“అప్పుడు నేను బలహీనమైన విషయాలు బలమైనవిగా చేయగలను”
మనల్ని మనం తగ్గించుకొని, యేసు క్రీస్తుయందు విశ్వసించిన యెడల అప్పుడు ఆయన కృప మరియు ఆయన అంతములేని ప్రాయశ్చిత్త త్యాగము మారడానికి మనకు సాధ్యపరుస్తుంది.
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్, ఒకసారి చెరసాల వార్డెన్ క్లింటన్ డఫ్ యొక్క వృత్తాంతాన్ని పంచుకున్నారు. “1940, 1950 సంవత్సరాలలో, [వార్డన్ డఫ్] తన చెరసాలలోని పురుషులకు పునరావాసం కల్పించడంలో అతడి ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఒక విమర్శకుడు చెప్పాడు, “చిరుతపులులు తమ చర్మపు ఆకృతిని మార్చుకోలేవు, మనుషులు కూడా తమ స్వభావాన్ని మార్చుకోలేరు.”
“వార్డన్ డఫ్ జవాబిచ్చాడు, నేను చిరుతపులులతో పని చేయనని నీకు తెలియాలి. నేను మనుష్యులతో పని చేస్తాను మరియు మనుష్యులు ప్రతిరోజు మారతారు.’”1
పురుషులు, స్త్రీలు మారలేరు అనేది సాతాను యొక్క గొప్ప అబద్ధాలలో ఒకటి. మనం మార్చలేము లేదా ఇంకా అధ్వాన్నంగా మారకూడదు అని ప్రపంచం చెప్పినట్లు ఈ అసత్యం అనేక రకాలుగా చెప్పబడుతుంది మరియు తిరిగి చెప్పబడుతుంది. మన పరిస్థితులు మనల్ని నిర్వచిస్తాయని మనము బోధించబడ్డాము. “నిజంగా మనం ఎవరో అంగీకరించాలి,” మరియు “మన నిజమైన స్వభావానికి మనము ప్రామాణికంగా ఉండాలి” అని ప్రపంచం చెబుతుంది.
మనము మార్పు చెందగలము
వాస్తవానికి మనము ప్రామాణికంగా ఉండటం మంచిది అయినప్పటికీ, దైవిక స్వభావంతో మరియు ఆయనలా మారాలనే గమ్యంతో మనం దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా, మన నిజమైన, యదార్థమైన స్వభావాలకు ప్రామాణికంగా ఉండాలి.2 ఈ దైవిక స్వభావము మరియు గమ్యముకు ప్రామాణికంగా ఉండటం మన లక్ష్యమైతే, అప్పుడు మనమందరం మారవలసిన అవసరమున్నది. మార్పుకు సంబంధించిన లేఖన పదము పశ్చాత్తాపము. “అనేకమంది జనులు,” పశ్చాత్తాపము ఒక శిక్ష అని—అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులలో తప్ప దానికి దూరంగా ఉండాలని పరిగణిస్తారు. కాబట్టి, యేసు నిన్ను, నన్ను “పశ్చాత్తాపపడమని’ అడిగినప్పుడు, ఆయన మార్చుకోమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు.”3
దేవుని యొక్క షరతులు
కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసేవారు కంప్యూటర్‌లకు ఏమి చేయాలో చెప్పడానికి షరతులతో కూడిన ప్రకటనలను ఉపయోగిస్తారు. ఇది కొన్నిసార్లు అయితే-అప్పుడుగా సూచించబడింది. X సత్యమైతే, అప్పుడు y సత్యమే.
ప్రభువు పరిస్థితుల ద్వారా కూడా పనిచేస్తారు: విశ్వాసం యొక్క పరిస్థితులు, నీతి యొక్క పరిస్థితులు, పశ్చాత్తాపం యొక్క పరిస్థితులు. దేవుని నుండి షరతులు గల ప్రకటనలకు అనేక మాదిరులున్నాయి.
“మీరు ఆజ్ఞలను పాటించి, అంతము వరకు సహించిన యెడల [అప్పుడు] మీరు నిత్యజీవము కలిగియుంటారు, అది దేవుని బహుమానములన్నింటిలో కెల్లా గొప్పది.”4
లేదా “ఒకవేళ మీరు యధార్థహృదయముతో, నిజమైన ఉద్దేశముతో, క్రీస్తునందు విశ్వాసము కలిగి అడిగిన యెడల, [అప్పుడు]ఆయన దానియొక్క సత్యమును పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీకు తెలియజేయును.”5
దేవుని ప్రేమ, అంతములేనిది, పరిపూర్ణమైనది అయినప్పటికీ, షరతులకు లోబడుతుంది.6 ఉదాహరణకు:
“నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొనిన యెడల, [అప్పుడు] నా ప్రేమయందు నిలిచియుందురు.”7
ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ బోధించినప్పుడు, ఈ సువార్త సత్యాన్ని మరింతగా వివరించారు: ‘రక్షకుడు నన్ను నన్నుగా ప్రేమిస్తున్నారు’ అని కొందరు తరుచుగా చెప్తారు మరియు అది ఖచ్చితంగా సత్యము. కానీ మనం ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆయన మనలో ఎవరినీ తన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళలేరు, ‘ఏలయనగా అపవిత్రమైనది ఏదియు అక్కడ ఉండజాలదు, లేదా ఆయన సన్నిధిలో నివసించలేదు.’ [మోషే 6:57]. మొదట మన పాపాలు పరిష్కరించబడాలి.”8
బలహీనమైన సంగతులు బలమైనవి కాగలవు
మారడానికి మనకు సహాయపడే దేవుని శక్తిని పొందే దీవెన కూడ షరతులతో కూడినది. మోర్మన్ గ్రంథములో ప్రవక్త మొరోనై ద్వారా మాట్లాడుతూ, రక్షకుడు బోధించాడు: “మరియు మనుష్యులు నా యొద్దకు వచ్చిన యెడల, నేను వారికి వారి బలహీనతను చూపెదను. వారు తగ్గించుకొనునట్లు నేను మనుష్యులకు బలహీనతనిచ్చెదను, మరియు నా యెదుట తమను తగ్గించుకొను మనుష్యులందరికి నా కృప చాలును. ఏలయనగా నా యెదుట వారు తమను తగ్గించుకొనిన యెడల మరియు నా యందు విశ్వసించిన యెడల, అప్పుడు నేను బలహీనమైన సంగతులను వారికి బలమైనవిగా చేస్తాను.”9
ఇక్కడ ప్రభువు బోధిస్తున్న దానిని మరింత దగ్గరగా చూస్తే, ఆయన మొదట, పురుషులు, స్త్రీలకు బలహీనతను ఇస్తానని చెప్పారు, అది ఏకవచనము, అది పతనమైన లేక శరీరముగల ప్రాణులుగా మన మర్త్య అనుభవములో భాగముగా ఉన్నది. ఆదాము యొక్క పతనము వలన మనము ప్రకృతి సంబంధియైన పురుషులు, స్త్రీలుగా మారాము. కానీ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మనము మన బలహీనతను లేక మన పతనమైన స్వభావాలను జయించగలము.
తరువాత ఆయన తన కృప చాలును అని చెప్పెను మరియు మనల్ని మనం తగ్గించుకొని, ఆయనయందు విశ్వసించిన యెడల అప్పుడు ఆయన బలహీనమైన సంగతులను [బహువచనము] [మనకు] బలమైనవిగా చేయును. మరొక మాటలలో, మనము మొదట మన పతనమైన స్వభావాలను, మన బలహీనతను మార్చుకున్నప్పుడు, అప్పుడు మనము మన ప్రవర్తనలు, మన బలహీనతలను మార్చుకోగలుగుతాము.
మార్పు చెందడానికి అర్హతలు
ప్రభువు యొక్క మాదిరి ప్రకారము మార్చుకోవడానికి కావాలిసిన వాటిని సమీక్షిద్దాం:
మొదట, మనల్ని మనం తగ్గించుకోవాలి. మార్పు కోసం ప్రభువు యొక్క షరతు తగ్గించుకొనుట. “వారు నా యెదుట తమను తాము తగ్గించుకొనిన యెడల” ఆయన చెప్పాడు.10 తగ్గింపుకు వ్యతిరేకము గర్వము. దేవుడు ఆలోచించినది లేదా భావించిన దానికంటే మనము ఆలోచించేది లేదా భావించినది ప్రాధాన్యతను పొందినప్పుడు గర్వము ఉంటుంది.
“ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి … మరియు ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము ద్వారా ఒక పరిశుద్ధుడై మరియు విధేయుడు, సాత్వికుడు, వినయము, సహనము కలిగి ప్రేమతో నిండి ఒక పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లు కూడ అతనిపై చేయుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడాలని”11 రాజైన బెజమిన్ బోధించాడు.
మారడానికి బదులుగా, మనము ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి వినయము మరియు విధేయతగల వారిగా మారాలి. జీవిస్తున్న ప్రవక్తను అనుసరించడానికి తగినంత వినయముగా మనముండాలి. దేవాలయ నిబంధనలను చేసి, వాటిని పాటించడానికి తగినంతగా తగ్గించుకోవాలి. ప్రతిరోజు పశ్చాత్తాపపడుటకు తగినంత వినయము. “(మన) హృదయాలను దేవునికి లోబరచుటకు,” మారాలని కోరుకొనుటకు తగినంత వినయముగా మనము ఉండాలి.12
రెండవది, మనము యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండాలి. మరలా, రక్షకుని యొక్క మాటలు: “వారు నా యెదుట తమను తగ్గించుకొని, నాయందు విశ్వసించిన యెడల,”13 మన బలహీనతలను జయించుటకు శక్తిని ఆయన మనకిస్తాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముతో జతపరచబడి, దీనమనస్సు, ఆయన ప్రాయశ్చిత్తము వలన లభ్యమయ్యే ఆయన కృప యొక్క సాధ్యపరచే శక్తి మరియు సంపూర్ణ దీవెనలకు చేరవగుటకు మనకు సాధ్యపరచును.
“మనల్ని శుద్ధిచేయడానికి, స్వస్థపరచడానికి మరియు బలపరచడానికి యేసు క్రీస్తు శక్తి కలిగియున్నారనే విశ్వాసంతో నిజమైన పశ్చాత్తాపము మొదలవుతుందని. … అధ్యక్షులు నెల్సన్ బోధించారు. మన జీవితాల్లో దేవుని శక్తిని తెరచేది మన విశ్వాసమే.”14
మూడవది, ఆయన కృప ద్వారా ఆయన బలహీనమైన సంగతులను బలమైనవిగా చేయగలడు. మనల్ని మనం తగ్గించుకొని, యేసు క్రీస్తుయందు విశ్వసించిన యెడల అప్పుడు ఆయన కృప మారడానికి మనకు సాధ్యపరుస్తుంది. మరొక మాటలలో, ఆయన మారడానికి మనకు శక్తిని ఇస్తాడు. “మనుష్యులందరికీ నా కృప చాలును,” అని ఆయన చెప్పినట్లుగా, ఇది సాధ్యము.15 మనము మారడానికి కోరినప్పుడు, ఆయన బలపరచి, సాధ్యపరచే కృప అన్ని ఆడ్డంకులను, అన్ని సవాళ్లను, మరియు అన్ని బలహీనతలను జయించడానికి మనకు శక్తిని ఇస్తుంది.
మన గొప్ప బలహీనతలు, మన గొప్ప బలములు కాగలవు. మనము మారగలము మరియు “నూతన సృష్ఠి కాగలము.” 16 బలహీనమైన సంగతులు ఖచ్చితంగా, “(మనకు) బలమైనవిగా మారగలవు.” 17
మనము మారి, పశ్చాత్తాపపడి మరియు ఉత్తమంగా మారునట్లు రక్షకుడు తన అంతములేని, నిత్యమైన ప్రాయశ్చిత్తఃమును ప్రణాళిక చేసాడు. వాస్తవంగా మనము క్రొత్తగా జన్మించగలము. మనము అలవాట్లు, వ్యసనాలు, మరియు “చెడు చేయుటకు కోరికను,”18 కూడా జయించగలము. పరలోకమందున్న తండ్రి యొక్క కుమారులు, కుమార్తైలుగా, మనము మారడానికి మనలో శక్తిని కలిగియున్నాము.
మార్పు చెందినవారి మాదిరులు
లేఖనాలు మార్పు చెందిన పురుషులు, స్త్రీల మాదిరులతో నిండియున్నవి.
సౌలు ఒక పరిసయ్యుడు మరియు ప్రారంభ క్రైస్తవ సంఘము యొక్క చురుకైన హింసకుడు,19 ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడైన పౌలుగా మారాడు.
ఆల్మా దుష్ట రాజైన నోవాహ్ యొక్క న్యాయస్థానంలో యాజకునిగా ఉన్నాడు. అతడు అబినడై మాటలు విన్నాడు, పూర్తిగా పశ్చాత్తాపం చెందాడు, మరియు మోర్మన్ గ్రంథములో గొప్ప మిషనరీలలో ఒకరిగా మారాడు.
అతడి కుమారుడు ఆల్మా సంఘాన్ని నాశనం చేస్తూ తన యౌవనాన్ని గడిపాడు. అతడు హృదయములో మార్పు చెంది, తన స్వసిద్ధంగా శక్తివంతుడైన మిషనరీగా మారేంత వరకు అతడు “మిక్కిలి దుష్ఠులైన పాపుల”20 మధ్య ఉన్నాడు.
మోషే ఫరో కుటుంబములోనికి దత్తత తీసుకోబడ్డాడు మరియు ఐగుప్తు యువరాజుగా విలాసవంతంగా పెరిగాడు. కానీ అతడు నిజముగా ఎవరో గ్రహించి, తన దైవిక గమ్యమును తెలుసుకొన్నప్పుడు, అతడు మారాడు మరియు పాత నిబంధనలో గొప్ప ధర్మశాస్త్రమును ఇచ్చే ప్రవక్త అయ్యాడు.21
నా భార్య తాత, జేమ్స్ బి. కీసర్, తన హృదయములో బలమైన మార్పును బట్టి నేను ఎల్లప్పుడు ఆకట్టుకోబడ్డాను.22 1906 లో సాల్ట్‌లేక్ వేలీలో విశ్వాసుడైన కడవరి దిన పరిశుద్ధ అగ్రగామిగా పుట్టి, అతడు చిన్న వయస్సులో తన తల్లిని కోల్పోయాడు మరియు తన బాల్యమంతా కష్టపడ్డాడు. అతడి యవ్వన వయోజన సంవత్సరాలు సంఘానికి దూరంగా గడపబడ్డాయి; ఆ సమయంలో అతడు అనేక చెడు అలవాట్లును అలవరచుకొన్నాడు. అయినప్పటికీ, అతడు విశ్వాసురాలైన స్త్రీని కలుసుకొని, వివాహము చేసుకున్నాడు మరియు వారు ఐదుగురు పిల్లలను కని పెంచారు.
1943లో, గొప్ప మాంద్యము యొక్క కష్టమైన సంవత్సరాల తరువాత మరియు రెండవ ప్రపంచ యుద్ధమందు, తన స్నేహితులు, కుటుంబము చేత పిలవబడినట్లుగా బడ్, ఉద్యోగాన్ని వెదకడానికి యూటాను విడిచి, కాలిఫోర్నియా, లాస్‌ఎంజెల్స్‌కు మారాడు. ఇంటికి దూరంగా ఉన్న ఈ సమయంలో, అతడు తన సహోదరి, వారి వార్డు యొక్క బిషప్పుగా సేవ చేస్తున్న ఆమె భర్తతో కలిసి ఉన్నాడు.
అతడి సహోదరి, బావ యొక్క ప్రేమ, ప్రభావముతో, అతడు సంఘముపట్ల తన ఆసక్తిని తిరిగి పొందసాగాడు మరియు నిద్రపోకముందు ప్రతి రాత్రి మోర్మన్ గ్రంథమును చదవడం ప్రారంభించాడు.
ఒక రాత్రి, ఆల్మా 34 అధ్యాయము చదువుతుండగా, అతడి క్రింది మాటలను చదివినప్పుడు అతడి హృదయము తాకబడింది.
“అవును, మీరు ముందుకు రావలెనని మరియు ఇక ఏమాత్రము మీ హృదయములను కఠినపరచుకొన రాదని, నేను కోరుచున్నాను. …
“ఏలయనగా ఇదిగో ఈ జీవితంము దేవుని కలుసుకొనుటకు మనుష్యులు సిద్ధపడు సమయమైయున్నది, అవును ఇదిగో ఈ జీవితము యొక్క దినము మనుష్యులు వారి పనులు చేయు దినము.”23
ఈ వచనాలు చదువుచుండగా, ఒక బలమైన భావన అతడిపైకి వచ్చింది మరియు అతడు మారాలని, పశ్చాత్తాపపడాలని ఎరుగును, మరియు తాను ఏమి చేయాలో అతడు ఎరుగును. అతడు తన మంచంపై నుండి లేచి మోకరించి, తనను క్షమించమని తన జీవితంలో మార్పులు చేసుకోవడానికి తనకు అవసరమైన బలమును తనకు ఇమ్మను ప్రభువును వేడుకుంటూ ప్రార్థన చేయసాగాడు. అతడి ప్రార్థన జవాబివ్వబడింది, అ సమయము నుండి, అతడు ఎన్నడూ వెను తిరిగి చూడలేదు. బడ్ సంఘములో సేవ చేయడం కొనసాగించాడు, విశ్వాసుడిగా, తన జీవితము చివరి వరకు నిబద్ధుడైన కడవరి దిన పరిశుద్ధునిగా నిలిచాడు. అతడు ప్రతి విధముగా మార్పు చెందాడు. అతడి మనస్సు, అతడి హృదయము, క్రియలు, అతడి సమస్త ప్రవర్తను మార్చబడ్డాయి.
సహోదర సహోదరీలారా, మన దైవిక గమ్యము మరియు ఉద్దేశ్యము అంతిమంగా మన పరలోక తండ్రి మరియు మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు వలె మారడం. మనము మారినప్పుడు లేక పశ్చాత్తాపపడినప్పుడు దీనిని చేస్తాము. మనము “[మన] ముఖముల యందు [రక్షకుని] స్వరూపమును,”24 పొందుతాము. మనము క్రొత్తగా, శుద్ధిగా, ప్రత్యేకంగా మారాము, మరియు ప్రతిరోజు ఆవిధంగా మారటాన్ని కొనసాగిస్తాము. కొన్నిసార్లు రెండు అడుగులు ముందుకు, మరియు ఒక అడుగు వెనుకకు వేసినట్లుగా అనిపించవచ్చు, కానీ విశ్వాసమునందు వినయముగా ముందుకు సాగుటను మనము కొనసాగిస్తాము.
మనల్ని మనం తగ్గించుకొని, యేసు క్రీస్తుయందు విశ్వసించిన యెడల అప్పుడు ఆయన కృప మరియు ఆయన అంతములేని ప్రాయశ్చిత్తః త్యాగము మారడానికి మనకు సాధ్యపరుస్తుంది.
యేసు క్రీస్తు వాస్తవంగా మన రక్షకుడని మరియు విమోచకుడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ధృవీకరిస్తున్నాను. వాస్తవానికి ఆయన కృప చాలును. ఆయనే “మార్గమును, సత్యమును, జీవము”25 అని నేను ప్రకటిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.