దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించెను
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిని మనల్ని నిందించడానికి కాదు,మనల్ని రక్షించడానికి పంపెను.
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును, నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) నేను ఈ వచనమును గమనించిన మొదటిసారి, నేను సంఘములో లేక కుటుంబ గృహ సాయంకాలములో లేను. నేను టెలివిజన్‌లో ఒక క్రీడా కార్యక్రమాన్ని చూస్తున్నాను. నేను ఏ స్టేషన్ చూసినప్పటికీ, అది ఏ ఆట అయినప్పటికీ, కనీసము ఒక వ్యక్తి “యోహాను 3:16” అని చదివే సూచనను పట్టుకొనియుంటాడు.
నేను 17 వచనమును సమానంగా ఇష్టపడుతున్నాను: “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.”
మనలో ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణమును పెట్టుటకు, దేవుడు శరీరములో తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును పంపెను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక దీనిని ఆయన చేసారు మరియు ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి మనలో ప్రతిఒక్కరి కొరకు ఒక ప్రణాళికను రూపొందించారు.
కాని ఇది ప్రతి ఒక్కరికీ వసతి కల్పించే ప్రయత్నంలో చాలా సాధారణమైన మరియు విస్తృతమైన ప్రణాళిక లేక విజయవంతమైనది కాదు. అది వ్యక్తిగతమైనది, ప్రేమగల పరలోక తండ్రి చేత నియమించబడింది, ఆయన మన హృదయాలను, మన పేర్లను మరియు మనము ఏమి చేయాలని కోరుతున్నారో ఎరుగును. దానిని మనము ఎందుకు నమ్ముతున్నాము? ఎందుకనగా మనము పరిశుద్ధ లేఖనాలలో దానిని బోధించబడ్డాము:
“మోషే, నా కుమారుడా,” (మోషే 1:6; వచనములు 7, 40 చూడండి) అని పరలోక తండ్రి మాట్లాడటం మోషే పలుమార్లు విన్నాడు. అబ్రాహాము తాను దేవుని యొక్క బిడ్డనని, తాను పుట్టకముందే తన మిషనుకు ఏర్పరచబడ్డాడని తెలుసుకున్నాడు (అబ్రాహాము 3:12, 23 చూడండి). దేవుని హస్తము చేత, ఎస్తేరు తన జనులను రక్షించడానికి ప్రభావముగల స్థానములో ఉంచబడింది (ఎస్తేరు 4 చూడండి). మరియు దేవుడు జీవిస్తున్న ప్రవక్త గురించి సాక్ష్యమిచ్చుటకు, ఒక సేవకురాలైన యువతిని నమ్మాడు, ఆవిధంగా నయమాను స్వస్థపరచబడగలడు (2 రాజు 5:1–15 చూడండి).
పొట్టిగా ఉండి, యేసును చూడటానికి చెట్టును ఎక్కిన, ఆ మంచి వ్యక్తిని నేను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాను. అతడు అక్కడున్నాడని రక్షకుడు ఎరిగి, ఆగాడు, కొమ్మలలోనికి చూసాడు, మరియు ఈ మాటలను అన్నాడు: “జక్కయా, … నేడు నేను నీ యింట నుండవలసియున్నది” (లూకా 19:5) చెట్ల వనములోనికి వెళ్లి, ప్రణాళిక నిజంగా ఎంత వ్యక్తిగతమైనదో నేర్చుకొన్న14-సంవత్సరాల బాలుడిని మనము మరచిపోలేము: “[జోసెఫ్,] ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకించుము!” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17).
సహోదర, సహోదరీలాలా, మనము మన పరలోక తండ్రి ప్రణాళిక యొక్క కేంద్రము మరియు మన రక్షకుని నియమితకార్యానికి కారణము. మనలో ప్రతి ఒక్కరూ, వ్యక్తిగతంగా, వారి కార్యము మరియు వారి మహిమ.
నాకైతే, పాత నిబంధన గురించి నేను చేసిన అధ్యయనము కంటే లేఖనములో ఏ గ్రంధము కూడా దీన్ని ఎక్కువ స్పష్టంగా వివరించదు. అధ్యాయము తరువాత అధ్యాయము పరలోక తండ్రి మరియు యెహోవా మన జీవితాలలో ఎంత సన్నిహితంగా చేర్చబడ్డారో మాదిరులను మనము కనుగొంటాము.
ఈమధ్య యాకోబు యొక్క ప్రియమైన కుమారుడు యోసేపు గురించి మేము అధ్యయనము చేస్తున్నాము. తన యౌవనము నుండి, యోసేపు ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, అయినప్పటికీ, అతడు తన అన్నల చేతులలో గొప్ప శ్రమలను ఎదుర్కొన్నాడు. రెండు వారముల క్రితం, అతడు తన సహోదరులను క్షమించిన విధానం మనలో అనేకమందిని సృశించింది. రండి నన్ను అనుసరించండి లో మనమిలా చదువుతాము: “అనేక విధాలుగా, యోసేపు యొక్క జీవితం యేసు క్రీస్తుకు సమాంతరంగా ఉన్నది. మన పాపములు ఆయనకు గొప్ప బాధను కలిగించినప్పటికీ, కరువు కంటే చాలా ఘోరమైన విధి నుండి మనందరినీ విడిపిస్తూ, రక్షకుడు క్షమాపణను ఇస్తున్నాడు. మనము క్షమాపణ పొందవలసిన లేక దానిని ఇవ్వాల్సి వచ్చినప్పటికీ—ఏదో ఒక సమయంలో మనమందరం రెండింటినీ చేయాలి—యోసేపు యొక్క మాదిరి, స్వస్థత మరియు సమన్వయము యొక్క నిజమైన ఆధారమైన, రక్షకుని వైపు మనల్ని సూచిస్తుంది.”1
ఆ వృత్తాంతములో నేను ఇష్టపడే పాఠం యోసేపు అన్న యూదా నుండి వచ్చినది, అతడు యోసేపు కోసం దేవుని వ్యక్తిగత ప్రణాళికలో ఒక పాత్రను పోషించాడు. యోసేపు తన అన్నల చేత మోసగించబడినప్పుడు, యోసేపు ప్రాణము తీయవద్దని, కానీ బానిసత్వానికి అతడిని అమ్మమని యూదా వారిని ఒప్పించాడు (ఆదికాండము 37:26–27 చూడండి).
అనేక సంవత్సరాల తరువాత, యూదా, మరియు అతడి సహోదరులు వారి చిన్న తమ్ముడైన బెంజమీనును ఐగుప్తుకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది. మొదట వారి తండ్రి తిరస్కరించాడు. కానీ యూదా బెంజమీనును ఇంటికి తెస్తానని యాకోబుకు ఒక ప్రమాణము చేసాడు.
ఐగుప్తులో, యూదా యొక్క ప్రమాణము పరీక్షించబడింది. యౌవనుడైన బెంజమీను ఒక నేరముతో తప్పుగా నిందించబడ్డాడు. యూదా తన ప్రమాణానికి యదార్ధంగా ఉండి, బెంజమీను స్థానంలో తనను చెరలో ఉంచమని అడిగాడు. “కాబట్టి,” “ఈ చిన్నవాడు నాతోకూడ ఉంటేనే గాని నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను?” (ఆదికాండము 44:33–34 చూడండి) అని అతడు అన్నాడు. యూదా తన ప్రమాణమును నిలబెట్టుకొని, బెంజమీను తిరిగి వెళ్లాలని తీర్మానించాడు. బెంజమీను పట్ల యూదా భావించిన రీతిగా మీరు ఎప్పుడైనా ఇతరుల గురించి భావించారా?
తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఇలానే భావిస్తారు కదా? మిషనరీలు వారు సేవ చేసే జనులు గురించి ఎలా భావిస్తారు? ప్రాథమిక మరియు యువత నాయకులు వారు బోధించి, ప్రేమించే వారి గురించి ఎలా భావిస్తారు?
మీరు ఎవరు లేక మీ ప్రస్తుత పరిస్థితులు ఏవైనప్పటికినీ, ఎవరో ఒకరు మీ గురించి ఖచ్చితంగా ఈవిధంగా భావిస్తారు. ఎవరైనా ఒకరు మీతో పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్లాలని కోరతారు.
మనల్ని విడిచి పెట్టని వారి కోసం నేను కృతజ్ఞత కలిగియున్నాను, వారు మన కోసం ప్రార్థనయందు వారి ఆత్మలను క్రుమ్మరించారు, మరియు మన పరలోకమందున్న తండ్రి వద్దకు తిరిగి వెళ్లడానికి అర్హులు కావడానికి మనకు బోధించి, సహాయపడుటను కొనసాగిస్తున్నారు.
ఈమధ్య ఒక ప్రియమైన స్నేహితుడు ఒకరు, కోవిద్-19తో హాస్పిటల్‌లో 233 రోజులు గడిపాడు. ఆ సమయములో, చనిపోయిన అతని తండ్రి అతడిని సందర్శించి, తన మనుమలకు సందేశము పంపమని కోరాడు. తెరకు అవతల వైపు నుండి కూడ, ఈ మంచి తాత తన మనుమలు వారి పరలోకపు గృహానికి తిరిగి వెళ్లడానికి సహాయపడాలని కోరాడు.
అంతకంతకూ, క్రీస్తు యొక్క శిష్యులు వారి జీవితాలలోని “బెంజమీన్లను” జ్ఞాపకముంచుకుంటున్నారు. ఈ సమావేశమునకు ముగింపు ప్రసంగీకులు మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్. యువకులు, యువతులు ప్రభువు యొక్క యువ సైనికదళములో నిమగ్నమైయున్నారు. వ్యక్తులు మరియు కుటుంబాలు ప్రేమించుట, పంచుకొనుట, స్నేహితులు మరియు పొరుగువారిని క్రీస్తునొద్దకు రమ్మని ఆహ్వానించుట---పరిచర్య యొక్క ఆత్మలో చేరువవుతున్నారు. యువత మరియు పెద్దవారు వారి నిబంధనలు జ్ఞాపకం చేసుకొని, పాటించడానికి ప్రయాసపడుతున్నారు---దేవుని యొక్క దేవాలయాలనును నింపుతూ, మృతులైన కుటుంబ సభ్యుల పేర్లను కనుగొంటూ, వారి తరఫున విధులను పొందుటకు ప్రయాసపడుతున్నారు.
పరలోక తండ్రి యొక్క వ్యక్తిగతీకరించబడిన ప్రణాళిక ఇతరులు ఆయన వద్దకు తిరిగి రావడానికి సహాయపడటాన్ని ఎందుకు కలిగియున్నది? ఎందుకనగా ఈవిధంగా మనము యేసు క్రీస్తు వలె మారగలము. చివరకు, యూదా మరియు బెంజమీను యొక్క వృత్తాంతము మన కోసం రక్షకుని యొక్క త్యాగము గురించి బోధిస్తున్నది. ప్రాయశ్చిత్తము ద్వారా, ఆయన మనల్ని ఇంటికి తీసుకొనిరావడానికి తన ప్రాణము నిచ్చారు. యూదా యొక్క మాటలు రక్షకుని యొక్క ప్రేమను వ్యక్తపరచును: “[మీరు] నాతోకూడ ఉంటేనేగాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్లగలను?” ఇశ్రాయేలును సమకూర్చు వారిగా, అవి మన మాటలు కూడా.
పాత నిబంధనలో పరలోక తండ్రి యొక్క ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం అయిన అద్భుతాలు మరియు మృదువైన కనికరాలతో నిండి ఉంది. 2 రాజులు 4 లో, “ఆ రోజున జరిగింది” అనే వాక్యము దేవుని సమయం ప్రకారము జరిగిన ముఖ్యమైన సంఘటనలను నొక్కిచెప్పడానికి మూడుసార్లు ఉపయోగించబడింది, మరియు ఏ వివరణ ఆయనకు చాలా చిన్నది కాదు.
నా క్రొత్త స్నేహితుడు ఈ సత్యమును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. కొన్నిసార్లు దూషణపూర్వకంగా, ఎల్లప్పుడు మతాన్ని ద్వేషించే గృహములో పౌలు పెరిగి పెద్ద వాడయ్యాడు. జర్మనీలోని మిలటరీ బేస్‌లోని పాఠశాలకు హాజరవుతుండగా, అతడు ఒక ఆత్మీయమైన వెలుగును కలిగియున్నట్లుగా కనబడిన ఇద్దరు సహోదరీలను గమనించాడు. వారు ఎందుకు భిన్నంగా ఉన్నారని అడుగుట, వారు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘానికి చెందిన వారనే జవాబును తెచ్చింది.
త్వరలో పౌలు మిషనరీలతో సమావేశమయ్యాడు మరియు సంఘానికి ఆహ్వానించబడ్డాడు. తరువాత ఆదివారము, అతడు బస్సు దిగినప్పుడు, అతడు ఇద్దరు పురుషులు తెలుపు షర్టులు మరియు టైలు ధరించియుండుట గమనించాడు. వారు సంఘము యొక్క ఎల్డర్లా అని అతడు అడిగాడు. వారు అవునని, జవాబిచ్చారు, అందుచేత పౌలు వారిని అనుసరించాడు.
కార్యక్రమమందు, ఒక బోధకుడు సమూహములోని జనులను సూచించి వారిని సాక్ష్యమివ్వమని ఆహ్వానించాడు. ప్రతీ సాక్ష్యము ముగింపులో, డ్రమ్ము వాయించే వాడు, నమస్కరించాక, సమూహము “ఆమేన్” అని చెప్పును.
బోధకుడు పౌలును సూచించినప్పుడు, అతడు లేచి చెప్పాడు,“జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త అని, మోర్మన్ గ్రంథము సత్యమని నాకు తెలుసు.” డ్రమ్ము మోగలేదు లేక ఆమేన్ చెప్పబడలేదు. తాను తప్పు ప్రదేశానికి వెళ్ళాడని పౌలు వెంటనే గ్రహించాడు. వెంటనే, పౌలు సరైన స్థలమును దారిని కనుగొన్నాడు మరియు బాప్తిస్మము పొందాడు.
పౌలు బాప్తిస్మము పొందిన రోజున, అతడికి తెలియని ఒక సభ్యుడు అతడితో చెప్పాడు, “నీవు నా జీవితాన్ని కాపాడావు.” కొన్ని వారాల క్రితం, ఈ వ్యక్తి మరొక సంఘాన్ని వెదకడానికి నిర్ణయించుకొని, డ్రమ్ములు మరియు ఆమేన్ అని చెప్పే కార్యక్రమానికి హాజరయ్యాడు. జోసెఫ్ స్మిత్ మరియు మోర్మన్ గ్రంథమును గూర్చి పౌలు చెప్పిన సాక్ష్యమును ఆ వ్యక్తి విన్నప్పుడు, దేవుడు అతడిని ఎరుగునని, అతడి ప్రయాసలు గుర్తించాడని, మరియు అతడి కోసం ఒక ప్రణాళికను కలిగియున్నాడని అతడు గ్రహించాడు. వాస్తవానికి పౌలు మరియు ఆ వ్యక్తి ఇరువురికి “ఆ రోజునే జరిగింది!”
పరలోక తండ్రి మనలో ప్రతిఒక్కరి కోసం సంతోషము యొక్క వ్యక్తిగత ప్రణాళికను కలిగియున్నాడని మనము కూడ ఎరుగుదుము. దేవుడు తన ప్రియమైన కుమారుడిని మన కోసం పంపాడు కనుక, ఆయన ప్రణాళిక నెరవేరడానికి ముఖ్యమైనది, మనకవసరమైన అద్భుతములు “[ఆ] రోజునే [వస్తాయి].”
ఈ సంవత్సరము మనము పాత నిబంధనలో దేవుని యొక్క ప్రణాళిక గురించి ఎక్కువగా నేర్చుకోగలమని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ పరిశుద్ధ గ్రంథము అస్థిరమైన కాలములలో ప్రవక్తల పాత్రను మరియు కలవరము నిండిన, తరచుగా వివాదస్పదమైన లోకములో దేవుని హస్తమును బోధించును. ఆయన రెండవ రాకడ—చాలాకాలంగా ప్రవచించబడిన ఆయన మహిమకరమైన రాక కొరకు మనము ఎదురుచూసి, సిద్ధపడినట్లుగా, అది మన రక్షకుని రాకడకు విశ్వాసంగా ఎదురుచూసి వినయముగల విశ్వాసులను గూర్చినది కూడా.
ఆ రోజు వరకు, మనము మన జీవితపు దశలన్నిటిలో దేవుని యొక్క ప్రణాళికను మన సహజమైన నేత్రముతో చూడలేకపోవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:3 చూడండి). అతడు గ్రహించని దానిని ఏదైన ఎదుర్కొన్నప్పుడు నీఫై యొక్క జవాబును మనము జ్ఞాపకముంచుకొనగలము: ఆయన తన సంతానమును ప్రేమించునని అతడు ఎరుగును, అయినప్పటికినీ అన్నివిషయముల యొక్క భావము అతడు ఎరుగడు (1 నీఫై 11:17 చూడండి).
ఈ అందమైన సబ్బాతు ఉదయమున ఇది నా సాక్ష్యము. మనము దానిని మన హృదయాలపై వ్రాసి, అది మన ఆత్మలను శాంతి, నిరీక్షణ, మరియు నిత్య సంతోషముతో నింపుటకు అనుమతిద్దామా: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని మనల్ని నిందించడానికి కాదు కానీ మనల్ని రక్షించడానికి పంపెను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.