మీరు ఇశ్రాయేలును సమకూర్చగలరు!
మీ గుర్తింపును బట్టి మీలోని అపారమైన శక్తి వలన యువతైన మీరు దీనిని చేయగలరని నేను నిశ్చయముగా చెప్పగలను.
దాదాపు మూడు సంవత్సరాల క్రితం, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ తెరకు రెండు వైపుల “ఇశ్రాయేలును సమకూర్చుటకు ప్రభువు యొక్క యువ సైన్యములో” చేరమని యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ యువత అందరిని ఆహ్వానించారు. “నేడు భూమి మీద జరుగుచున్న అత్యంత ముఖ్యమైన విషయము ఆ సమకూర్చుట” అని ఆయన అన్నారు.1 (1) మీ గుర్తింపును బట్టి(2) మీలోని అపారమైన శక్తి వలన—యువతైన మీరు దీనిని చేయగలరని—దానిని చాలా బాగా చేయగలరని నేను నిశ్చయముగా చెప్పగలను.
నలభై-ఒక సంవత్సరాల క్రితం, మన సంఘము నుండి ఇద్దరు సువార్తికులు న్యూ జెర్సీలో (అమెరికా) ఒక గృహానికి నడిపించబడినట్లు భావించారు. సకాలంలో, అద్భుతరీతిలో ఇరువురు తల్లిదండ్రులు మరియు 10 మంది పిల్లలందరూ బాప్తీస్మము పొందారు. ప్రవక్త మాటలలో వారు తమ జీవితాలలో “దేవునికి ఎక్కువ ప్రాధాన్యతన ఇచ్చారు.”2 “మా జీవితాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు” అని నేను చెప్పగలను. నేను వారి మూడవ బిడ్డను. యేసు క్రీస్తును అనుసరించడానికి ఒక శాశ్వతమైన నిబంధనను చేయడానికి నిర్ణయించినప్పుడు నేను 17 సంవత్సరాల వాడిని. కానీ నేను ఇంకా ఏమి చేయడానికి నిర్ణయించానో ఊహించండి? నేను పూర్తి-కాల సువార్త పరిచర్య చేయను. అది చాలా ఎక్కువ. అది నా నుండి ఇది ఆశించబడరాదు, అవునా? నేను క్రొత్తగా చేరిన సంఘ సభ్యుడను. నా వద్ద డబ్బు లేదు. ఇది కాకుండా, పశ్చిమ ఫిలడెల్ఫియా దగ్గరలో నేర్చుకోవడానికి కష్టమైన వాతావరణంగల పాఠశాల నుండి నేను అప్పుడే పట్టభద్రత పొంది, కొన్ని భయంకరమైన సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, రెండు సంవత్సరాలు ఇంటిని విడిచి వెళ్ళడానికి నేను రహస్యంగా భయపడ్డాను.
మీ నిజమైన గుర్తింపు
కానీ మనము పుట్టకముందు నేను మరియు సమస్త మానవాళి పరలోక తండ్రి ఆత్మ కుమారులు, కుమార్తెలుగా ఆయనతో జీవించామని అప్పుడే నేర్చుకున్నాను. ఆయన తన పిల్లలందరు ఆయనతో నిత్యజీవమును ఆనందించాలని ఆపేక్షిస్తున్నారని నాకు తెలిసినట్లుగా, ఇతరులు కూడా తెలుసుకోవాల్సిన అవసరమున్నది. అందువలన, భూమి మీదకు ఎవరూ రాకముందు, ఆయన మన రక్షకునిగా యేసు క్రీస్తుతో తన పరిపూర్ణమైన రక్షణ మరియు సంతోషము యొక్క ప్రణాళికను అందరి ముందు ప్రవేశపెట్టెను. విచారకరంగా, సాతాను దేవుని ప్రణాళికను వ్యతిరేకించాడు.3 ప్రకటన గ్రంథము ప్రకారము, “పరలోకములో యుద్ధము జరిగెను”!4 సాతాను దేవునికి బదులుగా అతడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చునట్లు చేస్తూ చాకచక్యంగా పరలోక తండ్రి యొక్క ఆత్మ బిడ్డలలో మూడవ భాగాన్ని మోసగించాడు.5 కాని మిమ్మల్ని కాదు! “[మీరు ఇచ్చిన] సాక్ష్యము ద్వారా”6 మీరు సాతానును జయించుట అపొస్తలుడైన యోహాను చూసాడు.
నా గోత్రజనక దీవెన చేత సహాయము చేయబడి, నా నిజమైన గుర్తింపును తెలుసుకొనుట ఇశ్రాయేలును సమకూర్చుటకు అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఆహ్వానమును అంగీకరించడానికి ధైర్యమును మరియు విశ్వాసమును నాకు ఇచ్చింది.7 ప్రియమైన స్నేహితులారా, మీకు అదేవిధంగా ఉన్నది. ముందు మీరిచ్చిన సాక్ష్యము ద్వారా సాతానును జయించారని మీరు తెలుసుకొనుట ఇప్పుడు, ఎల్లప్పుడు మీరు “ప్రేమించి, పంచుకొని, ఆహ్వానించడానికి”8—గొప్ప తీవ్రతతో దేవుని పిల్లల ఆత్మల కొరకు అదే యుద్ధము కొనసాగినప్పుడు, ఇతరులను వచ్చి, చూడమని, సహాయపడమని, వచ్చి చేర్చబడమని ఆహ్వానించడానికి మీకు సహాయపడుతుంది.
మీలో ఉన్న శక్తివంతమైన విశ్వాసము
మీలో ఉన్న విస్తారమైన శక్తి మాటేమిటి? దీనిగురించి ఆలోచించండి: శారీరక, ఆత్మీయ మరణమును అందరూ అనుభవించే చోట పతనమైన లోకమునకు రావడానికి మీరు సంతోషంగా కేకలు వేసారు.9 మన స్వంతంగా మనము ఎన్నడూ జయించలేము. మన స్వంత పాపములే కాదు ఇతర పాపముల వలన కూడా మనము బాధపడతాము. సమస్త జనులు—మర్త్యత్వమునకు ముందు లోకము జ్ఞాపకాన్ని మరచిపోవడంతో మానవాళి వాస్తవంగా ప్రతీ ఊహించదగిన పగిలిన హృదయం మరియు నిరాశను అనుభవించును.10 అందరూ పునరుత్థానము చెంది, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి శుద్ధులుగా తిరిగి వెళ్ళాలనే నిరీక్షణ ఒకరు యేసు క్రీస్తు వాగ్ధానమును పాటిస్తూ ఉండుటపై పూర్తిగా ఆధారపడియున్నది.11
పరలోక తండ్రి ప్రణాళికను అంగీకరించి, భూమి మీదకు రావడానికి చేసిన నిర్ణయానికి మీకు ఏది అధికారమిచ్చింది? అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు, “మర్త్యత్వములో మీరు ఎదుర్కొను సవాళ్ళ గురించి మీకు అతి తక్కువ తెలిసినప్పటికీ, సంతోషకరమైన ప్రణాళికను దానిలో యేసు క్రీస్తు యొక్క స్థానమును బలపరచుటకు మీకు యేసు క్రీస్తునందు విశ్వాసము అవసరమయ్యెను.”12 యేసు క్రీస్తు మర్త్యత్వములోనికి వచ్చి, మనల్ని సమకూర్చి,13 రక్షించడానికి ఆయన తన జీవితాన్ని ఇచ్చినప్పుడు మీరు ఆయనను మాత్రమే నమ్మలేదు. మీరు “ఘనమైన ఆత్మలు”14 ఆయన వాగ్దానము నిశ్చయంగా నెరవేర్చబడుతుందని “అధికముగా గొప్ప విశ్వాసమును”15 కలిగియున్నారు. ఆయన అబద్ధమాడడు గనుక ఆయన పుట్టకముందే, మీ కొరకు ఇదివరకే ఆయన రక్తము చిందించినట్లుగా మీరు ఆయనను చూసారు.16
యోహాను యొక్క చిహ్నపూర్వకమైన మాటలలో, మీరు “గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టి [సాతానును] జయించియున్నారు.”17 మర్త్యత్వమునకు ముందు లోకములో “[మీరు] ఆరంభము నుండి అంతమును చూసారు”18 అని అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధిస్తున్నారు.
ఒక రోజు మీరు పాఠశాలకు వెళ్శకముందు, మీరు తిరిగి వచ్చినప్పుడు మీకిష్టమైన ఆహారాన్ని తినవచ్చని మీ తల్లిదండ్రులు మీకు నిజమైన వాగ్దానము చేసారని అనుకోండి. మీరు ఉద్వేగం చెందారు! మీరు పాఠశాలలో ఉన్నప్పుడే ఆ ఆహారాన్ని తింటున్నట్లు, మీరు ఇదివరకే దానిని రుచి చూసినట్లు ఊహిస్తారు. సహజంగా, మీరు మీ శుభవార్తలు ఇతరులతో కూడా పంచుకుంటారు. ఇంటికి వెళ్ళడానికి ఎదురుచూడటం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఆవిధంగా పాఠశాల యొక్క పరీక్షలు, సవాళ్ళు తేలికగా అనిపిస్తాయి. ఆ వాగ్దానము చాలా నిశ్చయమైనది గనుక ఏదీ మీ సంతోషాన్ని తీసివేయలేదు లేక మీరు అనుమానించేలా చేయదు! అదేవిధంగా, “ఘనమైన ఆత్మలైన” మీరు పుట్టకముందు, ఈ నిశ్చయమైన విధానములో క్రీస్తు యొక్క వాగ్దానములను పరిగణించుటను మీరు నేర్చుకున్నారు మరియు ఆయన రక్షణను మీరు రుచి చూసారు.19 మీ గొప్ప విశ్వాసము కండరముల వంటిది, మీరు వాటిని ఎంత వ్యాయమం చేస్తే అంత బలమైనవిగా, పెద్దవిగా అవుతాయి, కానీ ఇదివరకే అవి మీలో ఉన్నాయి.
క్రీస్తునందు మీ గొప్ప విశ్వాసమును మేల్కొలిపి, ఇప్పుడు ఇశ్రాయేలును సమకూర్చి, మరలా తిరిగి సాతానును జయించడానికి మీరు ఏవిధంగా దానిని ఉపయోగించగలరు? ఎదురుచూచుట, నేడు సమకూర్చి, రక్షించాలనే ప్రభువు యొక్క వాగ్దానమును అదే నిశ్చయతతో చూచుట తిరిగి నేర్చుకొనుట ద్వారా మీరు దానిని ఉపయోగించగలరు. అది ఎలాగో మనకు బోధించడానికి ఆయన మోర్మన్ గ్రంథమును మరియు తన ప్రవక్తలను ప్రధానంగా ఉపయోగిస్తారు. క్రీస్తుకు చాలా ముందుగా, నీఫైయుల “ప్రవక్తలు, … యాజకులు, మరియు … ఉపదేశకులు … మెస్సీయ వైపు ఎదురుచూచుటకు, రాబోవు ఆయన వచ్చియున్నట్లుగా విశ్వసించుటకు వారిని ఒప్పించుచు శ్రద్ధగా కృషి చేసిరి.”20 ప్రవక్త అబినడై ఇలా బోధించాడు, “మరియు ఇప్పుడు రాబోవు క్రియలను గూర్చి అవి ఇదివరకే వచ్చియున్నట్లు మాట్లాడిన క్రీస్తు లోకములోనికి వచ్చియుండని యెడల అసలు విమోచన ఉండదు.”21 ఆల్మా వలే అబినడై “విశ్వాసము యొక్క కంటితో ఎదురుచూసాడు”22 మరియు దేవుని యొక్క రక్షణ వాగ్దానము ఇదివరకే నెరవేర్చబడుట చూసాడు. మీరు చేసినట్లుగా, క్రీస్తు జన్మించకముందు, వారు “ గొఱ్ఱెపిల్ల రక్తము మరియు… వారు ఇచ్చిన సాక్ష్యము ద్వారా [సాతానును] జయించారు. ప్రభువు వారికి ఇశ్రాయేలును ఆహ్వానించి, సమకూర్చే అధికారాన్ని ఇచ్చాడు. విశ్వాసమందు మీరు ఎదురు చూచి, ఇశ్రాయేలును ప్రపంచవ్యాప్తంగా మరియు మీ స్వంత “ప్రభావ పరిధిలో” సమకూర్చి 23—మరియు అందరిని ఆహ్వానించినప్పుడు ఆయన మీకు అదే చేస్తాడు.
వందలమంది సువార్తికులు క్రీస్తునందు మర్త్యత్వముకు ముందు శక్తివంతమైన విశ్వాసముపై కట్టబడి, వారు సంప్రదించిన వారిని మనోనేత్రము ద్వారా చూచి లేక బాప్తీస్మము మరియు దేవాలయ వస్త్రము ధరించి బోధిస్తున్నారు. “Begin with the End in Mind,”24 (అంతమును మనస్సులో ఉంచుకొని ప్రారంభించు) అనే ప్రసంగంలో, అధ్యక్షులు నెల్సన్ దీనిని చేసే వ్యక్తిగత మాదిరిని పంచుకొని, మన సువార్తికులు అదేవిధంగా చేయమని బోధించమని మిషను నాయకులను సూచించారు. పూర్వ మర్త్య లోకములో యేసు క్రీస్తునందు ఈ గొప్ప విశ్వాసమును సాధన చేసారని తెలుసుకొనుట మన ప్రియమైన సువార్తికులు “ఆయనను వినుటకు”25 మరియు ప్రభువు వాగ్దానమిచ్చినట్లుగా ఇశ్రాయేలును సమకూర్చుటకు తమ విస్తారమైన విశ్వాసమును చైతన్యవంతం చేయడానికి వారికి ఎంతగానో సహాయపడింది.
వాస్తవానికి, అబద్ధాలను ఊహించుకోవడం విశ్వాసానికి హాని కలిగిస్తుంది.26 నా స్నేహితులారా, మీరు నిజముగా ఎవరో దానికి విరుద్ధమైన, ప్రత్యేకంగా అశ్లీల చిత్రములను ఉద్దేశ్యపూర్వకంగా ఊహించుకొనుట లేక వీక్షించుట, క్రీస్తునందు మీ విశ్వాసమును బలహీనపరచును మరియు పశ్చాత్తాపపడకపోవడం దానిని నాశనం చేయగలదు. క్రీస్తునందు విశ్వాసమును హెచ్చించడానికి మీ ఊహలను ఉపయోగించండి, దానిని నాశనం చేయడానికి కాదు.
పిల్లలు, యువత కార్యక్రమము
పిల్లలు, యువత కార్యక్రమము యువతైన మీరు మీ గొప్ప విశ్వాసమును చైతన్యవంతము చేయడానికి మీకు సహాయపడే ప్రవచనాత్మక సాధనము. “ఆ కార్యక్రమము ఆత్మీయ, సామాజిక, భౌతిక మరియు మేధా సంబంధమైన నాలుగు ప్రాంతాలలో మన రక్షకుని వలె మీరు ఎక్కువగా మారడానికి సహాయపడటానికి ఉద్దేశించబడింది”27 అని అధ్యక్షులు ఓక్స్ బోధించారు. యువతైన మీరు సువార్తను జీవించుట, ఇతరుల పట్ల శ్రద్ధ తీసుకొనుట, సువార్తను అంగీకరించడానికి అందరినీ ఆహ్వానించడానికి, నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకము చేసి, సరదాగల కార్యక్రమాలను28 ఏర్పాటు చేసి నడిపించినప్పుడు, మర్త్యత్వముకు ముందు లోకములో క్రీస్తునందు మీరు కలిగియున్న గొప్ప విశ్వాసము ఈ జీవితంలో ప్రభువు కార్యమును చేయడానికి మిమ్మల్ని తిరిగి ఉంచి, అధికారమిస్తుంది!
మరియు వ్యక్తిగత లక్ష్యములు, “ప్రత్యేకంగా స్వల్ప-కాల లక్ష్యములు”29 మీ శక్తివంతమైన విశ్వాసమును వెలిగించడానికి మీకు సహాయపడతాయి. ఒక మంచి లక్ష్యమును ఏర్పరచి, మీ పరలోక తండ్రి మీరు లేక మరొకరు కావాలని కోరిన దానిని చూచినప్పుడు మీరు ముందు చేసినట్లుగా మీరు ఎదురుచూస్తారు.30 అప్పుడు మీరు దానిని సాధించడానికి ప్రణాళిక మరియు కృషి చేయండి. “ప్రణాళిక చేయుట, లక్ష్యములను ఏర్పరుచుట … మరియు విశ్వాసము యొక్క కంటితో — అందరిని [ఆహ్వానించుట] యొక్క ప్రాముఖ్యతను ఎన్నడూ తక్కువగా అంచనా వేయకండి,”31 అని ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ బోధించారు.
ఎంపిక మీదే! “[ఎంపిక ] చేసే శక్తి వారిలో ఉన్నది,”32 అని ప్రభువు మీ గురించి అన్నారు. “మీ విశ్వాసము ఆకస్మాత్తుగా వృద్ధి చెందదు, కానీ ఎంపిక ద్వారా వృద్ధి చెందుతుంది,”33 అని ఎల్డర్ ఎల్. ఆండర్సన్ వివరించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు, “[మీరు] కలిగియున్న నిజాయితీగల ప్రశ్నలు [ఏవైనా]… ఓపిక మరియు విశ్వాసము యొక్క కంటితో పరిష్కరించబడతాయి.”34
(1) మీ నిజమైన గుర్తింపు మరియు (2) మీలోని క్రీస్తునందు మీ విశ్వాసము యొక్క అపారమైన శక్తి “క్రీస్తు నొద్దకు వచ్చుటకు అందరిని ఆహ్వానించి, ఆయన ప్రాయశ్చిత్తము యొక్క దీవెనలు పొందడానికి లోకమును సిద్ధపరచడానికి సహాయపడుటకు” మీకు సాధ్యపరచునని నేను సాక్ష్యమిస్తున్నాను.35 మోర్మన్ గ్రంథము యొక్క నిశ్చయమైన వాగ్దానము యొక్క సంతోషమును మనమందరం పంచుకొనెదము గాక:
“సమస్త హింసను ఎదుర్కొని… ప్రవక్తల మాటలను ఆలకించి… క్రీస్తు కొరకు నిలకడగా ఎదురుచూచు నీతిమంతులు… నశించని వారు.
“కానీ [క్రీస్తు]… వారిని స్వస్థపరచును, మరియు వారు ఆయనతో సమాధానము కలిగియుందురు.”36
యేసు క్రీస్తు నామములో, ఆమేన్.