యేసే జవాబు
సవాళ్ళు ఎంత కష్టమైనవి లేదా కలవరపరిచేవి అయినప్పటికీ, జవాబు సాధారణమైనదని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవచ్చు: అది ఎల్లప్పుడూ యేసే.
సమావేశము యొక్క ఈ సభలో మీతో మాట్లాడడం ఎంతో గౌరవదాయకం. ఈరోజు నేను మిమ్మల్ని స్నేహితులని సంబోధిస్తాను. యోహాను సువార్తలో, రక్షకుడు చెప్పినట్లు మనము చేసినట్లయితే మనము ఆయన స్నేహితులమని ఆయన బోధించాడు.1
ఇది రక్షకునిపట్ల మనకున్న వ్యక్తిగత, సామూహిక ప్రేమ మరియు ఆయనతో మన నిబంధనలు మనల్ని ఒక్కటిగా బంధిస్తాయి. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ బోధించినట్లుగా: “ప్రభువు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, నమ్ముతున్నారో మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. మరియు ఆయన మీమీద ఎంతగా ఆధారపడ్డారో మీకు చెప్పాలని నేను ఇంకా ఎక్కువగా కోరుతున్నాను.”2
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారిచేత ప్రధాన అధికారిగా నేను పిలువబడినప్పుడు, నేను అత్యంత భావోద్వేగాలకు లోనయ్యాను. అది చాలా తీవ్రమైనది. సర్వసభ్య సమావేశం యొక్క శనివారం మధ్యాహ్నకాల సభ కోసం నేను, నా భార్య జూలీ ఆత్రుతగా ఎదురుచూసాము. ఆమోదించబడడం వినయం కలిగించేదిగా ఉంది. నా మొదటి నియామకంలో నేను పడిపోకుండా ఉండేలా నా కూర్చీ వద్దకు వెళ్ళడానికి మెట్లను నేను జాగ్రత్తగా లెక్కపెట్టాను.
ఆ సభ ముగింపులో జరిగిన ఒక విషయం నాపై ప్రగాఢమైన ప్రభావాన్ని కలిగియున్నది. సమూహ సభ్యులు వరుసగా నిలబడి క్రొత్త ప్రధాన అధికారులను ఒక్కొక్కరిని పలకరించారు. ప్రతీఒక్కరు వారి ప్రేమను, సహకారమును పంచుకున్నారు. హృదయపూర్వకంగా అబ్రాజో (ఆలింగనము) చేసుకొని వారిలా అన్నారు, “చింతించకండి—మీరు చెందియున్నారు.”
రక్షకునితో మన అనుబంధములో, ఆయన హృదయాన్ని చూస్తాడు మరియు “పక్షపాతి కాడు.”3 ఆయన తన అపొస్తలులను ఎలా ఎంపిక చేసాడో పరిగణించండి. ఆయన అంతస్థు లేదా ఐశ్వర్యముపట్ల ఆసక్తి చూపలేదు. ఆయనను అనుసరించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు మరియు మనము ఆయనతో ఉన్నామని ఆయన మనకు భరోసా ఇస్తాడని నేను నమ్ముతున్నాను.
ఈ సందేశము ప్రత్యేకంగా సంఘ యువతకు అన్వయిస్తుంది. అధ్యక్షులు నెల్సన్ మీలో చూసిన దానిని నేను మీలో చూస్తున్నాను. ఆయన ఇలా చెప్పారు, “ఈ తరం యువతలో కాదనలేని ప్రత్యేకత ఉన్నది. ఈ సమయమందు భూమి మీదకు మిమ్మల్ని పంపడానికి మీ పరలోక తండ్రి మీపై గొప్ప నమ్మకాన్ని కలిగియుండాలి. మీరు గొప్పతనము కోసం పుట్టారు!”4
యువత నుండి నేను నేర్చుకున్న దాని కొరకు నేను కృతజ్ఞుడిని. నా పిల్లలు నాకు బోధించిన దాని కొరకు, మన సువార్తికులు నాకు బోధించిన దాని కొరకు, మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు నాకు బోధించిన దాని కొరకు నేను కృతజ్ఞుడిని.
కొంతకాలం క్రితం, నేను మా తమ్ముని కొడుకు నాష్‌తో మా పొలములో పని చేస్తున్నాను. అతడికి ఆరు సంవత్సరాలు, అతడు స్వచ్ఛమైన హృదయము గలవాడు. అతడు నా ప్రియమైన నాష్ మరియు ఈరోజు సమావేశంలో మాట్లాడుతున్న నేను, తన ప్రియమైన పెదనాన్నను అని నమ్ముతున్నాను.
మా ప్రాజెక్టు కోసం పరిష్కారము కనుగొనడంలో అతడు నాకు సహాయపడినప్పుడు, “నాష్, ఇది గొప్ప ఆలోచన. నువ్వింత తెలివైనవాడిగా ఎలా అయ్యావు?” అన్నాను నేను. అతడు తన కళ్ళలో ఈ భావనతో నావైపు చూసి, “రాయన్ పెదనాన్న, ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలియకుండా ఎలా ఉంది?” అన్నాడు.
అతడు తన భుజాలు వంచి చిరునవ్వు నవ్వి, నమ్మకంగా “యేసు” అని చెప్పాడు.
ఆ రోజు ఈ సరళమైన, లోతైన బోధనను నాష్ నాకు గుర్తు చేసాడు. అతి సులువైన ప్రశ్నలకు మరియు మిక్కిలి చిక్కైన సమస్యలకు జవాబు ఎల్లప్పుడూ ఒకటే ఉన్నది. యేసు క్రీస్తే జవాబు. ప్రతీ పరిష్కారము ఆయనయందు కనుగొనబడుతుంది.
యోహాను సువార్తలో, రక్షకుడు తన శిష్యులతో వారి కోసం ఒక స్థలము సిద్ధపరిచెదనని చెప్పాడు. తోమా కలవరపడి, రక్షకునితో ఇలా అన్నాడు:
“ప్రభువా యెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియును?
“నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడని యేసు అతడితో చెప్పెను.”5
“ఆయనే మార్గమును, సత్యమును, జీవమును” అని యేసు తన శిష్యులకు బోధించాడు. పరలోక తండ్రి యొద్దకు ఎలా రావాలనే ప్రశ్నకు జవాబు ఆయనే. మన జీవితాలలో ఆయన దైవిక పాత్రను గూర్చి ఒక సాక్ష్యమును పొందడం, యువకునిగా నేను నేర్చుకున్న విషయము.
అర్జెంటీనాలో ఒక సువార్తకునిగా నేను సేవ చూస్తుండగా, అధ్యక్షులు హావర్డ్ డబ్ల్యు. హంటర్ ఒక పని చేయమని మమ్మల్ని ఆహ్వానించారు, అది నా జీవితంపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది . ఆయన ఇలా చెప్పారు, “మనము క్రీస్తును ఎరిగిన దానికంటే బాగా ఆయనను తప్పక మనం తెలుసుకోవాలి; మనం ఆయనను గుర్తుంచుకునే దానికంటే ఎక్కువగా ఆయనను తప్పక గుర్తుంచుకోవాలి; మనం ఆయనకు సేవ చేయడం కంటే ఎక్కువ ధైర్యంగా ఆయనను సేవించాలి.”6
ఆ సమయమందు, ఒక మంచి సువార్తకునిగా ఎలా వుండాలని నేను ఆందోళన చెందాను. దానికి ఇది జవాబు: క్రీస్తును తెలుసుకొనుట, ఆయనను జ్ఞాపకముంచుకొనుట మరియు ఆయనకు సేవ చేయుట. “పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందుట మరియు అంతము వరకు సహించుట”7 ద్వారా మరియు “[ఆయన] యందు, ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను పొందడానికి వారికి సహాయపడుట ద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించడానికి” ఈ ఉద్దేశ్యములో ప్రపంచమంతటా ఉన్న సువార్తికులు ఏకమయ్యారు. సువార్తికులను వినుచున్న మా స్నేహితులకు, క్రీస్తు నొద్దకు రమ్మని నా ఆహ్వానాన్ని చేరుస్తున్నాను. కలిసి మనము క్రీస్తును తెలుసుకొనుటకు, ఆయనను జ్ఞాపకముంచుకొనుటకు మరియు ఆయనకు సేవ చేయుటకు ప్రయాసపడదాం.
సువార్త సేవ చేయడం నా జీవితంలో పరిశుద్ధమైన సమయము. పూర్తి-కాల సువార్తకునిగా ఆయనతో నా చివరి మౌఖిక సంభాషణయందు, ఆయన, ఆయన భార్య వారి సేవాకాలం ముగింపుకు దగ్గరలో ఉన్నప్పుడు, అధ్యక్షుడు బ్లెయిర్ పిన్‌కాక్ మిషను నాయకులలో రాబోయే మార్పు గురించి మాట్లాడారు. మేము ఎంతగానో ప్రేమించిన దానిని విడిచి వెళ్ళడానికి మేమిద్దరం విచారంగా ఉన్నాము. పూర్తి-కాల సువార్తకునిగా ఉండననే ఆలోచన చేత నేను ఇబ్బందిపడడం ఆయన చూడగలిగారు. ఆయన గొప్ప విశ్వాసము గల వ్యక్తి మరియు గత రెండు సంవత్సరాలుగా ఆయన నాకు ప్రేమతో బోధించారు. ఆయన తన బల్లకు పైగా ఉన్న యేసు క్రీస్తు చిత్రమును చూపించి ఇలా అన్నారు, “ఎల్డర్ ఓల్సన్, అంతా సవ్యంగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆయన కార్యము.” మనము ఆయనను అనుమతించిన యెడల—మనము సేవ చేస్తుండగా మాత్రమే కాదు, కానీ ఎల్లప్పుడూ రక్షకుడు మనకు సహాయపడతాడని తెలుసుకొని, నేను నిశ్చింతగా భావించాను.
సహోదరి పిన్‌కాక్ తన హృదయపు లోతుల నుండి సాధారణమైన స్పానిష్ వాక్యాలలో మాకు బోధించింది. ఆమె “Jesucristo vive (యేసు క్రీస్తు జీవిస్తున్నాడు)” అని చెప్పినప్పుడు, అది సత్యమని మరియు ఆయన జీవిస్తున్నాడని నాకు తెలుసు. ఆమె “Elderes y hermanas, les amo (ఎల్డర్లు మరియు సహోదరీలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను)” అని చెప్పినప్పుడు ఆమె మమ్మల్ని ప్రేమిస్తుందని మరియు మేము రక్షకుడిని ఎల్లప్పుడూ అనుసరించాలని కోరుతుందని నాకు తెలుసు.
నేను, నా భార్య ఈమధ్య ఉరుగ్వేలో శ్రేష్ఠమైన సువార్తికులతో పని చేయడానికి మిషను నాయకులుగా సేవ చేయడానికి దీవించబడ్డాము. వీరు ప్రపంచంలో శ్రేష్ఠమైన సువార్తికులని నేను చెప్పగలను మరియు ప్రతీ మిషను నాయకుడు ఆవిధంగా భావిస్తారని నేను నమ్ముతున్నాను. రక్షకుడిని అనుసరించడం గురించి ప్రతీరోజు ఈ శిష్యులు మాకు బోధించారు.
క్రమమైన మౌఖిక సంభాషణలందు, మా గొప్ప సువార్తకురాళ్ళలలో ఒకరు కార్యాలయం లోపలకు వచ్చారు. ఆమె విజయవంతురాలైన సువార్తికురాలు, శ్రేష్టమైన శిక్షకురాలు, మరియు అంకితమైన నాయకురాలు. ఆమె తన సహవాసుల చేత మెచ్చుకోబడింది మరియు జనుల చేత ప్రేమించబడింది. ఆమె విధేయత, వినయము మరియు నమ్మకం గలది. మా గత సందర్శనాలు ఆమె ప్రాంతంపై మరియు ఆమె బోధిస్తున్న జనులపై కేంద్రీకరించబడ్డాయి. ఈ సందర్శన భిన్నమైంది. ఆమె ఎలా ఉందని నేను అడిగినప్పుడు, ఆమె ఇబ్బందిపడిందని నేను చెప్పగలను. ఆమె ఇలా అన్నది, “అధ్యక్షులు ఓల్సన్, దీనిని నేను చేయగలనో లేదో నాకు తెలియదు. నేను ఎప్పటికైనా తగినంత మంచిగా ఉంటానో లేదో నాకు తెలియదు. ప్రభువు నన్ను కోరిన సువార్తికురాలిగా నేను ఉంటానో లేదో నాకు తెలియదు.”
ఆమె ఒక అసాధారణమైన సువార్తికురాలు. అన్నివిధాలా శ్రేష్ఠమైనది. ఒక మిషను అధ్యక్షుడు ఆశించే విధమైన సువార్తికురాలు. ఒక సువార్తకురాలిగా ఆమె సామర్థ్యాల గురించి నేను ఎన్నడూ ఆందోళన చెందలేదు.
ఆమె చెప్పినది విన్నప్పుడు, ఏమి చెప్పాలో తెలియక నేను ప్రయాసపడ్డాను. నేను మౌనంగా ప్రార్థన చేసాను: “పరలోక తండ్రీ, ఈమె ఒక శ్రేష్ఠమైన సువార్తికురాలు. ఆమె మీకు చెందినది. ఆమె ప్రతీ దానిని సరిగ్గా చేస్తుంది. నేను తప్పుగా చెప్పాలనుకోవడంలేదు. ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి దయచేసి నాకు సహాయం చేయండి.”
ఆ మాటలు నాకు తెలిసాయి. “Hermana, (సహోదరి), ఈవిధంగా నీవు భావిస్తున్నందుకు నేను చాలా విచారిస్తున్నానని నేను అన్నాను. నిన్ను ఒక ప్రశ్న అడగనివ్వు. నువ్వు బోధిస్తున్నఒక స్నేహితురాలు ఈవిధంగా భావించినట్లయితే నువ్వు ఏమి చెప్తావు?”
ఆమె నా వైపు చూసి నవ్వింది. పొరబడని సువార్తికురాలి ఆత్మతో మరియు నమ్మకంతో, “అధ్యక్షా, అది సులువైనది” అని ఆమె అన్నది. రక్షకుడు ఆమెను పరిపూర్ణంగా ఎరుగునని నేను ఆమెకు చెప్తాను. ఆయన జీవిస్తున్నాడని నేను ఆమెతో చెప్తాను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు తగినంత మంచిదానవు మరియు నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను!”
ఆమె చిన్నగా నవ్వుతూ చెప్పింది, “అది మా స్నేహితులకు అన్వయించినట్లయితే, అప్పుడది నాకు కూడా అన్వయిస్తుంది.
మనము ప్రశ్నలు లేదా సందేహాలను కలిగియున్నప్పుడు, పరిష్కారాలు చాలా చిక్కైనవని లేదా జవాబులు కనుగొనడం చాలా గందరగోళంగా ఉన్నదని మనం భావించవచ్చు. సమస్త అబద్ధములకు తండ్రియైన అపవాది గందరగోళం యొక్క వాస్తు శిల్పి అని మనం గుర్తుంచుకోవాలి.8
రక్షకుడు నిరాడంబరత యొక్క బోధకుడు.
అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు:
“విరోధి తెలివైనవాడు. సహస్రాబ్దాలుగా, అతడు మంచిని చెడుగా మరియు చెడును మంచిగా కనిపించేలా చేస్తున్నాడు. అతని సందేశాలు బిగ్గరగా, ధైర్యంగా ఉంటాయి మరియు ప్రగల్భాలు పలుకుతాయి.
“ఏదేమైనా, మన పరలోక తండ్రి నుండి వచ్చిన సందేశాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన సరళంగా, నిశ్శబ్దంగా మరియు చాలా అద్భుతమైన స్పష్టతతో తెలియపరుస్తారు, కాబట్టి మనం ఆయనను అపార్థం చేసుకోలేము.”9
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఆయన తన కుమారుని పంపినందుకు మనము ఎంతో కృతజ్ఞత కలిగియున్నాము. ఆయనే జవాబు.
ఈమధ్య అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు:
“యేసు క్రీస్తు సువార్త యొక్క అవసరం నేటి కంటే ఎక్కువగా మునుపెన్నడూ లేదు. …
“… మీరు సర్వ లోకమునకు వెళ్ళి … సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి”10 అని ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన సూచనను మనం అనుసరించాల్సిన తక్షణ అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది.
సేవ చేయడానికి ఎంపిక చేసే వారు, మీరు ప్రవక్త పిలుపును వినినప్పుడు కలిగే దీవెనలను నేను ధృవీకరించగలను. సేవ చేయడం మీ గురించి కాదు; అది రక్షకుని గూర్చినది. మీరు ఒక స్థలమునకు పిలువబడతారు, కానీ అతి ముఖ్యమైనది మీరు ఒక జనుల కొరకు పిలువబడతారు. జవాబు యేసే అని క్రొత్త స్నేహితులు గ్రహించడానికి సహాయపడే గొప్ప బాధ్యతను మరియు దీవెనను మీరు కలిగియుంటారు.
ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము మరియు దీనికి మనము చెందియున్నాము. అధ్యక్షులు నెల్సన్ మనల్ని చేయమని ప్రేమతో ప్రోత్సహించు సమస్తము మనల్ని రక్షకునికి దగ్గరగా నడిపిస్తుంది.
మా తమ్ముని కొడుకు నాష్‌తో సహా—మన అద్బుతమైన యువతకు—మీ జీవితమంతటా, సవాళ్ళు ఎంత కష్టమైనవి లేదా కలవరపరిచేవి అయినప్పటికీ, జవాబు సాధారణమైనదని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవచ్చు: అది ఎల్లప్పుడూ యేసే.
ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించే వారు అనేక సందర్భాలలో చెప్పుట నేను వినినట్లుగా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీకు మా ధన్యవాదాలు మరియు మీరు మాకు అవసరమని నేను కూడా మీకు చెప్తున్నాను. దీనికి మీరు చెందియున్నారు.
నేను రక్షకుడిని ప్రేమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు”11 మరియు ఆయన నిరాడంబరత యొక్క బోధకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసే జవాబు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.