సర్వసభ్య సమావేశము
ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును: మనము విజేతల కంటే ఎక్కువగా ఉండవచ్చు
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


12:15

ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి లేచును:

మనము విజేతల కంటే ఎక్కువగా ఉండవచ్చు

మీరు బ్రతకడానికి మీకు శక్తిని ఇవ్వడానికి యేసు ఈ ప్రపంచంలోని నిందలు అధిగమించడం మాత్రమే కాకుండా, ఒక రోజు ఆయన ద్వారా అధిగమించుటకు మరియు జయించుటకు కూడ శక్తిని ఇస్తారు.

మారిన్, నేను ఎల్డర్ హాలండ్‌ను మరియు పరిస్థితులు ప్రతికూలముగా మారబోవుచున్నాయి.

మనము విజేతల కంటే ఎక్కువగా ఉండవచ్చు

మనమందరం మనుగడ కథలపై ఆసక్తి కలిగియున్నాము. నిర్భయముగల అన్వేషకుల కథలను మనము విన్నాము మరియు అన్ని అసమానతలు మరియు అంచనాలకు వ్యతిరేకంగా తమను తాము సజీవంగా ఉంచుకునే సాధారణ వ్యక్తుల కథలను మనము వింటాము, మరియు “నేను అలా చేసి ఉండవచ్చా?” అని మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఉండలేము.

బ్రిటీష్ అన్వేషకుడు ఎర్నెస్ట్ షాకిల్టన్ మరియు అతని ఓడ హెచ్‌ఎమ్‌ఎస్, ఎండ్యూరెన్స్ సిబ్బంది, అంటార్కిటికాకు తన యాత్రలో దాదాపు రెండు సంవత్సరాల పాటు బంజరు మంచుతో నిండిన బంజరు భూమిలో ఓడ ధ్వంసమైన దాని గురించి నేను వెంటనే ఆలోచించాను. కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, షాకిల్టన్ యొక్క అసాధారణ నాయకత్వం మరియు లొంగని సంకల్పం అతని మనుషుల ప్రాణాలను కాపాడింది.

తరువాత అమెరికా అంతరిక్ష విమానం అపోలో 13 సిబ్బంది చంద్రుడిపైకి దిగడానికి అంతరిక్షం గుండా వెళ్లుట గురించి నేను ఆలోచిస్తున్నాను! కానీ ఆక్సిజను ట్యాంక్ పేలడంతో విపత్తు సంభవించింది, మరియు మిషను నిలిపివేయవలసి వచ్చింది. ఆక్సిజన్ కొరత, సిబ్బంది మరియు అంతరిక్ష నౌక యొక్క విమానాన్ని నియంత్రించే వ్యక్తుల సమూహం తెలివిగా మెరుగుపరచి, ముగ్గురు వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకువచ్చారు.

తరువాత యుద్ధంలో బలిపశువులుగా చేయబడి, శిబిరాల్లో బంధించబడి మరియు శరణార్థులుగా మారిన వ్యక్తులు మరియు కుటుంబాల ఆశ్చర్యకరమైన మనుగడ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను, వాళ్లు వీరోచితంగా మరియు ధైర్యంగా తోటి బాధితుల కోసం ఆశల జ్వాలని సజీవంగా ఉంచి, క్రూరత్వాన్ని ఎదుర్కొని మంచితనాన్ని ప్రసాదిస్తారు, మరియు వారు కేవలం ఒక రోజు మాత్రమే భరించేందుకు ఇతరులకు సహాయం చేయగలరు.

ఈ తీవ్రమైన పరిస్థితులలో ఏదైనా ఒక దానిలో మీరు నేను జీవించగలమా?

అయినప్పటికీ, బహుశా మీలో కొందరు ప్రాణాలతో బయటపడిన వారి వృత్తాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు మరియు నింద, నిర్లక్ష్యం, బెదిరింపు, గృహ హింస బాధితురాలిగా లేదా ఈ రకమైన బాధ ఏదైనా ఇప్పుడు మీరు జీవిస్తున్న ఒక మనుగడ కధగా మీ పరిస్థితి గురించి గ్రహిస్తారు. వినాశకరమైన ఓడ ప్రమాదం లేదా అకస్మాత్తుగా ఆగిపోయిన ఆశాజనక మిషనువలె భావించే పరిస్థితిని తట్టుకుని నిలబడేందుకు మీరు మీ స్వంత నిర్విరామ ప్రయత్నాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఎప్పటికైనా విడిపించబడతారా; మీరు మీ స్వంత మనుగడ కథ ద్వారా దీన్ని చేస్తారా?

దానికి సమాధానము అవును. మీరు ప్రాణాలతో బయపడగలరు. నిజానికి మీరు ఇప్పటికే విడిపించబడ్డారు; మీరు అనుభవిస్తున్న వేదనను అనుభవించిన మరియు మీరు అనుభవిస్తున్న తీవ్రమైన వేదనను భరించిన వ్యక్తి ద్వారా—మీరు ఇదివరకే రక్షింపబడ్డారు.1 మీరు బ్రతకడానికి మీకు శక్తిని ఇవ్వడానికి యేసు ఈ ప్రపంచంలోని నిందలు2 అధిగమించడం మాత్రమే కాకుండా, ఒక రోజు, ఆయన ద్వారా, జయించుటకు—నొప్పి, దుఃఖం, వేదనలను పూర్తిగా అధిగమించి, వాటి స్థానంలో శాంతి ఉంచబడుట చూచుటకు కూడా మీకు శక్తిని ఇచ్చాడు.

అపొస్తలుడైన పౌలు అడుగుతున్నాడు:

“క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? …

“అయినను, మనలను ప్రేమించిన వాని ద్వారా మనమువీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.3

నిబంధన ఇశ్రాయేలుకు వాగ్దానాలు

సర్వసభ్య సమావేశములో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ క్రింది ఆహ్వానాన్ని జారీ చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ఇలా చెప్పారు: “మీరు లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు … , నిబంధన ఇశ్రాయేలు కోసం ఆయన చేస్తానని ప్రభువు వాగ్దానము చేసిన సమస్తమును ఒక జాబితాగా చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు దిగ్భ్రాంతి చెందుతారని నేననుకుంటున్నాను!”4

మా కుటుంబం కనుగొన్న కొన్ని శక్తివంతమైన మరియు ఓదార్పునిచ్చే వాగ్దానాలు ఇక్కడున్నాయి. ఈ మాటలు ప్రభువు మీతో—బ్రతికియున్న మీతో మాట్లాడుతున్నట్లు ఊహించండి—ఎందుకనగా అవి మీ కోసమే:

భయపడకుడి.5

మీ దుఃఖములు నాకు తెలిసే యున్నవి, మరియు నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను.6

నేను మిమ్మల్ని విడువను.7

నా నామము మీపైనుండును, మరియు నా దూతలు మీకు బాధ్యత వహిస్తారు.8

నేను మీ మధ్య అద్భుతములు చేయుదును.9

నాతో నడువుడి; నా యొద్ద నేర్చుకొనుడి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.10

నేను మీ మధ్యలో ఉన్నాను.11

మీరు నా సొత్తు.12

బ్రతికి ఉన్న వారికి

ఆ హామీలను చాలా దృష్టిలో పెట్టుకొని, ఇతరుల క్రూర చర్యలవలన వారి స్వంత మనుగడ కథ నుండి బయటపడే దారి లేదని భావించే వారితో నేను నేరుగా మాట్లాడాలని కోరుతున్నాను. ఇది మీ మనుగడ కథ అయితే, మేము మీతోపాటు దుఃఖిస్తాము. మీరు కలవరము, అవమానము, భయమును అధిగమించాలని మేము కోరుతున్నాము, మరియు యేసు క్రీస్తు ద్వారా జయించాలని ఆపేక్షిస్తున్నాము.

బాధితుడు నుండి బ్రతికియుండుట నుండి విజేత వరకు

మీరు ఏ విధమైన నింద, గాయం, దౌర్జన్యము, లేక అణచివేతను అనుభవించిన యెడల, ఈ సంఘటనలు ఏదోవిధంగా మీ పొరపాటని మరియు మీరు అనుభవించే అవమానము మరియు నేరభావనను మోయడానికి మీరు అర్హులనే భావనతో మీరు విడిచిపెట్టబడియుండవచ్చు. ఇటువంటి ఆలోచనలను మీరు కలిగియుండవచ్చు:

  • నేను దీనిని నిరోధించాల్సింది.

  • దేవుడు నన్ను ఇక ప్రేమించడంలేదు.

  • నన్ను ఎవరూ ప్రేమించరు.

  • నేను బాగు చేయలేనివిధంగా దెబ్బతిన్నాను.

  • రక్షకుని ప్రాయశ్చిత్తము ఇతరులకు అన్వయిస్తుంది, కానీ నాకు కాదు.

ఈ తప్పు ఆలోచనలు మరియు భావనలు కుటుంబము, స్నేహితులు, లేక నిపుణుల సహాయమును కోరడానికి ఆడ్డంకిగా ఉండియుండవచ్చు, కాబట్టి మీరు ఒంటరిగా కష్టపడ్డారు. మీరు నమ్మిన వారి నుండి మీరు సహాయము కోరిన యెడల, మీరు ఇప్పటికీ అవమానకరమైన ఆలోచనలతో మరియు స్వీయ-ద్వేషంతో పోరాడుతూ ఉండవచ్చు. ఈ సంఘటనల ప్రభావము అనేక సంవత్సరాలుగా నిలిచియుండవచ్చు. ఒకరోజు మీరు మంచిగా భావిస్తారని మీరు ఆశిస్తారు, కానీ ఎదోవిధంగా ఆ రోజు ఇంకా రాలేదు.

నిందించేవారు లేదా ఎవరైనా విరుద్ధంగా ఏది మాట్లాడినా, దుర్వినియోగం మీ తప్పు కాదు, కాదు, మరియు ఎప్పటికీ మీ తప్పు కాదు. మీరు క్రూరత్వం, వరుసకాని స్త్రీ పురుష సంగమం లేదా ఇతర వక్రబుద్ధికి బలి అయినప్పుడు, మీరు పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు; మీరు బాధ్యత వహించరు.

వేరొకరు మీకు చేసిన దాని కారణంగా మీరు తక్కువ యోగ్యతగల వారు లేదా తక్కువ విలువైనవారు లేదా మానవునిగా లేదా దేవుని కుమార్తెగా లేదా కుమారునిగా తక్కువ ప్రేమించబడరు.

తృణీకరించబడిన వ్యక్తిగా దేవుడు ఇప్పుడు చూడరు లేదా ఎప్పటికీ మిమ్మల్ని చూడరు. మీకేమి జరిగినప్పటికినీ, ఆయన మిమ్మల్ని బట్టి సిగ్గుపడడు లేక మీయందు నిరాశపడడు. మీరు ఇంకా కనుగొనే విధానములో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన వాగ్దానాలను మీరు నమ్మినప్పుడు, మీరు “(ఆయన) దృష్టికి ప్రియమైనవారని” ఆయన చెప్పినప్పుడు మీరు దానిని కనుగొంటారు.13

మీకు జరిగిన భయంకరమైన సంగతుల ద్వారా మీరు నిర్వచించబడరు. మహిమకరమై సత్యములో మీరు, సృష్టికర్త యొక్క పరిపూర్ణమైన, అనంతమైన ప్రేమ ద్వారా దేవుని కుమారుడు లేదా కుమార్తెగా మీ శాశ్వతంగా ఉనికిలో ఉన్న గుర్తింపు ద్వారా నిర్వచించబడ్డారు మరియు మీరు సంపూర్ణంగా మారి, మీ స్వస్థతను పూర్తి చేయమని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు.

అది అసాధ్యమైనదిగా కనబడినప్పటికినీ, అసాధ్యమైనదిగా భావించినప్పటికినీ, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క విమోచించు శక్తి అద్భుతము ద్వారా స్వస్థత రాగలదు, ఆయన “తన రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును.” 14

మన కనికరముగల రక్షకుడు, అంధకారము మరియు దుర్మార్గముపై విజయాన్ని పొంది, అన్ని తప్పులను సరిదిద్దగల శక్తిని కలిగియున్నాడు, ఇతరులచే అన్యాయానికి గురైన వారికి జీవాన్ని ఇచ్చే సత్యము.15

మీకు ఏది జరిగినప్పటికిని, రక్షకుడు అన్ని విషయాల క్రిందుగా దిగివచ్చాడు. దాని వలన మీకేమి జరిగినప్పటికీ, నిజమైన భయము, అవమానము ఎలా ఉంటాయో మరియు విడిచిపెట్టబడుట, కృంగియుండుట ఎలాగో ఆయనకు ఖచ్చితంగా తెలుసు.16 ఆయన ప్రాయశ్చిత్త బాధ యొక్క లోతుల నుండి, శాశ్వతంగా కోల్పోయారని మీరు భావించిన నిరీక్షణను, మీరు ఎప్పటికి పొందలేరని నమ్మిన బలాన్ని, మరియు మీరు సాధ్యమవుతుందని ఊహించని స్వస్థతను రక్షకుడు ఇస్తారు.

నిందించే ప్రవర్తన ప్రభువు మరియు ఆయన ప్రవక్తల చేత స్పష్టంగా ఖండించబడింది

ఏ గృహములోనైనా, ఏ దేశంలోనైనా లేదా ఏ సంస్కృతిలోనైనా ఏ రకమైన శారీరక, లైంగిక, భావోద్వేగ లేదా పదజాల వేధింపులకు చోటు లేదు. ఒక భార్య లేదా బిడ్డ చేసేది లేదా చెప్పేది ఏమైన వారిని కొట్టడానికి “న్యాయమని ఒప్పించదు.” ఏ దేశంలో లేదా సంస్కృతిలో, ఎవరూ అధికారంలో ఉన్న వేరొకరి నుండి లేదా పెద్ద మరియు బలమైన వ్యక్తి నుండి దూకుడు లేదా హింసను ఎప్పుడూ “అడగరు.”

వేధించే వారు మరియు వారి తీవ్రమైన పాపములు దాయాలని కోరేవారు కొంతకాలము శిక్షను తప్పించుకోవచ్చు. కానీ సమస్తమును చూచే ప్రభువు హృదయము యొక్క తలంపులు మరియు ఉద్దేశములను ఎరుగును.17 ఆయన న్యాయముగల దేవుడు, మరియు ఆయన దైవిక న్యాయము అందించబడుతుంది.18

అద్భుతంగా, నిజంగా పశ్చాత్తాపము చెందిన వారికి ప్రభువు కనికరముగల దేవుడు కూడ. ఒకప్పుడు తమను తాము హింసించుకున్న వారితో సహా—వేధించేవారు తమ పాపాన్ని ఒప్పుకొని, విడిచిపెట్టి, పరిహారము మరియు తిరిగి చెల్లించడానికి వారు సమస్త శక్తితో చేసిన వారికి, క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క అద్భుతం ద్వారా క్షమాపణ పొందగలరు.

తప్పుగా వేధింపబడినవారు ఈ ఆరోపణల యొక్క మిక్కిలి తీవ్రతను మరియు బాధను అనుభవించారు మరియు అన్యాయంగా శిక్షించబడ్డారు. కానీ వారి కొరకు రక్షకుని యొక్క ప్రత్యమ్నాయ బాధ మరియు చివరకు సత్యము ప్రబలమవుతుందనే జ్ఞానము చేత వారు కూడ దీవించబడ్డారు.

కానీ పశ్చాత్తాపపడని వేధించేవారు, తమ ఘోరమైన నేరాలకు లెక్క చెప్పడానికి ప్రభువు ముందు నిలబడతారు.

ఏవిధమైన వేధింపును ఖండించుటలో ప్రభువు స్వయంగా స్పష్టంగా చెప్పాడు: “ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో, … వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు.”19

ముగింపు

అతి భయంకరంగా గాయపడిన ప్రియమైన స్నేహితులారా—ఆ విషయం కొరకు, జీవితంలోని అన్యాయాలను భరించిన ఎవరికైనా—మీరు ఒక క్రొత్త ఆరంభము మరియు తాజాగా ప్రారంభించవచ్చు. గెత్సేమనే, మరియు కల్వరిలో, యేసు “మీరు నేను ఎప్పటికి అనుభవించిన సమస్త వేదన మరియు బాధను … తనపై తీసుకొన్నాడు,”20 మరియు ఆయన సమస్తమును జయించాడు! చాపబడిన బాహువులతో, రక్షకుడు మీకు స్వస్థపరచే వరమును ఇస్తున్నాడు. ధైర్యము, సహనము, మరియు ఆయనపై విశ్వాసముగల దృష్టితో, త్వరలో మీరు ఈ వరమును పూర్తిగా అంగీకరించగలరు. మీరు మీ బాధను విడిచిపెట్టి, ఆయన పాదము వద్ద దానిని విడిచిపెట్టుము.

మీ మృదువైన రక్షకుడు ప్రకటించాడు, “దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు: [మీరు] జీవము కలుగుటకును దానిని [మీరు] సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని.”21 మీరు బ్రతియున్నారు, మీరు స్వస్థపరచబడగలరు, యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు కృపతో మీరు అధిగమించగలరు, జయించగలరని మీరు నమ్మవచ్చు.

అసాధ్యమైనదిగా కనబడిన దానిలో యేసు ప్రత్యేకతను కలిగియున్నాడు. అసాధ్యమైనవాటిని సుసాధ్యం చేయడానికి, విడిపించలేని దానిని విమోచించడానికి, వైద్యం చేయలేని దానిని స్వస్థపరచడానికి, అన్యాయమైన వాటిని సరిచేయడానికి, వాగ్దానం చేయలేని వాటిని వాగ్దానం చేయడానికి ఆయన ఇక్కడకు వచ్చారు.22 ఆయన నిజముగా దానియందు మంచిగా ఉన్నాడు. వాస్తవానికి, ఆయన దానియందు పరిపూర్ణుడిగా ఉన్నాడు. మన వైద్యుడైన, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

మరింత సమాచారం మరియు వనరుల కోసం, ChurchofJesusChrist.orgలోని లైఫ్ హెల్ప్ విభాగంలో మరియు గోస్పెల్ లైబ్రరీ యాప్‌లో “హింస” చూడండి.