“ఒలీవ చెట్లు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
ఒలీవ చెట్లు
ఆయన పిల్లల పట్ల దేవునికి గల ప్రేమ
జేకబ్ దేవుని ప్రవక్త. దేవుడు తన జనులను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీఫైయులకు బోధించాలని అతడు కోరాడు. జేకబ్ వారికి ఒలీవ చెట్ల తోట గురించి ఒక కథను చెప్పాడు. ఒలీవ తోట యజమాని మరియు ఆయన సేవకుడు తోట కోసం శ్రద్ధ తీసుకోవడానికి కలిసి పనిచేసారు.
యజమానికి మంచి ఫలాలు ఇచ్చే ఒక ప్రత్యేకమైన ఒలీవ చెట్టు ఉంది. ఈ చెట్టు దేవుని జనులు, లేదా ఇశ్రాయేలు సంతానము వలె ఉన్నదని జేకబ్ చెప్పాడు. ఫలము జనులు క్రియల వలె ఉన్నది. యజమాని ఈ చెట్టుకు గొప్ప శ్రద్ధ తీసుకున్నాడు. దాని వేర్లకు ఆహారమిచ్చి, దాని కొమ్మలను కత్తిరించుట ద్వారా అది ఎదగడానికి ఆయన సహాయపడ్డాడు. అది బ్రతకడానికి అవసరమైన దానిని ఆయన ఇచ్చాడు.
కొంతకాలం తరువాత, ఆయన ప్రత్యేకమైన చెట్టు చనిపోసాగింది. అక్కడ ఆరోగ్యకరమైన కొమ్మలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది ప్రభువుకు విచారం కలిగించింది. అది మంచి ఫలమును కాస్తూ ఉండాలని ఆయన కోరాడు.
ఆరోగ్యమైన కొమ్మలను కాపాడటానికి, యజమాని వాటిని తీసివేసి, వాటిని మిగిలిన చెట్లకు జోడిస్తాడు. తరువాత అతడు ఇతర చెట్ల నుండి ఆరోగ్యమైన కొమ్మలతో వాటిని భర్తీ చేస్తాడు.
చాలాకాలం గడిచింది. యజమాని, సేవకుడు తరచుగా తోట వద్దకు వచ్చారు. వారు యజమాని యొక్క ప్రత్యేకమైన చెట్టు కోసం శ్రద్ధ తీసుకొన్నారు. తోట అంతటా చెట్లలో చెల్లాచెదురుగా ఉన్న ప్రత్యేక కొమ్మలను కూడా వారు శ్రద్ధ తీసుకొన్నారు. కాసిన పండ్లలో ఎక్కువ భాగం మంచిగా ఉన్నాయి. మంచి ఫలము యజమానికి, అతని సేవకునికి సంతోషాన్ని కలిగించింది.
కొంత కాలము తరువాత, ప్రతి చెట్టు ఎక్కువ పండ్లు కాసింది. కానీ ఇప్పుడు పండ్లన్నీ చెడిపోయాయి. ప్రభువు చాలా విచారంగా ఉన్నారు. ఆయన తన తోటను లేదా దాని పండ్లను కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఆయన తన చెట్లకు సహాయపడటానికి కష్టపడి పనిచేసాడు. తాను ఇంకా ఏమి చేయాలోనని ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన సేవకునితో మాట్లాడాడు మరియు ప్రయత్నిస్తూ ఉండాలని కోరుకున్నాడు.
తన తోటను కాపాడటానికి, ప్రత్యేక చెట్టు నుండి ఆయన కత్తిరించిన కొమ్మలను సేకరించమని యజమాని చెప్పాడు. వాటిని ప్రత్యేక చెట్టుకు మరలా జోడించమని ఆయన వారికి చెప్పాడు.
యజమాని తన తోటలో పనిచేయడం ఇదే చివరిసారి. సహాయం చేయడానికి అతడు మిగిలిన సేవకులను పిలిచాడు. కొమ్మలను సేకరించి అతికించడానికి ప్రతిఒక్కరు కలిసి పనిచేసారు
అన్ని చెట్లను వారు శ్రద్ధ తీసుకున్నారు. వారు చెడిన కొమ్మలను తీసివేసి మంచి వాటిని ఉంచారు. కొంత కాలం తరువాత, యజమాని యొక్క ప్రత్యేకమైన చెట్టు మరలా మంచి పండ్లను కాసింది. మిగిలిన చెట్లు కూడ ప్రత్యేకమైన చెట్టు పండ్లు ఉన్నంత మంచిగా ఉన్నాయి. యజమాని సంతోషించాడు. ఆయన చెట్లు కాపాడబడినవి! ఆయన వాటి నుండి కోరినట్లుగా అవి మంచి పండ్లను కాసాయి.
యజమాని సేవకులకు ధన్యవాదాలు తెలిపాడు. వారు కష్టపడి పనిచేసినందుకు మరియు ఆయన ఆజ్ఞలు పాటించినందుకు వారు దీవించబడ్డారని ఆయన వారితో చెప్పాడు. ఆయన వారితో పండ్లను పంచుకున్నాడు, మరియు అది వారికి సంతోషాన్ని కలిగించింది. చాలా కాలం, యజమాని పండ్లను ఆనందించాడు.
ఒలీవ చెట్ల కథను జేకబ్ ముగించాడు. తోట యజమాని తన చెట్ల కోసం శ్రద్ధ తీసుకొన్నట్లుగానే దేవుడు వారి కోసం శ్రద్ధ తీసుకుంటారని అతడు జనులకు బోధించాడు. ప్రతిఒక్కరిని పశ్చాత్తాపపడమని, దేవునికి దగ్గరగా రావాలని జేకబ్ అడిగాడు. దేవునిని ప్రేమించి సేవ చేయమని అతడు వారికి బోధించాడు, ఎందుకనగా దేవుడు వారికి సహాయపడటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడు.