“మోర్మన్ గ్రంధము గురించి,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
మోర్మన్ గ్రంధము గురించి
యేసు క్రీస్తు మరియు అమెరికాలో ఆయన జనులు
మోర్మన్ గ్రంధము లేఖనము. ప్రభువైన యేసు క్రీస్తు గురించి, చాలాకాలం క్రితం అమెరికాను ఆయన సందర్శించుట గురించి అది మనకు బోధిస్తుంది. మోర్మన్ గ్రంథము నుండి, మనము యేసు సువార్తను నేర్చుకోవచ్చు. మనము ఇప్పుడు శాంతిని ఎలా కలిగియుండగలము మరియు ఎదో ఒకరోజు మరలా దేవునితో, యేసుతో ఎలా జీవించవచ్చో అది మనకు బోధిస్తుంది.
మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజి; మోర్మన్ గ్రంథమునకు పీఠిక; 3 నీఫై 11
మోర్మన్ గ్రంథము దేవుని ప్రవక్తల చేత వ్రాయబడింది. వారు పలకలని పిలవబడిన లోహపు పేజీలపై వ్రాసారు. వారి కథలు మరియు సాక్ష్యములు మనం యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండటానికి సహాయపడతాయి. అమెరికాలో చాలాకాలం క్రితం జీవించిన అనేక జనుల గుంపులు గురించి వారు రాసారు.
మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజి; మోర్మన్ గ్రంథమునకు పీఠిక
దాదాపు 600 సంవత్సరాల క్రితం, యేసు పుట్టకముందు, ఒక గుంపు యెరూషలేము నుండి అమెరికాకు వచ్చింది. వారు లేమనీయులు మరియు నీఫైయులని పిలవబడిన రెండు రాజ్యాలుగా మారారు.
మోర్మన్ గ్రంధమునకు పీఠిక; 1 నీఫై 1:4
చాలా ముందుగా, మరొక గుంపు బాబెలు గోపురం నుండి అమెరికాకు వచ్చారు. వారు జెరెడీయులని పిలువబడిరి.
మోర్మన్ గ్రంధమునకు పీఠిక; ఈథర్ 1:33–43
దేవుని ప్రవక్తలు జనులకు బోధించారు. జనులు ప్రవక్తలను విని దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన వారికి సహాయపడ్డారు. ప్రవక్తలు యేసు గురించి బోధించి, ఆయన యెరూషలేములో పుడతారని చెప్పారు. యేసు మరణము తరువాత నీఫైయులు, లేమనీయులను ఆయన సందర్శిస్తారని వారు నేర్చుకున్నారు.
2 నీఫై 1:20; 25:12–14; 26:1, 3, 9; మోషైయ 3:5–11; ఆల్మా 7:9–13; హీలమన్ 3
ప్రవక్తలు చెప్పినట్లే యేసు వచ్చారు. యేసు చనిపోయి పునరుత్థానము చెందిన తరువాత, ఆయన జనులను సందర్శించారు. ఆయన ప్రతి వ్యక్తిని తన చేతులు, పాదములలో మేకుల గుర్తులను తాకనిచ్చారు. యేసు దేవుని కుమారుడని వారికి తెలుసు. ఆయన తన సువార్తను బోధించాడు, మరియు జనులు దానిని వ్రాసి ఉంచారు. అనేక సంవత్సరాలుగా యేసు యొక్క రాక గురించి వారు మాట్లాడారు.
3 నీఫై 11:7–15, 31–41; 16:4; 4 నీఫై 1:1–6, 13–22
మోర్మన్.ఒక ప్రవక్త అతడు యేసు సందర్శించిన తరువాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జీవించాడు. మోర్మన్ జీవిత కాలలో, జనులు ప్రభువును అనుసరించడం మానేసారు. మోర్మన్ తనకు ముందుగా జీవించిన ప్రవక్తల రచనలను కలిగి ఉన్నాడు. అతడు వారి అనేక రచనలను ఒకే జత పలకలో ఉంచాడు. ఈ పలకలు మోర్మన్ గ్రంథమయ్యాయి.
మోర్మన్ గ్రంథమునకు పీఠిక; మోర్మన్ వాక్యములు 1: 2–9; మోర్మన్ 1:2–4, 13–17
మోర్మన్ చనిపోకముందు, అతడు తన కుమారుడైన మొరోనైకి పలకలను ఇచ్చాడు. మొరోనై జీవితంలో, జనులు చాలా చెడ్డపనులు చేసేవారు. వారు యేసును నమ్మిన వారిని ఎవరినైనా చంపాలని కోరారు. మొరోనై భవిష్యత్తులో జనులకు సహాయపడాలని కోరాడు, కనుక అతడు పలకలపై ఎక్కువగా వ్రాసి, వాటిని భద్రంగా కాపాడటానికి వాటిని పాతి పెట్టాడు.
మోర్మన్ గ్రంథమునకు పీఠిక; మోర్మన్ వాక్యములు 1: 2–9; మోర్మన్ 8:2–4, 14–16; మొరోనై 1
అనేక సంవత్సరాల తరువాత, 1823లో, మొరోనై దేవదూతగా ప్రవక్త జోసెఫ్ స్మిత్ వద్దకు వచ్చాడు. పలకలు ఎక్కడ దొరుకుతాయో మొరోనై జోసెఫ్‌కు చెప్పాడు. దేవుని సహాయంతో, జోసెఫ్ పలకలపై వ్రాయబడియున్న దానిని అనువదించాడు.
మోర్మన్ గ్రంధమునకు పీఠిక; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1
ఏదైన నిజమని తెలుసుకోవడానికి మీకు సహాయపడేందుకు దేవుడు పరిశుద్ధాత్మను పంపుతారు. మోర్మన్ గ్రంథమును మీరు చదివినప్పుడు, మీరు ప్రార్థించి, అది సత్యమా అని అడగవచ్చు. అదే విధానములో, యేసు మీ రక్షకుడని మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు తెలుసుకోవచ్చు.