25వ అధ్యాయము
రెండవ రాకడ సమయమున గర్విష్ఠులు మరియు దుష్టులు కొయ్యకాలు వలె కాల్చబడుదురు—భయంకరమైన ఆ మహాదినమునకు ముందు ఏలీయా తిరిగి వచ్చును—మలాకీ 4తో పోల్చుము. సుమారు క్రీ. శ. 34 సం.
1 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
2 అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
3 నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
4 హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి.
5 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.
6 నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.