సర్వసభ్య సమావేశము
ఇదే సమయం
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


5:57

ఇదే సమయం

ఇదే మనం నేర్చుకోగల సమయం. ఇదే మనం పశ్చాత్తాపపడగల సమయం. ఇదే మనం ఇతరులను దీవించగల సమయం.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ సమావేశం అనేక విధాలుగా చారిత్రాత్మకమైనది. ప్రార్థనలు, సందేశాలు మరియు సంగీతం చేత మనం దీవించబడ్డాము. ప్రభువు యొక్క సేవకుల చేత మనం ప్రేరేపించబడ్డాము.

భవిష్యత్తు కోసం ముఖ్యమైన నిర్దేశాన్ని మనము పొందాము. మీరు చేయాలని ప్రభువు కోరే విషయాల గురించి ఆత్మ తిన్నగా మీతోనే మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను.

భవిష్యత్తు ఎప్పుడూ అస్థిరమైనది. వాతావరణం మారుతుంది. ఆర్థిక చక్రాలు ముందుగా ఊహించలేనివి. వినాశనాలు, ప్రమాదాలు మరియు రోగాలు జీవితాన్ని త్వరగా మార్చివేయగలవు. ఈ చర్యలు మనం నియంత్రించలేనంత విస్తారమైనవి. కానీ, మనం ప్రతీరోజు మన సమయాన్ని ఎలా గడుపుతాము అనే దానితో కలిపి, మనం నియంత్రించగల విషయాలు కొన్ని ఉన్నాయి.

న్యూయార్క్‌లోని వెల్స్ కళాశాల వద్ద నీడ గడియారంపై హెన్రీ వాన్ డైక్ చేత వ్రాయబడిన ఈ కవిత నాకిష్టం. అది ఇలా చదువబడుతుంది:

నా వ్రేలి చేత చేయబడిన నీడ

గతం నుండి భవిష్యత్తును విడదీస్తుంది:

ఇంకా రాని కాలముంది,

అది వచ్చేవరకు నువ్వేమి చేయలేవు.

నీడ వెనుక గడిచిపోయిన కాలం ఉంది,

అది ఇకపై మనం ఉపయోగించలేనిది:

ఉపయోగించడానికి మనకు ఒకే ఒక్క గంట ఉంది,—

అది నీడ క్రింద ఉన్న ఈ సమయమే.1

అవును, మనం గతం నుండి నేర్చుకోవాలి మరియు భవిష్యత్తు కోసం సిద్ధపడాలి. కానీ ఇప్పుడు మాత్రమే మనం చేయగలము. ఇదే మనం నేర్చుకోగల సమయం. ఇదే మనం పశ్చాత్తాపపడగల సమయం. ఇదే మనం ఇతరులను దీవించగల సమయం మరియు “వడలిన చేతులను పైకెత్తగల” సమయం.2 మోర్మన్ తన కుమారుడైన మొరోనైకి ఉపదేశించినట్లు, “మనము శ్రద్ధగా పని చేయుదము; ఏలయనగా, … మనము సమస్త నీతి యొక్క శత్రువును జయించునట్లు, దేవుని రాజ్యమందు మన ఆత్మలకు విశ్రాంతి ఇచ్చునట్లు ఈ మట్టి గుడారమందున్నప్పుడు చేయుటకు మనము ఒక పనిని కలిగియున్నాము.”3

విరోధి ఎప్పుడూ దాడి చేయడాన్ని ఆపడు. సత్యానికి ఎల్లప్పుడూ వ్యతిరేకత ఉంటుంది. మీ సానుకూల ఆత్మీయ వేగాన్ని పెంచేవి, ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ చెప్పినట్లుగా ఉన్నతమైనవి, ఎటువంటి సవాళ్ళు ఎదురైనా మరియు అవకాశాలు వచ్చినా మిమ్మల్ని పురోగమించేలా చేసే పనులను చేయమని ఈరోజు ఉదయం నేనిచ్చిన ప్రేరేపణను మళ్ళీ ఇస్తున్నాను.

మనం దేవాలయంలో ఆరాధించి, అక్కడ పొందే దీవెనల యొక్క దివ్యమైన ప్రభావాలను గ్రహించడంలో ఎదిగినప్పుడు, సానుకూల ఆత్మీయ వేగం పెరుగుతుంది. దేవాలయం యొక్క నిత్య దీవెనలపై కేంద్రీకరించడం ద్వారా ప్రపంచ విధానాలను ఎదుర్కోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అక్కడ మీ సమయం నిత్యత్వము కొరకు దీవెనలను తెస్తుంది.

సంఘము ఎదుగుతుండగా, మరిన్ని దేవాలయాలతో ఆ వేగాన్ని అందుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతం నలభై నాలుగు క్రొత్త దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. మరిన్ని పునర్నిర్మించబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పరికల్పనలపై పనిచేస్తున్న నిపుణుల కోసం నేను ప్రార్థిస్తున్నాను.

ప్రార్థనాపూర్వకమైన కృతజ్ఞతాభావంలో, క్రింది ప్రాంతాలలో ప్రతీదానిలో ఒక క్రొత్త దేవాలయాన్ని నిర్మించడానికి మా ప్రణాళికలను ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను: వెల్లింగ్టన్, న్యూజిలాండ్; బ్రాజివిల్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో; బార్సిలోనా, స్పెయిన్; బర్మింగ్‌హామ్, యునైటెడ్ కింగ్‌డమ్; కుస్కో, పెరూ; మాసెయో, బ్రెజిల్; శాంటోస్, బ్రెజిల్; శాన్ లూయి పొటొసి, మెక్సికో; మెక్సికో సిటీ బెనెమెరిటో, మెహికో; టెంపా, ఫ్లోరిడా; నాక్స్‌విల్, టెనెసీ; క్లీవ్‌లాండ్, ఒహైయో; విచిటా, కాన్సాస్; ఆస్టిన్, టెక్సాస్; మిసూలా, మాంటెనా; మాంట్‌పీలియర్, ఐడహో; మరియు మెడెస్టో, కాలిఫోర్నియా.

ఈ 17 దేవాలయాలు తెరకు ఇరువైపులా లెక్కలేనంతమంది జీవితాలను దీవిస్తాయి. నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరీముఖ్యంగా, ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ రక్షకుడు మరియు మీ విమోచకుడు. ఆయన తన సంఘాన్ని నడిపిస్తున్నారు మరియు మార్గనిర్దేశం చేస్తున్నారు. “మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును”4 అని చెప్పిన ప్రభువు యొక్క యోగ్యులైన ప్రజలుగా మనము ఉందుముగాక.

ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.