2010–2019
మనం ఉత్తమముగాా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

మనం ఉత్తమముగాా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము

మీ దృష్టి అనుదిన పశ్చాత్తాపము పైన పెట్టండి, అది మీ జీవితానికి ఎంత అంతర్భాగము కావాలంటే ఇంతకు ముందు కంటే గొప్ప శక్తితో మీ యాజకత్వమును మీరు కసరత్తు చెయ్యాలి.

నా ప్రియమైన సహోదరులారా, యాజకత్వమును వహించు ప్రభువు సైన్యము యొక్క ఈ విస్తృతమైన సమూహమును చూచుట చాలా ప్రేరేపితముగా ఉన్నది. మంచికి మీరు ఎంతో బలమైన శక్తిగా ఉన్నారు! మేమేు మిమ్మును ప్రేమిస్తున్నాము. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మేము మీకు అత్యంత కృతజ్ఞత కలిగియున్నాము.

“ఈ తరమువారితో పశ్చాత్తాపము తప్ప మరేమి బోధించవద్దు“1 అని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు ఇచ్చిన ఉపదేశమునకు నేను చేరువైనట్లు ఇటీవల కనుగొన్నాను. ఈ ప్రకటన లేఖనములన్నిటిలో తరచు పునరావృతము చెయ్యబడినది. 2ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపము అవసరమా?“ అనే స్పష్టమైన ప్రశ్నను మనకు ప్రేరేపిస్తుంది. దానికి సమాధానము అవును.

చాలా మంది జనులు పశ్చాత్తాపము ఒక శిక్ష అని-అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులలో తప్ప దానికి దూరంగా ఉండాలని పరిగణిస్తారు. కాని శిక్ష విధించబడినట్లు కలిగే ఈ భావము సాతాను ద్వారా కల్పించబడింది. మనం యేసు క్రీస్తు3 వైపునకు చూడకుండా అడ్డు పడుటకు సాతాను ప్రయత్నిస్తాడు, ఆయన స్వస్థపరచుటకు, క్షమించుటకు, శుద్ధిచేయుటకు, బలపరచుటకు, నిర్మలము చేయుటకు మరియు పవిత్రము చేయుటకు సమ్మతితో, ఆశతో తన బాహువులు తెరచి నిలబడి యున్నారు4.

పశ్చాత్తాపము అనే పదము గ్రీకు క్రొత్తనిబంధనలో మెటనోయీ. మెటా అనే ఉపసర్గమునకు “మార్పు“ అని అర్థము. నోయీ అనే ప్రత్యయము గ్రీకు పదాలకు సంబందించింది దానికి అర్థము “మనస్సు,“ “జ్ఞానము,“ “ఆత్మ“ మరియు “శ్వాస“ అని అర్థము. 5

కాబట్టి, యేసు నిన్ను, నన్ను “పశ్చాత్తాపపడమని“6 అడిగినప్పుడు, ఆయన మన మనస్సును, మన జ్ఞానాన్ని, మన ఆత్మను-మనం శ్వాసతీసుకొనే విధానాన్ని కూడా మార్చుకోమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనం ఏవిధంగా ప్రేమిస్తామో, ఆలోచిస్తామో, మన సమయాన్ని వెచ్చిస్తామో, మన భార్యలను పరిగణిస్తామో, మన పిల్లలకు బోధిస్తామో, మన శరీరాలకు జాగ్రత తీసుకుంటామో దానిని కూడా మార్చమని ఆయన అడుగుచున్నారు.

పశ్చాత్తాపము పైన క్రమం తప్పకుండా, అనుదినం కేంద్రీకృతం చెయ్యడము కంటే మరేది కూడా మిక్కిలి స్వేచ్ఛనిచ్చేది, ఘనత చేకూర్చేది లేదా మన వ్యక్తిగత అభివృద్ధికి మిక్కిలి ఆవశ్యకమైనది ఏదియ లేదు. పశ్చాత్తాపము అనేది ఒక సంఘటన కాదు; అది ఒక విధానము. సంతోషానికి, మనశ్శాంతికి అది ఆయువుపట్టు. విశ్వాసముతో కలిసినప్పుడు పశ్చాత్తాపము అనేది యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క శక్తికి మనము సమీపించుటకు మార్గము తెరుచును.7

మీరు నిబంధన మార్గములో శ్రద్ధతో ముందుకు వెళ్తున్నప్పటికి, నిబంధన మార్గము నుండి జారిపోయి లేదా ప్రక్కకు వెళ్లి లేదా మీరు ఇప్పుడు ఉన్న చోటునుండి నిబంధన మార్గమును చూడలేకపోయినప్పటికి, పశ్చాత్తాపపడమని నేను మిమ్ములను వేడుకొనుచున్నాను. అను దినము ఇంకొంచెము ఉత్తమముగా చేయుచు, ఇంకొంచెం ఉత్తమముగాా ఉంటూ-అనుదిన పశ్చాత్తాపము యొక్క బలపరచు శక్తిని అనుభవించండి.

పశ్చాత్తాపపడుటకు మనం ఎంచుకొన్నప్పుడు, మారుటకు మనం ఎంచుకుంటాము! రక్షకుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు ఆయనను మనం అనుమతిస్తాము. మనం ఆత్మీయంగా ఎదుగుటకు, ఆనందమును పొందుటకు అనగా-ఆయన యందు విమోచన ఆనందమును పొందుటకు మనం ఎంచుకుంటాము. 8 మనం పశ్చాత్తాపపడాలని ఎంచుకొన్నప్పుడు, మనం మరింతగా యేసు క్రీస్తువలె ఉండుటకు ఎంచుకొంటాము! 9

సహోదరులారా, మనం యుద్ధములో ఉన్నాము గనుక మనం ఉత్తమముగా చెయ్యాలి మరియు ఉత్తమముగా ఉండాలి. పాపముతో పోరాటము నిజము. సాక్ష్యములను భంగపరచుటకు, ప్రభువు యొక్క పనిని ఆటంకపరచుటకు అపవాది తన ప్రయత్నాలను నాలుగు రెట్లు ఎక్కువ చేసెను. ప్రభువు యొక్క ప్రేమను, సంతోషమును మనం పాలుపొందకుండా ఉండుటకు తన సేవకులకు సామర్థ్యము గల ఆయుధాలను వారికి ధరింపజేయుచున్నాడు. 10

అపవాది యొక్క ఉచ్చుల ద్వారా కలుగు దుఃఖమును తప్పించుకోవాలంటే పశ్చాత్తాపము కీలకము. మన నిత్యాభివృద్ధిలో ఈ స్థానములో మన నుండి పరిపూర్ణతను ప్రభువు ఆశించడం లేదు. కాని మనం ఎక్కువ నిర్మలముగా ఉండాలని ఆయన మననుండి ఆశిస్తున్నారు. నిర్మలత్వమునకు మార్గము అనుదిన పశ్చాత్తాపము మరియు నిర్మలత్వము శక్తిని ఇస్తుంది. వ్యక్తిగత నిర్మలత్వము మనలను దేవుని హస్తాలలో శక్తివంతమైన పనిముట్లుగా చేస్తుంది. మన పశ్చాత్తాపము-మన నిర్మలత్వము-ఇశ్రాయేలీయులను పోగుచేయుటలో సహాయము చేయుటకు మనకు అధికారాన్ని ఇస్తుంది.

“యాజకత్వపు హక్కులు పరలోక శక్తులతో వేరు చేయబడలేకుండ కలుపబడియున్నవి, పరలోక శక్తులను నీతి సూత్రములతో తప్ప నియంత్రించలేము లేక వినియోగించలేము“11 అని ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు బోధించెను.

పరలోక శక్తులకు ఎక్కువ ప్రవేశాన్ని మనకు ఏది ఇస్తుందో అది మనకు తెలుసు. మన అభివృద్ధిని నిరోధించేది ఏదో -పరలోక శక్తులకు మన ప్రవేశాన్ని పెంచుకొనుటకు మనం ఏది చెయ్యకుండా ఆపాలో అది కూడా మనకు తెలుసు. సహోదరులారా, మన పశ్చాత్తాపము చెందడానికి మన మార్గములో ఏది అడ్డుగా ఉందో అర్థము చేసుకొనుటకు ప్రార్థనా పూర్వకముగా వెదకండి. పశ్చాత్తాపపడకుండా మనల్ని ఏది ఆపుతుందో కనిపెట్టండి. తరువాత మారండి! పశ్చాత్తాపపడండి! మునుపెన్నటికంటే కూడా మనందరము ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము. 12

మనం అభివృద్ధి చెందగలిగే కొన్ని నిర్థిష్టమైన మార్గాలు కలవు. మన శరీరాలను మనం ఏవిధంగా పరిగణిస్తామో అనేది వాటిలో ఒకటి. మనుష్య శరీరము అనే అద్భుతము గురించి నేను విస్మయము చెందుతాను. అది అద్భుతమైన సృష్టి, మన అంతిమ దివ్యమైన సామర్థ్యమునకు క్రమముగా పైకి తీసుకొని వెళ్ళుటకు ఆవశ్యకమైనది. అది లేకుండా మనం అభివృద్ధి చెందలేము. శరీరమనే బహుమానము మనకు ఇచ్చుట ద్వారా, మనం ఆయన వలె మరింతగా అగుటకు ఆవశ్యకమైన నిర్ణయం తీసుకొనుటకు దేవుడు మనల్ని అనుమతించెను.

సాతాను దీనిని అర్థం చేసుకున్నాడు. అతని పూర్వమర్త్య జీవితపు భ్రష్టత్వము అతడ్ని ఈ విశేషాధికారమునకు అనర్హుడిగా చేసిందని అతడు నిరాశతో ఉండి, అతడ్ని స్థిరముగా అసూయ, పగతో ఉన్న స్థితిలోకి నెట్టెను. కాబట్టి అందురూ కాకపోయినా, చాలామంది అతడు మన త్రోవలో పెట్టే శోధనల వలన మన శరీరాలను లేదా ఇతరుల శరీరాలను దుర్వినియోగం చేసేలా చేస్తాడు. సాతాను శరీరము లేకుండా ధౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు కాబట్టి, మన శరీరాల వలన13 మనం కూడా ధౌర్భాగ్య స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు.

మీ శరీరము మీ స్వంత దేవాలయము, మీ నిత్య ఆత్మ నివసించుటకు సృష్టించబడినది.14 ఆ దేవాలయమునకు మీ సంరక్షణ అవసరము. సహోదరులారా నేను మిమ్మును అడుగుచున్నాను: దేవుని మీరు సంతోషపరుచుట కంటే లోకమునకు ఆకర్షనీయముగా కనిపించుటకు మీ శరీరాన్ని దుస్తులతో అలంకరించుకొనుట యందు మీరు ఎక్కువ ఆసక్తి కలిగియున్నారా? మీ సమాధానము ఆయన మీకిచ్చిన మహిమకరమైన బహుమానము గురించి మీ భావాలు ఏవిధంగా ఉన్నాయో అనే సందేశాన్ని నేరుగా ఆయనకు పంపును. సహోదరులారా, మన శరీరాల యొక్క భక్తితోకూడిన గౌరవము విషయములో మనం ఇంకా ఇంకా ఉత్తమముగా చెయ్యగలము.

మనం ఇంకా మరింత ఉత్తమముగా చెయ్యగలిగిన మరొక మార్గమేదనగా మన జీవితాలలో స్త్రీలను - మన భార్యలు, కుమార్తెలు, మన తల్లులు, మన సహోదరీలతో మొదలుకొని వారిని మనం ఏవిధంగా గౌరవిస్తాము. 15

అనేక నెలల క్రితం ఒక సహోదరి నుండి హృదయ విదారకమైన లేఖ వచ్చింది. ఆమె ఇలా వ్రాసింది: “[నా కుమార్తె మరియు నేను] మా భర్తలు మరియు కుమారుల యొక్క నిరంతర లక్ష్యముతో వారి కొరకు భయంకరమైన పోటీలో ఉన్నట్లు భావిస్తున్నాము, వారు ఇరవై నాలుగు గంటలు ఆటల పోటీల సమాచారము, విడియో గేములు, స్టాక్ మార్కెట్ విషయాలు, ప్రతి విధమైన వృత్తి మరియు ఆట యొక్క విశ్లేషణ మరియు వీక్షణ చేస్తారు. మా భర్తలు మరియు కుమారుల దృష్టిలో మేము ముఖ్యము కాదనే భావన కలుగుతుంది ఎందుకంటే వారికి [ఆటలు, క్రీడలే] ముఖ్యమైనవి.“ 16

సహోదరులారా, యాజకత్వము కలిగిన వారిగా మీ యొక్క మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది మీ భార్యను ప్రేమించి, సంరక్షించుట. ఆమెతో ఐక్యము కండి. ఆమె భాగస్వామి కండి. మీ దానిగా తాను భావించుటకు ఆమెకు సులభతరము చెయ్యండి. ఆమెతో నిత్య సంబంధమును నిర్మించుకొనుట కంటే మరే ఇతర ఆసక్తి ప్రాధాన్యతను కలిగియుండకూడదు. ఆమె సంక్షేమము కంటే టీవీలోను, ఏ మొబైల్ పరికరము లేదా కంప్యూటర్ ముఖ్యమైనది కాకూడదు. మీ సమయాన్ని ఎక్కడ కేటాయిస్తున్నారు మరియు మీ శక్తిసామర్థ్యాలను ఎక్కడ వినియోగిస్తున్నారు అనే దానికి జాబితా వ్రాయండి. మీ హృదయము ఎక్కడ ఉందో అది మీకు తెలుపుతుంది. మీ హృదయము మీ భార్య హృదయముతో ఐక్యము చేయబడుటకు ప్రార్థన చెయ్యండి. ఆమెకు సంతోషాన్ని కలిగించుటకు అపేక్షించండి. ఆమె సలహాను అపేక్షించి, ఆలకించండి. ఆమె ఇచ్చె సలహాలు మీ చర్యలను మెరుగుపరుస్తాయి.

మీకు సన్నిహితముగా ఉండే స్త్రీలను మీరు పరిగణించిన విధానము వలన మీరు పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉన్న యెడల, ఇప్పుడే మొదలు పెట్టండి. మరియు మీ జీవితములో ఉన్న స్త్రీలకు ప్రభువు యొక్క పవిత్రత చట్టమును జీవించుట ద్వారా పొందే దీవెనలను పొందుటలో సహాయ పడుట మీ బాధ్యత అని మీరు గుర్తుంచుకోండి. ఒక స్త్రీ దేవాలయ దీవెనలు పొందలేక పోవడానికి మీరెప్పుడు కారణం కావద్దు.

సహోదరులారా, మనందరము పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉన్నది. మనందరము సోఫాపైనుండి లేతి, రిమోట్‌ను క్రింద పెట్టి, మన ఆత్మీయ నిద్రనుండి మేలుకోవలసిన అవసరం ఉన్నది. భూమిపైన చాలా ముఖ్యమైన పనిలో మనం నిమగ్నమై యుండుటకు దేవుని సర్వాంగ కవచమును ధరించుటకు ఇది సమయము. “[మన] కొడవళ్ళను వేసి [మన] పూర్ణ బలము, మనస్సు, శక్తితో కోత కోయుటకు“ 17 ఇది సమయము. దుష్టశక్తులు మునుపెన్నడు లేనివిధంగా నేడు మరింత బలముతో ఉగ్రతతో ఉన్నాయి. ప్రభువు యొక్క సేవకులుగా, యుద్ధము తీవ్రమౌచుండగా మనం నిద్రపోలేము.

మీ కుటుంబమునకు మీ నాయకత్వము, మీ ప్రేమ కావాలి. మీ యాజకసమూహము మరియు మీ వార్డులో లేదా శాఖలో ఉన్నవారికి మీ బలము అవసరము. మిమ్ములను కలిసేవారందరు ఒక నిజమైన ప్రభువు యొక్క శిష్యుడు ఏవిధంగా కనిపిస్తాడు, ప్రవర్తిస్తాడు అని తెలుసుకోవలసిన అవసరం ఉంది.

నా ప్రియమైన సహోదరులారా, మీ యొక్క పూర్వమర్త్య ఆత్మీయ ధైర్యము వలన ఈ కీలకమైన సమయంలో భూమిమీదకు వచ్చుటకు మన తండ్రిచేత మీరు ఎన్నుకోబడ్డారు. ఇప్పటివరకు భూమిమీదకు వచ్చిన శ్రేష్టమైన, అత్యంత పరాక్రమము కలిగిన పురుషులందరిలో మీరు కూడా ఉన్నారు. పూర్వమర్త్యములో మీరేమిటో, రక్షకుడు తిరిగి వచ్చేముందు చెయ్యబడవలసిన కార్యము ఏమిటో సాతాను యెరిగియున్నాడు. అపవాది వేల సంవత్సరాలుగా తన కుయుక్తి కళలను సాధన చేసిన తరువాత, అతడు అనుభవజ్ఞుడు, మార్చలేనివాడు.

అదృష్టవశాత్తు, మనం కలిగియున్న యాజకత్వము అపవాది కుయుక్తుల కంటే బలమైనది. మీరు ఎటువంటి యౌవనులు, పురుషులు కావాలని ప్రభువు కోరుచున్నారో అట్టివారిగా ఉండమని నేను మిమ్ములను వేడుకొనుచున్నాను. మీ దృష్టి అనుదిన పశ్చాత్తాపము పైన పెట్టండి, అది మీ జీవితానికి ఎంత అంతర్భాగము కావాలంటే ఇంతకు ముందు కంటే గొప్ప శక్తితో మీ యాజకత్వమును మీరు కసరత్తు చెయ్యాలి. ముందున్న సవాళ్ళతో కూడిన దినములలో మిమ్ములను, మీ కుటుంబాన్ని ఆత్మీయంగా సురక్షితముగా ఉంచుటకు మీకు ఇది ఒక్కటే మార్గము.

ఎవరైతే తమకంటే ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారో, అటువంటి నిస్వార్థపరులైన పురుషులు ప్రభువుకు కావాలి. స్పష్టతతో ఆత్మ స్వరమును వినుటకు ఉద్దేశపూర్వకముగా కష్టపడే పురుషులు ఆయనకు కావాలి. తమ నిబంధనలను యధార్థముగా గైకొను పురుషులు ఆయనకు కావాలి. తమను తాము లైెంగికముగా పవిత్రముగా ఉంచుకొనుటకు దృఢనిశ్చయముతో ఉన్న పురుషులు ఆయనకు కావాలి-నిర్మలమైన హృదయాలతో, స్వచ్ఛమైన మనస్సులతో, సమ్మతిగల చేతులతో దీవెన కావాలని ఒక్క క్షణం ముందు చెప్పిన ఇవ్వగలిగే యోగ్యులైన పురుషులు ఆయనకు కావాలి. పశ్చాత్తాపము చెందుటకు ఆతృత గల పురుషులు ప్రభువుకు కావాలి-యోగ్యులైన యాజకత్వము వహించు ప్రభువు యొక్క సైన్యములో భాగము కావాలని, సేవ చెయ్యాలనే తపన కలిగిన పురుషులు ఆయనకు కావాలి.

అటువంటి పురుషులు కావాలని నేను మిమ్ములను దీవిస్తున్నాను. అనుదినము పశ్చాత్తాపపడుటకు ధైర్యము కలిగియుండాలని, పూర్తి యాజకత్వ శక్తిని ఏవిధంగా కసరత్తు చెయ్యాలో నేర్చుకోవాలని నేను మిమ్ములను దీవిస్తున్నాను. రక్షకుని ప్రేమను మీ భార్యకు, మీ పిల్లలకు మరియు మీకు తెలిసిన వారందరికి తెలియజెయ్యాలని నేను మిమ్ములను దీవిస్తున్నాను. ఉత్తమముగా చెయ్యాలని, ఉత్తమముగా ఉండాలని నేను మిమ్ములను దీవిస్తున్నాను. ఈ ప్రయత్నాలను మీరు చేసినప్పుడు, మీ జీవితములో అద్భుత కార్యములను అనుభూతి చెందాలని నేను మిమ్ములను దీవిస్తున్నాను.

సర్వశక్తిమంతుడైన దేవుని కార్యములో మనం నిమగ్నమై యున్నాము. యేసే క్రీస్తు. మనం వారి సేవకులము. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.