సర్వసభ్య సమావేశము
పరలోక తండ్రి వద్దకు వెళ్ళడానికి మీరు చేయవలసిన విషయాలను జ్ఞాపకముంచుకొనండి
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


8:26

పరలోక తండ్రి వద్దకు వెళ్ళడానికి మీరు చేయవలసిన విషయాలను జ్ఞాపకముంచుకొనండి

మనము అనుసరించడానికి యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన మాదిరిని కలిగియున్నాము మరియు మన నిత్య గృహమువైపు ప్రయాణము ఆయన బోధనలు, ఆయన జీవితము, మరియు ఆయన మరణము, ఆయన పునరుత్థానము కలిపి—ఆయన ప్రాయశ్చిత్త త్యాగము వలన మాత్రమే సాధ్యము.

1946 లో, యువ పరిశోధకుడు ఆర్ధర్ హస్లెర్ తన చిన్ననాటి ఇంటికి దగ్గరలో పర్వత ప్రవాహము వెంబడి ఎక్కుచుండగా, అతడికి ఒక అనుభవము కలిగింది, అది చేపలు అవి పుట్టిన ప్రవాహానికి తిరిగి వెళ్ళడానికి వాటి మార్గాన్ని ఎలా కనుగొంటాయనే ముఖ్యమైన ఆవిష్కరణకు నడిపించింది.

పర్వతము పైకి ఎక్కుతూ, బాల్యములో అతడికి ప్రియమైన జలపాతము కనబడనప్పటికీ హస్లెర్ చాలాకాలంగా మరచిపోయినది జ్ఞాపకానికి తీసుకొనిరాబడ్డాడు. “నాచు, కొలంబైన్ మొక్కల సువాసనను కలిగి ఉన్న ఒక చల్లని గాలి, రెండు ప్రాంతాల సరిహద్దు వద్ద రాతి వాలును కొట్టినప్పుడు, జలపాతం యొక్క వివరాలు మరియు పర్వత ముఖముపై దాని అమరిక ఆకస్మాత్తుగా నా మన్సులోనికి దూసుకెళ్ళాయి”1 అని అతడు చెప్పాడు.

ఈ వాసనలు అతడి బాల్యములో జరిగిన జ్ఞాపకాలను ప్రేరేపించి, అతడికి ఇంటిని జ్ఞాపకం చేసాయి.

వాసనలు అతడికి అటువంటి జ్ఞాపకాలను ప్రేరేపించిన యెడల, బహుశా వాసనలు సాల్మన్ చేప, సంవత్సరాలు సముద్రములో ఉన్న తరువాత కూడా, వాటికి పుట్టిన స్వంత పిల్లలున్న ఖచ్చితమైన ప్రవాహానికి తిరిగి రావడానికి జ్ఞాపకాన్ని తేవచ్చని అతడు వాదించాడు.

ఈ అనుభవముపై ఆధారపడి, హస్లెర్ ఇతర పరిశోధకులతో కలిసి సాల్మన్ చేప సముద్రము నుండి ఇంటికి తిరిగి వెళ్ళడానికి వాటి దారిని కనుగొనడానికి వేలాది మైళ్ళు సముద్రయానము చేయడానికి సహాయపడే చాలా సువాసనలను గుర్తుంచుకుంటాయని నిరూపించాడు.

ఈ వృత్తాంతము మనము ఈ జీవితంలో చేయగల అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి, మన పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడానికి మార్గమును గుర్తించి, జ్ఞాపకముంచుకొని, మరియు ప్రయాణమంతా విశ్వాసంగా, సంతోషంగా పట్టుదలతో వెళతామని నేను ఆలోచించునట్లు చేసింది.

మన జీవితాలలో ఏకరీతిగా ఉపయోగించబడి, అన్వయించబడినప్పుడు, మన పరలోక గృహము యొక్క భావాలను తిరిగి తేగల నాలుగు జ్ఞాపకాలను గూర్చి నేను ఆలోచించాను.

మొదటిది, మనము దేవుని యొక్క పిల్లలమని మనము జ్ఞాపకముంచుకొనగలము.

మనము దైవిక వారసత్వమును కలిగియున్నాము. మనము దేవుని యొక్క పిల్లలమని తెలుసుకొనుట, మనము ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళాలని ఆయన మనల్ని కోరుతున్నారని తెలుసుకొనుట మన పరలోక తండ్రి గృహానికి తిరిగి వెళ్ళే ప్రయాణములో మొదటి మెట్లలో ఒకటి.

ఈ వారసత్వమును గూర్చి మీకై మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రభువు నుండి పొందిన దీవెనలను జ్ఞాపకముంచుకొనుట ద్వారా, మీ ఆత్మీయ రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి క్రమంగా సమయాన్ని తీసుకోండి. మీ వ్యక్తిగత విలువను కొలవడానికి మరియు మీ మార్గాన్ని కనుగొనటానికి కేవలము ప్రపంచము వైపు తిరగడం కంటే మేలుగా ఆయన నుండి ఇవ్వబడిన మార్గసూచికలను నమ్మండి.

ఇటీవల నేను ఒక ప్రియమైన వ్యక్తిని ఒక హాస్పిటల్‌లో చేరిన తరువాత ఆమెను సందర్శించాను. ఆమె హాస్పిటల్ మంచంపై పడుకొనియుండగా, ఎవరైనా “I Am a Child of God,” పాట పాడాలని మాత్రమే తాను కోరుకున్నదని ఆమె కన్నీళ్ళతో నాతో చెప్పింది. ఆ ఒక్క ఆలోచనే ఆ శ్రమ గడియలో తనకు కావాల్సిన శాంతిని ఇచ్చిందని ఆమె అన్నది.

మీరెవరో అని తెలుసుకొనుట మీరు భావించే దానిని మరియు మీరు చేసే దానిని మారుస్తుంది.

మీరు నిజంగా ఎవరో గ్రహించుట మీ పరలోక తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళే మార్గమును గుర్తించి, జ్ఞాపకముంచుకోవడానికి మరియు అక్కడ ఉండటానికి ఆపేక్షించడానికి మిమ్మల్ని బాగా సిద్ధపరుస్తుంది.

రెండవది, మనల్ని కాపాడే పునాదిని జ్ఞాపకముంచుకొనగలము

ఇతరులు రక్షణ సూత్రములను మరియు ఆజ్ఞలను అధికంగా విస్మరించినప్పుడు కూడా, మనము నీతిమంతులుగా, యదార్ధముగా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు విశ్వసనీయంగా నిలిచియున్నప్పుడు, మనకు బలము వస్తుంది.2

మోర్మన్ గ్రంథములో, అపవాది యొక్క శోధనలను జయించడానికి బలము కలిగియుండటానికి బదులుగా వారు యేసు క్రీస్తు పై వారి పునాదులు నిర్మించునట్లు జ్ఞాపకముంచుకోమని హీలమన్ తన కుమారులకు బోధించాడు. సాతాను యొక్క బలమైన గాలులు మరియు తుఫానులు మనపై కొట్టుచున్నవి, కానీ మన భద్రతగల స్థలమైన—విమోచకునియందు నమ్మకముంచిన యెడల మనల్ని క్రిందకు లాగివేసే శక్తిని అవి కలిగియుండవు.3

ఆయన స్వరమును విని, ఆయనను అనుసరించుటకు మనము ఎంపిక చేసినప్పుడు, మనము ఆయన సహాయాన్ని పొందుతామని వ్యక్తిగత అనుభవము నుండి నేను తెలుసుకున్నాను. మన పరిస్థితుల యొక్క విశాలమైన దృష్టికోణమును మరియు జీవితపు ఉద్దేశమును గూర్చి లోతైన అవగాహనను మనము పొందుతాము. మన పరలోక గృహానికి నడిపించే ఆత్మీయమైన ప్రేరేపణలను మనము భావిస్తాము.

మూడవది, ప్రార్థనాపూర్వకంగా ఉండటానికి మనము జ్ఞాపకముంచుకోగలము

ఒక్క తాకిడితో లేదా స్వర ఆజ్ఞతో, విస్తారమైన మరియు సంక్లిష్టమైన కంప్యూటర్ల నెట్‌వర్క్‌లో నిల్వ చేయబడిన మరియు దాచబడి, నిర్వహించబడే అపారమైన సమాచారములో మనము ఏ అంశంపైన అయినా సమాధానాల కోసం శోధించడం ప్రారంభించవచ్చు.

మరొకవిధంగా, పరలోకము నుండి జవాబులను వెదకడం ప్రారంభించాలనే ఆహ్వానం యొక్క సరళతను మనము కలిగియున్నాము. “ఎల్లప్పుడూ ప్రార్థించుము, నేను నా ఆత్మను నీపై క్రుమ్మరించెదను.” నీ దీవెన గొప్పదగును—భూలోక నిధుల కంటె నీ దీవెన అధికముగానుండును.”4

దేవుడు మనలో ప్రతీఒక్కరిని పూర్తిగా ఎరిగియున్నాడు మరియు మన ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రార్థన చేయడం జ్ఞాపకముంచుకున్నప్పుడు, ఆయన ఆమోదించే ప్రేమను మనము కనుగొంటాము, మరియు క్రీస్తు నామములో పరలోకమందున్న తండ్రికి మనము ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత ఎక్కువగా రక్షకుని మన జీవితంలోనికి మనము తెస్తాము మరియు మన పరలోక తండ్రి ఇంటికి వెళ్ళే మార్గములో ఉంచబడిన సూచనలు మరియు గురుతులను గుర్తిస్తాము.

నాలగవది, ఇతరులకు సేవ చేయడానికి మనము జ్ఞాపకముంచుకోగలము.

ఇతరులకు సేవ చేయుట మరియు దయ చూపుట ద్వారా యేసు క్రీస్తును అనుసరించడానికి మనము ప్రయాసపడినప్పుడు, మనము లోకమును ఉత్తమమైన స్థలముగా చేస్తాము.

మన క్రియలు మన చుట్టూ ఉన్నవారిని, అదేవిధంగా మన స్వంత జీవితాలను గణనీయంగా దీవించగలవు. ప్రేమగల సేవ ఇచ్చు వారిని మరియు పుచ్చుకొనే వారిని ఇరువురి జీవితాలకు అర్థమును చేరుస్తాయి.

మీ సేవా క్రియల ద్వారా మరియు మీ సేవ యొక్క మాదిరి ద్వారా రెండు విధాలా, మేలు కొరకు ఇతరులను ప్రభావితం చేయడానికి మీకుగల సాధ్యతను తక్కువగా అంచనా వేయవద్దు.

ఇతరులకు ప్రేమగల సేవ మన పరలోక గృహము వెంబడి బాటలో మనల్ని నడిపించును—అది మనల్ని రక్షకుని వలె ఎక్కువగా మారటానికి నడిపించును.

1975లో అంతర్యుద్ధం ఫలితంగా ఆర్నాల్డో, యుజెనియా టెలిస్ గ్రిలో మరియు వారి పిల్లలు తమ ఇంటిని, దశాబ్దాల కృషి ద్వారా వారు నిర్మించినవన్నీ విడిచిపెట్టవలసి వచ్చింది. వారి స్వదేశమైన పోర్చుగల్‌లో, సహోదర, సహోదరి టెలిస్ గ్రిలో అంతా క్రొత్తగా ప్రారంభించాల్సిన కష్టమైన సవాలును ఆ సమయంలో ఎదుర్కొన్నారు. కానీ సంవత్సరాల తరువాత, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో చేరిన తరువాత, “మాకు కలిగిన సమస్తాన్ని కోల్పోయాము, కానీ అది మంచి విషయము ఎందుకనగా అది నిత్య దీవెనలను పరిగణించడానికి మమ్మల్ని ఒత్తిడి చేసింది,”5 అని వారు అన్నారు.

వారు తమ భూలోక గృహాన్ని కోల్పోయారు, కానీ వారు తమ పరలోకపు గృహానికి తిరిగి వెళ్ళే దారిని కనుగొన్నారు.

గృహానికి వెళ్ళే దారిని అనుసరించడానికి మీరు వదలివేయ వలసినది ఏదైనను, ఒకరోజు ఏమాత్రము త్యాగము చేసినట్లు కనబడదు.

మనము అనుసరించడానికి యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన మాదిరిని కలిగియున్నాము, మరియు మన నిత్య గృహమువైపు ప్రయాణము ఆయన బోధనలు, ఆయన జీవితము, మరియు ఆయన మరణము, ఆయన పునరుత్థానము కలిపి—ఆయన ప్రాయశ్చిత్త త్యాగము వలన మాత్రమే సాధ్యము.

మనము దేవుని యొక్క పిల్లలమని మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, మనకు దారి చూపడానికి ఆయన కుమారుని పంపాడని6 జ్ఞాపకముంచుకొనడంలో ఆనందమును అనుభవించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసముగా ఉండి, మీ జీవితాన్ని రక్షకుని వైపు త్రిప్పమని మరియు ఆయనపై మీ పునాదిని నిర్మించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ ప్రయాణములో ప్రార్థనాపూర్వకంగా ఉండి, మార్గము వెంబడి ఇతరులకు సేవ చేయుటకు జ్ఞాపకముంచుకొనండి.

ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఈస్టరు ఆదివారమున యేసు క్రీస్తు విమోచకుడు మరియు లోక రక్షకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. సంతోషమైన జీవితపు బల్ల వద్దకు మరియు మన ప్రయాణములో మనల్ని నడిపించి దారిచూపగలవాడు ఆయనే. మనము జ్ఞాపకముంచుకొని ఇంటికి ఆయనను అనుసరించెదము గాక. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.