2010–2019
సంఘం యొక్క సరియైన పేరు
అక్టోబర్ 2018


15:44

సంఘము యొక్క సరియైన పేరు

ఇది ఆయన శక్తితో నిండిన ఆయన సంఘము కనుక, ఆయన నామము చేత సంఘము పిలవబడాలని యేసు క్రీస్తు మనల్ని నడిపిస్తున్నారు.

నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ సుందరమైన సబ్బాతు దినమున, ప్రభువు నుండి మనం పొందిన అనేక దీవెనలకో సం మనం కలసి ఉత్సహించెదం. యేసుక్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను గూర్చి మీరు కలిగియున్న సాక్ష్యాల కొరకు, ఆయన నిబంధన మార్గంలో నిలుచుటకు లేదా తిరిగి వచ్చుటకు మీరు చేసే త్యాగాలకు, ఆయన సంఘంలో మీ అంకితమైన సేవలకు మేము చాలా కృతజ్ఞులము.

ఈరోజు నేను గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఒక విషయాన్ని గూర్చి చర్చించాలని ఒత్తిడి చేయబడ్డాను. కొన్ని వారాల క్రితం, సంఘం యొక్క పేరు యొక్క క్రమాన్నిసరిచేసే వివరణను నేను విడుదల చేసాను. 1 దానిని నేను ఎందుకు చేసానంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమైన ఆయన సంఘానికి ఆయన ఇచ్చిన పేరు యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసారు.2

మీరు భావించినట్లే, ఈ వివరణకు, సవరించబడిన శైలికి3 అనుకూలమైన మరియు ప్రతికూలమైన మిశ్రితమైన ప్రతిస్పందనలు వచ్చాయి. అనేకమంది సభ్యులు వారి వ్యక్తిగత బ్లాగులలో, సాంఘిక ప్రసారమాధ్యమ పేజీలలో వెంటనే సంఘం పేరును సరిచేసారు. మిగిలిన వారు లోకంలో జరుగుతున్న వాటన్నిటిలో, “అంత ప్రాముఖ్యమైనది” దానిని గూర్చి ఉద్ఘాటించడం అవసరం ఏముందని ఆశ్చర్యపడ్డారు. కొందరు ఇది జరగదని, అలాంటప్పుడు ప్రయత్నించడం ఎందుకు? అన్నారు. ఈ విషయం గురించి ఇంత లోతుగా ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నామో నన్ను వివరించనివ్వండి. కానీ ఈ ప్రయత్నము క్రింది వాటిలో దేనిని చేయదో నన్ను మొదట వివరించనివ్వండి:

  • ఇది ఒక పేరు మార్పిడి కాదు.

  • ఇది ఒక క్రొత్త ముద్ర కాదు.

  • ఇది ఒక వన్నె తెచ్చే ప్రక్రియ కాదు.

  • ఇది చపలత్వముతో చేసినది కాదు.

  • మరియు ఇది అసందర్భమైనది కాదు.

బదులుగా, ఇది ఒక దిద్దుబాటు. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. జోసెఫ్ స్మిత్ తన ద్వారా పునఃస్థాపించబడిన సంఘానికి పేరు పెట్టలేదు; అలాగే మోర్మన్ పేరు పెట్టలేదు. రక్షకుడే స్వయంగా, “కడవరి దినాలలో నా సంఘం యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘం అని పిలువబడుతుంది, అని చెప్పారు.” 4

దానికన్నా ముందు, క్రీశ 34 లో, పునరుత్థాన ప్రభువు సంఘ సభ్యులను అమెరికాలో దర్శించినప్పుడు ఇలాంటి సూచననే ఇచ్చారు. ఆ సమయమందు ఆయన చెప్పారు:

“మీరు సంఘమును నా నామమున పిలువవలెను. …

“మరియు అది నా నామంతో పిలువబడని యెడల, అది నా సంఘమెట్లగును? ఏలయనగా ఒక సంఘం మోషే పేరుతో పిలువబడిన యెడల అప్పుడు అది మోషే యొక్క సంఘం అగును; లేక అది ఒక మనుష్యుని పేరుతో పిలువబడిన యెడల, అది ఒక మనుష్యుని యొక్క సంఘమగును; కానీ అది నా నామమున పిలువబడిన యెడల అది నా సంఘమగును”5 అని చెప్పారు.

కాబట్టి, సంఘం పేరు మార్చబడదు. ఆయన సంఘం పేరు ఏమని ఉండాలో రక్షకుడే స్పష్టంగా చెప్పుచూ, “అలాగుననే నా సంఘం పిలువబడాలి” అను ప్రకటనతో ముగించినప్పుడు ఆయన గంభీరముగా ఉన్నారు. మనం మారుపేరులను ఉపయోగించడానికి అనుమతించినప్పుడు లేదా మనమే ఆ మారుపేరులను ప్రోత్సహించినప్పుడు, ఆయన ఆగ్రహిస్తారు.

పేరులో లేదా ఈ సందర్భములో మారుపేరులో ఏముంది? సంఘం యొక్క మారుపేరులైన “ఎల్‌డిఎస్ సంఘము,” “మోర్మన్ సంఘము” లేదా “కడవరి దిన పరిశుద్ధుల సంఘం,” చూస్తే ఆ పేర్లలో అతి ముఖ్యమైన విషయమేమిటంటే, రక్షకుని పేరు అందులో లేకపోవడం. ప్రభువు సంఘం నుండి ప్రభువు పేరును తీసివేయుట సాతాను యొక్క గొప్ప విజయం. మన రక్షకుని పేరునుఉపయోగించనప్పుడు, మనకు తెలియకుండానే యేసుక్రీస్తు మన కొరకు చేసిన సమస్తమును---ఆయన ప్రాయశ్చిత్తాన్ని కూడా తిరస్కరిస్తున్నాము.

ఆయన దృష్టితో దీనిని మనం చూచినప్పుడు: మర్త్యత్వమునకు ముందు జీవితంలో, ఆయన యెహోవా, పాతనిబంధన యొక్క దేవుడు. తన తండ్రి యొక్క దర్శకత్వంలో, ఈ లోకం మరియు ఇతర లోకాల యొక్క సృష్టికర్త.6 ఆయన తన తండ్రి చిత్తానికి తనను అప్పగించుకుని, దేవుని పిల్లలందరి కోసం వేరే ఎవరూ చేయలేని దానిని చేశారు! భూమిపైకి తండ్రి యొక్క అద్వితీయకుమారునిగా అన్నింటికన్నా తక్కువస్థితిలో శరీరంతో వచ్చి, ఆయన క్రూరంగా ధిక్కరించబడి, అపహసించబడి, ఉమ్మివేయబడి, శిక్షించబడ్డారు. గెత్సమనే వనంలో, మన రక్షకుడు తనపై ప్రతీ నొప్పిని, ప్రతీ పాపమును, మీరు నేను, భూమిపై జన్మించిన, జన్మించబోయే ప్రతీ ఒక్కరూ ఎప్పటికీ అనుభవించిన సమస్త వేదనను, బాధను తనపై తీసుకొనెను. మిక్కిలి బాధాకరమైన భారం యొక్క ఆ బరువు క్రింద, ఆయన ప్రతీ శ్వేద రంధ్రం నుండి రక్తాన్ని కార్చెను.7 ఈ బాధంతా ఆయన కల్వరి సిలువపై క్రూరముగా సిలువ వేయబడినప్పుడు తీవ్రం చేయబడెను.

ఈ వేదనపూరితమైన అనుభవాలు, తరువాత ఆయన యొక్క పునఃరుత్థానం--- ఆయన అంతములేని ప్రాయశ్చిత్తం--- ద్వారా ఆయన అందరికీ అమర్త్యత్వాన్ని అనుగ్రహించి, మన పశ్చాత్తాపం అనే షరతుపై పాపం యొక్క పర్యవసనాల నుండి మనందరినీ విడుదల చేసారు.

రక్షకుని పునరుత్థానము, ఆయన అపోస్తలుల మరణం తర్వాత, లోకం శతాబ్ధాలుగా అంధకారంలోనికి కృంగిపోయింది. అప్పుడు 1820 సంవత్సరములో, ప్రభువు సంఘం యొక్క పునఃస్థాపనకు తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమయ్యారు.

ఆయన సమస్తమును సహించిన తర్వాత – మానవాళి కొరకు ఆయన చేయవలసిన సమస్తము చేసిన తర్వాత –మనం గ్రహించకుండా ప్రభువు యొక్క పునస్థాపించబడిన సంఘాన్ని వేరే పేర్లతో పిలుస్తున్నామని లోతైన విచారముతో నేను గ్రహించాను, వాటిలో ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని తీసివేస్తున్నాయి!

ప్రతీ ఆదివారం మనము సంస్కారాన్ని యోగ్యతగా తీసుకున్నప్పుడు, మన పరలోకతండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని మనపై తీసుకొనుటకు విధేయులమైయున్నామని చేసిన వాగ్ధానాన్ని క్రొత్తదిగా చేస్తున్నాము.8 ఆయనను అనుసరించి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకుంటామని వాగ్ధానం చేస్తాం.

మనం ఆయన సంఘం నుంచి ఆయన నామాన్ని తీసివేసినప్పుడు, మన జీవితాలలో నుండి అజాగ్రత్తగా ఆయనను కేంద్రస్థానంగా తీసివేస్తున్నాము.

రక్షకుని నామాన్ని మనపై తీసుకొనుట ఇతరులకు మన మాటలు క్రియలు ద్వారా యేసే క్రీస్తని-- ప్రకటించడాన్ని, సాక్ష్యమివ్వడాన్ని కలిగియుంటుంది. మనలను “మోర్మన్స్” అని పిలిచే వారికి కోపం తెప్పిస్తామని భయపడుతూ, ఆయన కొరకు ఆయన సంఘం పిలువబడే పేరు కొరకు నిలబడలేక రక్షకుడిని కాపాడుటకు మనము విఫలమయ్యమా?

జనులుగా, వ్యక్తులుగా మనము యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త శక్తిని పొందటానికి--మనలను స్వస్థపరచి, శుద్ధి చేయుటకు, బలపరచి, గొప్పచేయుటకు, చివరకు మనలను మహోన్నతులుగా చేయుటకు--- మనం స్పష్టంగా ఆయనే ఆ శక్తి యొక్క మూలాధారం అని గుర్తించాలి. ఆయన ప్రకటించిన పేరు చేత ఆయన సంఘాన్ని పిలుచుట ద్వారా మనం ప్రారంభించవచ్చు.

లోకంలో, చాలావరకు ప్రభువు సంఘము మోర్మన్ సంఘంగా మరుగు చేయబడింది. కానీ ప్రభువు సంఘ సభ్యులుగా దాని శిరస్సు ఎవరో మనకు తెలుసు: అది యేసుక్రీస్తే. దురదృష్టవసాత్తూ, మోర్మన్ అనుపదాన్ని విన్న ప్రతీవారు మనం మోర్మన్‌ను ఆరాధిస్తాం అని భావిస్తారు. కానీ కాదు! మనం ఆ గొప్ప ప్రాచీన అమెరికా ప్రవక్తను సన్మానించి, గౌరవిస్తాం.9 కానీ మనం మోర్మన్ యొక్క శిష్యులం కాదు. మనం ప్రభువు యొక్క శిష్యులం.

పునస్థాపించబడిన సంఘ ప్రారంభ దినాలలో, మోర్మన్ సంఘం,మోర్మన్స్10 అను పదాలు తరచూ మారు పేర్లుగా---క్రూరమైన పదాలుగా, నిందించే పదాలుగా, ఈ కడవరి దినాలలో యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని పునఃస్థాపించడంలో దేవుని యొక్క ప్రభావాన్ని దాచివేయుటకు వాడబడేవి.11

సహోదరీ సహోదరులారా, అనేక లోకరీతి వాగ్వివాదాలు సంఘం యొక్క సరైన పేరును తిరిగి వాడడానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. మనం నివసించే డిజిటల్ ప్రపంచంలో, సర్చ్ ఇంజన్ అనుకూలపరచుట వలన మనకు కావలసిన సమాచారం, సంఘం గురించిన సమాచారం కూడా తక్షణమే కనుగొనడానికి సహాయపడుతుంది. విమర్శకులు ఇప్పుడు దానిని సరిచేయడం అజ్ఞానం అంటారు. ఇతరులు మనం అందరికీ మోర్మన్స్ అని మోర్మన్ సంఘం అని విస్తారముగా తెలుసు కనుక మనము దానిని బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

ఈ చర్చ అంతా మనిషి చేసిన సంస్థ యొక్క ముద్రణ గురించి అయితే ఆ వాదనలు ప్రబలుతాయి. కానీ ఈ కీలకమైన విషయంలో, ఈ సంఘం ఎవరిదో ఆయనవైపు మనము చూసి, ప్రభువు మార్గాలు ఎన్నటికీ మనుష్యుని మార్గాలు కావని గుర్తించాలి. మనం సహనంగా ఉండి మన పాత్రను మనం సరిగ్గా పూర్తి చేసిన యెడల, ప్రభువు ఈ ముఖ్యమైన కార్యము గుండా మనల్ని నడిపిస్తారు. అన్నిటికిపైగా, ప్రభువు ఆయన చిత్తాన్ని చేయుటకు వెదకే వారికి, నీఫైకు సముద్రమును దాటుటకు ఓడను నిర్మించే కార్యాన్ని పూర్తిచేయుటకు ఆయన సహాయం చేసినట్లే వారికి సహాయము చేస్తారని మనము ఎరుగుదుము.12

మనం ఈ తప్పులను సరిచేసే మన ప్రయత్నాలలో మర్యాదపూర్వకంగా, సహనంగా ఉండాలని మనము కోరుతున్నాం. మన మనవికి బాధ్యతగల మీడియా సానుభూతితో స్పందిస్తుంది.

మునుపటి సర్వసభ్య సమావేశంలో, ఎల్డర్ బెంజనిన్ డి హోయోస్ అటువంటి ఒక సందర్భాన్ని గూర్చి మాట్లాడారు. ఆయన:

“కొన్నేళ్ల క్రితం మెక్సికోలోని ప్రజా వ్యవహారాల కార్యాలయంలో సేవ చేస్తున్నప్పుడు, [ఒక సహవాసి మరియు నేను] రేడియేలో మాట్లాడే కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాం. . . [కార్యక్రమ దర్శకులలో ఒకరు], సంఘం ఇంత పెద్ద పేరును ఎందుకు కలిగియుందని మమ్మల్ని అడిగారు? . . .

“నా సహవాసి, నేను ఆ గొప్ప ప్రశ్నకు ఒకరినొకరం చూచి నవ్వి, సంఘం యొక్క పేరు మనిషిచేత ఎంపిక చేయబడలేదని వివరించుట ప్రారంభించాము. అది రక్షకునిచేత ఇవ్వబడింది. . . . కార్యక్రమ దర్శకుడు వెంటనే గౌరవంగా స్పందించాడు, ‘అయితే మేము దానిని గొప్ప ఆనందంతో తిరిగి చెప్తాం’” 13

ఆ నివేదిక ఒక మాదిరిని ఇస్తుంది. ఒక్కొక్కటిగా, మన శ్రేష్టమైన వ్యక్తిగత ప్రయత్నాలు అనేక సంవత్సరాలుగా అల్లుకుపోయిన తప్పులను సరిచేయడానికి అవసరం.14 మిగిలిన లోకం సరియైన పేరుతో పిలువబడాలన్న మన మార్గాన్ని అనుసరించ వచ్చు లేక లేకపోవచ్చు. కానీ లోకం మొత్తం సంఘాన్ని, దాని సభ్యులను తప్పు పేర్లతో పిలిచినప్పుడు మనం కూడా విసిగిపోయి అలాగే పిలుస్తే అది మనకు కపటమైనది.

సవరించబడిన మన శైలి నిర్ధేశం సహాయకరముగా ఉండును. అది వివరించును: “మొదటి ప్రస్తావనలో, ప్రాధాన్యత ఇవ్వబడిన సంఘం యొక్క పూర్తిపేరు: ‘యేసుక్రీస్తు యొక్క కడవరిదిన పరిశుద్ధుల సంఘం.’ ఎప్పుడైనా చిన్నదైన (రెండవ) అవసరమైనప్పుడు, ‘సంఘం,’ లేదా ‘యేసుక్రీస్తు సంఘం’ అని పిలుచుట ప్రోత్సహించబడింది. యేసుక్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘం’ అనునది కూడా సరియైనది, ప్రోత్సహించబడింది.”15

ఎవరైనా, “నీవు ఒక మోర్మన్ వా’ అని అడిగినప్పుడు,, “మీరు నన్ను యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడివా అని అడుగుతున్నారా, అవును, నేనే!” అని మీరు సమాధానమివ్వవచ్చును.

ఎవరైనా, “నీవు కడవరి దిన పరిశుద్ధుడివా?”16 అని అడిగితే, నీవు, “అవును, నేను యేసుక్రీస్తును నమ్ముతాను, ఆయన పునఃస్థాపించబడిన సంఘ సభ్యుడిని” అని మీరు స్పందించవచ్చు.

నా ప్రియమైన సహోదరీ సహోదరులారా, ప్రభువు సంఘం యొక్క సరైన పేరును పునరుద్ధరించుటకు మన శాయశక్తులా చేసినప్పుడు, ఈ సంఘం ఎవరిదో ఆయన మనమెన్నడూ చూడని విధాలుగా కడవరి దిన పరిశుద్ధుల శిరస్సులపై17 ఆయన శక్తిని, దీవెనలను క్రుమ్మరించునని నేను వాగ్ధానం చేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క పునస్థాపించబడిన సువార్త దీవెనలను ప్రతీ దేశము, జాతి, బాష, ప్రజలకు తీసుకెళ్లుటకు ప్రభువు యొక్క రెండవ రాకడకు లోకమును సిద్ధపరచుటకు మనము దేవుని యొక్క జ్ఞానం, శక్తిని కలిగియుంటాము.

అయితే, పేరులో ఏముంది? ప్రభువు యొక్క సంఘం పేరు వద్దకు వచ్చినప్పుడు, సమాధానం ఏమిటంటే “సమస్తం!” యేసుక్రీస్తు సంఘాన్ని తన నామంలో పిలువమని మనల్ని నిర్ధేశించారు, ఎందుకంటే ఇది ఆయన సంఘం, ఆయన శక్తితో నిండియున్నది.

దేవుడు నివసిస్తున్నాడని నేనెరుగుదును. యేసే క్రీస్తు. ఈరోజు ఆయన తన సంఘాన్ని నడిపిస్తున్నారు. దానిని నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. “ఆయన తన సంఘము కొరకు బయల్పరచిన పేరు, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రాముఖ్యతను ప్రభువు నాకు తెలియచేసారు. ఆయన చిత్తముతో మనల్నిమనం ఐక్యముగా చేసుకొనుటకు మన యెదుట కార్యమును కలిగియున్నాము. ఇటీవల సంవత్సరాలలో, వేర్వేరు సంఘ నాయకులు, విభాగములు ఆవిధంగా చేయుటకు అవసరమైన వాటిని ప్రారంభించారు. ఈ ముఖ్యమైన విషయము గురించి అదనపు సమాచారము రాబోయే నెలలలో లభ్యముగా చేయబడుతుంది” (Russell  M. Nelson, in “The Name of the Church” [official statement, Aug. 16, 2018], mormonnewsroom.org).

  2. సంఘము యొక్క ముందు అధ్యక్షులు అదేవిధమైన మనవులు చేసారు. ఉదాహరణకు, అధ్యక్షులు జార్జ్ అల్బార్ట్ స్మిత్ ఇలా చెప్పారు: “మోర్మన్ సంఘమని దీనిని పిలుచుట ద్వారా ప్రభువుని అవమానించవద్దు. ఆయన దానిని మోర్మన్ సంఘమని పిలవలేదు” (in Conference Report, Apr. 1948, 160).

  3. See “Style Guide—The Name of the Church,” mormonnewsroom.org.

  4. సిద్ధాంతం మరియు నిబంధనలు 115:4.

  5. 3 నీఫై 27:7–8.

  6. మోషే 1:33 చూడుము.

  7. సిద్ధాంతం మరియు నిబంధనలు 19:18 చూడుము.

  8. మొరోనై 4:3; సిద్ధాంతం మరియు నిబంధనలు 20:37, 77 చూడుము.

  9. మోర్మన్ గ్రంధములో నలుగురు ప్రధాన రచయతలలో ఒకరు మోర్మన్, మిగిలిన వారు నీఫై, జేకబ్, మరియు మొరోనై. అందరూ దాని ప్రేరేపించబడిన అనువాదకుడు ప్రవక్త జోసెఫ్ స్మిత్ వలే, ప్రభువు యొక్క ప్రత్యక్ష సాక్షులు.

  10. Even the word Mormonites was among terms of derision that were employed (see History of the Church, 2:62–63, 126).

  11. క్రొత్త నిబంధన కాలములందు మిగిలిన మారుపేర్లు ఉన్నట్లుగా కనబడినవి. ఫెలిక్స్ ముందు అపోస్తులుడైన పౌలు యొక్క విచారణ కాలమందు పౌలు “నజరేయుల మత బేధమునకు నాయకుడు” (Acts 24:5) “నజరేయులు,” మాటను ఉపయోగించు గురించి, ఒక వ్యాఖ్యాత ఇలా వ్రాసాడు: “ఇది సాధారణంగా క్రైస్తవులకు తిరస్కార భావనతో ఇవ్వబడెను. యేసు నజరేతు వాడు కనుక వారు ఆవిధంగా పిలవబడ్డారు” (Albert Barnes, Notes, Explanatory and Practical, on the Acts of the Apostles [1937], 313).

    అదేవిధంగా, మరొక వ్యాఖ్యాత వివరించాడు: “మన ప్రభువు ‘నజరేయుడని’ (మత్త. xxvi. 71), ఎగతాళి చేయబడ్డాడు, ఆవిధంగా యూదులు ఆయన శిష్యులను ‘నజరేయులు’ అని పిలిచారు.” వారు క్రైస్తవులను వీరు అంగీకరించలేదు¸i.e. మెస్సయా యొక్క శిష్యులు” (The Pulpit Commentary: The Acts of the Apostles, ed. H. D. M. Spence and Joseph S. Exell [1884], 2:231).

    అదేవిధంగా, ఎల్డర్ నీల్ ఎ. మాక్సవెల్ గమనించారు: “లేఖనముల చరిత్ర అంతటా, వారిని తరిమివేయుటకు---వారిని నాశనము చేయుటకు బదులుగా వారికి ముద్ర వేయు పునరావృతమైన ప్రయత్నములను మనము చూస్తాము. అయినప్పటికినీ, అత్యధికంగా, వారు కేవలము తమ సమకాలీనులు ద్వారా మరియు లౌకిక చరిత్ర ద్వారా, నిర్లక్ష్యము చేయబడ్డారు. అన్నిటికి పైగా, ప్రాచీన క్రైస్తవులు కేవలము ‘నజరేయుల తెగ’ అని పిలవబడ్డారు (Acts 24:5.)” (“Out of Obscurity,” Ensign, Nov. 1984, 10).

  12. 1 నీఫై 18:1–2 చూడుము.

  13. Benjamín De Hoyos, “Called to Be Saints,” Liahona, May 2011, 106.

  14. జనులు మనల్ని పిలిచి దానిపై మనకు నియత్రంణ లేనప్పటికినీ, మనల్ని మనం సూచించుటకు మనము పూర్తిగా నియంత్రించుకోగలము. సంఘము యొక్క సరియైన పేరును దాని సభ్యులమైన మనము గౌరవించుటకు విఫలమైన యెడల ఇతరులు దానిని గౌరవించుటకు మనము ఎలా ఆశించగలము?

  15. Style Guide—The Name of the Church,” mormonnewsroom.org.

  16. పరిశుద్ధుడు అనే పదము తరచుగా పరిశుద్ధ బైబిలులో ఉపయోగించబడింది. ఉదాహరణకు ఎఫెసీయులకు, పౌలు యొక్క పత్రికలో, ప్రతీ అధ్యాయములో అతడు పరిశుద్ధుడు మాటను కనీసము ఒకసారైనా ఉపయోగించాడు. పరిశుద్ధుడనగా యేసు క్రీస్తునందు విశ్వసించి, ఆయనను వెంబడించుటకు ప్రయాసపడువాడు.

  17. సిద్ధాంతం మరియు నిబంధనలు 121:33 చూడుము.