2010–2019
కార్యములో యువతులు
ఏప్రిల్ 2018


కార్యములో యువతలు

సంఘములోని ప్రతీ యువతీ విలువగలదిగా భావించాలి, సేవ చేయుటకు అవకాశాలను కలిగియుండాలి, మరియు ఈ కార్యమునకు సహాయపడుటకు ఏదైనా విలువైన దానిని ఆమె కలిగియున్నదని భావించాలి.

ఒక సంత్సరము క్రితం, సమావేశము యొక్క ప్రధాన యాజకత్వ సభలో, బిషప్పు జెరాల్డ్ కాస్సీ రక్షణ కార్యమును నెరవేర్చుటలో విడదీయరాని భాగస్వాములుగా అహరోను మరియు మెల్కీసెదకు యాజకత్వముగల వారు ఎలా ఉన్నారో వివరిస్తూ సంఘ పురుషులతో మాట్లాడారు.1 ఆ సందేశము ఈ భూమి మీద దేవుని రాజ్యమును నిర్మించుటలో వారు కలిగియున్న పాత్రను చూచుటకు అహరోను యాజకత్వముగల యువకులకు సహాయపడుటలో గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నది. వారి చేర్చబడిన సేవ సంఘమును బలపరచును మరియు ఈ కార్యము ఎంత అద్భుతమైనది మరియు వారి తోడ్పాటు ఎంత విలువైనదో వారు గ్రహించినప్పుడు మన యువకుల హృదయాలలో నిబద్ధతను మరియు లోతైన పరివర్తనను తెచ్చును.

ఆయన సంఘములో ప్రభువు యొక్క కార్యమును నెరవేర్చుటలో సంఘ యువతులు కూడ ఎలా అవసరము మరియు ముఖ్యమైన వారో నేను మాట్లాడినప్పుడు నా వ్యాఖ్యలు ఆ సందేశమునకు చేర్చబడాలని నేను కోరుచున్నాను.

బిషప్పు కాస్సీ వలే, నేను నా యౌవనకాల సంవత్సరాలలో ఎక్కువ కాలము సంఘము యొక్క చిన్న బ్రాంచీలో నివసించాను, మరియు సాధారణంగా పెద్దలచేత చేయబడే పనులు మరియు పిలుపులను నెరవేర్చుటకు నేను తరచుగా అడగబడ్డాను. ఉదాహరణకు, నేను సంఘ మాసపత్రిక ప్రతినిధిగా ఉండుటకు అడగబడ్డాను, మరియు బ్రాంచీలోని జనుల చందాల గడువు ముగించబడుతుందని వారికి తెలియచేయుటకు నేను వారిని పిలిచాను. అదనముగా, యువత కార్యక్రములలో ఉన్న మేము మా స్వంత కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఘటనలను ప్రణాళిక చేసి నడిపించుటకు సహాయపడుటలో తరచుగా నాయకత్వమును తీసుకునేవారము. మేము నాటకాలను వ్రాసేవారము, బ్రాంచి కార్యక్రమాలందు వినోదమిచ్చుటకు పాటల గుంపును ఏర్పాటు చేసాము, మరియు అన్ని బ్రాంచీ కార్యక్రమాలలో మేము సంపూర్ణంగా పాల్గొనేవారము. నేను బ్రాంచీ గాయకురాలిగా ఉండుటకు పిలవబడ్డాను మరియు ప్రతీ వారము సంస్కార సమావేశములో పాడుటను నడిపించాను. ప్రతీ ఆదివారము బ్రాంచిలో ప్రతీ ఒక్కరి యెదురుగా నిలబడి మరియు కీర్తనలను పాడుటలో వారిని నడిపించుట, 16-సంవత్సరాల అమ్మాయికి ఎలాంటి గొప్ప అనుభవమో మీరూహిస్తారా? నేను అవసరమని భావించాను మరియు నేను ఏదైనా తోడ్పడాలని ఎరుగుదును. నేనక్కడ ఉండుటకు జనులు నాపై ఆధారపడ్డారు, మరియు ప్రయోజనకరంగా భావించుటను నేను ప్రేమించాను. ఆ అనుభవము యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యమును నిర్మించుటకు నాకు సహాయపడింది, మరియు బిషప్పు కాస్సీ అది చేసినట్లుగా, నా జీవితంలో సువార్త సేవ యొక్క పునాదిని అది ఇచ్చింది.

అతడు లేక ఆమె ఎంతగా అవసరమో ప్రతీ సభ్యుడు తెలుసుకోవాలి. ప్రతీ వ్యక్తికి తోడ్పడుటకు ఏదైనా ముఖ్యమైనది కలిగియున్నారు మరియు ఈ ముఖ్యమైన కార్యము ముందుకు సాగుటకు సహాయపడే ప్రత్యేకమైన ప్రతిభలు మరియు సామర్ధ్యములను కలిగియున్నారు. మన యువకులు సిద్ధాంతము మరియు నిబంధనలలో వివరించబడిన అహరోను యాజకత్వ బాధ్యతలను కలిగియున్నారు, అవి స్పష్టంగా మరియు ప్రత్యక్షంగా కన్పిస్తాయి. అది సంఘ యువతులు బాప్తీస్మము పొందినప్పటినుండి, “దుఃఖించువారితో దుఃఖపడుటకు, అవును, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు, మరియు మరణము వరకు కూడ, మీరు ఉండు అన్ని సమయములలో మరియు అన్ని విషయములలో మనము అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలువబడుటకు.”2వారు నిబంధన బాధ్యతలను కలిగియున్నారని సంఘ యువతులకు, వారి తల్లిదండ్రులు మరియు వారి నాయకులకు తక్కువ స్పష్టంగా కనిపించవచ్చు. తరగతుల అధ్యక్షత్వములు, యువత సలహాసభలు, మరియు ఇతర పిలుపులందు వారు సేవ చేసినప్పుడు ఈ బాధ్యతలను నెరవేర్చుటకు యువతులు బాధ్యతలను కలిగియున్నారు. సంఘములోని ప్రతీ యువతీ, విలువగలదిగా భావించాలి, సేవ చేయుటకు అవకాశాలను కలిగియుండాలి, మరియు ఈ కార్యమునకు తోడ్పడుటకు ఏదైనా విలువైన దానిని కలిగియున్నదని భావించాలి.

సంఘమును నిర్వహించుట: చేతిపుస్తకము2లో, మన వార్డు లోపల రక్షణ కార్యము “సభ్య మిషనరీ కార్యము, పరివర్తనను నిలుపుకొనుట, చురుకుగా లేని సభ్యులను చైతన్యవంతము చేయుట, దేవాలయ మరియు కుటుంబ చరిత్ర కార్యము, మరియు సువార్తను బోధించుటను”3 కలిపియున్నది. వార్డులోని ఈ కార్యము వారి వార్డు కొరకు యాజకత్వపు తాళపు చెవులను కలిగియున్న మన విశ్వాసులైన బిషప్పుల చేత నడిపించబడును. అనేక సంవత్సరాలుగా, మా యువతుల ప్రధాన అధ్యక్షత్వము ఈ ప్రశ్నను అడుగుతున్నది, “చెప్పబడిన వాటిలో దేనిలో మా యువతులు చేర్చబడరాదు?” దానికి జవాబు, ఈ కార్యమంతటిలో చేర్చబడుటకు వారు ఏదైనా కలిగియున్నారు.

ఉదాహరణకు, ఇటీవల నేను లాస్ వేగాస్‌లో అనేకమంది యువతులను కలిసాను, వారు వార్డు దేవాలయ మరియు కుటుంబ చరిత్ర సలహాదారులుగా సేవ చేయుటకు పిలవబడ్డారు. వారి వార్డు సభ్యులు తమ పూర్వీకులను కనుగొనుటకు సహాయపడుటకు మరియు బోధించుట గురించి వారు చాలా ఉత్సాహముగా ఉన్నారు. వారు కంప్యూటరుపై విలువైన నైపుణ్యములను కలిగియున్నారు, ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు, మరియు వారి జ్ఞానమును ఇతరులతో పంచుకొనుటకు ఉత్సాహపడుచున్నారు. దేవాలయములో వారి కొరకు ఆవశ్యకమైన రక్షించే విధులు నెరవేర్చబడునట్లు మన మృతులైన పూర్వీకుల పేర్లను వెదకు ప్రాముఖ్యతను గూర్చి అవగాహనను మరియు సాక్ష్యమును వారు కలిగియున్నారని స్పష్టమయ్యింది.

కొన్ని నెలల క్రితం, 14 సంవత్సరాల యువతితో ఒక ఆలోచనను పరీక్షించే అవకాశము నాకు కలిగింది. నేను అసలైన వార్డు సలహా కార్యక్రమ పట్టికల ప్రతులను తీసుకొని, ఎమ్మా మరియు మాగీకి ఒక్కొక్క ప్రతిని ఇచ్చాను. కార్యక్రమ పట్టికలను చదివి, వార్డు సలహా సభలలో ఏదైనా పనిని చూసి, వారు సహాయపడగలరేమోనని నేను వారిని అడిగాను. ఒక క్రొత్త కుటుంబము వార్డుకు మారుటను ఎమ్మా చూసింది, వారు మారి, సర్దుకోవటానికి తాను సహాయపడగలనని ఆమె చెప్పింది. కుటుంబములోని పిల్లలతో స్నేహముగా ఉండి, వారి క్రొత్త పాఠశాలను చూపించగలనని ఆమె అనుకున్నది. వార్డు రాత్రి భోజనము రాబోవుతున్నదని, అనేక వేర్వేరు విధాలుగా తన సేవలను అందించగలనని ఆమె భావించింది.

వార్డులో దర్శనములు మరియు సహవాసము అవసరమైన కొందరు వృద్ధులున్నారని మాగీ చూసింది. ఈ అద్భుతమైన వృద్ధులను దర్శించి మరియు సహాయపడుటను తాను ప్రేమిస్తున్నానని చెప్పింది. సామాజిక మీడియా సైట్లను ఎలా ఏర్పాటు చేసి మరియు ఉపయోగించాలో సభ్యులకు బోధించుటకు తాను సహాయపడగలనని కూడా ఆమె భావించింది. ఆ కార్యక్రమ పట్టికలలో ఆ ఇద్దరు యువతులు సహాయపడలేనిదేది నిజముగా లేదు!

వార్డు సలహాసభలలో కూర్చోనే వారు, లేక వార్డులో ఏ పిలుపునైనా కలిగియున్న వారు, మన వార్డులలో అనేక అవసరాలను నెరవేర్చుటకు సహాయపడుటకు విలువైన వనరులుగా యువతులను చూస్తున్నారా? సాధారణంగా సేవ చేయుటకు ఎవరైనా అవసరమనే పరిస్థితులు గల సుదీర్ఘమైన జాబితా ఉన్నది, మరియు ఆ అవసరాలను తీర్చుటకు వార్డులో పెద్దవారిని గూర్చి మాత్రమే మనము తరచుగా ఆలోచిస్తాము. అహరోను యాజకత్వము గలవారు తమ తండ్రులతో పని చేయుటకు ఆహ్వానించబడినట్లుగా, మన యువతులు తమ తల్లులు లేక ఇతర మార్గదర్శులైన సహోదరీలతో కలిసి వార్డు సభ్యుల అవసరాలను తీర్చుటకు సేవను, పరిచర్యను అందించుటకు పిలవబడవచ్చును. వారు సమర్ధులు, ఆతృత కలిగియుండి, కేవలము ఆదివారము చర్చికి హాజరగుట కంటే అత్యధికము చేయుటకు సమ్మతిస్తున్నారు!

చిత్రం
సరకులతో సహాయపడుతున్న యువతి
చిత్రం
సేవ చేస్తున్న యువతి
చిత్రం
కంప్యూటరుతో సహాయపడుతున్న యువతి
చిత్రం
శుభ్రపరుస్తున్న యువతి
చిత్రం
సంగీతమును నడిపిస్తున్న యువతి
చిత్రం
బోధిస్తున్న యువతి
చిత్రం
సహాయక హస్తముల చొక్కాలో యువతి
చిత్రం
సంఘములో పలుకరిస్తున్న యువతి

సమీప భవిష్యత్‌లో మన యువతులు ఊహించుటకు ఆశించబడే పాత్రలను గూర్చి మనము ఆలోచించినప్పుడు, ఇప్పుడు వారి కొరకు మనము అందించగల ఏ రకమైన అనుభవాలు, వారు మిషనరీలుగా, సువార్త పండితులుగా, సంఘ అనుబంధాలలో నాయకులుగా, దేవాలయ పనివారుగా, భార్యలు, తల్లులు, బోధకులు, మరియు స్నేహితులుగా వారి సిద్ధపాటులో సహాయపడునట్లు మనము అందిస్తున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇదివరకు విధి పనివారు లేక స్వచ్ఛంధ సేవకులు మృతుల కొరకు బాప్తీస్మములను నెరవేర్చుటకు తమ యువతుల గుంపుతో వారు దేవాలయమునకు హాజరైనప్పుడు, వారి చేత చేయబడిన సేవలను నెరవేర్చుటకు ఇప్పుడు మన యువతులకు అవకాశాలున్నాయి. మన ప్రాథమిక-వయస్సుగల బాలికలు ఇప్పుడు, యాజకత్వము మరియు దేవాలయ పరిదృశ్యానికి హాజరగుటకు ఆహ్వానించబడుచున్నారు, అది వారు యాజకత్వము నడిపించిన కార్యములో ముఖ్యముగా పాల్గొనేవారని గ్రహించుటకు వారికి సహాయపడును. పురుషులు, స్త్రీలు, యువత, మరియు పిల్లలు అందరూ యాజకత్వపు దీవెనల యొక్క గ్రహీతలని మరియు యాజకత్వము-నడిపించే కార్యమును ముందుకు కొనసాగించుటలో అందరూ చురుకైన పాత్ర వహించగలరని వారు నేర్చుకుంటారు.

బిషప్పులారా, తరచుగా మీ బాధ్యతలు భారమైనవని మాకు తెలుసు, కానీ అహరోను యాజకత్వపు కోరములపైగా అధ్యక్షత్వము వహించుటకు మీ ఉన్నతమైన ప్రాధాన్యతలలో ఒకటిగా, “బిషప్పు మరియు ఆయన సలహాదారులు, యువతుల నిర్మాణము కొరకు యాజకత్వపు నాయకత్వమును అందిస్తారని” చేతి పుస్తకము 2 లో వివరించబడింది. ఈ ప్రయత్నములో వారు తల్లిదండ్రులు మరియు యువతుల నాయకులతో సన్నిహితంగా పనిచేస్తూ, వారు కావలికాస్తూ, యువతులను వ్యక్తిగతంగా బలపరుస్తారు. “బిషప్పు మరియు ఆయన సలహాదారులు యువతుల సమావేశాలు, సేవ, మరియు కార్యక్రమాలలో క్రమముగా పాల్గొంటారని”4 కూడా అది వివరించును. యువతుల తరగతులను దర్శించుటకు సమయాన్ని తీసుకొని, కార్యమును చూచు ప్రేక్షకులు వలే కాక తమ వార్డులలో యువతులకు అవకాశాలను అందించుటకు సమయాన్ని తీసుకునే బిషప్పులకు మేము కృతజ్ఞతను కలిగియున్నాము. వార్డు సభ్యుల అవసరాలను తీర్చుటలో విలువైన పాల్గొనేవారిగా వారి యువతులను నిశ్చయపరచే బిషప్పుల కొరకు పరలోకమునకు ధన్యవాదములు! అర్ధవంతమైన విధానాలలో సేవ చేయు ఈ అవకాశములు, వారు కేవలము వినోదపరచబడే కార్యక్రమాల కంటే అత్యధికముగా వారిని దీవించును.

సంఘ యువతులైన మీకు, మీ యౌవన సంవత్సరాలు తీరికలేనివి కావచ్చు మరియు తరచుగా సవాలుతో కూడినవి. మీలో అనేకులు స్వ-విలువ, ఆతృత, అత్యధిక ఒత్తిడి, బహుశా నిరాశ వంటి సమస్యలతో ప్రయాసపడుచున్నారని మేము గమనించాము. మీ స్వంత సమస్యల గురించి ఆలోచించుటకు బదులుగా ఇతరులను గూర్చి మీ ఆలోచనలు మరల్చుట, ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించకపోవచ్చు, కానీ సేవ తరచుగా, మీ భారములను తేలికగా చేయగలదు మరియు మీ సవాళ్ళు తక్కువ కష్టమైనదిగా కనబడునట్లు చేయును. స్వ-విలువ భావనలు హెచ్చింపబడుటకు శ్రేష్టమైన విధానాలలో ఒకటి, ఇతరులకు మన ఆలోచన మరియు సేవ ద్వారా, మనము తోడ్పడుటకు అధికమును కలిగియున్నామని చూపుట..5 మీ చుట్టూ ఉన్నవారి అవసరతలను మీరు చూచినప్పుడు, సహాయపడుటకు మీ చేతులను పైకెత్తమని యువతులైన మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. మీ నిబంధన బాధ్యతలను మీరు నెరవేర్చి, దేవుని రాజ్యమును నిర్మించుటలో పాల్గొనినప్పుడు, మీ జీవితములోనికి దీవెనలు ప్రవహించును మరియు మీరు శిష్యత్వము యొక్క లోతైన, శాశ్వతమైన సంతోషమును కనుగొంటారు.

సహోదర, సహోదరిలారా, మన యువతలు అద్భుతమైనవారు. వారు ప్రతిభలు, అపరిమితమైన ఉత్సాహము, శక్తిని కలిగియున్నారు, కనికరము మరియు శ్రద్ధను కలిగియున్నారు. వారు సేవ చేయాలని కోరుతున్నారు. వారు విలువివ్వబడుతున్నారని, రక్షణ కార్యములో ముఖ్యమైనవారని తెలుసుకోవాల్సినవసరమున్నది. యువకులు మెల్కీసెదకు యాజకత్వమునకు వృద్ధి చెందుటకు గొప్ప సహాయకరమైన సిద్ధపాటుగా అహరోను యాజకత్వమున్నట్లుగా, మన యువతులు భూమిమీద గొప్ప నిర్మాణమైన ఉపశమన సమాజము—యొక్క సభ్యులగుటకు సిద్ధపడుచున్నారు. కలిసి, ఈ అందమైన, బలమైన, విశ్వాసులైన యువతీ, యువకులు భార్యలు మరియు భర్తలుగా, దేవుని యొక్క సిలెస్టియల్ రాజ్యములో యోగ్యతగల కుటుంబాలను పెంచుటకు తల్లులు మరియు తండ్రులుగా సిద్ధపడుచున్నారు.

మన పరలోక తండ్రి యొక్క కార్యము, ఆయన పిల్లల యొక్క అమర్త్యత్వమును మరియు నిత్యజీవమును అందించుట అని నేను సాక్ష్యమిస్తున్నాను..6 మన ప్రశస్తమైన యువతులు ఈ గొప్ప కార్యమును నెరవేర్చుటకు సహాయపడుటలో ముఖ్యమైన పాత్రను కలిగియున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు