30వ అధ్యాయము
కడవరి దినపు అన్యజనులు పశ్చాత్తాపపడి, క్రీస్తు యొద్దకు వచ్చి, ఇశ్రాయేలు వంశము వారితో లెక్కింపబడవలెనని ఆజ్ఞాపించబడియున్నారు. సుమారు క్రీ. శ. 34–35 సం.
1 ఓ, అన్యజనులైన మీరు ఆలకించుడి మరియు నేను మిమ్ములను గూర్చి చెప్పవలెనని నన్ను ఆజ్ఞాపించిన సజీవుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మాటలను వినుడి, ఏలయనగా ఇట్లు చెప్పుచూ నేను వ్రాయవలెనని ఆయన నన్ను ఆజ్ఞాపించుచున్నాడు:
2 అన్యజనులైన మీరందరూ మీ దుష్టమార్గముల నుండి మరలుడి; మీ చెడు కార్యములు, మీ అబద్ధములు, మోసములు, జారత్వములు, రహస్య హేయక్రియలు, విగ్రహారాధనలు, నరహత్యలు, యాజకవంచనలు, అసూయలు, కలహములు, సమస్త దుష్టత్వము మరియు హేయక్రియల నిమిత్తము పశ్చాత్తాపపడి, మీ పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు మరియు ఇశ్రాయేలు వంశస్థులైన నా జనులతో లెక్కింపబడునట్లు నా యొద్దకు వచ్చి, నా నామమందు బాప్తిస్మము పొందుడి.