మెల్కీసెదెకు యాజకత్వము మరియు తాళపుచేతులు
సంఘములో యాజకత్వం యొక్క అధికారం ఆ యాజకత్వం యొక్క తాళపుచేతులను కలిగి ఉన్న యాజకత్వ నాయకుడి ఆదేశాల మేరకు ఉపయోగించబడుతుంది.
ఇంతకుముందు ముగ్గురు ప్రసంగీకులు ఇప్పటికే మాట్లాడిన దేవుని యాజకత్వం గురించి మరింత మాట్లాడటానికి నేను ఎంచుకున్నాను, వారు యువతులు, యువకులు మరియు మహిళలను యాజకత్వం ఎలా ఆశీర్వదిస్తుందో మనకు బోధించారు.
యాజకత్వం అనేది ఒక దైవిక శక్తి మరియు అధికారం, ఆయన పిల్లలందరి ప్రయోజనాల కోసము దేవుని పని కోసం ఉపయోగించబడుటకు నమ్మకంతో అప్పగించబడింది. యాజకత్వము అనేది యాజకత్వ స్థానానికి నియమించబడిన వారు లేదా దాని అధికారాన్ని వినియోగించేవారు కాదు. యాజకత్వం కలిగి ఉన్న పురుషులు యాజకత్వం కాదు. నియమించబడిన పురుషులను యాజకత్వం అని సూచించకూడదు, కాని వారిని యాజకత్వం కలిగియున్నవారుగా గా సూచించడం సముచితం.
యాజకత్వం యొక్క శక్తి సంఘములో మరియు కుటుంబ వ్యవస్థ రెండింటిలోను ఉంది. కానీ యాజకత్వ శక్తి మరియు యాజకత్వ అధికారం కుటుంబంలో కంటే సంఘములో భిన్నంగా పనిచేస్తాయి. ఇదంతా ప్రభువు స్థాపించిన సూత్రాల ప్రకారం ఉంది. దేవుని ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం ఆయన పిల్లలను నిత్యజీవానికి నడిపించడం. ఆ ప్రణాళికకు మర్త్య కుటుంబాలు చాలా అవసరం. కుటుంబ సంబంధాలను నిత్యత్వానికి శాశ్వతం చేయడానికి అవసరమైన సిద్ధాంతం, అధికారం మరియు విధులు అందించడానికి సంఘం ఉంది. ఈ విధంగా, కుటుంబ వ్యవస్థ మరియు యేసు క్రీస్తు సంఘము పరస్పరం బలోపేతం చేసే సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సువార్త యొక్క సంపూర్ణత్వం వంటి యాజకత్వ దీవెనలు మరియు బాప్తీస్మము, నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరమును పొందటం, దేవాలయ వరం మరియు నిత్య వివాహం వంటి విధులు స్త్రీపురుషులకు ఒకే విధంగా లభిస్తాయి.1
మనము ఇక్కడ మాట్లాడే యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వము, సువార్త పునఃస్థాపణ ప్రారంభంలో పునఃస్థాపించబడింది. జోసెఫ్ స్మిత్ మరియు ఆలివర్ కౌడరీలను పేతురు, యాకోబు మరియు యోహాను నియమించారు, వారు తమను తాము “పరలోకరాజ్యము మరియు కాలముల పరిపూర్ణ యుగము యొక్క తాళపుచేతులను కలిగి ఉన్నవారిగా,” ప్రకటించారు ( సిద్ధాంతం మరియు ఒడంబడికలు 128: 20). ఈ అనుభవముగల అపొస్తలులు ఆ అధికారాన్ని రక్షకుడి నుండే పొందారు. యాజకత్వంలోని అన్ని ఇతర అధికారులు లేదా స్థానాలు మెల్కీసెదెకు యాజకత్వమునకు అనుబంధాలు ( సిద్ధాంతము మరియు నిబంధనలు 107: 5 చూడండి), ఎందుకంటే ఇది “అధ్యక్షత్వము యొక్క హక్కును కలిగి ఉంది మరియు ప్రపంచంలో అన్ని యుగాలలో సంఘమలోని అన్ని స్థానాలపై శక్తి మరియు అధికారాన్ని కలిగి ఉంది”(సిద్ధాంతం మరియు ఒడంబడిక 107: 8).
సంఘములో, గొప్ప యాజకత్వమైన మెల్కీసెదెకు యాజకత్వము, మరియు తక్కువ లేదా అహరోను యాజకత్వము యొక్క అధికారం బిషప్పు లేదా అధ్యక్షుడు వంటి ఒక యాజక నాయకుని ఆదేశాల మేరకు ఉపయోగించబడుతుంది, అతడు యాజకత్వం యొక్క తాళపుచేతులను కలిగి ఉండును. సంఘములో యాజకత్వ అధికారం యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి మనం యాజకత్వ తాళపుచేతుల సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.
పరలోకరాజ్యం యొక్క మెల్కీసెదెకు యాజకత్వపు తాళపుచేతులను పేతురు, యాకోబు, యోహానులు అనుగ్రహించారు, కాని అది యాజకత్వపు తాళపుచేతుల పునఃస్థాపనను పూర్తి చేయలేదు. యాజకత్వము యొక్క కొన్ని తాళపుచేతులు తరువాత వచ్చాయి. అధ్యక్షులు ఐరింగ్ ఒప్పించేవిధంగా ఇప్పుడే వివరించినట్లుగా ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ఈ యుగము యొక్క మొదటి దేవాలయం ప్రతిష్ఠించబడిన తరువాత, ముగ్గురు ప్రవక్తలు, మోషే, ఏలీ మరియు ఏలియా ఇజ్రాయేలీయులను సమకూర్చడానికి మరియు ప్రభువు యొక్క దేవాలయాల కార్యమునకు సంబంధించిన తాళపుచేతులతో కలిపి “ఈ యుగము యొక్క తాళపుచేతులను” పునఃస్థాపించారు ( సిద్ధాంతం మరియు నిబంధనలు 110 చూడండి).
తాళపుచేతుల పనితీరుకు బాగా తెలిసిన ఉదాహరణ యాజకత్వ విధుల నిర్వహణ. ఒక విధి అనేది నిబంధన మరియు దీవెనల వాగ్దానాన్ని సూచించే గంభీరమైన చర్య. సంఘములో, అన్ని విధులు ఆ విధుల కొరకు తాళపుచేతులు కలిగి ఉన్న యాజక నాయకుడి అధికారం క్రింద నిర్వహించబడతాయి.
యాజకత్వపు తాళపుచేతులను కలిగి ఉన్నవారి ఆదేశాల మేరకు పనిచేయుచు యాజకత్వంలోని ఒక స్థానానికి నియమించబడిన వ్యక్తులచేత ఒక విధి సర్వసాధారణంగా నిర్వహించబడుతుంది. ఉదాహరణకు, అహరోను యాజకత్వము యొక్క వివిధ స్థానాలను కలిగియున్నవారు, అహరోను యాజకత్వము యొక్క తాళపుచేతులను కలిగి ఉన్న బిషపు యొక్క తాళపుచేతులు మరియు దర్శకత్వములో సంస్కార విధిని నిర్వహిస్తారు. దేవాలయంలో మహిళలు అధికారికంగా వ్యవహరించే యాజకత్వ విధులకు ఇదే సూత్రం వర్తిస్తుంది. స్త్రీలు యాజకత్వంలో స్థానాలను కలిగియుండనప్పటికీ, వారు దేవాలయ విధుల తాళపుచేతులను కలిగియున్న దేవాలయ అధ్యక్షుడి అధికారం క్రింద పవిత్రమైన దేవాలయ విధులను నిర్వహిస్తారు.
తాళపుచేతులు కలిగియున్న వ్యక్తి ఆదేశాల మేరకు యాజకత్వ అధికారం యొక్క మరొక ఉదాహరణ, సువార్తను బోధించడానికి పిలవబడే స్త్రీపురుషుల యొక్క బోధనలు—అవి వారి ఇంటి వార్డులలోని తరగతుల్లో అయినా లేదా మిషను రంగంలో అయినా సరే. ఇతర ఉదాహరణలు ఏవనగా వార్డులో నాయకత్వ పదవులను కలిగి ఉన్నవారు వారి పిలుపుల కారణంగా మరియు వార్డులో లేదా స్టేకులో తాళపుచేతులు కలిగియున్న యాజక నాయకుడు వారిని ప్రత్యేకపరచి మరియు నడిపించడం ద్వారా వారి నాయకత్వంలో యాజకత్వ అధికారాన్ని వినియోగించుకునేవారు. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో యాజకత్వం యొక్క అధికారం మరియు శక్తి ఈ విధంగా వినియోగించబడుతుంది మరియు ఆనందించబడుతుంది. 2
యాజకత్వ అధికారము కడవరి దిన పరిశుద్ధుల కుటుంబాలలో వినియోగించబడుతుంది మరియు దాని దీవెనలలో అనుభవించబడుతుంది. కుటుంబాలు అని నేను చెప్పినదానికి అర్థము వివాహము చేసుకున్న యాజకత్వ అధికారము కలిగియున్న పురుషుడు మరియు ఒక స్త్రీ మరియు వారి పిల్లలు. మరణం లేదా విడాకుల వల్ల కలిగే ఆదర్శ సంబంధాల నుండి వచ్చిన వైవిధ్యాలను కూడా నేను వీటిలో చేర్చుతాను.
ఆ పనికి యాజకత్వపు తాళపుచేతులు కలిగియున్న వ్యక్తి ఆదేశాల మేరకు మాత్రమే యాజకత్వ అధికారాన్ని ఉపయోగించవచ్చనే సూత్రం సంఘములో ప్రాథమికమైనది, అయితే ఇది కుటుంబంలో వర్తించదు. ఉదాహరణకు, ఒక తండ్రి తనకు కలిగి ఉన్న యాజకత్వం యొక్క అధికారం ద్వారా తన కుటుంబంలో యాజకత్వానికి అధికారం వహించి దానిని వినియోగిస్తాడు. తన వివిధ కుటుంబ విధులను నిర్వర్తించడానికి ఒక యాజకత్వ తాళపుచేతులను కలిగి ఉన్న వ్యక్తి యొక్క దిశ లేదా ఆమోదం అతనికి అవసరం లేదు. అతని కుటుంబ సభ్యులకు సలహా ఇవ్వడం, కుటుంబ సమావేశాలు నిర్వహించడం, అతని భార్య మరియు పిల్లలకు యాజకత్వ దీవెనలు ఇవ్వడం లేదా కుటుంబ సభ్యులకు లేదా ఇతరులకు స్వస్థత దీవెనలు ఇవ్వడం వీటిలో ఉన్నాయి.3 సంఘ అధికారులు కుటుంబ సభ్యులకు బోధిస్తారు కాని కుటుంబంలో యాజకత్వ అధికారాన్ని ఎలా వినియోగించాలో నిర్దేశించరు.
తండ్రి లేనప్పుడు మరియు తల్లి కుటుంబ నాయకురాలిగా ఉన్నప్పుడు అదే సూత్రం వర్తిస్తుంది. ఆమె తన ఇంటిలో అధ్యక్షత వహిస్తుంది మరియు దేవాలయంలో తన వరము మరియు ముద్రణ ద్వారా యాజకత్వం యొక్క శక్తి మరియు ఆశీర్వాదాలను తన కుటుంబంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. యాజకత్వంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ఇవ్వగలిగే యాజకత్వ ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఆమెకు అధికారం లేనప్పటికీ, కుటుంబ నాయకత్వానికి సంబంధించిన ఇతర పనులన్నింటినీ ఆమె చేయగలదు. అలా చేయడం ద్వారా ఆమె కుటుంబంలో నాయకత్వ పదవిలో అధ్యక్షత వహించే తన పిల్లల ప్రయోజనం కోసం యాజకత్వ శక్తిని ఉపయోగిస్తుంది.4
తండ్రులు తమ సొంత కుటుంబంలో తమ యాజకత్వాన్ని ఘనపరిస్తే, అది సంఘము యొక్క లక్ష్యమును వారు చేయగలిగే ఏ ఇతర కార్యములకన్నా ఎక్కువ నిరవేరుస్తుంది. మెల్కీసెదెకు యాజకత్వమును కలిగి ఉన్న తండ్రులు తమ అధికారాన్ని “ప్రేరేపణతోను, దీర్ఘ శాంతముతోను, మృదుత్వముతోను, సాత్వీకముతోను, నిష్కపటమైన ప్రేమతోను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121: 41) ఉపయోగించాలి. యాజకత్వ అధికారను పూర్తిగా వినియోగించుటకు ఆ ఉన్నత ప్రమాణము కుటుంబములో చాలా ముఖ్యమైనది. యాజకత్వం ఉన్నవారు ఆజ్ఞలను కూడా పాటించాలి తద్వారా వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం ఇచ్చే యాజకత్వ శక్తి వారికి ఉంటుంది. వారు ప్రేమగల కుటుంబ సంబంధాలను పెంపొందించుకోవాలి, తద్వారా కుటుంబ సభ్యులు వారిని దీవెన కొరకు అడగాలని అనుకుంటారు. మరియు తల్లిదండ్రులు కుటుంబంలో ఎక్కువ యాజకత్వ దీవెనలను ప్రోత్సహించాలి.5
ఈ సమావేశ కూడికలలో, వినాశకరమైన మహమ్మారితో మన ప్రాణాంతక సమస్యల నుండి సంక్షిప్త ఆశ్రయం పొందుతున్నప్పుడు, మనకు నిత్యత్వము యొక్క గొప్ప సూత్రాలు నేర్పించబడ్డాయి. నిత్యత్వము యొక్క ఈ సత్యాలను పొందడానికి మన కన్ను “తేటగా” ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను, తద్వారా మన శరీరాలు “కాంతితో నిండి ఉంటాయి.”(3 నీఫై 13:22).
బైబిల్లో మరియు మోర్మన్ గ్రంథములో నమోదు చేయబడిన అనేకమందికి ఆయన చేసిన ప్రసంగంలో, రక్షకుడు మర్త్య శరీరాలు కాంతితో లేదా చీకటితో నిండి ఉండవచ్చని బోధించారు. మనము, వాస్తవానికి, కాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నాము, మరియు మన రక్షకుడు మనకు ఇది ఎలా జరుగుతుందో నేర్పించారు. నిత్యత్వం యొక్క సత్యాల గురించి సందేశాలను మనం వినాలి. ఆయన మన కంటిని ఉదాహరణగా ఉపయోగించారు, దీని ద్వారా మన శరీరంలోకి కాంతిని తీసుకుంటాము. మన “కన్ను తేటగా” ఉంటే—అనగా మరొక మాటలో మనం నిత్య కాంతిని పొందడం మరియు అర్థం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తుంటే—“నీ దేహమంతయు కాంతితో నిండి ఉండును” (మత్తయి 6:22; 3 నీఫై 13:22) అని ఆయన వివరించారు. మన “కన్ను చెడుగా ఉంటే” –మనం చెడు కోసం వెతుకుతూ దానిని మన శరీరాల్లోకి తీసుకుంటే— “నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది” అని హెచ్చరించారు.(వచనము 23). మరో మాటలో చెప్పాలంటే, మన శరీరాల్లోని కాంతి లేదా చీకటి మనం బోధించే నిత్య సత్యాలను ఎలా చూస్తామో లేదా స్వీకరిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది.
నిత్యత్వం యొక్క సత్యాలను వెతకాలి మరియు అడగాలి అని రక్షకుడు ఇచ్చిన ఆహ్వానాన్ని మనము అనుసరించాలి. ప్రతి ఒక్కరూ వారు కోరుకునే సత్యాలను నేర్పిండానికి పరలోకంలో ఉన్న మన తండ్రి సిద్ధంగా ఉన్నారని ఆయన వాగ్దానం చేశారు( 3 నీఫై 14:8). మనం దీనిని కోరుకుంటే మరియు స్వీకరించడానికి మన కన్ను తేటగా ఉంటే, రక్షకుడు నిత్యత్వం యొక్క సత్యాలు మనకు “తెరవబడతాయని” వాగ్దానం చేస్తారు (3 నీఫై 14:7–8).
దీనికి విరుద్ధంగా, మన ఆలోచనను గందరగోళపరిచేందుకు లేదా దేవుని యాజకత్వం యొక్క కార్యకలాపాలు వంటి ముఖ్యమైన విషయాలపై మమ్మల్ని దారితప్పడానికి సాతాను ఆత్రుతగా ఉన్నాడు. రక్షకుడు అటువంటి “అబద్దపు ప్రవక్తలు, వారు మీ వద్దకు గొర్రెల తొడుగలో వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు” (3 నీఫై 14:15). మనల్ని గందరగోళపరిచే వివిధ బోధనల నుండి సత్యాన్ని ఎన్నుకోవడంలో సహాయపడటానికి ఆయన ఈ పరీక్షను మనకు ఇచ్చారు: “వారి ఫలముల ద్వారా మీరు వారిని ఎరుగుదురు” అని ఆయన బోధించారు (3 నీఫై 14:16). “ఒక మంచి చెట్టు చెడు ఫలములను ఫలించదు; ఒక భ్రష్ఠమైన చెట్టు మంచి ఫలములను ఫలించలేదు” (వచనము 18). అందువల్ల, బోధించిన సూత్రాల యొక్క ఫలితాలను— “ఫలాలు” మరియు వాటిని బోధించే ప్రవక్తల మనం చూడాలి. సంఘము మరియు దాని సిద్ధాంతాలు మరియు విధానాలు మరియు నాయకత్వానికి వ్యతిరేకంగా మనం విన్న అనేక అభ్యంతరాలకు ఇది ఉత్తమ సమాధానం. రక్షకుడు బోధించిన పరీక్షను అనుసరించండి. ఫలాలను అనగా ఫలితాలను చూడండి.
సువార్త ఫలాలు మరియు పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘము గురించి మనం ఆలోచించినప్పుడు, సంఘము దాని జీవితకాలంలో ఉన్న జీవించుచున్న సభ్యుల సంఖ్య, ఇంటర్‌మౌంటైన్ వెస్ట్‌లోని స్థానిక సమూహాల నుండి 16 మిలియన్ల కంటే ఎక్కువ మంది సభ్యులు సంయుక్త రాష్ట్రాలలో కాకుండా ఇతర దేశాలలో నివసించుటకు ఎలా విస్తరించిందో తెలుసుకొని మనము సంతోషిస్తాము. మనము భావించిన ఆ పెరుగుదలతో, సంఘము దాని సభ్యులకు సహాయపడటంలో దాని సామర్థ్యము పెరుగుతంది. ఆజ్ఞలు పాటించడానికి, పునఃస్థాపించబడిన సువార్తను ప్రకటించడానికి బాధ్యతను నెరవేర్చడానికి, ఇశ్రాయేలీయులను సమకూర్చడానికి, మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించడానికి మనం సహాయపడతాము.
మనము ఒక ప్రవక్త చేత నడిపించబడుతున్నాము, ఆయన నాయకత్వం యొక్క రెండు సంవత్సరాలలో మనము అనుభవించిన పురోగతిని సాధించడానికి ప్రభువు ఆయన నాయకత్వం ఉపయోగించారు. ఇప్పుడు మనము అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి నుండి వినడానికి దీవించబడ్డాము, వారు మన రక్షకుడైన యేసు క్రీస్తును బోధించి, సాక్ష్యమిచ్చేటప్పుడు మన పురోగతిని మరింత పెంచే కొన్ని అదనపు కార్యక్రమాలను పంచుకుంటారు.
ఈ విషయాల యొక్క సత్యాన్ని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు యేసు క్రీస్తు పేరిట మనము ఇప్పుడు వినే మన ప్రవక్త కొరకు ప్రార్థించడంలో మీతో చేరతాను.