2010–2019
దైవిక అసంతృప్తి
అక్టోబర్ 2018


దైవిక అసంతృప్తి

దైవిక అసంతృప్తి మనల్ని విశ్వాసముతో చేయుటకు, మేలు చేయమని, ఆయనకు వినయముతో మన జీవితాలను ఇవ్వమనిన రక్షకుని ఆహ్వానమును అనుసరించుటకు మనల్ని కదిలించగలదు.

నేను ప్రాధమిక పాఠశాలలో ఉన్నప్పుడు, మేము చదును చేయబడిన కాలిబాటపై నడిచాము, అది ఒక కొండ ప్రక్కన ముందుకు వెనుకకు చుట్టుకొనియున్నది. అక్కడ చదను చేయబడని మరొక కాలిబాట ఉన్నది, అది “బాలుర కాలిబాట,” అని పిలవబడింది. బాలుర కాలి బాట ధూళిలో బాట, అది కొండపైకి నేరుగా వెళ్ళును. అది దగ్గర దారి కాని ఎక్కువ ఏటవాలైనది. ఒక చిన్న బాలికగా, నేను బాలురు నడవగల కాలిబాటలో నడవగలనని నేను ఎరుగుదును. మరిముఖ్యముగా, నేను కడవరి దినాలలో జీవిస్తున్నానని మరియు అగ్రగాముల వలే, కఠినమైన విషయాలు చేయాల్సినవసరమున్నదని నాకు తెలుసు---మరియు నేను సిద్ధపడాలని కోరాను. కనుక అప్పుడప్పుడు, చదను చేయబడిన కాలిబాటపై నా స్నేహితుల గుంపు నుండి వెనకబడి, నా చెప్పులను తీసివేసి, బాలుర కాలిబాటపైకి వట్టికాళ్లతో నడిచేదాన్ని.

ఒక చిన్న ప్రాధమిక బాలికగా, సిద్ధపడుటకు నేను చేయగలది అదేనని నేను అనుకున్నాను. ఇప్పుడు నాకు భిన్నముగా తెలుసు! కొండ కాలిబాటలపై వట్టికాళ్ళతో నడుచుటకు బదులుగా, పరిశుద్ధాత్మ యొక్క ఆహ్వానములకు స్పందించుట ద్వారా నిబంధన బాటపై నడుచుటకు నా పాదమును నేను సిద్ధపరచుకోగలనని నేను ఎరుగుదును. ఏలయనగా ప్రభువు, ఆయన ప్రవక్త ద్వారా, “మహోన్నతమైన, పరిశుద్ధమైన విధానములో” జీవించుటకు, శ్రద్ధ తీసుకొనుటకు మరియు “ఒక అడుగు ఉన్నతంగా తీసుకొనుటకు”1 మనలో ప్రతీఒక్కరిని పిలచుచున్నారు.

క్రియతో చేయుటకు ఈ ప్రవచనాత్మక పిలుపులు, మన సహజ జ్ఞానముతో జతపరచబడి, మనము ఇంకా అధికము చేయగలము మరియు కొన్నిసార్లు ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ “దైవిక అసంతృప్తి”2 అని పిలిచిన దానిని మనలో కల్పిస్తాము. “మనము ఏమిటో, మనము మారుటకు గల శక్తి (తో)”3 దానిని పోల్చినప్పుడు దైవిక అసంతృప్తి కలుగును. మనలో ప్రతీఒక్కరు, మనము నిజాయితీగా ఉన్నయెడల, మన ప్రస్తుతపు సామర్ధ్యములు, బలములు, బలహీనతలు మరియు ఆత్మీయత స్థాయి మధ్య, మనము ఎవరము, మనము ఎక్కడ, ఎవరి వలే కావాలని కోరతామో మధ్య తేడా ఉన్నదని గమనిస్తాము. మనము గొప్ప వ్యక్తిగత సామర్ధ్యము కొరకు ఆపేక్షిస్తాము. మనము ఈ భావనలను కలిగియున్నాము, ఎందుకనగా మనము దేవుని యొక్క కుమార్తైలము మరియు కుమారులము, క్రీస్తు యొక్క వెలుగుతో జన్మించాము, అయినప్పటికినీ దుష్టలోకములో జీవిస్తున్నాము. ఈ భావనలు దేవుడు ఇచ్చినవి మరియు అమలు చేయుటకు అత్యవసరతను కల్పించును.

సాతాను యొక్క అనుకరణను గుర్తించి మనము గెలవమని భావించునట్లు చేసే నిరాశను మానివేస్తూ, ఒక మహోన్నత విధానమునకు మనల్ని పిలుచు దైవిక అసంతృప్తి భావనలను మనము ప్రోత్సహించాలి. సాతాను తరచుగా మనలో ఈ భావనను ప్రోత్సహించును. దేవునిని, ఆయన సమాధానమును, మరియు కృప కొరకు వెదకుటకు మనల్ని నడిపించు ఉన్నతమైన బాటను నడుచుటకు మనము ఎంపిక చేయవచ్చు లేక మనము ఎప్పటికీ గెలవమని, తగినంత గొప్పవారము కాదని, ఎప్పటికీ తెలివైనవారము కాదని, అందమైనవారము కాదని, మనలో ఏదీ మంచిలేదనే సందేశాలతో మనల్ని కృంగదీయుటకు తరచుగా ప్రయత్నించు సాతానును మనము వినవచ్చు. మన అసంతృప్తి మనల్ని బలపరచవచ్చు---లేక మనల్ని బలహీనపరచవచ్చు.

విశ్వాసముతో అమలు చేయుట

దైవిక అసంతృప్తి సాతాను కల్పన నుండి వచ్చినదని చెప్పుటకు ఒక విధానము దైవిక అసంతృప్తి మనల్ని విశ్వాసముగల క్రియకు నడిపించును. దైవిక అసంతృప్తి మన సౌకర్యముగల ప్రదేశములోనే ఉండాలనే ఒక ఆహ్వానము కాదు, లేక అది మనల్ని నిరాశకు నడిపించదు. నేను కాని సమస్తమును గూర్చి ఆలోచనలలో ప్రతికూలతను నేను అనుమతించినప్పుడు, నేను వృద్ధి చెందను, మరియు ఆత్మను అనుభూతిచెందుటకు మరియు అనుసరించుట మిక్కిలి కష్టమైనదిగా నేను కనుగొన్నాను. 4

యువకునిగా, జోసెఫ్ స్మిత్ తన పొరపాట్లను బాగా ఎరుగును మరియు “(తన) అమర్త్యత్వ ఆత్మ యొక్క శ్రేయస్సు” గురించి చింతించెను. అతడి మాటలలో, “నా మనస్సు మిక్కిలి వ్యధ చెందింది, ఏలయనగా నేను నా పాపముల చేత దోషిగా నిర్ధారించబడ్డాను, మరియు . . . నా స్వంత పాపముల కొరకు మరియు లోక పాపముల కొరకు దుఃఖించాలని భావించాను.”5 అది అతడిని, “గంభీరమైన ఆలోచనకు మరియు గొప్ప అసౌకర్యతకు నడిపించెను.”6 ఇది పరిచయమైనదిగా అనిపిస్తుందా? మీ పొరపాట్లు ద్వారా మీరు అసౌకర్యంగా లేక నిరాశ చెందారా?

మంచిది, జోసెఫ్ ఏదైన చేసాడు. అతడు ఇలా తెలియజేసాడు, “తరచుగా నాకైనేను అనుకున్నాను: దాని గురించి నేనేమి చేయాలి?”7 జోసెఫ్ విశ్వాసముతో అమలు చేసాడు. అతడు లేఖనాలవైపు తిరిగాడు, యాకోబు 1:5 లో ఆహ్వానమును చదివాడు, మరియు సహాయము కొరకు దేవుని వైపు తిరిగాడు. ఫలితంగా కలిగిన దర్శనము పునఃస్థాపనను పరిచయము చేసింది. జోసెఫ్ దైవిక అసంతృప్తి, అతడి అసౌకర్య సమయము మరియు కలవరము అతడిని విశ్వాసమైన క్రియకు ప్రేరేపించినందుకు నేనెంత కృతజ్ఞతను కలిగియున్నాను.

మేలు చేయుటకు ప్రేరేపణలను అనుసరించుము

అసంతృప్తి భావనను లోకము తరచుగా ఆత్మ అవశోషణకు, మన ఆలోచనలను ప్రస్తుతము మరియు గతముపై మరల్చుట, నేను ఎవరని, నేను ఎవరు కాదని, మరియు నాకు ఏమి కావాలని వ్యక్తిగతంగా ఎక్కువగా ఆలోచించుటకు ఒక సాకుగా ఉపయోగించును. దైవిక సంతృప్తి “మేలు చేయుచు సంచరించిన,”8 రక్షకుని యొక్క మాదిరిని అనుసరించుటకు మనల్ని ప్రేరేపించును. మనము శిష్యత్వము యొక్క బాటను నడిచినప్పుడు, ఇతరులకు సహాయపడుటకు ఆత్మీయ ప్రేరేపణలను మనము పొందుతాము.

సంవత్సరాల క్రితం నేను వినిన వృత్తాంతము పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణలను గుర్తించి అమలు చేయుటకు నాకు సహాయపడింది. మాజీ ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షురాలైన సహోదరి బోన్నీ డి. పార్కిన్ ఇలా పంచుకున్నారు:

“సూసాన్, . . . ఒక అద్భుతమైన దుస్తులు కుట్టేది. అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ (ఆమె) వార్డులో నివసించారు. ఒక ఆదివారము, ఆయన క్రొత్త సూట్ వేసుకోవటం సూసాన్ గమనించింది. ఆమె తండ్రి ఇటీవల . . . ఆమెకు చాలా అందమైన సిల్కు వస్త్రమును కొన్నాడు. అధ్యక్షులు కింబల్ యొక్క క్రొత్త సూట్‌కు సరిపోయే ఒక అందమైన టైను కుట్టాలని సూసాన్ అనుకున్నది. కనుక సోమవారము ఆమె టై కుట్టింది. ఆమె దానిని టిష్యూ కాగితములో చుట్టి ప్రక్క వీధిలో అధ్యక్షులు కింబల్ యొక్క ఇంటికి నడిచి వెళ్లింది.

“ముందు తలుపుకు తన దారిలో, ఆమె హఠాత్తుగా ఆగి, ఆలోచించింది, ‘ప్రవక్త కొరకు ఒక టై కుట్టటానికి నేను ఎవరిని? బహుశా ఆయన వాటిని పుష్కలంగా కలిగియుండవచ్చు.’ తాను తప్పు చేసానని నిర్ణయిస్తూ, ఆమె వెళ్లిపోవటానికి వెనుతిరిగింది.

“అప్పుడే సహోదరి కింబల్ ముందు తలుపు తీసి, ‘ఓ, సూసాన్!’ అన్నది.

“సూసాన్ సిగ్గుతో, భయపడుతూ, చెప్పింది, ‘ఆదివారము అధ్యక్షులు కింబల్ తన క్రొత్త సూట్‌లో నేను చూసాను. నాన్న నాకు న్యూయార్క్ నుండి కొంత సిల్కు తెచ్చాడు . . . అందువలన నేను ఆయనకు ఒక టై తయారు చేసాను.’

“సూసాన్ కొనసాగించకముండు, సహాదరి కింబల్ ఆమెను ఆపి, ఆమె భుజాలపై చేతులు వేసి, ఇలా అన్నది: ‘సూసాన్, ఒక మంచి ఆలోచనను ఎన్నడూ అణచివేయకు.’” 9

నేను దానిని ప్రేమిస్తున్నాను! “ఒక మంచి ఆలోచనను ఎన్నడూ అణచివేయకు” కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా చేయాలనే భావన నాకు కలిగినప్పుడు, అది ఒక ప్రేరేపణ లేక నా స్వంత ఆలోచన అని నేను ఆశ్చర్యపడతాను. కానీ నేను జ్ఞాపకము చేయబడ్డాను, “దేవుని నుండి వచ్చునది ఎల్లప్పుడు మంచి చేయుటకు ఆహ్వానించును, మరియు చిక్కించుకొనును, అందువలన మంచి చేయుటకు మరియు దేవుని ప్రేమించుటకు మరియు ఆయనను సేవించుటకు ఆహ్వానించి మరియు చిక్కించుకొను ప్రతి సంగతి, దేవుని వలన ప్రేరేపింపబడినది.” 10

అవి నేరుగా వచ్చిన ప్రేరేపణలు లేక కేవలము సహాయపడుటకు ప్రేరణలు అయినప్పటికిని, ఒక మంచి క్రియ ఎప్పటికీ వ్యర్ధము కాదు, “దాతృత్వము ఎన్నటికీ విఫలముకాదు” 11---మరియు ఎప్పటికి తప్పు స్పందన కాదు.

తరచుగా సమయము అసౌకర్యమైనది మరియు మన స్వల్పమైన సేవా చర్యల ప్రభావమును మనము అరుదుగా ఎరుగుదుము. కానీ అప్పుడప్పుడు, మనము దేవుని యొక్క హస్తములలో సాధనములుగా ఉన్నామని గుర్తిస్తాము మరియు పరిశుద్ధాత్మ మన ద్వారా పని చేస్తుందనుట దేవుని అనుమతికి నిదర్శనమని తెలుసుకొనుటకు మనము కృతజ్ఞత కలిగియుంటాము.

సహోదరిలారా, మనము చేయాల్సిన పనుల జాబితా చాలా ఉన్నప్పటికిని, మీరు, నేను “(మనము) చేయాల్సిన సమస్త విషయాలను”12 మనకు చూపమని పరిశుద్ధాత్మను వేడుకొనగలము. ప్రేరేపించబడినప్పుడు, మనము సింక్‌లో గిన్నెలు వదలివేయచ్చు లేక ఒక బిడ్డకు చదువుటకు, ఒక స్నేహితురాలిని దర్శించుట, ఒక పొరుగువాని పిల్లలను శ్రద్ధ తీసుకొనుట, లేక దేవాలయములో సేవ చేయుటకు బదులుగా ఆసక్తిని డిమాండు చేయు ఇతర పనులను మనము మానవచ్చు. నన్ను ఆపార్ధము చేసుకోవద్దు--- చేయాల్సిన విషయాల జాబితాను నేను చేస్తాను, నా జాబితాలో చేయబడిన పనులను గుర్తించుటకు నేనిష్టపడతాను. కానీ ఒక మంచి వ్యక్తిగా ఉండుట ఎక్కువ పనులను నెరవేర్చుట ఆవశ్యముగా ఒకటే కాదని తెలుసుకొనుటలో సమాధానము కలుగును. ప్రేరేపణలను అనుసరించుటకు తీర్మానించుకొనుట ద్వారా స్పందించుట “నా సమయము,” గురించి నేను ఆలోచించు విధానమును మార్చును, మరియు ఇతరులకు సేవ చేయుట అంతరాయములుగా నేను అనుకోను, కాని నా జీవిత ఉద్దేశముగా అనుకుంటాను.

దైవిక అసంతృప్తి మనల్ని క్రీస్తు వద్దకు నడిపించును

దైవిక అసంతృప్తి సాత్వీకమునకు దారితీయును, స్వీయ జాలి కాదు లేక మనము తీర్చలేని అంచనాలతో పోలికలు చేయుట నుండి వచ్చు నిరాశ కాదు. నిబంధన-పాటించు స్త్రీలు అన్ని పరిమాణాలు, రూపాలలో వస్తారు, వారి కుటుంబాలు, వారి జీవితపు అనుభవాలు, మరియు వారి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.

అవును, మనమందరము మన దైవిక సాధ్యత నుండి పడిపోతాము, మరియు ఒంటరిగా మనము సరిపోమనే గ్రహింపులో కొంత సత్యమున్నది. కానీ సువార్త యొక్క మంచి వార్త ఏదనగా, దేవుని యొక్క కృపతో మనము సరిపోతాము. క్రీస్తు యొక్క సహాయముతో, మనము సమస్త విషయాలను చేయగలము. 13 మనము “సమయోచితమైన సహాయము కొరకు కృపను పొందుతాము,”14 అని లేఖనాలు వాగ్దానమిచ్చుచున్నవి.

ఆశ్చర్యకరమైన సత్యమేదనగా, మన బలహీనతలు మనల్ని దీనులుగా చేసి, క్రీస్తు వైపుకు మనల్ని మరల్చినప్పుడు, అవి ఒక దీవెన కాగలదు.15 స్వీయ జాలి వలన సందేహించుటకు బదులుగా మనము చేయలేని వాటితో యేసు క్రీస్తును వినయముగా మనము సమీపించినప్పుడు అసంతృప్తి దైవికమగును.

వాస్తవానికి, యేసు యొక్క అద్భుతములు కోరిక, అవసరత, వైఫల్యము, లేక తగియుండకపోవుటను గుర్తించుటతో తరచుగా ప్రారంభమగును. రొట్టెలు మరియు చేపలు జ్ఞాపకమున్నాయా? యేసు తనను వెంబడించిన వేలమందికి అద్భుతంగా ఎలా ఆహారమిచ్చారో సువార్త రచయతలలో ప్రతీఒక్కరు చెప్పారు.16 కానీ వారు లేకపోవుటను గుర్తించుటతో వృత్తాంతము ప్రారంభమగును; వారు కేవలము “ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవిగాని, ఇంతమందికి ఇవి ఏమాత్రము?”17 శిష్యులు సరిగా చెప్పారు: వారికి తగినంత ఆహారము లేదు, కానీ వారికి కలిగియున్నదంతా వారు యేసుకు ఇచ్చారు మరియు ఆయన అద్భుతమును అందించాడు.

మీ ముందున్న కార్యమునకు మీ తలాంతులు మరియు వరములు చాలా చిన్నవని మీరెప్పుడైన భావించారా? నేను భావించాను. కానీ మీరు, నేను, మనకు కలిగినది క్రీస్తుకు ఇవ్వగలము, మరియు ఆయన మన ప్రయత్నాలను విస్తారముగా చేయును. దేవుని యొక్క కృపపై మీరు ఆధారపడిన యెడల----మీ మానవ దుర్భలతలు మరియు బలహీనతలతో కూడ---ఇవ్వటానికి మీరు కలిగియున్నది సరిపోవును.

సత్యమేదనగా మనలో ప్రతిఒక్కరం దేవుని తరువాత తరము,---ప్రతీఒక్కరు దేవుని యొక్క బిడ్డ.18 లోక చరిత్ర అంతటా ప్రవక్తలు మరియు సామాన్యులైన పురుషులు, స్త్రీలకు చేసినట్లుగా, పరలోక తండ్రి మనలను మార్చాలని కోరుతున్నాడు.

సి. ఎస్. లూయీస్ దేవుని యొక్క మార్చే శక్తిని ఈ విధంగా వివరించాడు: “మీరొక సజీవమైన గృహముగా ఊహించుకొనుము. ఆ గృహమును పునర్నిర్మించుటకు దేవుడు వస్తాడు. మొదట, బహుశా, ఆయన ఏమి చేస్తున్నాడో మీరు గ్రహించగలరు. ఆయన ఇంటి పైకప్పులోని కన్నములను ఆపును మరియు కాలువలను సరిచేస్తున్నాడు, మొ; ఆ పనులు చేయబడవలసి యున్నదని మీకు తెలుసు, కనుక మీరు ఆశ్చర్యపడరు. కానీ ప్రస్తుతము ఆయన చాలా తీవ్రంగా బాధించే విధానములో పెద్ద మార్పులను చేయుట ప్రారంభించారు. . . . (మీరు చూసారా,) మీరు అనుకున్న దానికి భిన్నమైన గృహమును ఆయన కట్టుచున్నాడు . . . . మీరు ఒక చిన్న మంచి కుటీరముగా చేయబడ్డారని మీరనుకోవచ్చు; కానీ ఆయన ఒక రాజభవనమును కట్టుచున్నాడు. ఆయన వచ్చి, దానిలో తనకైతాను నివసించాలని కోరుతున్నాడు.” 19

మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, మనముందున్న కార్యములకు సమానముగా మనము చేయబడగలము. శిష్యత్వము యొక్క బాటను మనము ఎక్కినప్పుడు, క్రీస్తు యొక్క కృప ద్వారా మనము పరిశుద్ధపరచబడగలమని ప్రవక్తలు బోధించారు. దైవిక అసంతృప్తి మనల్ని విశ్వాసమందు పని చేయుటకు, మేలు చేయమనే రక్షకుని ఆహ్వానమును అనుసరించుటకు, మరియు మన జీవితాలను వినయముగా ఆయనకు ఇచ్చుటకు మనల్ని ప్రేరేపించును. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, in Tad Walch, “‘The Lord’s Message Is for Everyone’: President Nelson Talks about Global Tour,” Deseret News, Apr. 12, 2018, deseretnews.com.

  2. Neal A. Maxwell, “Becoming a Disciple,” Ensign, June 1996, 18.

  3. Neal A. Maxwell, “Becoming a Disciple,” 16; emphasis added.

  4. “నిరాశ మీ విశ్వాసమును బలహానపరచును. మీ అంచనాలను మీరు తగ్గించుకున్న యెడల, మీ ప్రభావము తగ్గును, మీ కోరిక బలహీనమగును, మరియు ఆత్మను అనుసరించుటలో మీకు గొప్ప కష్టముండును” (“What Is My Purpose as a Missionary?Preach My Gospel: A Guide to Missionary Service, rev. ed. [2018], lds.org/manual/missionary).

  5. Teachings of Presidents of the Church: Joseph Smith (2007), 28.

  6. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8.

  7. జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10; వివరణ చేర్చబడింది.

  8. అపొస్తులుల కార్యములు 10:38.

  9. Bonnie D. Parkin, “Personal Ministry: Sacred and Precious” (Brigham Young University devotional, Feb. 13, 2007), 1, speeches.byu.edu.

  10. మొరోనై 7:13.

  11. 1 కొరింథీయులకు 13:8.

  12. 2 నీఫై 32:5.

  13. “నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను” (ఫిలిప్పియులకు 4:13).

  14. హెబ్రీయులతు 4:16.

  15. “మరియు మనుష్యులు నాయొద్దకు వచ్చిన యెడల, నేను వారికి వారి బలహీనతలను చూపెదను. వారు తగ్గించుకొనునట్లు నేను మనుష్యులకు బలహీనతనిచ్చెదను; మరియు నా యెదుట తమను తగ్గించుకొను మనుష్యులందరి కొరకు నా కృప చాలును. ఏలయనగా నా యెదుట వారు తమను తాము తగ్గించుకొనిన యెడల మరియు నాయందు విశ్వసించిన యెడల, అప్పుడు నేను బలహీనమైన సంగతులను వారి బలమైనవిగా చేయుదును. ” (ఈథర్ 12:27; వివరణ చేర్చబడింది).

  16. మత్తయి 14:13–21; మార్కు 6:31–44; మార్కు 9:10–17; యోహాను 6:1–14 చూడుము.

  17. యోహాను 6:9.

  18. అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ బోధించారు: “మీ మర్త్య పూర్వీకులలో అనేక తరములున్నప్పటికినీ, మీరు ఏ తెగ లేక జనులకు ప్రతినిధులుగా ఉన్నప్పటికిని, మీ ఆత్మ యొక్క వంశావళి ఒక వరుసలో వ్రాయబడగలదు. మీరు దేవుని యొక్క బిడ్డ!” (“To Young Women and Men,” Ensign, May 1989, 54).

  19. C. S. Lewis, Mere Christianity (1960), 160.

ముద్రించు