ఆత్మీయ సామర్ధ్యము
యేసు క్రీస్తు యొక్క విశ్వసనీయులైన శిష్యునిగా, మీరు వ్యక్తిగత ప్రేరేపణను, మీకు ప్రత్యేకించబడిన ఆయన ఆజ్ఞలతో ఒకేరీతిగల బయల్పాటును మీరు పొందగలరు.
ఈ వేసవిలో యువతుల విడిదిని విడిచి నేను వెళ్లుచున్నప్పుడు, ఒక అద్భుతమైన యువతి నాకు ఒక నోటు ఇచ్చింది. దానిలో ఆమె ఇలా అడిగింది, “దేవుడు నాకు ఏదైనా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడని నేను ఎలా గ్రహించగలను?” నేను ఆమె ప్రశ్నను ఇష్టపడ్డాను. మన ఆత్మలు మన పరలోకపు గృహముతో అనుబంధము కొరకు ఆపేక్షించును. మనము అవసరమైన వారిగా, ప్రయోజనకరమైన వారిగా భావించాలని కోరతాము. కాని కొన్నిసార్లు మనము మన స్వంత ఆలోచనలు, ఆత్మ యొక్క మృదువైన భావనల మధ్య తేడాను గుర్తించటానికి ప్రయాసపడతాము. ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలు, ఇలా బోధించారు, ఏదైన ఒకటి “మంచి చేయుటకు ఆహ్వానించిన యెడల, అది క్రీస్తునుండి వచ్చినది.”1
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒక సాధారణమైన, శక్తివంతమైన ఆహ్వానమును ఇచ్చారు: “నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, బయల్పాటును పొందుటకు మీఆత్మీయ సామర్ధ్యమును పెంచుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. … పరిశుద్ధాత్మ వరమును ఆనందించుటకు, ఆత్మ యొక్క స్వరమును ఎక్కువ తరచుగా, ఎక్కువ స్పష్టముగా వినుటకు అవసరమైన ఆత్మీయ కార్యమును చేయుటకు ఎంపిక చేయుము.”2
ఈ ఉదయమున నా కోరిక ఏదనగా, బయల్పాటును పొందటానికి మీ ఆత్మీయ సామర్ధ్యమును పెంచుకోవాటానికి నాలుగు విధానాలను గూర్చి మనఃపూర్వకంగా మాట్లాడాలనుకుంటున్నాను.
1. దేవుని స్వరమును వినుటకు సమయమును మరియు స్థలమును కల్పించుట గురించి ఉద్దేశ్యపూర్వకంగా ఉండుము
ప్రతీరోజు దేవుని స్వరమునకు, ప్రత్యేకంగా మోర్మన్ గ్రంథమునకు దగ్గరగుటకు సమయాన్ని ప్రణాళిక చేయటానికి మీ స్వతంత్రతను ఉపయోగించినప్పుడు, కాలక్రమేణా, ఆయన స్వరము స్పష్టమైనదై మీకు ఎక్కువ పరిచయముగలదగును.
వ్యతిరేకంగా, లోకమును, మన గృహాలను మన జీవితాలను నింపు అంతరాయములు మరియు ధ్వనులు ఆయన స్వరమును వినుటకు మిక్కిలి కష్టమైనదిగా చేయవచ్చు. ఈ అంతరాయములు మన మనస్సులను, హృదయాలను చాలా ఆక్రమించగలవు, ఆవిధంగా మనము పరిశుద్ధాత్మ యొక్క మృదువైన ప్రేరేపేణలకు స్థలమివ్వటం లేదు.
దేవుడు తరచుగా తనను తాను “ఏకాంతములో, వారి గదిలో, అరణ్యము లేక పొలములలో, సాధారణంగా శబ్ధము లేక కల్లోలములేని చోట వ్యక్తులకు,”3 బయల్పరుచుకొనునని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించాడు.
ఆ నిశ్శబ్ధమైన స్థలముల బయట మనల్ని ఉంచుట ద్వారా దేవుని స్వరమునుండి మనల్ని వేరు చేయుటకు సాతాను కోరును. దేవుడు మిక్కిలి నెమ్మదియైన స్వరముతో మాట్లాడిన యెడల, మీరు, నేను ఆయనను వినుటకు దగ్గరవ్వాలి. వై-ఫై తో మనము జతపరచబడినంతగా పరలోకముతో జతపరచబడి ఉండాలని మనము ఉద్దేశించిన యెడల, ఏమి జరుగుతుందో ఊహించండి. ప్రతీరోజు దేవుని స్వరాన్ని వినుట కొరకు ఒక సమయాన్ని, స్థలమును ఎంపిక చేయుము. ఈ పరిశుద్ధ నియామకమును ఖచ్చితంగా నిలుపుకొనుము, ఏలయనగా దానిపై అధికంగా ఆధారపడియున్నవి!
2. ఆలస్యం చేయకుండా అమలు చేయుము.
మీరు ప్రేరేపణలను పొంది, ఉద్దేశముతో అమలు చేసినప్పుడు, ప్రభువు మిమ్మల్ని ఉపయోగించగలడు. మీరు ఎక్కువగా అమలు చేసిన యెడల, ఆత్మ యొక్క స్వరముతో ఎక్కువ పరిచయము కలిగియుంటారు. మీరు దేవుని యొక్క నడిపింపును ఎక్కువగా గుర్తిస్తారు, ఆయన “తన చిత్తమును, మనస్సును బయల్పరచుటకు … సమ్మతిస్తున్నాడు.”4 మీరు ఆలస్యము చేసిన యెడల, మీరు ప్రేరేపణను మరచిపోవచ్చు లేక దేవుని కొరకు ఎవరికైనా సహాయపడే అవకాశమును కోల్పోవచ్చు.
3. ప్రభువు నుండి మీ కార్యమును పొందుము
పరలోక తండ్రి జవాబిచ్చుటకు ఆతృతగా కనబడే ప్రార్థన, మన సహాయము అవసరమైన ఎవరైన ఒకరి వద్దకు నడిపించమనే మన మనవి. ఆయన కొరకు మనము ఎవరికి సహాయపడగలమో దేవునిని అడుగుట ద్వారా బయల్పాటును వెదకమని అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ మనకు బోధించారు. “అటువంటి ప్రశ్నలను మీరు అడిగిన యెడల, పరిశుద్ధాత్మ వచ్చును మరియు మిగిలిన జనుల కొరకు మీరు చేయగల విషయాలను గూర్చి ప్రేరేపణలను మీరు భావిస్తారు. మీరు వెళ్లి, ఆ విషయాలను చేసినప్పుడు, మీరు ప్రభువు యొక్క కార్యముపై ఉన్నారు, మరియు మీరు ప్రభువు యొక్క కార్యముపై ఉన్నప్పుడు, మీరు పరిశుద్ధాత్మ యొక్క వరము కొరకు అర్హులవుతారు.”5
మీరు ఒక కార్యము కొరకు ప్రార్ధించగలరు మరియు ప్రభువును అడగగలరు. మీరు దానిని చేసినప్పుడు, ఆయన తన అసాధారణమైన కార్యమును నెరవేర్చుటకు మీ సాధారణమైన నైపుణ్యములను ఉపయోగించగలరు.
మా (అమ్మ తరపు) తాత ఫ్రిట్జ్ జాల్మార్ లండ్‌గ్రిన్, 19 సంవత్సరాలప్పుడు, స్వీడన్ నుండి వలస వచ్చాడు. అతడు ఒక పెట్టెతో మరియు ఆరు సంవత్సరాల ప్రాధమిక విద్యతో, ఒంటరిగా అమెరికాలో ప్రవేశించాడు. ఏ ఆంగ్లము మాట్లాడలేక, అతడు ఒరెగన్‌కు ప్రయాణించాడు మరియు అక్కడ కలపను కోసే పనిని చేసాడు, మరియు తరువాత, మా అమ్మమ్మ, మా అమ్మతో పాటు సంఘములో చేరాడు. అతడు ఎన్నడూ వార్డుపై అధ్యక్షత్వము వహించలేదు, కానీ ఒక విశ్వసనీయుడైన గృహ బోధకునిగా, అతడు 50కు పైగా వేర్వేరు కుటుంబాలను సంఘ చైతన్యములోనికి తెచ్చాడు. అతడు దానిని ఎలా చేసాడు?
తాత చనిపోయిన తరువాత, అతడి కాగితముల పెట్టెను నేను చూడసాగాను, మరియు తాత యొక్క ప్రేమ వలన సంఘానికి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి చేత వ్రాయబడిన ఒక లేఖను చూసాను. ఆ లేఖ ఇలా చదవబడింది, “సహోదరడైన ఫ్రిట్జ్ యొక్క రహస్యమేదనగా, అతడు పరలోక తండ్రి యొక్క కార్యముపై ఎల్లప్పుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను.”
ఆ లేఖ సహోదరుడు వేని సిమోనిస్ నుండి వచ్చింది. తాత అతడిని దర్శించాడు, కుటుంబము యొక్క ప్రతీ సభ్యుడిని తెలుసుకున్నాడు. చివరకు, వారు అవసరమని తాత వారికి చెప్పి, సంఘానికి హాజరుకమ్మని వారిని ఆహ్వానించాడు. కానీ ఆదివారము, సహోదరుడు సిమోనిస్ మేల్కోని సందిగ్ధములో పడ్డాడు—అతడు తన ఇంటి పైకప్పును తిరిగి వేయుట పూర్తి చేయలేదు మరియు ఆ వారము వర్షము వస్తుందని ఊహించబడింది. తాను సంఘానికి వెళ్ళటానికి నిర్ణయించాడు, తాతతో కరచాలనము చేస్తాడు, మరియు తరువాత పైకప్పును పూర్తి చేయటానికి ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అతడి కుటుంబము అతడు లేకుండా సంస్కార సమావేశానికి హాజరుకావచ్చు.
పైకప్పుపై, ఎవరో నిచ్చెన ఎక్కటం అతడు వినేంత వరకు, అతడి ప్రణాళిక బాగానే పనిచేస్తోంది. అతడి మాటలలో: “నేను పైకి చూసినప్పుడు … నిచ్చెన పైన నిలబడినది సహోదరుడు ఫ్రిట్జ్. అతడు ఆ పెద్ద చిరునవ్వును నాకిచ్చాడు. మొదట, నేను సిగ్గుపడ్డాను, పాఠశాల మానేసినందుకు పట్టబడిన చిన్నపిల్లవానిగా భావించాను. తరువాత … నాకు కోపం వచ్చింది. (కానీ సహోదరుడు ఫ్రిట్జ్ కేవలము) తన సూటు కోటుని తీసివేసి, దానిని నిచ్చెనపై వేలాడదీసాడు. అతడు తన తెలుపు చొక్కా చేతులను పైకి మడతపెట్టి, నావైపు తిరిగి, చెప్పాడు, ‘సహోదరుడు సిమోనిస్, మీవద్ద ఇంకొక సుత్తి ఉన్నదా? ఈ పని చాలా ముఖ్యమైనది లేకపోతే మీరు మీ కుటుంబాన్ని విడిచి వెళ్ళరు, మరియు అది ముఖ్యమైనదైతే, నేను మీకు సహాయపడాలని కోరుతున్నాను. నేను అతడి కన్నులలోనికి చూసినప్పుడు, నేను దయను, క్రీస్తువంటి ప్రేమను మాత్రమే చూసాను. నా కోపం పోయింది. … ఆ ఆదివారము నా పనిముట్లను క్రింద పెట్టి, నా మంచి స్నేహితుడిని నిచ్చెన క్రిందగా, తిరిగి సంఘ భవనానికి అనుసరించాను.”
తాత ప్రభువు నుండి తన పనిని పొందాడు, మరియు తాను తప్పిపోయిన గొఱ్ఱెలను వెదకాలని అతడు ఎరుగును. నలుగురు వ్యక్తులు పక్షవాతముగల వారి స్నేహితుడిని పైకప్పుకు తీసుకొని వెళ్లి, యేసుక్రీస్తు చేత స్వస్థపరచబడుటకు క్రిందకు దించినట్లుగా6, తాత యొక్క పని కూడ అతడిని పైకప్పుకు తీసుకొనివెళ్లింది. ఇతరులకు సహాయపడుటకు కోరు వారికి ప్రభువు బయల్పాటును పంపును.
4. విశ్వసించుము మరియు నమ్ముము
ఇటీవల, ప్రభువు నుండి తన పనిని పొందిన మరొక గొప్ప మిషనరీ గురించి నేను లేఖనాలలో చదివాను. అహరోను లేమనీయుల రాజుకు బోధిస్తున్నాడు, అతడు తనకు బోధించుటకు అహరోను యొక్క సహోదరుడు అమ్మోన్ కూడ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడ్డాడు. “మరియు అహరోను రాజుతో చెప్పెను: ఇదిగో, ప్రభువు యొక్క ఆత్మ అతనిని మరొక మార్గమున పిలిచెను.”7
ఆత్మ నా హృదయముతో మాట్లాడెను: మనలో ప్రతీ ఒక్కరికి నెరవేర్చుటకు మరొక మిషను కలిగియున్నాము, కొన్నిసార్లు ఆత్మ మనల్ని “మరొక మార్గమున” పిలవవచ్చు. నిబంధన-చేయు, నిబంధన-పాటించు యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా దేవుని రాజ్యమును నిర్మించుటకు అనేక మార్గములున్నాయి. ఆయన విశ్వసనీయుడైన శిష్యునిగా, మీరు వ్యక్తిగత ప్రేరేపణను మరియు మీకు ప్రత్యేకించబడిన ఆయన ఆజ్ఞలతో ఒకేరీతిగల బయల్పాటును పొందగలరు. మీరు ప్రత్యేక మిషన్లను, జీవితంలో నెరవేర్చుటకు పాత్రలనుకలిగియున్నారు, వాటిని నెరవేర్చుటకు ప్రత్యేక నడిపింపు ఇవ్వబడతారు
నీఫై, జేరేడ్ సహోదరుడు, మోషే అందరూ దాటుటకు విస్తారమైన నీళ్లను కలిగియున్నారు—కానీ ప్రతీఒక్కరు దానిని వేర్వేరుగా చేసారు. నీఫై “కలప పనిని వింతైన పనితనముతో”8 చేసెను. “ఒక గిన్నె వలే బిగుతుగా ఉండే,”9 పడవలను జేరెడ్ యొక్క సహోదరుడు నిర్మించాడు. మరియు మోషే “సముద్రము మధ్యన ఆరిన నేలపై నడిచెను.”10
వారిలో ప్రతీఒక్కరు వ్యక్తిగత నడిపింపును పొందారు, వారికి అనుకూలించబడింది, మరియు ప్రతీ ఒక్కరు నమ్మారు, అమలు చేసారు. విధేయులైన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొనును, నీఫై యొక్క మాటలలో, “ఆయన వారికి ఆజ్ఞాపించిన కార్యములను నెరవేర్చుటకు [మన కొరకు] ఒక మార్గమును సిద్ధపరచును.”11 “ఒక మార్గమును”—”మార్గము” కాదని నీఫై చెప్పెనని గమనించుము.
మనము ఆశించిన దానికంటే భిన్నంగా “ఆయన ఒక మార్గమును” సిద్ధపరిచారు గనుక ప్రభువు నుండి వ్యక్తిగత కార్యములను మనము కోల్పోయామా లేక నిర్లక్ష్యము చేస్తున్నామా?
మా తాత అసాధారణమైన స్థలముకు—ఒక ఆదివారమున ఒక సూటులో, పైకప్పుకు నడిపించబడ్డాడు. ఆ మార్గము మీరు ఊహించిన దానికంటే భిన్నంగా లేక మిగిలిన వాటినుండి భిన్నంగా కనబడినప్పటికినీ, మిమ్మల్ని నడిపించుటకు దేవునిని నమ్మండి.
కడవరి-దిన పరిశుద్ధులు అనేక రూపములు, పరిమాణములలో వస్తారు, కానీ “నల్లవాడిని, తెల్లవాడిని, దాసుడుని, స్వతంత్రుడని, పురుషుని మరియు స్త్రీని,” ఒంటరివారు, వివాహితులు, ధనికులు, పేదవారు, చిన్నవారు, పెద్దవారు, జీవితకాలమున్న సభ్యుడు మరియు ఇటీవల మార్పు చెందిన వారు”—”అందరూ దేవునికి ఒకేరీతిగా ఉన్నారు.”12 మీరెవరైనను లేక మీరు దేనితో వ్యవహరించినప్పటికినీ, మీరు ప్రభువు యొక్క బల్ల వద్దకు ఆహ్వానించబడ్డారు.13
తండ్రి యొక్క చిత్తమును వెదకి, చేయుట మీ అనుదిన జీవితంలో క్రమ విధానము అయినప్పుడు, సహజంగా మీరు మారుటకు, పశ్చాత్తాపపడుటకు నడిపించబడతారు.
పిల్లలు, యువత కొరకు సంఘము యొక్క క్రొత్త కార్యక్రమము, ప్రభువు మనము ఏమి చేయాలని కోరుతున్నారో కనుగొని, తరువాత ఆ దిశ వైపుగా పని చేస్తూ, బయల్పాటును వెదకుటను నేర్చుకొను పునాదిపై నిర్మించబడింది. మనలో ప్రతీఒక్కరు, వయస్సు లేక పరిస్థితి లక్ష్యపెట్టకుండా, వెదకుటకు, పొందుటకు, అమలు చేయుటకు ప్రయాసపడగలరు. మన కాలము కొరకు నియమించబడిన ఈ నిత్య నమూనాను మీరు అనుసరించినప్పుడు, మిమ్మల్ని యేసు క్రీస్తు—ఆయన ప్రేమ, ఆయన వెలుగు, ఆయన నడిపింపు, ఆయన శాంతి, ఆయన స్వస్థపరచి, సాధ్యపరచు శక్తికి దగ్గరగా చేయును. ఆయన గొప్ప కార్యమును నెరవేర్చుటలో ప్రతీరోజు ఆయన హస్తములలో సాధనముగా మారుటకు మీ ఆత్మీయ సామర్ధ్యమును మీరు హెచ్చిస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.