లేఖన కథలు
శరయ


“శరయ,” మోర్మన్ గ్రంథ కథలు

“శరయ,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

1 నీఫై 2–3; 5

శరయ

ఒక స్త్రీ విశ్వాసపు ప్రయాణము

శరయ మరియు లీహై

శరయ తన కుటుంబంతో యెరూషలేములో నివసించింది. ఆమె భర్త, లీహై దేవుని యొక్క ప్రవక్త. ఒకరోజు, ప్రభువు లీహైను తన కుటుంబంతో యెరూషలేమును విడిచి వెళ్ళమని చెప్పారు.

1 నీఫై 2:1–3

ప్రార్థిస్తున్న శరయ

శరయ ప్రభువునందు విశ్వాసము కలిగియుంది. ఆమె, తన కుటుంబం వారి ఇంటిని విడిచి వెళ్ళారు. అరణ్యములోనికి లీహైతో వెళ్లడానికి వారు తమ బంగారం, వెండి వదిలి వెళ్లారు.

1 నీఫై 2:4–5

అరణ్యములో శరయ

శరయ మరియు లీహై ఆహారాన్ని, వారికి అవసరమైన మిగిలిన వస్తువులను తీసుకొని వెళ్ళారు. వారు అనేక రోజులు ప్రయాణించిన తరువాత, వారు అరణ్యములో నివసించడానికి గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వారు ఒక బలిపీఠమును కట్టారు, ఆయన సహాయం కోసం ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపారు.

1 నీఫై 2:4, 6–7,15

దూరంగా లీహైతోపాటు శరయ ఆందోళన చెందింది

ఒకరోజు యెరూషలేముకు వెళ్ళి కంచు పలకలను తీసుకొని రమ్మని శరయ మరియు లీహై కుమారులను ప్రభువు అడిగారు. తన కుమారులు తిరిగి రానప్పుడు శరయ భయపడింది. వారు చనిపోయారని ఆమె అనుకున్నది. లీహై శరయను ఓదార్చాడు. ప్రభువు వారి కుమారులను కాపాడతారనే నమ్మకాన్ని వారు ఎంచుకున్నారు.

1 నీఫై 3:1–2, 4–6; 5:1–6

శరయ మరియు లీహైలు వారి కుమారులకు స్వాగతమిస్తున్నారు.

యెరూషలేము నుండి తన కుమారులు తిరిగి వచ్చినప్పుడు శరయ చాలా సంతోషించింది. ప్రభువు వారిని కాపాడారని ఇప్పుడు ఆమెకు తెలుసు. ఆయన అడిగిన దానిని చేయడానికి ప్రభువు వారికి శక్తిని ఇస్తారని ఆమె నమ్మంది. శరయ మొత్తం కుటుంబం సంతోషంగా ఉన్నది, మరియు వారు ప్రభువుకు కృతజ్ఞత తెలిపారు.

1 నీఫై 5:7–9