2010–2019
పరిశుద్ధాలంకారము
April 2017 General Conference


పరిశుద్ధాలంకారము

ఆయన పరిశుద్ధుడైనట్లుగా మనము పరిశుద్ధులమగునట్లు మనందరికి అవసరమైన సమస్తమును మన పరలోకమందున్నతండ్రి ఏర్పాటు చేసాడు.

ఈ సమావేశము కొరకు నేను సిద్ధపడుచున్నప్పుడు, దగ్గరగా, దూరములో నేను కలుసుకొన్న అనేకమంది విశ్వాసులైన సహోదరీల వైపు నా మనస్సు మరలింది. నాకైతే, అవి రాజైన దావీదు చేత కృతజ్ఞతను తెలుపు కీర్తనలో బాగా వర్ణించబడింది: “యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి: పరిశుద్ధాలంకారములగు ఆభరణములు ధరించుకొనుడి.”1

మంచి వాటన్నిటిపై కేంద్రీకరించబడిన హృదయాలుగల సహోదరీలు, రక్షకుని వలె ఎక్కువగా కావాలని కోరు వారి పరిశుద్ధాలంకారమును నేను చూసాను. ప్రతిరోజు వారు జీవిస్తున్న విధానములో ప్రభువుకు తమ పూర్ణ ఆత్మలు, హృదయము, శక్తి, మనస్సు మరియు బలమును వారు అర్పిస్తున్నారు.2 ఆజ్ఞలను పాటించుటకు మరియు దేవునితో మనము చేసిన నిబంధనలను గౌరవించుటకు ప్రయాసపడుటకు మరియు పోరాటంలో పరిశుద్ధత ఉన్నది. పరిశుద్ధాత్మ మన మార్గదర్శిగా ఉంచు ఎంపికలను చేయుట పరిశుద్ధత. 3 పరిశుద్ధత, మన సహజమైన ధోరణులను ప్రక్కన పెట్టి మరియు “ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పరిశుద్ధురాలిగా అగుట.”4 “(మన జీవితాలలో) ప్రతీ క్షణము ప్రభువుకు పరిశుద్ధమైనది.”5

పరలోకము యొక్క దేవుడు ఇశ్రాయేలు యొక్క సంతతిని ఆజ్ఞాపించాడు, “నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను.”6

పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ బోధించారు: “మన పరలోక తండ్రి ఉన్నతమైన ఆకాంక్షలను కలిగిన దేవుడు . . . మనము సిలెస్టియల్ మహిమకు కట్టుబడియుండునట్లు మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు (సి మరియు ని 88:22) మరియు ఆయన సన్నిధిలో నివసించుటకు ఆయన ఉద్దేశిస్తున్నారు (మోషే 6:57).”7“ఆయన పరిపూర్ణతలు మరియు పరిశుద్ధత కలిగియుండకుండా, ఏ ప్రాణి ఆయన మహిమను ఆనందించలేడు,” 8 అని విశ్వాసముపై ప్రసంగాలు వివరించును. మన పరలోకమందున్న తండ్రి మనల్ని ఎరిగియున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మరియు ఆయన పరిశుద్ధుడైనట్లుగా మనము పరిశుద్ధులమగునట్లు మనందరికి అవసరమైన సమస్తమును మన పరలోకమందున్నతండ్రి ఏర్పాటు చేసాడు.

మనము పరలోక తండ్రి యొక్క కుమారైలము, మరియు మనలో ప్రతిఒక్కరం పరిశుద్ధత యొక్క దివ్యమైన వారసత్వమును కలిగియున్నాము. మన పరలోకమందున్న తండ్రి ప్రకటించాడు, “ఇదిగో, నేను దేవుడను, పరిశుద్ధుడను అన్నది నా పేరు.”9 మర్త్యత్వమునకు ముందు లోకములో, మనము మన తండ్రిని ప్రేమించాము మరియు ఆయనను ఆరాధించాము. ఆయన వలె కావాలని మనము కోరాము. పరిపూర్ణమైన తండ్రి తరఫు ప్రేమతో, ఆయన తన ప్రియమైన కుమారుడు, యేసు క్రీస్తును మన రక్షకుడు మరియు విమోచకునిగా ఉండుటకు అనుమతించెను. ఆయన పరిశుద్ధత యొక్క మనుష్య కుమారుడు. .10 ఆయన “పేరు పరిశుద్ధత,”11 “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడు.”12

పరిశుద్ధత కొరకు మన నిరీక్షణ క్రీస్తునందు, ఆయన కనికరము మరియు ఆయన కృపయందు కేంద్రీకరించబడింది. యేసుక్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసముతో, మనము సమస్త దుష్టత్వమును నిరాకరించుకొని,13 మరియు నిజాయితీగా పశ్చాత్తాపపడినప్పుడు మనము మచ్చలేకుండా, శుద్ధిగా, అవుతాము. పాపముల పరిహారము నిమిత్తము నీళ్ళచేత మనము బాప్తీస్మము పొందాము. తెరవబడిన హృదయాలతో, పరిశుద్ధాత్మను మనము పొందినప్పుడు, మనము, మన ఆత్మలు పరిశుద్ధపరచబడతాయి. వారానికి ఒకసారి, మనము సంస్కార విధిలో పాల్గొంటాము. పశ్చాత్తాపము యొక్క ఆత్మయందు, నీతి కొరకు నిజాయితీగల కోరికలతో, క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుటకు, ఆయనను జ్ఞాపకముంచుకొనుటకు, మరియు ఆయన ఆజ్ఞలు పాటించుటకు సమ్మతిస్తున్నామని మనము నిబంధన చేస్తున్నాము, ఆవిధంగా మనము ఆయన ఆత్మను మనతో కలిగియుంటాము. కాలక్రమేణా, తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మతో ఒకటిగా అగుటకు మనము నిరంతరము ప్రయాసపడినప్పుడు, వారి దివ్యమైన స్వభావముతో మనము పాలుపంచుకొనేవారమవుతాము.14

మన నిబంధనలు పాటించుట పరిశుద్ధత

అనేక పరీక్షలు, శోధనలు, మరియు శ్రమలు మనల్ని దేవుని యొదట సుగుణము మరియు పొగడదగిన సమస్తము నుండి తీసివేయగలవని మనము గుర్తిస్తున్నాము. కాని మన మర్త్య అనుభవాలు పరిశుద్ధతను ఎన్నుకొనుటకు మనకు అవకాశమిస్తాయి. మిక్కిలి తరచుగా అది మనల్ని పరిశుద్ధపరచి మరియు మనల్ని పవిత్రంగా చేసే నిబంధనలను పాటించుటకు మనము చేయు త్యాగములు.

చిత్రం
ఘానాలో 13-సంవత్సరాల బాలిక, ఈవాంజిలిన్

ఘానాలో 13-సంవత్సరాల బాలిక ఈవాంజిలిన్ ముఖములో పరిశుద్ధతను నేను చూసాను. ఆమె తన నిబంధనలు పాటించు విధానాలలో ఒకటి, బీహైవ్ తరగతి అధ్యక్షురాలిగా తన పిలుపును నెరవేర్చుట. సంఘానికి వచ్చుటకు వారిని అనుమతించమని వారి తల్లిదండ్రులను అడగటానికి, తన తక్కువ చురుకుదనము గల తన స్నేహితుల ఇండ్లకు వెళతానని ఆమె సవినయంగా వివరించింది. ఆదివారము పిల్లలు ఇంటి పనులు చేయాలి కనుక వారికది కష్టమని తల్లిదండ్రులు ఆమెతో చెప్పారు. అందుచేత ఈవాంజిలిన్ వెళ్ళి పనులతో సహాయపడుతుంది మరియు ఆమె ప్రయత్నాల ద్వారా ఆమె స్నేహితులు సంఘానికి వచ్చుటకు తరచుగా అనుమతించబడతారు.

సంబంధిత నిబంధనలను మనము పాటించిన యెడల, పరిశుద్ధ యాజకత్వ విధులు మనల్ని మారుస్తాయి, మనల్ని పరిశుద్ధపరుస్తాయి, మరియు ప్రభువు యొక్క సన్నిధిలో ప్రవేశించుటకు మనల్ని సిద్ధపరుస్తాయి.15 కనుక మనము ఒకరినొకరి భారములను భరిస్తాము, మనము ఒకరినొకరం బలపరచుకుంటాము. పేదవారు, ఆకలిగొన్నవారు, దిగంబరులు, మరియు రోగులకు తాత్కాలిక మరియు ఆత్మీయ ఉపశమనము కలిగించినప్పుడు, మనము పాపముల పరిహారమును నిలుపుకుంటాము.16 మనము సబ్బాతుదినమును పాటించి, ప్రభువు యొక్క పరిశుద్ధ దినమున యోగ్యతగా సంస్కారమును పొందినప్పుడు, లోకము నుండి మచ్చలేనివారిగా మనల్ని మనం కాపాడుకుంటాము.17

మనము మన కుటుంబాలను దీవిస్తాము మరియు మన గృహాలను పరిశుద్ధ స్థలములుగా చేస్తాము. శుద్ధమైన, శాశ్వతమైన ప్రేమతో మనము నింపబడునట్లు, మన అతి ఇష్టాలకు కళ్ళెము వేస్తాము.18 మనము ఇతరులను దయ, కనికరముతో చేరుకొని, దేవుని యొక్క సాక్షులుగా నిలబడతాము. ఐక్యత మరియు నీతియందు కలిసి నివసించిన ఏక హృదయము, ఏక మనస్సు కలిగిన, శుద్ధమైన జనులైన, సీయోను జనుల వలె మనము మారతాము.19 “ఏలయనగా సీయోను అందము మరియు పరిశుద్ధతయందు వృద్ధి చెందాలి.”20

సహోదరిలారా, దేవాలయముకు రండి. ఆయన రాకడయందు రక్షకుని స్వీకరించుటకు సిద్ధపడిన పరిశుద్ధ జనులుగా మనము ఉండాల్సిన యెడల, మనము పైకి లేచి మన అందమైన వస్త్రములను ధరించుకోవాలి.21 “పరిశుద్ధతతో, అవును, నీతి వస్త్రముతో ధరింప,”22 బడునట్లు, బలము మరియు ఘనతలో, మనము లోకము యొక్క విధానాలను విడిచి, మన నిబంధనలను పాటిస్తాము.

పరిశుద్ధాత్మను మన మార్గదర్శిగా తీసుకొనుట పరిశుద్ధత

పరిశుద్ధత ఆత్మ యొక్క వరము. మన జీవితాలలో పరిశుద్ధపరచు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని హెచ్చించునట్లు ఆ విషయాలను చేయుటకు మనము ఎన్నుకొన్నప్పుడు, ఈ వరమును మనము అంగీకరిస్తాము.

చిత్రం
మార్త రక్షకుని మాటలను విన్నది

మార్త తన గృహములోనికి యేసు క్రీస్తును ఆహ్వానించినప్పుడు, ఆమె తన శాయశక్తులా ప్రభువును సేవించుటకు ఒక అద్భుతమైన కోరికను అనుభూతి చెందింది. ఆమె సహోదరి, మరియ, “యేసు పాదము వద్ద” కూర్చోని ఆయన వాక్యము వినటానికి ఎన్నుకొన్నది. ఏవిధమైన సహాయము లేకుండా సేవ చేయటం గురించి మార్త భారముగా భావించినప్పుడు, ఆమె ఫిర్యాదు చేసింది, “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింత లేదా?”

నేనూహించగల అత్యంత సున్నితమైన గద్దింపు మాటలను నేను ప్రేమిస్తున్నాను. పరిపూర్ణమైన ప్రేమ మరియు అంతులేని కనికరముతో, రక్షకుడు హితబోధ చేసాడు:

“ మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని:

“అవసరమైన ఒక్కటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు.”23

సహోదరిలారా, మనము పరిశుద్ధముగా ఉండాల్సిన యెడల, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని పాదముల వద్ద కూర్చోనుట మనము నేర్చుకోవాలి మరియు పరిశుద్ధతకు సమయమివ్వాలి. ఫోను, ఎప్పటికి అంతులేని జాబితాను, మరియు లోక చింతలను ప్రక్కన పెడుతున్నామా? ప్రార్థన, అధ్యయనము, మరియు దేవుని వాక్యమును లక్ష్యముంచుట, మన ఆత్మలలోనికి ఆయన శుద్ధి చేయు మరియు స్వస్థపరచు ప్రేమను ఆహ్వానించును. పరిశుద్ధముగా ఉండుటకు సమయాన్ని మనము తీసుకొందాం, ఆవిధంగా, మనము ఆయన పరిశుద్ధమైన, మరియు పరిశుద్ధపరచు ఆత్మతో నింపబడతాము. పరిశుద్ధాత్మ మన మార్గదర్శిగా, మనము పరిశుద్ధాలంకారములందు రక్షకుని స్వీకరించుటకు సిద్ధపడియుంటాము.24

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పరిశుద్ధురాలిగా అగుట పరిశుద్ధత

రాజైన బెంజిమెన్ యొక్క ప్రేరేపించబడిన మాటల ప్రకారము, యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధులైన వారు, నమ్రత, అణకువ, వినయము, సహనము కలిగి, రక్షకునివలె ప్రేమతో నిండియుంటారు.25 యేసు క్రీస్తు, “సమస్త ఆనంతము నుండి సమస్త ఆనంతము వరకు ఉండి, మరియు ఉన్న ఆ సర్వశక్తిమంతుడైన ప్రభువు పరలోకమునుండి నరుల యొక్క సంతానము మధ్యకు దిగివచ్చును, మరియు ఒక మట్టి గుడారములో నివసించును.” ఆయన రోగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని దీవించుటకు, మరియు మృతులను లేపుటకు ఆయన వచ్చెను. ఇంకను ఆయన “మరణమునకు తప్ప మనుష్యుడు సహించగలిగిన దాని కంటె అధికముగా కూడ,”25 సహించాడు. మరియు రక్షణ ఆయన ద్వారానే వచ్చినప్పటికిని, ఆయన ఎగతాళి చేయబడ్డాడు, కొరడాతో కొట్టబడ్డాడు, మరియు సిలువ వేయబడ్డాడు. కాని మనమందరం మరణము జయించగలగునట్లు, దేవుని కుమారుడు, సమాధి నుండి లేచాడు. నీతియందు లోకమునకు తీర్పు తీర్చటానికి నిలబడేది ఆయనే. మనందరిని విమోచించేది ఆయనే. ఇశ్రాయేలు యొక్క విమోచకుడు ఆయనే. యేసు క్రీస్తు పరిశుద్ధాలంకారము.

రాజైన బెంజిమెన్ యొక్క జనులు అతడి మాటలు విన్నప్పుడు, వారు నేలపై పడ్డారు, వారి దీనత్వము మరియు మన దేవుని యొక్క కృప, మహిమ కొరకు భక్తిగల గౌరవము చాలా గొప్పది. వారి శారీరక స్థితిని వారు గుర్తించారు. మన ప్రభువైన క్రీస్తు యొక్క కృప మరియు కనికరముపై మన పూర్తి ఆధారమును మనము చూస్తున్నామా? భౌతికమైన మరియు ఆత్మీయమైన ప్రతీ మంచి వరము, క్రీస్తు ద్వారా మనకు వస్తుందని మనము గ్రహించామా? తండ్రి యొక్క నిత్య ప్రణాళిక ప్రకారము, ఈ జీవితంలో శాంతి మరియు నిత్యత్వము యొక్క మహిమలు ఆయన పరిశుద్ధ కుమారునియందు, ద్వారా మాత్రమేనని మనకు గుర్తుందా?

రాజైన బెంజిమెన్ యొక్క జనులు ఏకస్వరముతో కేకలు వేసినప్పుడు మనము వారితో చేరదామా, “ఓ కనికరము చూపించుము, మరియు మేము మా పాపముల యొక్క క్షమాపణను పొందునట్లు మరియు మా హృదయములు శుద్ధియగునట్లు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము ఉపయోగించుము, ఏలయనగా పరలోకమును మరియు భూమిని మరియు అన్నివస్తువులను సృష్టించిన, ఆ దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు నందు మేము విశ్వసించుచున్నాము.” 27

ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని వద్దకు మనము వచ్చినప్పుడు, ఆయన ఆత్మ మనపైకి వచ్చునని, మనము సంతోషముతో నింపబడతామని, పాపముల పరిహారమును మరియు మనస్సాక్షిని పొందుతామని నేను సాక్ష్యమిస్తున్నాను.

పరిశుద్ధులుగా అగుటకు పరలోక తండ్రి మనలో ప్రతిఒక్కరికి సామర్ధ్యమును ఇచ్చారు. మన నిబంధనలను పాటించుటకు, మరియు మన మార్గదర్శిగా పరిశుద్ధాత్మను తీసుకొనుటకు మన శాయశక్తులా చేద్దామా. అమర్తత్వమును మరియు నిత్యజీవమును మనము పొందునట్లు, యేసుక్రీస్తునందు విశ్వాసముతో, ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధులగుటకు ప్రయాసపడదామా మరియు ఆయన కారణముగా, మన తండ్రియైన దేవునికి మహిమను చెల్లిద్దామా. మన జీవితాలు ఒక పరిశుద్ధ అర్పణగా ఉండునుగాక, ఆవిధంగా మనము ప్రభువు యెదుట పరిశుద్ధాలంకారములో నిలబడెదము గాక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు