సర్వసభ్య సమావేశము
మన దుఃఖము సంతోషమగును
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


8:51

మన దుఃఖము సంతోషమగును

దుఃఖాన్ని అనుభవించే వారందరినీ, సందేహంతో పెనుగులాడే వారందరినీ, మనం చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్న వారందరినీ, క్రీస్తుపై మీ విశ్వాసాన్ని ఉంచమని నేను ఆహ్వానిస్తున్నాను.

కొన్ని సంవత్సరాల క్రితం, సాల్ట్‌లేక్ సిటీలో సమవేశాలకు హాజరవుతుండగా, నేను మన ప్రియమైన ప్రవక్త, రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత పలకరించబడ్డాను. తన సాధారణమైన, వ్యక్తిగత విధానములో, “మార్క్, మీ అమ్మ ఎలా ఉన్నారు?” అని అడిగారు.

నేను ఆ వారం ప్రారంభంలో న్యూజిలాండ్‌లోని ఆమె ఇంటి వద్ద ఉన్నానని, ఆమె వృద్ధురాలు అవుతోందని, కానీ విశ్వాసముతో నిండియుండి, ఆమెకు తెలిసిన వారందరికీ ఒక ప్రేరణ అని నేను ఆయనతో చెప్పాను.

అప్పుడు ఆయన, “దయచేసి ఆమెకు నా ప్రేమను తెలియజేయి … మరియు ఆమెను మరలా చూడాలని నేను ఎదురుచూస్తాను.”

నేను ఆశ్చర్యపోయాను మరియు ఇలా అడిగాను, “న్యూజిలాండ్‌కు త్వరలో రావడానికి మీరు ప్రణాళిక చేస్తున్నారా?”

ఆలోచనాత్మక చిత్తశుద్ధితో ఆయన జవాబిచ్చారు, “ఓహ్, లేదు, నేను తరువాత జీవితంలో ఆమెను చూస్తాను.”

ఆయన జవాబు నిష్ప్రయోజనమైనది కాదు. ఇది వాస్తవానికి పరిపూర్ణంగా సహజమైన వ్యక్తీకరణ. ఆ వ్యక్తిగతమైన అనాలోచితమైన క్షణంలో, మరణం తరువాత జీవితం కొనసాగుతుందని ఒక జీవిస్తున్న ప్రవక్త నుండి స్వచ్ఛమైన సాక్ష్యమును నేను విన్నాను మరియు అనుభవించాను.

ఈ సమావేశము వారాంతము, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము గూర్చి సాక్ష్యమిస్తున్న జీవిస్తున్న అపొస్తలులు, ప్రవక్తలను మీరు వింటారు. “ఆయన చనిపోయాడని, సమాధి చేయబడి, మూడవ రోజు మరలా తిరిగి లేచాడని యేసు క్రీస్తు గురించి, అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క సాక్ష్యము మన మతము యొక్క ప్రధాన సూత్రములు, … మన మతమునకు సంబంధించిన మిగిలిన విషయాలన్నీ [ఈ సత్యముకు] అనుబంధములు మాత్రమే.”1 నిజమైన ఉద్దేశముతో మీరు వినినప్పుడు, ఆత్మ ఈ సాక్ష్యముల యొక్క సత్యమును మీ మనస్సు మరియు మీ హృదయములో నిర్ధారిస్తుందని నేను వాగ్దానము చేస్తున్నాను.2

ఆయన మరణము తరువాత వారికి ఆయన ప్రత్యక్షమైన తరువాత యేసు యొక్క ప్రాచీన అపొస్తలులు శాశ్వతంగా మార్చబడ్డారు. ఆయన పునరుత్థానము చెందాడని వారిలో పదిమంది వారికై వారు చూసారు. మొదట లేకపోవడం వలన, తోమా ఇలా ప్రకటించాడు, “నేను చూస్తే తప్ప … నేను నమ్మనే నమ్మను.”3 తరువాత ప్రభువు తోమాకు ఉద్భోదించాడు, “అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.”4 తరువాత విశ్వాసము యొక్క ముఖ్యమైన పాత్రను ప్రభువు బోధించాడు: “చూడక నమ్మిన వారు ధన్యులు”5

పునరుత్థానము చెందిన ప్రభువు తనను గూర్చి సాక్ష్యమివ్వమని తన అపొస్తలులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈరోజు మన జీవిస్తున్న అపొస్తలుల వలె, వారు లోక సంబంధమైన వృత్తులను వదిలి వేసారు మరియు వారి జీవితాలలో మిగిలిన సమయాన్ని దేవుడు ఈ యేసును పైకి లేపాడని ధైర్యంగా ప్రకటిస్తూ మిగిలిన వారి జీవితాలను గడిపారు. వారి శక్తివంతమైన సాక్ష్యములు వేలమంది బాప్తీస్మము తీసుకోమనే ఆహ్వానాన్ని అంగీకరించడానికి నడిపించాయి.6

ఈస్టరు ఉదయము యొక్క మహిమకరమైన సందేశము సమస్త క్రైస్తవత్వమునకు ప్రధానమైనది. యేసు క్రీస్తు మృతులలో నుండి పైకిలేచెను, దీనివలన, మనము కూడా చనిపోయిన తరువాత మరలా జీవిస్తాము. ఈ జ్ఞానము మన జీవితాలకు అర్థమును మరియు ఉద్దేశమును ఇస్తుంది. విశ్వాసముతో మనము ముందుకు సాగిన యెడల, పాత అపొస్తలుల వలె మనము శాశ్వతంగా మారతాము. వారి వలే మనము, యేసు క్రీస్తునందు విశ్వాసముతో ఏ కష్టమునైనా సహించగలుగుతాము. “మన దుఃఖము సంతోషమగునప్పుడు” 7 ఒక సమయము కొరకు ఈ విశ్వాసము కూడా మనకు నిరీక్షణను ఇస్తుంది.

ఒక విచార కాలము తరువాత నా స్వంత విశ్వాసము దాని ప్రారంభములను కలిగియున్నది.

మా అమ్మ, నాన్న, న్యూజిలాండ్‌లో గొఱ్ఱెల వ్యవసాయదారులు.8 వారు తమ జీవితాన్ని ఆనందించారు. వివాహమాడిన దంపతులుగా వారు, ముగ్గురు బాలికలతో దీవించబడ్డారు. వారిలో చిన్నది యాన్. ఒకరోజు వారు సెలవు దినమున ఒక సరస్సు వద్ద ఉన్నారు, 17 నెలల, యాన్ తప్పటడుగులు వేస్తూ పడిపోయింది. అనేక నిమిషాలపాటు చాలా వెదికిన తరువాత, ఆమె శరీరము ప్రాణము లేకుండా కనుగొనబడింది.

ఈ దుఃఖకరమైన సంఘటన చెప్పలేని విచారాన్ని కలిగించింది. కొంత నవ్వు వారి జీవితాల నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిందని, సంవత్సరాల తరువాత నాన్న వ్రాసారు. అది జీవితములో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబుల కొరకు ఆపేక్షించినట్లు కూడా చేసింది: “మా ప్రశస్తమైన యాన్‌కు ఏమి జరుగుతుంది? మనము మరలా ఎప్పటికైన ఆమెను చూస్తామా? మా కుటుంబము ఎప్పటికైనా మరలా సంతోషంగా ఎలా ఉండగలదు?”

ఈ విషాదము జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమునుండి ఇద్దరు యువ సువార్తికులు మా పొలము వద్దకు వచ్చారు. వారు మోర్మన్ గ్రంథము మరియు బైబిలులో కనుగొనబడిన సత్యమును బోధించడం ప్రారంభించారు. ఈ సత్యములు ఇప్పుడు యాన్ ఆత్మ లోకములో జీవిస్తున్నదనే అభయాన్ని కలిపియున్నది. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము వలన, ఆమె కూడా పునరుత్థానము చెందుతుంది. యేసు క్రీస్తు యొక్క సంఘము జీవిస్తున్న ప్రవక్త మరియు పన్నెండు మంది అపొస్తలులతో భూమి మీద మరొకసారి పునఃస్థాపించబడిందని వారు బోధించారు. యేసు క్రీస్తు తన ప్రధాన అపొస్తలునికి ఇచ్చిన అదే యాజకత్వ అధికారము ద్వారా కుటుంబాలు శాశ్వతంగా ముద్రవేయబడతాయనే ప్రత్యేకమైన, అసాధారణమైన సత్యమును వారు బోధించారు.9

అమ్మ వెంటనే సత్యమును గుర్తించింది మరియు ఆత్మ యొక్క సాక్ష్యమును పొందింది. అయినప్పటికీ, మరుసటి సంవత్సరము నాన్న సందేహాలు మరియు ఆత్మీయ ప్రేరేపణల మధ్య ప్రయాసపడ్డాడు. మరియు, అతడు తన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి అయిష్టంగా ఉన్నాడు. ఒక నిద్రలేని రాత్రి తరువాత ఉదయమున, అటు ఇటు తిరుగుతూ, అతడు అమ్మ వెపు తిరిగి ఇలా అన్నాడు, “నేను ఈ రోజు బాప్తీస్మము పొందుతాను లేదా ఎప్పటికీ పొందను.”

అమ్మ జరిగిన దానిని ఆ సువార్తికులతో చెప్పింది, మరియు వెంటనే వారు మా నాన్నలోని మిణుకుమంటున్న విశ్వాసము ఇప్పుడు వెలిగించబడుతుంది లేక ఆరిపోతుందని గుర్తించారు.

ఆ ఉదయమే మా కుటుంబము దగ్గరలోని సముద్ర తీరానికి ప్రయాణించింది. ఎల్డర్లు బాయిడ్ గ్రీన్ మరియు గారీ షఫీల్డ్ నా తల్లిదండ్రులను సముద్రములోనికి నడిపించి, వారికి బాప్తీస్మమిచ్చినప్పుడు, జరిగిన దానిని గ్రహించలేని పిల్లలమైన మాకు ఇసుక తిన్నెలపై విహారయాత్ర జరిగింది. మరింత విశ్వాసము గల చర్యలో, ఏది జరిగినప్పటికీ లక్ష్యపెట్టకుండా, తాను చేస్తున్న వాగ్దానములకు తన జీవితకాలమంతా యదార్ధంగా ఉంటానని నాన్న వ్యక్తిగతంగా ప్రభువుకు ఒడంబడిక చేసుకున్నాడు.

ఒక సంవత్సరము తరువాత న్యూజిలాండ్, హమిల్టన్‌లో ఒక దేవాలయము ప్రతిష్ఠించబడింది. కొంతకాలం తరువాత మా కుటుంబము, యాన్‌ను ప్రతినిధిగా ఉన్న ఒకరితో, ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరములో బలిపీఠము చుట్టూ మోకరించాము. అక్కడ, పరిశుద్ధ యాజకత్వము ద్వారా సాధారణమైన, అందమైన విధియందు ఒక నిత్య కుటుంబముగా మేము ఏకము చేయబడ్డాము. ఇది గొప్ప శాంతిని, ఆనందమును తెచ్చింది.

యాన్ యొక్క దురదృష్టకరమైన మరణము లేకపోతే, తాను పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించడానికి తగినంత వినయంగా ఎప్పటికీ ఉండనని అనేక సంవత్సరాల తరువాత నాన్న చెప్పారు. అయినప్పటికీ, సువార్తికులు బోధిస్తున్నది యదార్థమనే నిరీక్షణను క్రమంగా ప్రభువు యొక్క ఆత్మ మాకిచ్చింది. జీవితంలో వారి ప్రతీ నిర్ణయాన్ని మౌనంగా, వినయంగా నడిపించునట్లు, వెలుగునిచ్చి మరియు దారిని చూపించినంత వరకు నా తల్లితండ్రుల విశ్వాసము ఎదగటం కొనసాగింది.

భవిష్యత్తు తరములకు నా తల్లిదండ్రుల యొక్క మాదిరి కొరకు నేను ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగియున్నాను. లోతైన విచారముకు స్పందనగా వారి విశ్వాసపు క్రియ వలన శాశ్వతంగా మారిన జీవితాల సంఖ్యను లెక్కించుట అసాధ్యమైనది.

దుఃఖాన్ని అనుభవించే వారందరినీ, సందేహంతో పెనుగులాడే వారందరినీ, మనం చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్న వారందరినీ, క్రీస్తుపై మీ విశ్వాసాన్ని ఉంచమని నేను ఆహ్వానిస్తున్నాను. అప్పుడు నమ్మటానికి మీరు కోరి, తరువాత విశ్వాసమందు అమలు చేసి ఆత్మ యొక్క గుస గుసలను అనుసరించని యెడల ఈ జీవితంలో మరియ రాబోయే జీవితంలో సంతోషాన్ని మీరు కనుగొంటారు.

నా సహోదరి యాన్‌ను నేను కలుసుకొనే రోజు కొరకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. 30 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్నతో సంతోషకరమైన కలయకకు నేను ఎదురుచూస్తున్నాను. యేసు క్రీస్తు జీవిస్తున్నాడని పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, చూడకుండా నమ్ముట, విశ్వాసముతో జీవించడంలో కనుగొనబడిన సంతోషమును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. నా పూర్ణ హృదయము మరియు ఆత్మతో, నేను యేసు క్రీస్తును మరియు ఆయన పునఃస్థాపించబడిన సువార్తను అనుసరించడానికి నేను ఎన్నుకున్నాను. ఇది నా జీవితంలో ప్రతీ అంశమును దీవిస్తుంది. యేసే క్రీస్తని, దేవుని యొక్క కుమారుడని, మన రక్షకుడని మరియు మన విమోచకుడని నేను ఎరుగుదును. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.