Scripture Stories
అబినడై మరియు రాజైన నోవహు


“అబినడై మరియు రాజైన నోవహు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

మోషైయ 11–17

అబినడై మరియు రాజైన నోవహు

ప్రవక్త నుండి వచ్చిన ఒక సందేశం

చిత్రం
ఇద్దరు యాజకులు వెనుక నిలబడి ఉన్నప్పుడు రాజైన నోవహు సూచించాడు

నీఫై దేశంలో నివసిస్తున్న నీఫైయులను రాజైన నోవహు పరిపాలించాడు. నోవహు తన ప్రజలు తనకు బోలెడంత ధనం ఇచ్చేలా చేసాడు మరియు దానిని తన కోసం మంచి వస్తువుల కోసం ఖర్చు చేశాడు. తనకు పాలనలో సహాయం చేయడానికి గర్వంతోనిండిన యాజకులను పిలిచాడు నోవహు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. బదులుగా, అతడు చాలా చెడ్డ పనులు చేశాడు.

మోషైయ 11:1–13

చిత్రం
రాజైన నోవహు

నోవహు తన ప్రజలను చెడ్డవారిగా కూడా నడిపించాడు. వారు ప్రభువును అనుసరించలేదు.

మోషైయ 11:7, 11, 14–15, 19

చిత్రం
అబినడై చెడు పనులు చేస్తున్న వ్యక్తుల వైపు చూస్తాడు.

అబినడై అనే దేవుని ప్రవక్త ఆ దేశంలో నివసించాడు. నోవహును మరియు అతని ప్రజలను పశ్చాత్తాపపడమని చెప్పడానికి ప్రభువు అబినడైని పంపారు.

మోషైయ 11:20

చిత్రం
అబినడై ప్రజలతో మాట్లాడతాడు

ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రభువు కోరుకుంటున్నారని అబినడై చెబుతాడు. వారు పశ్చాత్తాపపడకపోతే, ప్రభువు శత్రువులను వారి దేశానికి వచ్చి వారిని పాలించేలా చేస్తారు. వారి శత్రువులు నోవహుకు మరియు అతని ప్రజలకు జీవితాన్ని చాలా కష్టతరం చేస్తారు.

మోషైయ 11:20–25

చిత్రం
కోపంతో ఉన్న ప్రజలు

అబినడై చెప్పిన మాటల వలన ప్రజలు కోపంతో ఉన్నారు. వారు అతనిని చంపాలనుకున్నారు, కాని ప్రభువు అబినడైని సురక్షితంగా ఉంచారు మరియు అతడు తప్పించుకోవడానికి సహాయం చేసారు.

మోషైయ 11:26

చిత్రం
రాజైన నోవహు చేతులు జోడించి యాజకులతో మాట్లాడుతున్నాడు

నోవహు అబినడైని కూడా చంపాలనుకున్నాడు. నోవహు ప్రభువును విశ్వసించలేదు. అతడు మరియు అతని ప్రజలు పశ్చాత్తాపపడలేదు.

మోషైయ 11:27–29

చిత్రం
అబినడై పలకలు పట్టుకుని కుటుంబసభ్యులతో మాట్లాడతాడు

రెండు సంవత్సరాల తరువాత, ప్రభువు ప్రజలను హెచ్చరించడానికి అబినడైని తిరిగి పంపారు. వారు పశ్చాత్తాపపడనందున వారి శత్రువులు భూమిని స్వాధీనం చేసుకుంటారని అబినడై ప్రజలకు చెబుతాడు. అబినడై పట్ల ప్రజలు కోపంతో ఉన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, పశ్చాత్తాపపడబోమని వారు చెప్పారు. వారు అబినడైని కట్టివేసి, నోవహు వద్దకు తీసుకువెళ్లారు.

మోషైయ 12:1–16

చిత్రం
అబినడై రాజైన నోవహుకి వెనుదిరిగి మోకరిల్లాడు

నోవహు మరియు అతని యాజకులు ఒక ప్రణాళికను రూపొందించారు. యాజకులు అబినడైని చాలా ప్రశ్నలు వేసి మోసం చేయడానికి ప్రయత్నించారు. అయితే అబినడై ధైర్యంగా వారికి సమాధానం చెప్పాడు. అబినడై సమాధానాలకు యాజకులు ఆశ్చర్యపోయారు. వారు అతనిని మోసగించలేకపోయారు. అబినడై యాజకులకు సరైనది చేయడం కంటే ధనం గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని చెబుతాడు.

మోషైయ 12:17–37

చిత్రం
అబినడై ప్రకాశిస్తూ నిలబడి ఉన్నాడు

అబినడైని చంపమని నోవహు తన యాజకులకు చెప్పాడు. అయితే అబినడై మాత్రం తనని తాకవద్దని హెచ్చరించాడు. అతని ముఖం దేవుని శక్తితో ప్రకాశించింది. యాజకులు దేవునిశాసనాలను బోధించలేదని అబినడై చెప్పాడు. యేసు క్రీస్తు జన్మిస్తాడని, మనకోసం చనిపోతారని, పునరుత్థానుడవుతాడరని అబినడై వారికి బోధించాడు. వారు పశ్చాత్తాపపడితే యేసు వారిని క్షమిస్తాడని అతడు చెప్పాడు.

మోషైయ 13; 16:6–15

చిత్రం
అబినడై రాజైన నోవహు వైపు చూస్తున్నాడు

ప్రభువు చెప్పమని పంపిన సందేశాన్ని అబినడై ముగించాడు. నోవహు ఇంకా కోపంగా ఉన్నాడు. అతడు అబినడైని తీసుకెళ్లి చంపమని తన యాజకులకు చెప్పాడు.

మోషైయ 17:1

చిత్రం
ఆల్మా అనుకున్నట్లుగా రాజైన నోవహు అబినడై వైపు చూస్తున్నాడు మరియు ఇతర యాజకులు కోపంగా ఉన్నారు

ఒక యాజకుడు ఆల్మా అబినడైని నమ్మాడు. అబినడైని కాపాడేందుకు ఆల్మా ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు నోవహు ఆల్మాపై కూడా కోపంగా ఉన్నాడు మరియు అతనిని వదిలి వెళ్ళమని బలవంతం చేశాడు.

మోషైయ 17:2–3

చిత్రం
ఆల్మా చెడ్డ యాజకుల నుండి దూరంగా దాక్కున్నాడు.

తాను బోధించినది నిజం కాదని చెబితే అతడు బతకవచ్చని యాజకులు అబినడైకి చెప్పారు. కానీ అబినడై మాత్రం తాను సత్యం బోధించానని చెప్పాడు. నోవహు మరియు అతని యాజకులు మళ్లీ కోపంగా ఉన్నారు. వారు అబినడైని అగ్నితో చంపారు. నోవహు యొక్క కాపలాదారులు ఆల్మాను కూడా చంపడానికి ప్రయత్నించారు. కానీ ఆల్మా దాగివుండి అబినడై మాటలు అన్నిటిని వ్రాసాడు

మోషైయ 17:3–13, 20

ముద్రించు