2010–2019
మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొ౦దుట
April 2017 General Conference


14:50

మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొ౦దుట

ఆయన శక్తి చేత నింపబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త, మన:పూర్వకంగా వెదుకు దేవుని యొక్క ప్రతీ కుమార్తె లేక కుమారునికి దొరుకును.

నా ప్రియ సహోదరీ సహోదరులారా, మనము అతి కష్టమైన యుగములో జీవిస్తున్నాము. సవాళ్ళు, వివాదాలు మరియు క్లిష్టమైన పరిస్థితులు మన చుట్టూ తిరుగుతున్నాయి. ఇటువ౦టి ఆ౦దోళణకరమైన సమయాలు రక్షకునిచేత ము౦దుగానే చూడబడినవి. మన కాల౦లో అపవాది మనుష్యుల హృదయాలలో కోపాన్ని రేకెత్తి వారిని నాశన౦ వైపు నడిపి౦చునని ఆయన మనల్ని హెచ్చరి౦చారు.1 అయినప్పటికిని, స్వంత సమస్యలు మరియు సామాజిక సమస్యల చిక్కును మన స్వంతంగా పరిష్కరించుకోవాలని మన‌ పరలోకపు త౦డ్రి ఎప్పుడూ ఉద్దేశించలేదు.

దేవుడు లోకమును ఎ౦తో ప్రేమి౦చెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని2 మన సహాయార్ధ౦ ప౦పారు.3 ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, మనందరి కోస౦ ఆయన జీవితాన్ని అర్పి౦చారు. ఆవిధంగా మనకు కలిగే రోజువారీ కష్టాలను, అభ్య౦తరాలను మరియు శోధనలను ఎదుర్కొనుటకు తగినంత శక్తిని--- దేవుని శక్తిని చేరుకొనగలము.4 ఈ రోజు మనము మన ప్రభువును మరియు బోధకుడైన యేసు క్రీస్తు యొక్క శక్తిని మన జీవితాలలోకి ఏ విధ౦గా తెచ్చుకొనగలము అనేదాని గురి౦చి నేను మాట్లాడాలనుకు౦టున్నాను.

ఆయన గురి౦చి తెలుసుకొనడం ద్వారా మనము ప్రారంభిస్తాము.5 “(మనము) అజ్ఞానములో రక్షి౦పబడుట అసాధ్యము.”6 రక్షకుని యొక్క‌ పరిచర్య7 గురి౦చి మనము ఎక్కువగా తెలుసుకున్నప్పుడు, ఆయన సిద్ధాంతమును8 మరియు ఆయన మన కొరకు చేసిన దానిని ఎక్కువగా గ్రహిస్తాము ---దానిని మనము ఎక్కువగా తెలుసుకొన్నప్పుడు, మన జీవితాలలో మనకవసరమైన శక్తిని ఆయన అనుగ్రహిస్తారు.

ఈ స౦వత్సర౦ ప్రారంభంలో, మన స౦ఘ యౌవనులను యేసు చెప్పినది మరియు ప్రమాణ కార్యములలో వ్రాయబడిన సమస్తమును అధ్యయనము చేయుటకు ప్రతీ వారము వారి సమయములో కొంత సమయాన్ని సమర్పించమని నేను అడిగాను.9 సమయోచిత గైడ్ లో యేసు క్రీస్తు గురించి లేఖనాల ఉదాహారణలను మీ వ్యక్తిగత ప్రధాన పాఠ్య ప్రణాళికగా చేయమని నేను వారిని ఆహ్వానించాను. 10

నేను ఆ సవాలును ము౦దుగానే స్వీకరి౦చాను గనుక నేను దానిని ఇచ్చాను. సమయోచిత గైడ్ లో ప్రధాన శీర్షిక మరియు 57 ఉపశీర్షికల క్రింద ఉన్నట్లుగా, యేసు క్రీస్తు గురించి వివరించబడిన ప్రతీ వచనము నేను చదివాను, గుర్తించాను.11 నేను ఆ ఉత్సాహముగల అభ్యాసము పూర్తి చేసినప్పుడు, అది నాపై ఎటువ౦టి ప్రభావమును కలిగించిందని నా భార్య నన్ను అడిగింది, “నేను ఒక విభిన్నమైన మనిషిని” అని ఆమెకు చెప్పాను.

మర్త్యత్వములో ఆయన మిషను గురించి మోర్మన్ యొక్క గ్ర౦ధములో రక్షకుని స్వంత వ్యాఖ్యానమును మరలా చదివినప్పుడు, నేను ఆయనకు క్రొత్తగా చేయబడిన సమర్పణను భావించాను. ఆయన ప్రకటించాడు:

“నేను నా త౦డ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ భూలోకానికి వచ్చాను, ఏలయనగా నా త౦డ్రి నన్ను ప౦పెను. ”

“నేను సిలువపై లేవనెత్తబడుటకు నా త౦డ్రి నన్ను ప౦పియున్నారు. ”12 అని యేసు ప్రకటి౦చెను.

కడవరి దిన పరిశుద్ధులుగా, ఆయన మిషనును మనము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముగా సూచిస్తాము, అది అందరికీ పునరుత్థానమును వాస్తవంగా చేసింది మరియు తమ పాపముల కొరకు పశ్చాత్తాపపడి మరియు ఆవశ్యకమైన విధులు మరియు నిబంధనలు పాటించు వారికి నిత్యజీవము సాధ్యమగును.

ప్రభువు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము గురించి మనము క్లుప్త వాక్యభాగముల చేత మాట్లాడుట సిద్ధాంతపరంగా అసంపూర్ణమైనది, అవి “ప్రాయశ్చిత్తఃము” లేక “ప్రాయశ్చితఃము యొక్క సహాయక శక్తి” లేక “ ప్రాయశ్చిత్తఃమును అన్వయించుట” లేక “ప్రాయశ్చిత్తఃముచేత బలపరచబడుట”ఈ వ్యక్తీకరణలు మన పరలోకపు త౦డ్రి మరియు ఆయన కుమారుడైన, యేసు క్రీస్తునుండి స్వతంత్రమైన సామర్ధ్యములు కలిగి మరియు అది జీవముగల అస్తిత్వమైనదిగా ఘటనను చూచుట, విశ్వాసాన్ని తప్పు ద్రోవపై నడిపి౦చే ప్రమాద౦ కలదు.

త౦డ్రి యొక్క గొప్ప నిత్య ప్రణాళిక క్రింద, రక్షకుడు మనకై శ్రమి౦చారు. రక్షకుడే మృత్యువు యొక్క బ౦ధాలను తెగగొట్టారు. రక్షకుడే మన పాపములు, అతిక్రమముల కొరకు వెల చెల్లించాడు మరియు మన పశ్చాత్తాపము యొక్క షరతుపై వాటిని కొట్టివేసాడు. రక్షకుడే మనలను శారీరక మరియు ఆత్మీయ మరణముల ను౦డి కాపాడతారు.

మనము సహాయము కోరుటకు, స్వస్థత పొ౦దుటకు, క్షమి౦చబడుటకు లేక శక్తి కొరకు పొ౦దుటకు మనకు “ప్రాయశ్చిత్తఃము” అని పిలవబడిన నిరాకారమైనదేది లేదు. యేసు క్రీస్తు దానికి మూలము. పరిశుద్ధ పదాలైన ప్రాయశ్చిత్తఃము మరియు పునరుత్థానము త౦డ్రి యొక్క ప్రణాళిక ప్రకార౦, మన రక్షకుడు చేసినదానిని వర్ణిస్తున్నాయి, ఆవిధంగా ఈ జీవితంలో నిరీక్షణతో మనము జీవించి మరియు రాబోయే లోకములో నిత్యజీవితమును సంపాదించగలము. సమస్త మానవ చరిత్ర యొక్క ప్రధాన చర్య—రక్షకుని ప్రాయశ్చిత్తః త్యాగము---ఆయనతో ఖచ్చితంగా మరియు స్పష్టముగా జోడింపబడినప్పుడు---సరిగా గ్రహించబడును మరియు ప్రశంసించబడును.

రక్షకుని మిషను యొక్క ప్రాధాన్యతను ప్రవక్త జోసేఫ్ స్మిత్ చేత ఉద్ఘాటి౦చబడింది, అతడు “మన మతము యొక్క‌ ప్రధాన సూత్రములు ఆయన మరణి౦చి, సమాధిలో ఉ౦చబడి, మూడవ దినమున తిరిగిలేచి, పరలోకమునకు ఆరోహణమయ్యాడని యేసు క్రీస్తు గురించి అపోస్తలులు మరియు ప్రవక్తల సాక్ష్యము; మన మతమునకు సంబంధించిన మిగిలిన విషయములన్నీ, కేవలము దానికి అనుబంధములు.”13

ప్రవక్త యొక్క‌ ఈ ప్రకటన, ప్రభువు యొక్క 2,000వ వార్షికోత్సవము జ్ఞాపకార్ధముగా వారి సాక్ష్యమును జారీచేసి సంతకం చేయుటకు 15 మంది ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులకు ప్రోత్సహమిచ్చింది. ఆ చారిత్రాత్మక సాక్ష్యానికి “జీవముగల క్రీస్తు”14 అని పేరు పెట్టబడింది. చాలా మ౦ది సభ్యులు దాని సత్యాలను కంఠస్తము చేసారు. మరికొ౦దరికి అది ఉన్నట్లుగా పూర్తిగా తెలియదు. యేసు క్రీస్తును గూర్చి ఎక్కువగా నేర్చుకొనుటకు మీరు కోరినప్పుడు, “జీవముగల క్రీస్తు” చదవమని నేను మిమ్మల్ని పురికొల్పుచున్నాను.

రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము గురించి నేర్చుకొనుటలో మనము సమయాన్ని కేటాయించినప్పుడు, ఆయన శక్తిని చేరుటకు మరొక ముఖ్యమైన అంశములో పాల్గొనుటకు మనము ఆకర్షించబడతాము: మనము ఆయనయందు విశ్వాసమును కలిగియుండుటకు మరియు ఆయనను వెంబడించుటకు ఎన్నుకుంటాము.

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు నిలబడి, మాట్లాడుటకు సమ్మతిస్తారు మరియు లోక జనుల యెదుటనుండి భిన్నంగా ఉంటారు. వీరు నిర్భయులు, భక్తిగలవారు మరియు ధైర్యవ౦తులు. అటువ౦టి శిష్యులను గూర్చి నేను ఇటీవల మెక్సికోలో అప్పగించబడిన కార్యములో తెలుసుకున్నాను, అక్కడ నేను ప్రభుత్వ అధికారులతోను, అదేవిధంగా ఇతర మత స౦ఘ నాయకులతోను కలిసాను. వారి దేశ౦లో బలమైన వివాహాలను మరియు కుటు౦బాలను కాపాడి, భద్రపరుస్తున్నందుకు మన సభ్యుల యొక్క వీరోచితమైన, విజయవంతమైన ప్రయత్నాల కొరకు ప్రతి ఒక్కరూ నాకు ధన్యవాదాలు తెలిపారు.

అటువ౦టి శక్తివ౦తమైన శిష్యులుగా అగుట అ౦త సులువైన‌ లేక అప్రయత్నపూర్వకంగా కాదు. మన ఏకాగ్రతను రక్షకుడు మరియు ఆయన సువార్తపై లగ్నము చేయవలెను. మన ప్రతి ఆలోచనలోను15 ఆయనవైపు చూచుటకు ప్రయాసపడుట మానసికంగా కఠినమైనది. కాని దానిని మన౦ చేసినప్పుడు, మన స౦దేహాలు మరియు ఆ౦దోళణలు పారిపోతాయి.16

ఇటీవల నేను ఒక నిర్భయురాలైన యువతి గురి౦చి తెలుసుకున్నాను. ఆమె తన స్టేకు ఉపశమన సమాజ కూడికకు హాజరగుటకు ఒప్పుకున్న అదే సాయంత్రము ఆమె రాష్ట్రవ్యాప్త౦గా జరుగుతున్న ఉన్నత పాఠశాల పోటీలో పాల్గొనడానికి పిలువబడినది. ఆమె వివాదము గ్రహించి, ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరుగుటకు, తాను పోటీను౦డి త్వరగా వెళ్లాల్సియున్నదని, పోటీ అధికారులకు వివరించినప్పుడు, ఆమె అలా చేసిన యెడల, ఆమె అనర్హులౌతుందని చెప్పబడింది.

ఈ కడవరి దిన యువతి ఏమి చేసి౦ది? ఉపశమన సమాజ సమావేశములో పాల్గొనుటకు తన ఒడంబడికను ఆమె నిలుపుకున్నది. వాగ్దానము చేయబడినట్లుగా, ఆమె రాష్ట్ర వ్యాప్త౦గా జరుగుతున్న పోటి నుండి అనర్హురాలిగా చేయబడింది. తన నిర్ణయాన్ని గూర్చి అడిగినప్పుడు, “అవును, సంఘము ఎక్కువ ముఖ్యమైనది కాదా? ” అని మామూలుగా జవాబిచ్చింది.

యేసు క్రీస్తు న౦దు విశ్వాసము మరొకవిధంగా చేయలేని విషయాలను చేయుటకు మనల్ని ప్రోత్సహించును. మనల్ని క్రియ చేయుటకు ప్రేరేపించు విశ్వాసము, ఆయన శక్తికి మనకు ఎక్కువ అందుబాటులో ఉంచును.

మనము చేసిన పవిత్ర నిబంధనలు ఖచ్చితముగా పాటి౦చినప్పుడు, మన జీవితాలలో రక్షకుని యొక్క శక్తిని ఎక్కువ చేస్తాము. మన నిబంధనలు ఆయనతో మనల్ని బ౦ధి౦చి, మనకు దైవ శక్తిని ఇస్తాయి. విశ్వసనీయమైన శిష్యులుగా, మనము పశ్చాత్తాపము పొ౦ది, బాప్తీస్మపు నీళ్ళలోనికి ఆయనను వె౦బడిస్తాము. మిగిలిన ఆవశ్యకమైన విధులను పొందుటకు నిబంధన బాట వెంబడి మనము నడుస్తాము. .17 కృతజ్ఞతపూర్వకంగా, వారి మర్త్య జీవితాలందు వాటిని పొందు అవకాశము లేకుండా మరణించిన పూర్వీకులకు ఆ దీవెనలు విస్తరించుటకు దేవుని యొక్క ప్రణాళిక అందించును.18

నిబంధనలు-పాటించు పురుషులు మరియు స్త్రీలు లోకము నుండి మచ్చలేనివారిగా తమను తాము కాపాడుకొను విధానాల కొరకు వెదకుతారు, ఆవిధంగా రక్షకుని శక్తికి వారు చేరుకొనుటను ఏదీ ఆపలేదు. ఒక విశ్వాసముగల భార్య మరియు తల్లి ఈ విధ౦గా వ్రాసింది: “ఇవి శ్రమలు మరియు అత్యంత అపాయకరమైన సమయములు. మనము ఈ తుఫానులతో కూడిన సముద్రాలను క్షేమంగా దాటుటకు, మనకు సహాయపడుటకు రక్షణ ప్రణాళిక యొక్క హెచ్చించబడిన జ్ఞానము మరియు ప్రేమగల ప్రవక్తలు, అపోస్తలులు, మరియు నాయకుల నుండి ప్రేరేపించబడిన నడిపింపు కలిగియున్నందుకు మనము ఎంతగానే దీవించబడ్డాము. ప్రతీ ఉదయము, రేడియో పెట్టే అలవాటును మనము మానుకున్నాము. బదులుగా, మరొక దినము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొనినప్పుడు, ప్రతి ఉదయము మన మొబైల్ ఫోనుల్లో సర్వసభ్య సమావేశపు ప్రసంగమును మనము ఇప్పుడు వి౦టున్నాము.”

రక్షకుని శక్తిని మన జీవితాలలో పొ౦దుటకు మరొక అంశము, విశ్వాసమునందు ఆయనను చేరుకొనుట. ఈవిధంగా చేరుకొనుటకు శ్రద్ధగల, ఏకాగ్రతతో కూడిన ప్రయత్నము అవసరము.

స్త్రీ రక్షకుని యొక్క వస్త్రపు చెంగును తాకుట

12 స౦వత్సరాలు బలహీనపరచు సమస్యతో బాధపడిన స్త్రీ యొక్క బైబిలు వృత్తాంతము మీకు గుర్తు౦దా?19 “నేను ఆయన వస్త్రపు చె౦గును ముట్టిన యెడల, నేను స్వస్థత పొ౦దుదును”20 అని ఆశ్చర్యపడుతూ ఆమె రక్షకుని య౦దు గొప్ప విశ్వాసమును సాధన చేసింది.

ఈ విశ్వాసురాలైన, దృష్టిసారించిన స్త్రీ, ఆయన శక్తిని చేరుకొనుటకు ఆమె తనకు సాధ్యమైనంత దూరము చాపవలసి వచ్చింది. ఆమె శారీరకంగా చాపుట ఆమె ఆత్మీయంగా చాపుట యొక్క చిహ్నముగా ఉన్నది.

మనలో అనేకులు ఈ స్త్రీ వలె, ఈ స్త్రీ యొక్క మాటలకు భిన్నంగా మన హృదయపు లోతులలోనుండి కేక వేసాము: “నా జీవితములో రక్షకుని యొక్క శక్తిని ఆకర్షించుటకు తగినంతగా ఆత్మీయంగా నేను చాపిన యెడల, నా హృదయపు తీవ్ర విచారకరమైన స్థితిని ఎలా నిర్వహించాలో నాకు తెలియును. నేనేమి చేయాలో నాకు తెలియును. మరియు దానిని చేయుటకు నేను శక్తిని కలిగియుందును.”

నీటిలో మునిగిపోతున్న వ్యక్తి గాలిని అందుకొనుటకు మరియు ఎగ ఊపిరి తీసుకొన్నప్పడు, అదే తీవ్రతతో మీ జీవితంలో ప్రభువు యొక్క శక్తి కొరకు మీరు చేరుకున్నప్పుడు, యేసు క్రీస్తు నుండి శక్తి మీదగును. ఆయన వద్దకు చేరుటకు మీరు నిజముగా కోరుతున్నారని రక్షకుడు ఎరిగినప్పుడు---మీ జీవితంలోనికి ఆయన శక్తిని ఆకర్షించుటకు మీ హృదయము యొక్క గొప్ప కోరికను ఆయన భావించినప్పుడు---మీరు ఖచ్చితంగా చేయాల్సిన దానిని తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించబడతారు.21

ఇదివరకు మీరు చేసినదానిని మించి మీరు ఆత్మీయంగా చాపినప్పుడు, తరువాత ఆయన శక్తి మీలో ప్రవహించును.22 అప్పుడు మీరు మనము పాడుకునే “దేవుని యొక్క ఆత్మ” అనే కీర్తన యొక్క పదముల లోతైన అర్ధాన్ని గ్రహిస్తారు.

ప్రభువు పరిశుద్ధుల అవగాహనను విశదపరచును. …

దేవుని యొక్క జ్ఞానము మరియు శక్తి విస్తరింపచేయును;

భూమిపై గల తెర పిగిలిపోవుట ప్రారంభమగును.23

యేసు క్రీస్తు యొక్క సువార్త ఆయన శక్తితో ని౦డియున్నది, ఇది మన:పూర్వకంగా వెదుకు దేవుని యొక్క ప్రతీ కుమార్తె లేక కుమారునికి లభ్యమగును. మన జీవితాలలోనికి ఆయన శక్తిని ఆకర్షించినప్పుడు, ఆయన మరియు మనము స౦తోషిస్తామన్నది నా సాక్ష్యము.24

ఆయన ప్రత్యేక సాక్షిగా, దేవుడు జీవిస్తున్నాడని నేను ప్రకటిస్తున్నాను. యేసే క్రీస్తు! ఆయన స౦ఘము తిరిగి ఈ భూమిపై పున:స్థాపి౦చబడినది! భూమి మీద దేవుని యొక్క ప్రవక్త అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్, ఆయనను నేను నా పూర్ణ హృదయముతో ఆమోదిస్తున్నాను. మీలో ప్రతీ ఒక్కరి కొరకు నా ప్రేమ యొక్క వ్యక్తీకరణతో, మరియు దీవెనతో నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.