విశ్వాసపు నిచ్చెన
అవిశ్వాసము అద్భుతాలను చూసేందుకు మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది, అయితే రక్షకునియందు విశ్వాసముగల మనస్తత్వము పరలోకపు శక్తులను తెరుస్తుంది.
జీవితపు కష్టాలు యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ జీవితంలో మనము అనుభవించే ఆనందము మరియు శాంతిపై మన విశ్వాసం ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అది 1977వ సంవత్సరము. ఫోను మ్రోగింది మరియు ఆ సందేశము మా హృదయాలను ముక్కలు చేసింది. కారోలిన్ మరియు డగ్ టెబ్స్ పాఠశాలలో పట్టభద్రులైన తరువాత వారి క్రొత్త ఇంటికి వెళ్ళే ప్రక్రియలో ఉన్నారు. వ్యానులో సామాన్లు ఎక్కించడానికి పెద్దల సమూహము వచ్చింది. వెనక్కి వెళ్ళే ముందు మార్గం స్పష్టంగా ఉందని నిర్థారించుకోవడానికి డగ్ చివరిసారి అన్నివైపులా చూసాడు. అతడు చూడలేనిది ఏమిటంటే, అతడి చిన్న కూతురు జెన్నీ అనుకోని సమయంలో హఠాత్తుగా ట్రక్కు వెనుకకు వచ్చింది. ఒక్క క్షణంలో, వారి ప్రియమైన జెన్నీ చనిపోయింది.
తరువాత ఏమి జరుగుతుంది? వారు అనుభవించిన తీవ్రమైన బాధ, ఊహించలేని నష్టం కారోలిన్ మరియు డగ్ మధ్య సరిదిద్దలేని అగాధాన్ని సృష్టిస్తుందా లేదా అది వారి హృదయాలను ఒక్కటిగా బంధించి, పరలోక తండ్రి ప్రణాళికపై వారి విశ్వాసాన్ని పటిష్టం చేస్తుందా?
వారి బాధల మార్గము సుదీర్ఘమైనది మరియు బాధాకరమైనది, కానీ ఎక్కడి నుంచో ఆత్మీయ నిల్వలు ఆశను కోల్పోనివ్వకుండా “[వారి] మార్గమున నిలువడానికి” వచ్చాయి.1 ఏదోవిధంగా ఈ అపురూపమైన జంట ఇంకా ఎక్కువగా క్రీస్తు వలే మారారు. ఎక్కువ నిబద్ధత కలిగియున్నారు. ఎక్కువ కనికరము కలిగియున్నారు. ఆయన కాలములో, దేవుడు వారి బాధలను వారి లాభము కొరకు ప్రతిష్టిస్తాడని వారు నమ్మారు.2
బాధ మరియు నష్టము పూర్తిగా వదలిపెట్టనప్పటికీ, నిబంధన బాటలో స్థిరముగా నిలిచియుండుట ద్వారా వారి ప్రియమైన జెన్నీ శాశ్వతంగా వారిదవుతుందనే అభయము చేత కారోలిన్ మరియు డగ్ ఓదార్చబడ్డారు.3
వారి మాదిరి ప్రభువు యొక్క ప్రణాళికలో నా విశ్వాసాన్ని బలపరచింది. మనము అన్ని విషయాలను చూడము. ఆయన చూస్తారు. లిబర్టీ చెరసాలలో ఉండగా జోసెఫ్ స్మిత్‌తో ప్రభువు ఇలా చెప్పారు, “ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకే. మనుష్య కుమారుడు వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించెను. అతని కంటే నీవు గొప్పవాడివా?”4
మనము ప్రభువు యొక్క చిత్తమును అంగీకరించినప్పుడు, ఆయనతో ఎలా నడవాలో ఆయన మనకు బోధిస్తారు.5 టహిటిలో సేవ చేస్తున్న యువ సువార్తికునిగా నేను, రోగియైన ఒక పసిబిడ్డకు దీవెన ఇవ్వమని అడుగబడ్డాను. మేము అతడి తలపై మా చేతులు ఉంచి, స్వస్థపడాలని అతడిని దీవించాము. అతడి ఆరోగ్యము మెరుగుపడసాగింది, కానీ తరువాత అతడు మరలా అస్వస్థత చెందాడు. రెండవసారి మేము అతడిని దీవించాము, కానీ అదే ఫలితం కలిగింది. మూడవ మనవి వచ్చింది. ప్రభువు చిత్తము నెరవేర్చబడాలని మేము ఆయనను వేడుకున్నాము. తరువాత కొంతసేపటికి, ఆ చిన్న ఆత్మ తన పరలోక గృహానికి తిరిగి వెళ్ళింది.
కానీ మేము శాంతిని అనుభవించాము. పసిబిడ్డ బ్రతకాలని మేము కోరాము, కానీ ప్రభువు వేరే ప్రణాళికలను కలిగియున్నారు. మన పరిస్థితులను లక్ష్యపెట్టకుండా, మన స్వంత చిత్త స్థానములో ఆయన చిత్తమును అంగీకరించడమేసంతోషాన్ని కనుగొనడంలో ముఖ్యమైనది.
మనము మొదటిసారి ఆయన గురించి నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు యేసు క్రీస్తునందు మనకు గల సరళమైన విశ్వాసము, జీవితపు సవాళ్ళను మనము ఎదుర్కొన్నప్పుడు మన హృదయాలలో నిలిచియుండగలదు. ఆయనయందు మన విశ్వాసము జీవితపు చిక్కుల గుండా మనల్ని నడిపించగలదు మరియు నడిపిస్తుంది. వాస్తవానికి, “క్రీస్తునందు [నిలకడతో] పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియున్నప్పుడు,”7 జీవితంలోని సంక్లిష్టతలకు మరో వైపు సరళత ఉందని మనం కనుగొంటాము.6
ఒక నిచ్చెన, ఎందుకనగా అది విశ్వాసము స్థిరంగా ఉండదని సూచిస్తుంది—“విశ్వాసపు నిచ్చెన” అని నేను పిలిచే దానిని మనము ఎక్కినప్పుడు, సంభవనీయమైన ఈ అడ్డంకులు మైలురాళ్ళుగా మారడానికి అనుమతించడం జీవితపు ఉద్దేశ్యములో భాగము. మనము చేసే ఎంపికల ప్రకారము మన విశ్వాసము వృద్ధి చెందుతుంది లేదా క్షీణిస్తుంది.
రక్షకునియందు విశ్వాసమును వృద్ధిచేయడానికి మనము ప్రయాసపడినప్పుడు, మన కొరకు దేవుని ప్రేమను మనము పూర్తిగా గ్రహించలేకపోవచ్చు మరియు బాధ్యతాభావనతో ఆయన చట్టములకు మనం లోబడవచ్చు. ప్రేమకు బదులుగా నేరభావన మన ప్రాథమిక ప్రేరణగా కూడా మారవచ్చు. ఆయనతో నిజమైన అనుబంధాన్ని ఇంకా అనుభవించియుండకపోవచ్చు.
మన విశ్వాసాన్ని వృద్ధి చేయాలని మనం కోరినప్పుడు, యాకోబు బోధించిన దానిచేత మనము కలవరపడవచ్చు. “క్రియలు లేని విశ్వాసము మృతము”8 అని అతడు మనకు జ్ఞాపకము చేసాడు. సమస్తము మనపై ఆధారపడియున్నదని మనము ఆలోచించిన యెడల మనము తొట్రిల్లవచ్చు. మనపై ఎక్కువగా ఆధారపడుట పరలోకపు శక్తులను చేరుకోవడానికి మన సామర్థ్యాన్ని ఆటంకపరచవచ్చు.
కానీ యేసు క్రీస్తునందు నిజమైన విశ్వాసము వైపు మనము ముందుకు సాగినప్పుడు, మన ఆలోచనా విధానం మారడం ప్రారంభమవుతుంది. రక్షకునియందు విశ్వాసము మరియు విధేయత, ఆయన ఆత్మను ఎల్లప్పుడూ మనతో కలిగియుండడానికి మనల్ని అర్హులుగా చేస్తుందని మనము గుర్తిస్తాము.9 విధేయత ఇకపై చికాకు కలిగించదు, కానీ ఒక తపనగా మారుతుంది.10 దేవుని ఆజ్ఞలపట్ల విధేయత ఆయన నమ్మకాన్ని చూరగొనడాన్ని మనకు సాధ్యం చేస్తుందని మనము గుర్తిస్తాము. ఆయన నమ్మకముతో హెచ్చించబడిన వెలుగు కలుగుతుంది. ఈ వెలుగు మన ప్రయాణమును నడిపించి, మనము వెళ్ళవలసిన మార్గమును మరింత స్పష్టంగా చూడడానికి మనల్ని అనుమతిస్తుంది.
కానీ ఇంకా చాలా ఉంది. రక్షకునియందు మన విశ్వాసము వృద్ధి చెందినప్పుడు, దేవునితో మన అనుబంధమును గూర్చి ఒక దైవిక అవగాహనతో కూడిన సూక్ష్మమైన మార్పును—“నాకు ఏమి కావాలి?” అనే దాని నుండి “దేవునికి ఏమి కావాలి?” అనేదానికి ఒక స్థిరమైన కదలికను మనం గమనిస్తాము. రక్షకుని వలె, మనము “నా చిత్తము కాదు, కానీ మీ చిత్తమే” 11 చేయాలని కోరతాము. మనము దేవుని కార్యమును చేయాలని మరియు ఆయన చేతులలో ఒక సాధనంగా ఉండాలని కోరతాము.12
మన అభివృద్ధి నిత్యమైనది. పరలోక తండ్రి మనము తెలుసుకోవాలని కోరేది అత్యధికమున్నదని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.13 మనము వృద్ధి చెందినప్పుడు, ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు బోధించిన దానిని మనము బాగా గ్రహిస్తాము: “ఏలయనగా, మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల, మీరు ఆయన సంపూర్ణత్వమును పొందెదరు, నా యందు మహిమపరచబడుదురు; … నేను చెప్పునదేమనగా, మీరు కృప వెంబడి కృపను పొందెదరు.”14
విశ్వాసపు నిచ్చెనపై మనము ఎంత ఎత్తుగా ఎక్కుతామన్నది మన నిర్ణయము. “విశ్వాసము అకస్మాత్తుగా వృద్ధి చెందదు, కానీ ఎంపిక ద్వారా వృద్ధి చెందుతుంది,”15 అని ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ బోధించారు. రక్షకునియందు మన విశ్వాసమును హెచ్చించుటకు అవసరమైన ఎంపికలను చేయడానికి మనము ఎన్నుకోగలము.
నీఫై విశ్వాసపు నిచ్చెన పైకి ఎక్కగా, లేమన్, లెముయెల్‌లు క్రిందికి దిగునట్లు చేసిన ఎంపికల ప్రభావమును పరిగణించండి. నీఫై యొక్క స్పందనయైన “నేను వెళ్ళి చేయుదును”16 అనేదానికి వ్యతిరేకంగా అంతకుముందే దూతను చూసిన లేమన్, లెముయెల్‌ల స్పందనయైన, “ప్రభువు అప్పగించుట యెట్లు సాధ్యము?”17 అనే వాటికి మధ్య తేడా కంటే స్పష్టమైన ప్రాతనిధ్యమున్నదా?
అవిశ్వాసము అద్భుతాలను చూసేందుకు మన సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది, అయితే రక్షకునియందు విశ్వాసముగల మనస్తత్వము పరలోకపు శక్తులను తెరుస్తుంది.
మన విశ్వాసము బలహీనంగా ఉన్నప్పుడు కూడా, ప్రభువు హస్తము ఎల్లప్పుడూ మనల్ని పైకెత్తుటకు చాపబడియుంటుంది.18 కొన్నేళ్ళ క్రితం, నైజీరియాలో ఒక స్టేకును పునర్నిర్మించడానికి నేను నియమించబడ్డాను. చివరి నిముషంలో, తారీఖులో మార్పు చేయబడింది. స్టేకులో ఒక వ్యక్తి మొదటి సమావేశ తేదీన పట్టణాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించాడు. స్టేకు అధ్యక్షునిగా పిలువబడే ప్రమాదాన్ని అతడు తప్పించుకోవాలనుకున్నాడు.
అతడు దూరంగా వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు, కానీ అతనికి ఏ హాని జరుగలేదు. ఇది అతడి జీవితం ఎందుకు కాపాడబడిందోనని అతడు ఆలోచించేలా చేసింది. తాను చేసిన నిర్ణయాన్ని అతడు మరొకసారి సమీక్షించాడు. అతడు పశ్చాత్తాపపడి, క్రొత్త సమావేశ తేదీన వినయంగా హాజరయ్యాడు. అవును, అతడు క్రొత్త స్టేకు అధ్యక్షునిగా పిలువబడ్డాడు.
ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ ఇలా బోధించారు: “దేవుని యొక్క చిత్తముతో మన చిత్తమును సమరేఖలోనికి తెచ్చుట ద్వారా మాత్రమే నిజమైన సంతోషము కనుగొనబడుతుంది. దానికంటే తక్కువ ఉంటే ఫలితంగా తక్కువగా వస్తుంది.”19
“మన సామర్థ్యము మేరకు అన్నింటిని” చేసిన తరువాత, అప్పుడు “దేవుని రక్షణను చూచుటకు … నిలిచియుండడానికి”20 అది సమయము. పరిచర్య చేయు సహోదరుడిగా మెక్‌కార్మిక్ కుటుంబానికి సేవ చేస్తుండగా దానిని నేను చూసాను. 21 సంవత్సరాలుగా వివాహము చేసుకొని, మేరీ కే తన పిలుపులందు విశ్వాసనీయంగా సేవ చేసింది. కెన్ సంఘ సభ్యుడు కాదు మరియు సభ్యుడు కావడానికి ఏమాత్రం ఆసక్తి కలిగిలేడు, కానీ తన భార్యను ప్రేమిస్తూ, అతడు ఆమెతోపాటు సంఘానికి హాజరుకావాలని ఎంచుకున్నాడు.
ఒక ఆదివారము కెన్‌తో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను ప్రభావితం చేయబడ్డాను. పంచుకోవచ్చా అని నేనతడిని అడిగాను. అతడి జవాబు సరళమైనది మరియు స్పష్టమైనది: “వద్దు, ధన్యవాదాలు.”
నేను అయోమయంలో పడ్డాను. నేను ప్రేరేపణ పొందాను, దానిని అనుసరించడానికి ప్రయత్నించాను. నా వంతు నేను చేసానని నిర్ణయించుట ప్రలోభపెట్టేదిగా ఉన్నది. కానీ ప్రార్థన మరియు పర్యాలోచన తరువాత, నా ఉద్దేశ్యాలు సరైనవి అయినప్పటికీ, నాపై నేను ఎక్కువగా మరియు ప్రభువుపై చాలా తక్కువగా ఆధారపడినట్లు నేను చూడగలిగాను.
తరువాత నేను తిరిగి వచ్చాను, కానీ వేరేవిధమైన ఆలోచనా విధానముతో. కేవలము ఆత్మను అనుసరించుట కంటే మరొక కోరిక లేకుండా నేను ప్రభువు హస్తములలో ఒక సాధనముగా వెళతాను. విశ్వాసుడైన నా సహవాసి జెరాల్డ్ కార్డన్‌తో కలిసి, మేము మెక్‌కార్మిక్ ఇంటికి వెళ్ళాము.
వెళ్ళిన వెంటనే, “నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు” పాట పాడమని జెరాల్డ్‌ను ఆహ్వానించడానికి నేను ప్రేరేపించబడ్డాను.”21 అతడు నా వైపు ప్రశ్నార్థకంగా చూసాడు, కానీ నా విశ్వాసమందు నమ్మకం కలిగియుండి, అతడు దానిని చేసాడు. ఒక అందమైన ఆత్మ గదిని నింపింది. మేరీ కే మరియు వారి కూతురు క్రిస్టిన్‌లను వారి సాక్ష్యాలు పంచుకోమని ఆహ్వానించాలనే ప్రేరేపణ కలిగింది. వారు ఆవిధంగా చేసినప్పుడు, ఆత్మ బలంగా వృద్ధి చెందింది. వాస్తవానికి, క్రిస్టిన్ సాక్ష్యము తరువాత, కెన్ చెంపల మీదుగా కన్నీళ్ళు కారసాగాయి.22
దేవుడు స్వాధీనం చేసుకున్నాడు. హృదయాలు స్పృశింపబడుట మాత్రమే కాదు, కానీ శాశ్వతంగా మార్చబడ్డాయి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఇరవై-ఒక్క సంవత్సరాల అపనమ్మకము కడిగివేయబడింది. ఒక వారము తరువాత, కెన్ బాప్తిస్మము పొందాడు. ఒక సంవత్సరం తరువాత కెన్, మేరీ కేలు కాలము మరియు నిత్యత్వమంతటి కొరకు ప్రభువు యొక్క మందిరంలో ముద్రింపబడ్డారు.
మా చిత్తమునకు బదులుగా ప్రభువు యొక్క చిత్తమును ఉంచుట అనగా అర్థమేమిటో కలిసి మేము అనుభవించాము మరియు ఆయనయందు మా విశ్వాసము వృద్ధి చెందింది.
మీ విశ్వాసపు నిచ్చెన పైకి ఎక్కడానికి మీరు ప్రయాసపడినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తల చేత అడుగబడిన క్రింది ప్రశ్నలను దయచేసి పరిగణించండి:
నేను గర్వమును విడిచిపెట్టియున్నానా?23
దేవుని వాక్యము కొరకు నా హృదయంలో నేను స్థానమిస్తున్నానా?24
నా బాధలు నా లాభం కొరకు ప్రతిష్టించబడుటకు నేను అనుమతిస్తున్నానా?25
తండ్రి యొక్క చిత్తములో నా చిత్తము ఉపసంహరించబడుటకు నేను సమ్మతిస్తున్నానా?26
విమోచించు ప్రేమ గీతమును పాడవలెనని నాకనిపించిన యెడల, ఇప్పుడు నేను ఆలాగున భావించగలనా?27
నా జీవితంలో దేవునికి ప్రాధాన్యతనిస్తున్నానా?28
ప్రస్తుతం మీ బాట రక్షకునియందు మీ విశ్వాసానికి విరుద్ధంగా ఉన్నట్లు మీరు కనుగొంటే, దయచేసి ఆయన వద్దకు తిరిగివచ్చేందుకు మీ మార్గమును కనుగొనండి. మీ యొక్క, మీ సంతానము యొక్క ఉన్నతస్థితి దానిపై ఆధారపడియున్నది.
విశ్వాసపు విత్తనాలను మన హృదయాలందు మనము లోతుగా నాటెదము. ఆయనతో మనము చేసిన నిబంధనలను గౌరవించుట ద్వారా రక్షకునితో మనల్ని మనం బంధించుకొనినప్పుడు ఈ విత్తనాలను మనము పోషిద్దాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.