Scripture Stories
కొరియాంటన్


“కొరియాంటన్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 39–42

కొరియాంటన్

మరలా ప్రభువువైపు తిరిగెను

చిత్రం
జనులకు బోధిస్తున్న కొరియాంటన్

ఆల్మా కొడుకులలో ఒకరు కొరియాంటన్. యేసు క్రీస్తు యొక్క సువార్త గురించి జోరమీయులని పిలవబడిన జనుల గుంపుకు బోధించడానికి అతడు తన తండ్రి, తన సోదరుడు షిబ్లోను, మరియు ఇతరులతో కలిసి వెళ్ళాడు.

ఆల్మా 31:5–7; 32:1

చిత్రం
జనులతో తాగుతున్న కొరియాంటన్

కొరియాంటన్ జనులతో ఉన్నప్పుడు, అతడు పాపము చేయడానికి శోధించబడ్డాడు. దేవునికి విధేయుడు కాకుండా, అతడు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన పనులు చేయడానికి ఎన్నుకున్నాడు. అతడు చేసిన దాని కారణంగా, జోరమీయులలో కొందరు ఆల్మా, అతని కుమారులు బోధించిన దానిని నమ్మలేదు.

ఆల్మా 39:2–5; 11–12

చిత్రం
కొరియాంటన్‌తో మాట్లాడుతున్న ఆల్మా

పశ్చాత్తాపపడి, క్షమాపణ కొరకు ప్రభువు వైపు తిరగమని ఆల్మా కొరియాంటన్‌ను అడిగాడు. ప్రభువు యొక్క ప్రణాళికలో భాగాలు గురించి కొరియాంటన్ ఆందోళన చెందాడు. ప్రభువు యొక్క సంతోషపు ప్రణాళిక, క్రీస్తు ప్రాయశ్చిత్తము, పునరుత్థానము, మరియు చనిపోయిన తరువాత జీవితాన్ని గ్రహించడానికి ఆల్మా తన కుమారునికి సహాయపడ్డాడు. అతడు చేయడానికి దేవుడు ఒక కార్యమును కలిగియున్నాడని ఆల్మా అతనికి గుర్తు చేసాడు.

ఆల్మా 39:7–9, 13–19; 40–42

చిత్రం
జనులకు బోధిస్తున్న కొరియాంటన్

కొరియాంటన్ తన తండ్రి మాట విన్నాడు. యేసునందు అతనికి విశ్వాసము ఉన్నది మరియు అతడు తన పాపములను బట్టి పశ్చాత్తాపం చెందాడు. ప్రభువు న్యాయవంతుడు మరియు ప్రేమ, దయగలవాడని అతడు నేర్చుకున్నాడు. కొరియాంటన్ తన తండ్రి మరియు సోదరునితో కలసి మరలా బోధించాడు. పశ్చాత్తాపం వలన మరియు యేసు క్రీస్తు సువార్తను జీవించుట వలన కలిగే సంతోషం, శాంతి గురించి వారు అనేకమందికి బోధించారు.

ఆల్మా 42:30–31; 43:1–2; 48:17–18.

ముద్రించు