సర్వసభ్య సమావేశము
సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2021
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


1:42

సంఘ ఆడిటింగ్ విభాగ నివేదిక, 2021

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వమునకు

ప్రియమైన సహోదరులారా: సిద్ధాంతము మరియు నిబంధనల 120వ ప్రకరణం లో నమోదు చేయబడిన బయల్పాటు నిర్ధేశానుసారం, ప్రథమ అధ్యక్షత్వం, పన్నెండుమంది అపొస్తలుల కూటమితో కూడిన దశమభాగ వినియోగ సభ, సంఘ నిధుల వినియోగాన్ని ఆమోదిస్తుంది. సంఘ విభాగాలు ఆమోదించబడిన ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, విధానాల ప్రకారం నిధులను వినియోగిస్తాయి.

సంఘ ఆడిటింగ్, విశ్వసనీయ నిపుణులను కలిగి ఉంటుంది మరియు అన్ని ఇతర సంఘ డిపార్ట్‌మెంట్‌లు నుండి స్వతంత్రంగా ఉంటుంది, స్వీకరించిన విరాళాలు, చేసిన ఖర్చులు మరియు సంఘ ఆస్తుల రక్షణకు సంబంధించి సహేతుకమైన హామీని అందించే ఉద్దేశ్యంతో ఆడిట్‌లను నిర్వహించాల్సిన బాధ్యత ఉంది.

జరుపబడిన ఆడిట్ల ద్వారా, సంఘ ఆడిటింగ్ 2021 సంవత్సరానికి చెందిన, అన్ని భౌతిక సంబంధమైన విషయాలు, పొందిన విరాళాలు, చేయబడిన ఖర్చులు, సంఘ ఆస్థులు ఆమోదించబడిన సంఘ ఆదాయ వ్యయ అంచనాలు, అభిమతాలు, వాణిజ్య సాధనాల ప్రకారం నమోదు చేయబడ్డాయని, మరియు నిర్వహించబడినవని భావిస్తుంది. సంఘం దాని సభ్యులకు బోధించే ఆదాయ వ్యయ అంచనాలలోనే జీవించుట, అప్పును మానివేయుట, అవసరతగల సమయానికి దాచుకొనుట వంటి ఆచరణలను అనుసరిస్తుంది.

మర్యాదపూర్వకముగా నివేదించబడింది,

సంఘ ఆడిటింగ్ విభాగము

జారెడ్ బి. లార్సన్

నిర్వాహణాధికారి