కడవరి దినాలలో సాహసముగల శిష్యత్వము
ఈ కడవరి దినాలలో మనం ప్రభువు యొక్క వెలుగును పట్టుకున్నప్పుడు మనం క్షమాపణ చెప్పకుండా విశ్వాసంగా, పిరికిగా కాకుండా ధైర్యంగా, భయపడకుండా విశ్వాసంగా ఉందాం.
నైతిక కర్తృత్వము ఆయన పిల్లలలో ప్రతిఒక్కరికి దేవుని యొక్క ప్రశస్తమైన వరము.1 మనము “నరులందరి యొక్క గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను, నిత్య జీవమును కోరుకొనుటకు లేక అపవాది యొక్క చెర మరియు శక్తిని బట్టి, దాస్యమును మరియు మరణమును కోరుకొనుటకు స్వతంత్రులై యున్నాము.”2 దేవుడు మేలు చేయడానికి మనల్ని బలవంతం చేయడు మరియు దయ్యము చెడు చేయడానికి మనల్ని బలవంతం చేయలేడు.3 మర్త్యత్వము దేవునికి, అపవాదికి మధ్య జరిగే పోటీ అని కొందరు భావించినప్పటికీ, రక్షకుని నుండి ఒక మాట వస్తే “సాతాను నిశ్శబ్ధం చేయబడి, బహిష్కరించబడతాడు. … పరీక్షించబడేది [మన] బలమే, కానీ దేవుని బలము కాదు.”4
అంతములో మనము మన జీవిత కాలపు ఎంపికలు విత్తిన వాటి పంట కోస్తాము.5 కాబట్టి మన ఆలోచనలు, కోరికలు, మాటలు మరియు పనులు అన్నీ కలిపి రక్షకుడు, ఆయన ఎంపిక చేసుకున్న సేవకులు మరియు పునఃస్థాపించబడిన ఆయన సంఘము పట్ల మనకున్న ప్రేమ గురించి ఏమి చెప్తాయి? మన బాప్తిస్మపు, యాజకత్వము మరియు దేవాలయ నిబంధనలు ప్రపంచం యొక్క ప్రశంసలు లేదా సోషల్ మీడియాలో “అంగీకారముల” సంఖ్య కంటే మనకు ఎక్కువ అర్థము కలిగియున్నవా? ప్రభువు మరియు ఆయన ఆజ్ఞల కొరకు మన ప్రేమ ఈ జీవితంలో దేనిపైనా లేదా ఎవరిపైనా మనకున్న ప్రేమ కంటే బలమైనదా?
అపవాది, అతడి అనుచరులు క్రీస్తు మరియు ఆయన ప్రవక్తల కార్యములను నాశనము చేయాలని ఎల్లప్పుడు కోరుతున్నారు. రక్షకుని ఆజ్ఞలు పూర్తిగా విస్మరించబడతాయని విస్మరించబడకపోయినప్పటికీ, నేటి ప్రపంచంలో చాలా మంది వాటిని అర్థరహితంగా హేతుబద్ధం చేసారు. “జనులకు ఇష్టములేని” సత్యాలను బోధించే దేవుని దూతలు తరచుగా కొట్టివేయబడతారు. రక్షకుడు కూడా “తిండిబోతును మద్యపానియు”6 అని పిలవబడ్డాడు, ప్రజల మనోభావాలకు భంగము కలిగిస్తున్నాడని, విభజనకు గురిచేస్తున్నాడని ఆరోపించబడ్డాడు. బలహీనమైన మరియు మోసపూరితమైన ఆత్మలు “మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేసారు” 7 మరియు ఆయన ప్రారంభ క్రైస్తవుల “శాఖ” అంతట ఆక్షేపణ చేయబడ్డారు.”8
రక్షకుడు మరియు ఆయన ముందు అనుచరులు తీవ్రమైన అంతర్గత మరియు బాహ్య వ్యతిరేకతను ఎదుర్కొన్నారు మరియు మనం కూడా అదేవిధంగా అనుభవిస్తున్నాము. ఈ రోజు అప్పుడప్పుడు ప్రాపంచిక విషయాలతో సంబంధించిన వ్యక్తుల నుండి ఎగతాళి చేసే కొన్ని అసలైన, వాస్తవిక చేతి వ్రేళ్ళను ఆకర్షించకుండా మన విశ్వాసాన్ని ధైర్యంగా జీవించడం దాదాపు అసాధ్యం. రక్షకుని నమ్మకంగా అనుసరించుట ప్రతిఫలదాయకమైనది, కాని కొన్ని సమయాలలో మనము “తినుము, త్రాగుము మరియు సంతోషించుము”9 తత్వశాస్త్రమును సమర్ధించే వారి విమర్శకు గురికావచ్చు, అక్కడ క్రీస్తుయందు విశ్వాసము, విధేయత మరియు పశ్చాత్తాపము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఒక చిన్న పాపాన్ని సమర్ధిస్తాడనే భ్రమతో భర్తీ చేయబడింది.
“[ఆయన] స్వంత స్వరము లేక [ఆయన] సేవకుల స్వరము ద్వారా”10 మాట్లాడుతూ, రక్షకుడు మన ప్రస్తుత కాలము గురించి ఇలా చెప్పారు, “జనులు హితబోధను సహింపక, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసికొనిరి” మరియు అనేకమంది “సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథల వైపునకు తిరుగుదురు.”11 “మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు”12 అని ఆయన విలపించలేదా? “శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు”13 అని ఆయన హెచ్చరించలేదా? “కీడు మేలనియు మేలు కీడనియు (ఎంచుకొందురని)”14 మరియు “ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు”15 అని ఆయన ముందుగా చూడలేదా?
కాబట్టి మన సంగతి ఏమిటి? మనం బెదిరిపోవాలా లేక భయపడాలా? మనము మన మతమును ఇతరులు గుర్తించని విధంగా జీవించాలా? నిశ్చయముగా కాదు! క్రీస్తునందు విశ్వాసముతో మనము మనుష్యుల యొక్క నిందకు భయపడనవసరం లేదు లేక వారి దూషణలకు మీరు భయపడరాదు.16 రక్షకుడు అధికారములో ఉండి, మనలను నడిపించి, దారిచూపడానికి జీవిస్తున్న ప్రవక్తలతో, “మనకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు?”17 ఈ కడవరి దినాలలో మనం ప్రభువు యొక్క వెలుగును పట్టుకున్నప్పుడు, మనం క్షమాపణ కోరకుండా నమ్మకంగా, పిరికిగా లేకుండా ధైర్యంగా, భయపడకుండా విశ్వాసంగా ఉందాం.18
“మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వాడిని ఒప్పుకొందును. … “మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును.” 19
చివరకు, ఆజ్ఞలు లేని దేవునిని కొందరు ఇష్టపడినప్పటికీ, ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ యొక్క మాటలలో మనము ధైర్యముగా సాక్ష్యమిద్దామా, “ఎటువంటి డిమాండ్లు చేయని దేవుడు ఉనికిలో లేని దేవునికి క్రియాత్మక సమానం.”20
కొందరు తాము అనుసరించే ఆజ్ఞలు ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పటికీ, మనము “దేవుని నోటి నుండి బయటకు వచ్చే ప్రతి మాట ద్వారా జీవించుటకు” రక్షకుని యొక్క ఆహ్వానమును ఆనందంగా అంగీకరిద్దాము.21
ప్రభువు మరియు ఆయన సంఘము “మీ హృదయము కోరినదేదైనను చేయుటను”22 మన్నించదని అనేకమంది నమ్మినప్పటికీ, “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించుట”23 తప్పని మనము సాహసంగా ప్రకటిద్దాము, ఎందుకనగా “దేవుడు తప్పని ప్రకటించిన దానిని సమూహాలు సరైనదిగా చేయలేవు.”24.
“ఓ నా కుమారుడవైన హీలమన్, జ్ఞాపకముంచుకొనుము … దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత ఖచ్చితమైనవో జ్ఞాపకముంచుకొనుము.”25 వారికి స్పష్టముగా బోధించుట కొన్నిసార్లు సహించలేనిదిగా కనబడవచ్చు. కాబట్టి మన విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలను స్వీకరించే దేవుని బిడ్డను ప్రేమించడం సాధ్యము మాత్రమే కాదు కానీ అవసరమని గౌరవపూర్వకంగా నిరూపిద్దాం.
ఇతరుల నమ్మకాలను లేదా ప్రభువు చిత్తానికి అనుగుణంగా లేని చర్యలను ఆమోదించకుండా వారిని మనం అంగీకరించవచ్చు మరియు గౌరవించవచ్చు. అంగీకారం మరియు సామాజిక కోరికల బలిపీఠంపై సత్యాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు.
సీయోనుకు, బబులోనుకు సరిపడదు. “ఎవడును ఇద్దరు యాజమానులకు దాసుడుగా నుండనేరడు.” 26 మనమందరం రక్షకుని లోతైన ప్రశ్నను గుర్తుంచుకొందాం, “నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?”27
హృదయపూర్వకంగా, స్వచ్ఛంధంగా విధేయులగుట ద్వారా ప్రభువు కోసం మన ప్రేమను మనం రుజువు చేద్దాం.
మీ శిష్యత్వము మరియు లోకము మధ్య మీరు చిక్కుకున్నట్లు భావిస్తే, మీ ప్రేమగల రక్షకుడు “ఆహ్వానించుచున్నాడు … ఏలయనగా కరుణాబాహువులు (మీ వైపు) చాపబడియున్నవి, మరియు ఆయన పశ్చాత్తాపము పొందుడి మరియు నేను మిమ్ములను చేర్చుకొందుని చెప్పుచున్నాడని” దయచేసి జ్ఞాపకముంచుకొనుడి.28
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “యేసు క్రీస్తు, ఇప్పుడు మరియు ఆయన మరలా తిరిగి వచ్చే మధ్య కాలంలో, ఆయన అద్భుతకార్యములలో కొన్నిటిని నెరవేరుస్తారు.”29 కానీ “ప్రభువు మార్గమును ఎన్నుకొనే వారు హింసను సహిస్తారు.”30 “ఆయన నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడుట”31 కొన్నిసార్లు మన పరిస్థితి కావచ్చు, ఎందుకంటే మనం “మిగిలిన వాటికి పైగా ఆయన స్వరానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అనుమతిస్తాము.”32
“నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని” రక్షకుడు చెప్పెను.33 మరొకచోట “నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మదికలదు, వారు తొట్రిల్లుటకు కారణమేమియులేదు”34 అని మనము నేర్చుకున్నాము. ఏదీలేదు! కాబట్టి మనల్ని ప్రశ్నించుకుందాం, “నేను కొంతకాలము నిలిచి, వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను కలుగగానే అభ్యంతరపడుతున్నానా?35 యేసు క్రీస్తు బండపై మరియు ఆయన సేవకులపై నేను స్థిరముగా కట్టబడ్డానా?”
నైతిక సాపేక్షవాదులు సత్యము కేవలం సమాజంలోని జనులచేత కల్పించి అంగీకరించబడినదని, నైతిక ఖచ్చితత్వములు లేవని వాదించారు. వారు నిజంగా చెప్పేదేమిటంటే పాపము లేదని,36“మనుష్యుడు ఏమి చేసినను నేరము కాదని ఒక వేదాంతము, దానికోసం సాతాను ఈ వేదాంతమును కల్పించాడని సంతోషంగా చెప్పుకొనును.”37 కాబట్టి మనము గొఱ్ఱెల చర్మములు వేసికొను తోడేళ్ళను గూర్చి జాగ్రత్తపడదాం, వారు ఎల్లప్పుడూ నియామకం మరియు “తరచుగా వారి [స్వంత] ప్రవర్తనా లోపాలను కప్పుకోవడానికి వారి మేధోపరమైన మినహాయింపులను ఉపయోగిస్తారు.”38
మనము క్రీస్తు యొక్క సాహసముగల శిష్యులు కావాలని నిజంగా కోరిన యెడల, మనము ఒక మార్గాన్ని కనుగొంటాము. లేనియెడల, అపవాది వశ్యపరచే ప్రత్యమ్నాయాలను ఇస్తుంది. కానీ విశ్వాసులైన శిష్యులుగా, “మనము మన నమ్మకాల కోసం క్షమాపణ కోరనవసరం లేదు లేక మనకు సత్యమని తెలిసిన దాని నుండి వెనక్కి తగ్గనవసరంలేదు.”39
ముగింపులో, నా వెనుక కూర్చోన్న దేవుని యొక్క 15 సేవకుల గురించి ఒక మాట. లోకసంబంధులు “దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి”40 చెప్పినప్పటికీ, విశ్వాసులు “పైనుండి వచ్చిన దీవెనలతో, అవును అనేక ఆజ్ఞలతో మరియు వారి కాలములోని బయల్పాటులతో కిరీటమివ్వబడెదరు.”41
ప్రవక్తలు ప్రకటిస్తున్నట్లుగా, దేవుని వాక్యం పట్ల అసంతృప్తిగా ఉన్నవారికి ఈ పురుషులు తరచుగా ప్రతికూల భావనలుగా మారడంలో ఆశ్చర్యం లేదు. ప్రవక్తలను తిరస్కరించే వారు, “లేఖనములోని ఏ ప్రవచనమూ ఏ వ్యక్తిగత వ్యాఖ్యానానికి సంబంధించినది కాదు” లేదా మానవుని చిత్తం యొక్క ఫలితం కాదు, “కానీ [ఆ] దేవుని యొక్క పరిశుద్ధులు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడినప్పుడు [ఇప్పుడు మాట్లాడెదరు] అని గ్రహించలేరు.”42
పౌలు వలె, ఈ దేవుని యొక్క మనుష్యులు “మన ప్రభువును గూర్చి సాక్ష్యమును బట్టి సిగ్గుపడరు,” మరియు ఆయన “ఖైదీలుగా” ఉన్నారు 43 వారు బోధించే సిద్ధాంతము వారిది కాదు, కానీ వారిని పిలిచినది ఆయనదే అనే భావనలో. పేతురు వలె, వారు “కన్నవాటిని విన్నవాటిని [వారు] చెప్పక యుండలేరు” 44 ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది సమూహము మంచివారు, నిజాయితీగలవారు, దేవునిని, ఆయన పిల్లలను ప్రేమించువారు ఆయన చేత ప్రేమించబడిన వారని నేను సాక్ష్యమిస్తున్నాను. మనము వారి మాటలను “పూర్ణ సహనముతోను, విశ్వాసమునందు” ప్రభువు స్వంత నోటినుండి పలికినట్లుగానే స్వీకరించవలెను. వీటిని చేయడం ద్వారా (మనకు) వ్యతిరేకంగా నరకపు ద్వారములు తెరవబడవు … మరియు దేవుడైన ప్రభువు (మన) ముందు నుండి చీకటి శక్తులను చెదరగొట్టును.”45
“పరిశుద్ధపరచబడని హస్తము ఏదీ అభివృద్ధి చెందుట నుండి ఆపలేదు” మీరు లేక నేను లేకుండా దిగ్విజయంగా సాగుతుంది,46 కనుక “నేడు మీరు ఎవరిని సేవిస్తారో కోరుకొనుడి.”47 గొప్ప మరియు విశాలమైన భవనం నుండి వెలువడే పెద్ద అపవాది శబ్దాల ద్వారా మోసపోకండి లేదా బెదిరిపోకండి వారి తీరని ధ్వని ప్రమాణాలు విరిగిన హృదయాలు మరియు పశ్చాత్తాపపడిన ఆత్మలపై నిశ్చలమైన, చిన్న స్వరం యొక్క నిర్మలమైన ప్రభావానికి సరిపోల్చబడవు.
క్రీస్తు జీవిస్తున్నారని, ఆయన మన రక్షకుడు, విమోచకుడని, ఆయన ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ద్వారా తన సంఘమును నడిపిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆవిధంగా మనము “కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండము.”48
“యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు ధైర్యంగా నిలబడడానికి, మాట్లాడడానికి మరియు ప్రపంచ ప్రజల నుండి భిన్నంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని” అధ్యక్షులు నెల్సన్ బోధించారు. వారు నిస్సంకోచంగా, అంకితభావంతో మరియు ధైర్యంగా ఉన్నారు.”49
సహోదర సహోదరీలారా, మంచిగా ఉండటానికి ఇది మంచి రోజు! యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.