సర్వసభ్య సమావేశము
భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము!
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


13:31

భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము!

ప్రతి మంచి బహుమతిని ఇచ్చే ఆయన నుండి మనము ఇప్పటికే పొందిన వరాన్ని స్వీకరించడం ద్వారా సంతోషం కోసం మీ అన్వేషణను ప్రారంభించండి.

నేను ఈ రోజు సంఘములోని యువకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను, అంటే అధ్యక్షులు నెల్సన్ వయస్సు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల వారితో. నేను దృశ్యాలను చాలా అరుదుగా ఉపయోగిస్తాను, కానీ దీనిని పంచుకోకుండా ఉండలేను.

మారిన్ ఆర్నాల్డ్ నుండి లేఖ

క్రై డి కూయర్ నా ఎనిమిదేళ్ళ స్నేహితురాలైన మారిన్ ఆర్నాల్డ్ నుండి వచ్చింది, ఆమెకు ఏడేళ్ళు ఉన్నప్పుడు దీనిని వ్రాసింది. నేను మీ కోసం ఆమె యొక్క మొదట సంస్కరింపబడిన ఐగుప్తీయుల భాషను అనువదిస్తాను:

“ప్రియమైన బిషప్పు,

సర్వసభ్య సమావేశం

ఆసక్తిగా లేదు ఎందుకు

మనము దానిని

చెయ్యాలా? ఎందుకో నాకు చెప్పండి

భవదీయురాలు, మారిన్

ఆర్నాల్డ్.”1

మారిన్, నేను ఇవ్వబోతున్న ప్రసంగం నిస్సందేహంగా నిన్ను మళ్ళీ నిరాశపరుస్తుంది. కానీ నువ్వు మీ బిషప్పుకు ఫిర్యాదు చేయడానికి వ్రాసినప్పుడు, నువ్వు అతనికి నా పేరు “కీరోన్ అని చెప్పడం ముఖ్యం. ఎల్డర్ పాట్రిక్ కీరోన్.”

దాదాపు రెండు సంవత్సరాలుగా బైబిలులో వివరించబడిన తెగుళ్ళ వంటి మహమ్మారి మన గ్రహాన్ని చుట్టుముట్టింది మరియు ఆ తెగులు సామాజికంగా దాదాపు ప్రతీదానిని ఆపగలిగింది, కానీ రాజకీయంగా—జాతీయంగా లేదా అంతర్జాతీయంగా క్రూరత్వానికి, హింసకు మరియు క్రూరమైన దురాక్రమణకు అది అడ్డుకట్ట వేయలేదు. అంతకంటే ఘోరమైన వాటిని అనగా, ఆర్థిక లేమి నుండి పర్యావరణ వినాశనము వరకు, జాతి అసమానత నుండి మరెన్నో దీర్ఘకాలిక సామాజిక మరియు సాంస్కృతిక సవాళ్ళను మనము ఇప్పటికీ ఎదుర్కొంటున్నాము.

ఇటువంటి ఈదురు గాలులు మరియు చీకటి రోజులు మన మధ్య ఉన్న యువతను నిరుత్సాహపరుస్తాయి. మన జీవితాల భవిష్యత్తుకు సంబంధించి ఆశావాదం మరియు ఉత్సాహం కోసం వారివైపు మనం చూస్తున్నాము. “యువకులు గొప్ప పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున వారు ప్రపంచానికంతటికి విలువైన వనరు. యువకులు భావి సమాజాన్ని నిర్మిస్తారు”2 అని చెప్పబడింది. అంతేకాక, ఈ సంఘము యొక్క భవితవ్యము మన పిల్లలకు అప్పగించబడుతుంది.

మన ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే యువతలో ఆదర్శవాదం కొంచెం తగ్గుతోందని అర్థమవుతుంది. యేల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ లారీ శాంటోస్ ఇటీవల “మనస్తత్వశాస్త్రం మరియు మంచి జీవితం” పేరుతో ఒక తరగతిని రూపొందించారు. “తరగతి రూపొందించబడిన మొదటి సంవత్సరం, [మొత్తం] ఇంకా పట్టభద్రులు కాని విద్యార్థి సంఘంలో దాదాపు [పావు వంతు] ఆ తరగతిలో చేరారు.”3 640 లక్షల మందికి పైగా ప్రజలు ఆమె పోడ్‌కాస్ట్‌ని సందర్శించారు. ఈ దృగ్విషయం గురించి వ్రాస్తూ, చాలామంది తెలివైన యువ విద్యార్థులు మరియు పెద్దలు “తాము కోల్పోయిన దాని కోసం వెతకడం” లేదా ఇంకా అధ్వాన్నంగా, వారు ఎన్నడూ పొందని దాని కోసం ఆరాటపడడం ఎంతో బాధాకరమని ఒక పాత్రికేయుడు పేర్కొన్నాడు.4

ఈ రోజు మన యువతకు మరియు వారికి సలహా ఇచ్చే తల్లిదండ్రులకు మరియు పెద్దలకు నా విన్నపం ఏమిటంటే, ప్రతి మంచి బహుమతిని ఇచ్చే ఆయన నుండి మనము ఇప్పటికే పొందిన వరాన్ని స్వీకరించడం ద్వారా సంతోషం కోసం మీ అన్వేషణను ప్రారంభించండి.5 ప్రపంచంలోని చాలామంది ఆత్మ గురించి లోతైన ప్రశ్నలు అడుగుతున్న తరుణంలో, మనం యేసు క్రీస్తు సువార్తలోని “శుభవార్త”6తో సమాధానమివ్వాలి. లోక రక్షకుని యొక్క నియమితకార్యము మరియు సందేశాన్ని ఉన్నతంగా ఉంచే యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము, ఇటువంటి అవసరమైన సమయంలో మంచిని కనుగొనడానికి మరియు మంచిని చేయడానికి అత్యంత నిత్య ప్రాముఖ్యత గల మార్గాన్ని అందిస్తుంది.

ఈ తరం యువకులకు “ప్రపంచంపై [మంచి కోసం] మునుపటి తరం కంటే ఎక్కువ ప్రభావం చూపగల సామర్థ్యం” ఉందని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు.”7 జనులందరిలో మనం, “విమోచించు ప్రేమ గీతాన్ని పాడాలి”8, కానీ నిత్య రక్షణ గీతాన్ని మనము పాడడానికి ప్రయత్నించినప్పుడు మనల్ని ప్రక్కకు లాగే ప్రతికూల వైఖరులు మరియు విధ్వంసక అలవాట్లకు వ్యతిరేకంగా రక్షించే క్రమశిక్షణ అనగా “శిష్యత్వం” దానికి అవసరం.

మనం “ఎల్లప్పుడూ ఆశావాద వైఖరిని కలిగి ఉండడానికి ప్రయత్నించినప్పటికీ”9, నిరాశావాది మరియు ఏ పరిస్థితి గురించి అయినా ఎల్లప్పుడూ చెడు విషయాలను గమనించే వ్యక్తి మనకు తారసపడవచ్చు. అతని నినాదం మీకు తెలుసు: “పరిస్థితులు మరింత దిగజారడానికి ముందు అవి ఎల్లప్పుడూ చెడ్డవిగా కనిపిస్తాయి.” ఎంత , హానికరమైన దృక్పథం మరియు దయనీయమైన ఉనికి! అవును, మనం కొన్నిసార్లు మన ప్రస్తుత పరిస్థితి నుండి తప్పించుకోవాలని కోరుకోవచ్చు, కానీ మనం మన శాశ్వతమైన గుర్తింపును విడిచిపెట్టకూడదు. మనల్ని ప్రేమించే సజీవుడైన దేవుని పిల్లలం మనం, మనల్ని క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు మరియు ఎప్పటికీ, మనల్ని విడిచిపెట్టరు. మీరు ఆయన యొక్క అత్యంత విలువైన ఆస్తి. మీరు ఆయన బిడ్డ, మీకు ఆయన ప్రవక్తలు మరియు వాగ్దానాలు, ఆత్మీయ వరములు మరియు బయల్పాటులు, అద్భుతాలు మరియు సందేశాలు, తెరకు ఇరువైపులా దేవదూతలను ఇచ్చారు.10

మర్త్యత్వము కొరకు కుటుంబాలను బలపరిచి, నిత్యత్వము కొరకు వాటిని బంధించే సంఘాన్ని కూడా ఆయన మీకు ఇచ్చారు. ఇది 31,000 కంటే ఎక్కువ వార్డులు మరియు శాఖలను కలిగియుంది, ఇక్కడ ప్రజలు సమకూడి, పాడతారు, ఉపవాసం ఉంటారు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తారు మరియు పేద ప్రజల సంరక్షణ కోసం డబ్బును విరాళంగా ఇస్తారు. ఇక్కడే ప్రతి వ్యక్తి పేరు నమోదు చేయబడుతుంది, వారు లెక్కించబడతారు, పరిచర్య చేయబడతారు మరియు ఇక్కడ సాధారణ స్నేహితులు, పొరుగువారు స్వచ్ఛందంగా ఒకరికొకరు సేవ చేసుకుంటారు, ఇందులో గుమాస్తా పని నుండి సంరక్షకుని బాధ్యత వరకు ఉంటుంది. వేలాదిమంది యువకులు—మరియు వృద్ధ జంటలు కూడా—తమ స్వంత ఖర్చులతో సువార్త పరిచర్య చేస్తారు, వారు ఎక్కడ పని చేస్తారనేది వారిని ప్రభావితం చేయదు మరియు మానవ కుటుంబాన్ని కలిపి బంధించడానికి అవసరమైన పవిత్ర విధులను నిర్వహించడానికి యువకులు మరియు వృద్ధులు దేవాలయాలకు వెళతారు—విభజించబడిన ప్రపంచంలో ఇది సాహసోపేతమైన చర్య మరియు అటువంటి విభజన అనేది తాత్కాలికం మాత్రమే అని అది ప్రకటిస్తుంది. “[మనలో] ఉన్న నిరీక్షణకు”11 మనం చెప్పే కొన్ని కారణాలు ఇవి.

వాస్తవానికి, మన ప్రస్తుత రోజుల్లో, యేసు క్రీస్తు శిష్యులెవరైనా చాలా కష్టమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సవాళ్ళను పరిష్కరించడంలో ప్రభువు యొక్క మార్గనిర్దేశం కోసం ఈ సంఘ నాయకులు తమ జీవితాలను వెచ్చిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొనే కొన్ని క్లిష్ట సమస్యలు వారు ఊహించిన విధంగా ముగియవు, బహుశా ఆయనను అనుసరించడానికి మనం చేపట్టవలసి ఉంటుందని యేసు చెప్పిన సిలువలో అవి భాగమై ఉండవచ్చు.12 దీనికి ఖచ్చితమైన కారణం ఏమిటంటే, చీకటి రోజులు మరియు కష్టమైన సమస్యలు వస్తాయి గనుక పగలు మేఘం నుండి, రాత్రి అగ్ని స్తంభం నుండి ప్రవక్తలకు మార్గనిర్దేశం చేస్తానని, ఇనుప దండాన్ని ఇస్తానని, ఇరుకైన ద్వారం తెరుస్తానని మరియు అన్నింటికి మించి పరుగును తుదముట్టింటే శక్తిని మనకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసారు.13

కాబట్టి మనకు నచ్చని విషయాలు లేదా వ్యక్తులు ఉన్నప్పటికీ, దయచేసి, దయచేసి, సంఘములో చురుకుగా పాల్గొనడం కొనసాగించండి. ఆయన వెలుగులో మునిగిపోండి మరియు ఈ హేతువుకు మీ దీపపు వెలుగును ఇవ్వండి.14 వారు దానిని ప్రాథమికలో సరిగ్గా కలిగియున్నారు: యేసు నిజంగా “[నిన్ను] సన్‌బీమ్ కోసం కోరుతున్నారు.”15

ఇంట్లో చనిపోతున్న తన 12 ఏండ్ల కుమార్తెను స్వస్థపరచమని యూదుల నాయకుడైన యాయీరు యేసును ప్రాధేయపడినప్పుడు, చుట్టుప్రక్కల ఉన్న జనసమూహము చాలాసేపు రక్షకునితో మాటలాడుచుండగా, ఒక సేవకుడు వెంటనే ఆందోళనతో ఉన్న ఈ తండ్రితో, “నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు” అన్నాడు.

“యేసు ఆ మాటవిని–భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను.”16

ఆమె స్వస్థపరచబడింది. మరియు మీరు కూడా స్వస్థపరచబడతారు. “భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము.”

ఈ ప్రేక్షకులలో ఉన్న మీలో ప్రతీఒక్కరూ దేవునికి మరియు ఈ సంఘానికి విలువైనవారు కాబట్టి, నేను ఈ ప్రత్యేకమైన అపొస్తలుని ప్రకటనతో ముగిస్తాను. మీరు ఇంకా పరిశుద్ధాత్మ వరాన్ని పొందకముందే, మీ ఆత్మలో క్రీస్తు యొక్క వెలుగు స్థిరపరచబడినది,17 “ఆ వెలుగు అన్నిటియందు ఉండి, అన్నిటికి జీవమునిచ్చుచున్నది,”18 మరియు భూమిపైన ఇంతకుముందు జీవించిన, ఇకముందు జీవించబోయే వారి హృదయాలలో మంచి కోసం అది ప్రభావం చూపుతుంది. ఆ వెలుగు మిమ్మల్ని రక్షించడానికి మరియు మీకు బోధించడానికి ఇవ్వబడింది. దాని ప్రధాన సందేశాలలో ఒకటి ఏమిటంటే, అన్ని బహుమతులలోకెల్లా అత్యంత విలువైనది మన జీవితం, ఈ బహుమతి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా మాత్రమే శాశ్వతంగా పొందబడుతుంది. లోకమునకు వెలుగు మరియు జీవమునైయున్న,19 దేవుని అద్వితీయ కుమారుడు మరణాన్ని జయించడం ద్వారా మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు.

జీవితమనే ఆ బహుమతికి మనం పూర్తిగా కట్టుబడి ఉండాలి మరియు ఈ పవిత్ర బహుమతిని వదులుకునే ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయాలి. నాయకులు, సలహాదారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు—నిస్పృహ, నిరాశ లేదా స్వీయ-హాని యొక్క ఏవైనా సంకేతాల కోసం చూడండి. మీ సహాయం అందించండి. వినండి. సముచితమైనప్పుడు జోక్యం చేసుకోండి.

పోరాడుతున్న మన యువత ఎవరైనప్పటికీ, మీ ఆందోళనలు లేదా ఇబ్బందులు ఏమైనప్పటికీ, ఆత్మహత్య ద్వారా మరణించడం స్పష్టమైన సమాధానం కాదు. ఇది మీరు అనుభూతి చెందుతున్న లేదా మీరు కలిగించే బాధను తగ్గించదు. తాను పొందగలిగిన వెలుగంతా చాలా అవసరమైన ప్రపంచంలో, ఈ ప్రపంచం సృష్టించబడక ముందు దేవుడు మీ ఆత్మలో ఉంచిన శాశ్వతమైన కాంతిని దయచేసి తగ్గించవద్దు. ఎవరితోనైనా మాట్లాడండి. సహాయము కోసం అడగండి. ఏ ప్రాణాన్ని కాపాడడానికి క్రీస్తు తన జీవితాన్ని ఇచ్చారో, ఆ ప్రాణాన్ని నాశనం చేయవద్దు. ఈ మర్త్య జీవితంలోని పోరాటాలను మీరు భరించగలరు, ఎందుకంటే వాటిని భరించేందుకు మేము మీకు సహాయం చేస్తాము. మీరు ఊహించిన దానికంటే మీరు బలవంతులు. ఇతరుల నుండి మరియు ముఖ్యంగా దేవుని నుండి సహాయం లభిస్తుంది. మీరు ప్రేమించబడినవారు, విలువైనవారు మరియు కావలసినవారు. మీరు మాకు కావాలి. “భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము.”

మీ కంటే మరియు నా కంటే చాలా నిరాశాజనకమైన పరిస్థితులను ఎదుర్కొన్న వ్యక్తి ఒకసారి ఇలా యెలుగెత్తి చెప్పాడు: “ముందుకు వెళ్ళుడి [నా ప్రియమైన యువ స్నేహితులారా]. ధైర్యము తెచ్చుకొనుడి, … జయము పొందుటకు, ముందుకు సాగుడి! మీ హృదయములు సంతోషించి, గొప్ప ఆనందమును పొందనీయుడి.”20 మనం సంతోషించవలసింది చాలా ఉంది. మనము ఒకరికొకరు తోడుగా ఉన్నాము మరియు మనకు ఆయన తోడైయున్నారు. మిమ్మల్ని పొందే అవకాశాన్ని మా నుండి నిరాకరించవద్దని ప్రభువు, మన బోధకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన మరియు పరిశుద్ధమైన నామములో నేను వేడుకుంటున్నాను, ఆమేన్.