధులకు, క్రొత్తగా మార్పు చెందిన వారికి, మరియు ఇతరులకు నిజమైనది.2

కాని ఆదివారపు సమావేశ గృహ ప్రణాళిను తగ్గించుట కంటే ఈ సవరణకు చాలా అధికమున్నది. ఇదివరకు అడగబడిన వాటికి మీ విశ్వసనీయత ఫలితంగా ఎంతగా నెరవేర్చబడిందో అధ్యక్షులు నెల్సన్ గుర్తించారు. ఆయన, సంఘము యొక్క మొత్తము నాయకత్వము గృహము కేంద్రీకరించిన, సంఘము-సహాయపడే సమతుల్యమైన ప్రయత్నము ద్వారా తల్లిదండ్రులకు, యువతకు, ఒంటరిగా ఉన్నవారికి, వృద్ధులకు, క్రొత్తగా మార్పు చెందిన వారికి, మిషనరీలు బోధిస్తున్న ఆ జనులకు గొప్ప సంతోషమును తేవాలని కోరుతున్నారు. ఈ సవరణ మరియు ఈమధ్య చేయబడిన మార్పులతో సంబంధించిన ఉద్దేశాలు మరియు దీవెనలు క్రింది వాటిని కలిపియున్నవి:

  • పరలోకపు తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు లోతైన మార్పు మరియు వారియందు విశ్వాసమును బలపరచుట.

  • గృహము-కేంద్రీకరించబడిన, సంఘము-బలపరచు పాఠ్యప్రణాళిక ద్వారా వ్యక్తులు మరియు కుటుంబాలను బలపరచుట, అది సంతోషకరమైన సువార్త జీవితమునకు తోడ్పడును.

  • సంస్కార విధిపై దృష్టిసారించుటతో, సబ్బాతు దినమును గౌరవించుట.

  • మిషనరీ కార్యము, విధులను పొందుట మరియు దేవాలయ నిబంధనలు, దీవెనలు పొందుట ద్వారా తెరకు రెండువైపుల ఉన్న పరలోకపు తండ్రి యొక్క పిల్లలందరికి సహాయపడుట.

గృహము-కేంద్రీకరించబడిన, సంఘము-బలపరచు సువార్త శిక్షణ

ఈ ఆదివారము ప్రణాళిక గృహ సాయంకాలము కొరకు మరియు ఆదివారము ఇంటిలో సువార్తను అధ్యయనము చేయుటకు, లేక వ్యక్తులు మరియు కుటుంబాలు కోరినట్లుగా మిగిలిన సమయాలలో ఎక్కువ సమయాన్ని అనుమతించును. సోమవారము లేక ఇతర సమయాలలో ఒక కుటుంబ ప్రోత్సాహకార్యక్రమ రాత్రి జరపబడవచ్చు. ఈ ముగింపు వరకు, నాయకులు సంఘ సమావేశాలు మరియు ప్రోత్సాహకార్యక్రమాలనుండి సోమవారపు సాయంత్రములు ఖాళీగా ఉంచుట కొనసాగించాలి. అయినప్పటికిని, గృహ సాయంకాలము, సువార్త అధ్యయనము మరియు వ్యక్తులు, కుటుంబాల కొరకైన ప్రోత్సాహకార్యక్రమాలు వారి వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయబడవచ్చు.

వ్యక్తులు, కుటుంబాల కొరకు-- రండి, నన్ను వెంబడించుము

ఇంటి వద్ద కుటుంబము మరియు వ్యక్తిగత సువార్త అధ్యయనము క్రమబద్ధీకరించబడిన పాఠ్యప్రణాళిక చేత గణనీయంగా మెరుగుపరచబడింది మరియు వ్యక్తులు, కుటుంబాల కొరకు క్రొత్తదైన, రండి, నన్ను వెంబడించుము వనరు, అది సండేస్కూలు మరియు ప్రాధమికలో బోధించబడిన దానితో సమన్వయము చేయబడినది.3 జనవరిలో, సంఘము యొక్క యువత, పెద్దల సండేస్కూలు, మరియు ప్రాధమిక తరగతులు క్రొత్త నిబంధనను అధ్యయనము చేస్తాయి. వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు, రండి, నన్ను వెంబడించుము వనరు--- క్రొత్త గృహ అధ్యయనము కూడ క్రొత్త నిబంధనను కవరు చేయును---సభ్యులు గృహములో సువార్తను నేర్చుకొనుటకు ప్రణాళిక చేయబడినది. అది వివరించును: “ఈ వనరు సంఘములో ప్రతీ వ్యక్తి మరియు కుటుంబము కొరకైనది. అది (మన) స్వంతంగా లేక (మన) కుటుంబముగా అయినను . . . సువార్తను నేర్చుకొనుటకు (మనకు బాగా) సహాయపడుటకు ఏర్పాటు చేయబడింది. . . . ఈ (క్రొత్త) వనరులో సంక్షిప్తములు ఒక వారమునకు . . . ప్రణాళిక ప్రకారము ఏర్పాటు చేయబడినవి.”4

సంఘములో బోధించబడిన క్రొత్త ప్రాధమిక రండి, నన్ను వెంబడించుము పాఠములు అదే వారపు ప్రణాళికను అనుసరిస్తాయి. మొదటి మరియు మూడవ ఆదివారపు యుక్తవయస్కుల మరియు యువత సండే స్కూల్ తరగతులు సమన్వయపరచబడును, ఆవిధంగా అవి క్రొత్త రండి, నన్ను వెంబడించుము గృహ వనరును బలపరుస్తాయి. రెండవ మరియు నాలగవ ఆదివారమున యాజకత్వము మరియు ఉపశమన సమాజములో పెద్దలు ఆధునిక ప్రవక్తల ప్రస్తుతపు సందేశాలపై ఉద్ఘాటనతో, సంఘ నాయకుల బోధనలను అధ్యయనము చేయుట కొనసాగిస్తారు.5 యువతులు మరియు అహరోను యాజకత్వ యువకులు ఆ ఆదివారములు సువార్త విషయాలను అధ్యయనము చేస్తారు.

క్రొత్త గృహ బోధన అధ్యయనము వనరు “కుటుంబ లేఖన అధ్యాయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఆలోచనలను”6 అందించును. ప్రతీవారము కొరకు సంక్షిప్తములు వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు సహాయకరమైన అధ్యయన ఆలోచనలను మరియు ప్రోత్సాహకార్యక్రమాలను కలిగియున్నవి. వ్యక్తులు, కుటుంబాల కొరకైన రండి, నన్ను వెంబడించుము వనరు వ్యక్త్తిగత, కుటుంబ, ప్రత్యేకంగా పిల్లల శిక్షణను మెరుగుపరచుటకు సహాయపడు అనేక దృష్టాంతములను కూడ కలిగియున్నది.7 ఈ క్రొత్త వనరు ఈ సంవత్సరము డిసెంబరుకల్లా ప్రతీ ఇంటికి అందించబడును.

జనవరిలో, సంఘ సభ్యులకు తన ప్రారంభ ప్రసంగము నుండి అధ్యక్షులు నెల్సన్, నిబంధన బాటను నడుచుట ద్వారా యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుటకు మనల్ని ప్రేరేపించెను.8

పరలోకపు తండ్రి మరియు యేసు క్రీస్తు, మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసమును బలపరచుట మరియు దానికి లోతైన వ్యక్తిగత మార్పు లోక పరిస్థితులకు అత్యధికంగా అవసరము. మనము ఎదుర్కొను అపాయకరమైన కాలము కొరకు, వరుస వెంబడి వరుస ప్రభువు మనల్ని సిద్ధపరచియున్నాడు. ఇటీవల సంవత్సరాలలో, క్రింది సంబంధిత ప్రధానమైన ఆలోచనలతో వ్యవహరించమని ప్రభువు మనల్ని నడిపించారు.

  • సబ్బాతు దినమును మరియు సంస్కారపు పరిశుద్ధ విధిని గౌరవించుట, అది మరలా గత మూడు సంవత్సరాలుగా పునరుద్ఘాటించబడింది.

  • బిషప్పు యొక్క నడిపింపు క్రింద, బలపరచబడిన ఎల్డర్ల కోరములు మరియు ఉపశమన సమాజములు సంఘము యొక్క ఉద్దేశము మరియు దైవికంగా నియమించబడిన బాధ్యతలపై దృష్టిసారించబడినవి9 మరియు సభ్యులు నిబంధనలు చేసి పాటించుటకు సహాయపడును.

  • ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన విధానములో పరిచర్య చేయుట సంతోషంగా పొందుపరచబడింది.

  • ముగింపును మనస్సులో ఉంచుకొని ప్రారంభిస్తూ, దేవాలయ నిబంధనలు మరియు కుటుంబ చరిత్ర సేవ నిబంధన బాటలో ఉద్దేశ్యపూర్వకమైన భాగమగుచున్నవి.

ఈ ఉదయము ప్రకటించబడిన సవరణలు మన దినములో సవాళ్ళ కొరకు నడిపింపుకు మరొక మాదిరిగా ఉన్నవి.

సంఘ సాంప్రదాయ పాఠ్యప్రణాళిక ఆదివారపు సంఘ అనుభవమును ఉద్ఘాటించెను. మనకు మేలైన బోధన మరియు ఎక్కువ ఆత్మీయంగా సిద్ధపరచబడిన తరగతి సభ్యులున్నప్పుడు, మనము మంచి ఆదివారపు సంఘ అనుభవమును కలిగియుంటాము. సంఘ సందర్భములో తరచుగా ఆత్మ హెచ్చించబడి మరియు మార్పును బలపరచుటకు మనము దీవించబడ్డాము.

క్రొత్త గృహము-కేంద్రీకరించబడిన, సంఘము బలపరచిన పాఠ్యప్రణాళిక కుటుంబ మత ఆచరణ, ప్రవర్తన, మరియు వ్యక్తిగత మతపరమైన ఆచరణ మరియు ప్రవర్తనను ఎక్కువ శక్తివంతంగా ప్రభావితం చేయాలి. గృహ సందర్భములో సాధించబడే ఆత్మీయ ప్రభావము, లోతైన మరియు శాశ్వతమైన పరివర్తనను మేము ఎరుగుదుము. సంవత్సరాల క్రితం, యువతీ, యువకులకు ఎక్కువ తరచుగా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము గృహములో ప్రార్థన మరియు వ్యక్తిగత లేఖన అధ్యయనముతో ఉండునని ఒక అధ్యయనము ఏర్పాటు చేయబడింది. మన ఉద్దేశము, విశ్వాసమును, ఆత్మీయతను బహుగా హెచ్చించుట, పరలోకపు తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తుకు మార్పు చెందుటను బలపరచు విధానములో సంఘము మరియు గృహ అనుభవమును సరిచూచుట.

గృహము-కేంద్రీకరించబడిన, సంఘము-సహాయపడే భాగములో ఈ సవరణ, ప్రతీ వ్యక్తి మరియు కుటుంబమునకు ఎలా, ఎప్పుడు దాని అమలు చేయాలో ప్రార్థనాపూర్వకముగా తీర్మానించుటకు వశ్యత ఉన్నది. ఉదాహరణకు, ఇది కుటుంబాలన్నిటిని బహుగా దీవించుచుండగా, స్థానిక అవసరాలపై ఆధారపడి, అది పూర్తిగా ఒంటరి యౌవనులు, ఒంటరి పెద్దలకు, ఒంటరి తల్లిదండ్రులకు, కుటుంబాలలో ఒకరే సభ్యులున్న, క్రొత్త సభ్యులకు10 మరియు మామూలు ఆదివారపు ఆరాధనా కార్యక్రమాలకు బయట గుంపులందు సమావేశమగుట ఇతరులకు సువార్త సందర్భములో కలిసి మెలసి మెలగుటకు మరియు గృహ కేంద్రీకరితమైన మరియు సంఘము బలపరిచే వనరును కలిసి అధ్యయనము చేయుట ద్వారా బలపరచబడుటకు పూర్తిగా యుక్తమైనది. ఆవిధంగా కోరు వారిచేత అది అనధికారికంగా నెరవేర్చబడును.

ప్రపంచములో అనేక భాగాలలో, జనులు మామూలు ఆదివారపు సమావేశము తరువాత సామాజిక అనుబంధములను ఆనందించుటకు సమావేశ గృహము వద్ద నిలిచియుండుటకు ఇష్టపడతారు. ఈ ప్రకటించబడిన సవరణలో ఏదియు ఏ విధంగానైనా ఈ అద్భుతమైన మరియు ప్రతిఫలమిచ్చు ఆచారముతో అంతరాయపరచదు.

సభ్యులు సబ్బాతు కొరకు సిద్ధపరచుటకు సహాయపడుటకు, కొన్ని వార్డులు వారము మధ్యలో, ఇదివరకే సమాచారము అందజేసే ఈమెయిల్, సందేశము లేక సామాజిక మీడియా సందేశమును పంపుచున్నారు. ఈ సవరణను పరిగణిస్తూ, ఈ విధమైన సంభాషణను మేము బలముగా సిఫారసు చేస్తున్నాము. ఈ ఆహ్వానములు రాబోయే తరగతి పాఠము విషయము మరియు గృహములో సువార్త సంభాషణను కొనసాగించుట, బలపరచుట కలిపి, ఆ వారము కొరకు ఆదివారపు సమావేశ ప్రణాళికను గూర్చి సభ్యులకు జ్ఞాపకము చేయును. అదనముగా, ఆదివారమున పెద్దల సమావేశాలు ప్రతీవారము సంఘము మరియు గృహ బోధనను కలుపుటకు సమాచారమును కూడా అందించును.

కార్యనిర్వహణ పనులకు పైగా ఆత్మీయ ప్రాధాన్యతలు ఉద్ఘాటించబడినట్లు నిశ్చయపరచుటకు సంస్కార సమావేశము మరియు తరగతి సమయమునకు ప్రార్ధనాపూర్వకమైన ఆలోచన అవసరము. ఉదాహరణకు, ప్రకటనలు వారము మధ్యలో పంపే ఆహ్వానములో పూర్తి చేయబడిన దానిలో ఎక్కువ భాగము లేక ప్రచురించబడిన కార్యక్రమము కావచ్చు. సంస్కార సమావేశము ఒక ప్రారంభపు మరియు ముగింపు ప్రార్థన కలిగియుండగా, రెండవ సమావేశానికి ముగింపు ప్రార్థన మాత్రమే అవసరమగును.11

ముందుగా చెప్పినట్లుగా, క్రొత్త ఆదివారపు ప్రణాళిక 2019 జనవరి వరకు ప్రారంభము కాదు. దీనికి అనేక కారణములున్నాయి. రెండు అతి ముఖ్యమైనవి, మొదటిది, వ్యక్తులు, కుటుంబాల కొరకు క్రొత్తదైన, రండి, నన్ను వెంబడించుము వనరు, పంపిణీ చేయుటకు సమయము, మరియు రెండవది, రోజులో ఎక్కువ వార్డులు సమావేశమయ్యే లక్ష్యముతో సమావేశ ప్రణాళికలను ఏర్పాటు చేయుటకు స్టేకు అధ్యక్షులకు మరియు బిషప్పులకు సమయాన్ని అనుమతించుటకు.

నాయకులు బయల్పాటును వెదకినప్పుడు, కొన్ని సంవత్సరాలుగా పొందిన నడిపింపు సంస్కార సమావేశమును బలపరచుటకు, సబ్బాతు దినమును గౌరవించుటకు, తల్లిదండ్రులు, వ్యక్తులు తమ గృహాలను ఆత్మీయ బలము మరియు హెచ్చించబడిన విశ్వాసము యొక్క ఆధారముగా---ఆనందము మరియు సంతోషముగల స్థలముగా చేయుటకు ప్రోత్సహించి, సహాయపడుట కొరకైనది.

అసాధారణమైన దీవెనలు

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన సభ్యులకు ఈ సవరణల యొక్క అర్ధమేమిటి? సభ్యులు అసాధారణమైన విధానాలలో దీవించబడతారని మా విశ్వాసము. ఆదివారము సంఘములో మరియు గృహములో సువార్త శిక్షణ మరియు బోధించు దినము కాగలదు. వ్యక్తులు మరియు కుటుంబాలు కుటుంబ సలహాసభలు, కుటుంబ చరిత్రలు, పరిచర్య చేయుట, సేవ, వ్యక్తిగత ఆరాధన, మరియు ఆనందకరమైన కుటుంబ సమయము, సబ్బాతు దినములో ఒడంబడిక చేసుకున్నప్పుడు, సబ్బాతు దినము నిజముగా ఆనందము కలిగించును.

కార్వాల్హో కుటుంబము

బ్రెజిల్ నుండి ఒక కుటుంబము, ఒక స్టేకు యొక్క సభ్యులు, అక్కడ క్రొత్త గృహసంబంధమైన, రండి, నన్ను వెంబడించుడి వనరు పరీక్షించబడింది. తండ్రి, ఫెర్నాండో, మిషనరీగా తిరిగి వచ్చాడు, అతడు తన భార్య నాన్సి, నలుగురు చిన్న పిల్లలకు తల్లిదండ్రులు, దీనిని తెలియచేసారు: “రండి, నన్ను వెంబడించుము, కార్యక్రమము మా స్టేకులో పరిచయము చేయబడినప్పుడు, నేను చాలా ఉత్సాహపడ్డాను, మరియు ‘మేము ఇంటిలో లేఖనాలు చదివే విధానము మారబోతుందని నేను అనుకున్నాను. . . . అది నిజముగా మా ఇంటిలో జరిగింది, మరియు సంఘ నాయకునిగా అది మిగిలిన గృహాలలో జరుగుట నేను చూసాను . . . . అది మా ఇంటిలో లేఖనాలను నిజముగా చర్చించుటకు మాకు సహాయపడింది. నా భార్యకు, నాకు అధ్యయనము చేయబడిన విషయమును గూర్చి లోతైన జ్ఞానము కలిగింది . . . అది మా సువార్త జ్ఞానమును విశదపరచింది, మరియు మా విశ్వాసము, సాక్ష్యమును మెరుగుపరచింది. . . . అది ప్రభువు చేత ప్రేరేపించబడిందని, నేనెరుగుదును, ఆవిధంగా లేఖనాలలో ఉన్న సూత్రములు మరియు సిద్ధాంతముల యొక్క ఏకరీతిగల, ప్రభావవంతమైన అధ్యయనము . . . . హెచ్చుగా దుష్టమగుచున్న లోకములో కుటుంబాలకు ఎక్కువ విశ్వాసమును, సాక్ష్యమును, మరియు వెలుగును తెచ్చును.” 12

ప్రపంచమంతటా ఈ కార్యక్రమాన్ని పరీక్షించిన స్టేకులలో, రండి, నన్ను వెంబడించుముగృహ వనరుకు అత్యంత అనుకూలమైన స్పందన ఉన్నది. అనేకమంది లేఖనాలు చదువుట నుండి లేఖనాలు అధ్యయనము చేయుటకు పురోభివృద్ధి చెందామని తెలియచేసారు. అనుభవము విశ్వాసమును హెచ్చించేదిగా ఉన్నదని మరియు వార్డుపై అద్భుతమైన ప్రభావము కలిగియున్నదని ఉమ్మడిగా కూడా భావించబడింది.13

లోతైన మరియు శాశ్వతమైన పరివర్తన

ఈ సవరణల యొక్క లక్ష్యము పెద్దలు మరియు యువతకు లోతైన మరియు శాశ్వతమైన పరివర్తన తెచ్చుట. వ్యక్తుల మరియు కుటుంబ వనరులో మొదటి పేజీ దీనిని ప్రత్యేకించి చూపును: “సమస్త సువార్త శిక్షణ మరియు బోధన యొక్క లక్ష్యము మన పరివర్తనను లోతుగా చేయుట మరియు యేసు క్రీస్తు వలే ఎక్కువగా అగుటకు మనకు సహాయపడుట . . . దీని అర్ధము మన హృదయాలను మార్చుటకు క్రీస్తుపై ఆధారపడుట.”14 ఇది “తరగతి గదిని దాటి వ్యక్తి యొక్క హృదయము మరియు ఇంటిలోనికి చేరువగుట ద్వారా సహాయపడుతుంది. నిజమైన పరివర్తనకు సువార్తను గ్రహించి మరియు జీవించుటకు ఏకరీతిగల అనుదిన ప్రయత్నాలు అవసరము.”15

లోతైన, శాశ్వతమైన పరివర్తన యొక్క మిక్కిలి ముఖ్యమైన లక్ష్యము మరియు అంతిమ దీవెన ఏదనగా నిబంధన బాటలో నిబంధనలు మరియు విధులను యోగ్యతగా పొందుట.16

గురుతును దాటి చూచుట లేక వ్యక్తులు లేక కుటుంబాలను వర్గీకరించుటకు---మీరు కలిసి సంప్రదిస్తారని మరియు ఈ సవరణలను అమలుపరచుటకు బయల్పాటును వెదకుతారని మేము నమ్ముతున్నాము. అదనపు సమాచారము ప్రథమ అధ్యక్షత్వ లేఖ మరియు జతపరచబడినది కలిపి, రాబోయే ఉత్తరప్రత్యుత్తరములందు పంచుకొనబడును.

దేవాలయములో ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తులుల కూటమి సలహాసభ యొక్క నిశిత చర్చలలో, మరియు ఈ సవరణలతో ముందుకు సాగుటకు బయల్పాటు కొరకు ప్రవక్త ప్రభువుకు మొరపెట్టిన తరువాత, అందరిచేత శక్తివంతమైన నిర్ధారణ పొందబడింది. రస్సెల్ ఎమ్. నెల్సన్ మన జీవిస్తున్న అధ్యక్షుడు మరియు ప్రవక్త. ఈరోజు చేయబడిన ప్రకటనలు సవరణలను ఆతృతగా హత్తుకొని, పరిశుద్ధాత్మను వెదకువారి కొరకు లోతైన దీవెనలు కలుగును. మనము మన పరలోక తండ్రి, మరియు మన ప్రభువును, రక్షకుడైన, యేసు క్రీస్తుకు దగ్గరవుతాము, వీరిని గూర్చి నేను నిశ్చయమైన సాక్షిని. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, “Opening Remarks,” Liahona, Nov. 2018, 8.

  2. సమాజములో సాధారణంగా, సమాచారము, విద్య మరియు వినోదము కొరకు విస్తారమైన సంఘటనలు గణనీయంగా తగ్గించబడినవని కూడా మేము ఎరిగియున్నాము.

  3. ఈ పాఠ్యప్రణాళిక డిజిటల్‌ పద్ధతిలో మరియు ప్రచురణలో రెండు విధాలుగా లభ్యమగును.

  4. Come, Follow Me—For Individuals and Families (2019), vi.

  5. ఎల్డర్ల కోరము మరియు ఉపశమన సమాజము కొరకు------“రండి, నన్ను వెంబడించుము Liahona, May 2018, 140 చూడుము. రెండవ మరియు మూడవ ఆదివారములకు బదులుగా, అది రెండవ మరియు నాలగవ ఆదివారములందు సర్వసభ్య సమావేశ సందేశములు చర్చించబడును.

  6. వ్యక్తులకు మరియు కుటుంబాలకు---రండి నన్ను వెంబడించుము,, 4. గృహ సువార్త అధ్యయనము, గృహ సాయంకాలము, మరియు కుటుంబ ప్రోత్సాహకార్యక్రమాలలో ఏది కుటుంబ గృహ సాయంకాలములో భాగము కావాలో వ్యక్తులు మరియు కుటుంబాలు తీర్మానించాలి (అనేకమంది ఇదివరకే “గృహ సాయంకాలము”) ని పిలుస్తున్నారు. వ్యక్తులు మరియు కుటుంబాలు ఈ తీర్మానము ను చేస్తున్నారు కనుక, గృహ సాయంకాలము మరియు కుటుంబ గృహ సాయంకాలము ప్రకటించబడిన సవరణలలో ప్రత్యమ్నాయంగా ఉపయోగించబడినవి.

  7. See Come, Follow Me—For Individuals and Families, 29.

  8. See Russell M. Nelson, “As We Go Forward Together,” Liahona, Apr. 2018, 7.

  9. Handbook 2: Administering the Church (2010), 2.2, చూడుము. దైవికంగా నియమించబడిన బాధ్యతలు “యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుటకు సభ్యులకు సహాయపడుట, మిషనరీ కార్యము ద్వారా పేదవారు, అవసరతలో ఉన్నవారి కొరకు శ్రద్ధ తీసుకొను, మరియు దేవాలయములు నిర్మించి, మృతుల రక్షణను సాధ్యపరుస్తూ, ప్రతినిధిగా విధులను నెరవేర్చుట ద్వారా ఇశ్రాయేలును సమకూర్చుట.”సిద్ధాంతము మరియు నిబంధనలు 110 కూడా చూడుము, అది అవసరమైన తాళపు చెవుల పునఃస్థాపన వృత్తాంతమును కలిగియున్నది.

  10. తల్లిదండ్రులు సభ్యులు కాని వారికి, లేక సంఘానికి క్రమంగా హాజరుకాని వారికి ప్రత్యేక శ్రద్ధను చూపుము. అందరికి సంబంధించి అది ప్రయోజనకరమైనది అయితే ఒక కుటుంబముతో ఒంటరివారు మరియు ఇతరులు కూడా కలుసుకోవచ్చు.

  11. ప్రారంభ కార్యక్రమాలు సాధారణంగా రెండవ సమావేశములో భాగము కాదు.

  12. ఫెర్నాండో మరియు నాన్సీ డి కార్వాల్హో కుటుంబము, బ్రెజిల్.

  13. కార్యక్రమమును పరీక్షించుటలో చేర్చబడిన వ్యక్తులు మరియు కుటుంబాలు సగటున సువార్తను ఎక్కువ తరచుగా అధ్యయనము చేసారు మరియు ఇంటిలో ఎక్కువ అర్ధవంతమైన లేఖన అధ్యయనము మరియు సువార్త చర్చలను కలిగియున్నారు. వారు కుటుంబము మరియు వార్డు సభ్యులతో అనధికారమైన సువార్త చర్చలను కలిగియున్నారని తెలియచేసారు మరియు వారి కుటుంబాల వలే అదే లేఖన వచనాలను అధ్యయనము చేయుటను అభినందించారు. ఇది ప్రత్యేకంగా యువత విషయములో యధార్దమైనది.

  14. వ్యక్తులకు మరియు కుటుంబాలకు---రండి నన్ను వెంబడించుము,, v;2 కొరింథీయులకు 5:17 కూడా చూడుము.

  15. వ్యక్తులకు మరియు కుటుంబాలకు---రండి నన్ను వెంబడించుము,v.

  16. See Russell M. Nelson, “As We Go Forward Together,” 7.