“టియాంకమ్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
టియాంకమ్
తన ప్రజలను రక్షించడం
సేనాధిపతి అయిన మొరోనై యొక్క సైన్యంలో టియాంకమ్ ఒక నాయకుడు. అతడు నీఫైయుల నగరాలను లేమనీయుల నుండి సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు.
అమలిక్యా ఒక నీఫైయుడు, అతను లేమనీయులకు రాజు అయ్యాడు. అతడు నీఫైయులను కూడా పరిపాలించాలనుకున్నాడు. అతడు నీఫైయులపై దాడి చేసి అనేక నగరాలను స్వాధీనం చేసుకున్నాడు
ఆల్మా 47:1, 35; 48:1–4; 51:23–28
నీఫైయుల నగరాలపై దాడి చేయకుండా అమలిక్యా సైన్యాన్ని ఆపడానికి టియాంకమ్ సైన్యం వెళ్లింది.
రోజంతా సైన్యాలు యుద్ధం చేశాయి. టియాంకమ్ మరియు అతని సైన్యం అమలిక్యా సైన్యం కంటే ఎక్కువ శక్తితో మరియు నైపుణ్యంతో పోరాడాయి. కానీ ఏ సైన్యం కూడా విజయం సాధించలేదు. చీకటి పడినప్పుడు, రెండు సైన్యాలు విశ్రాంతి తీసుకోవడానికి యుద్ధాన్ని నిలిపివేశాయి.
ఆల్మా 51:31—32
కానీ టియాంకమ్ విశ్రాంతి తీసుకోలేదు. అతడు మరియు అతని సేవకుడు రహస్యంగా అమలిక్యా శిబిరానికి వెళ్లారు.
టియాంకమ్ అమలిక్యా గుడారంలోకి చొరబడ్డాడు. అమలిక్యా నిద్ర లేవకముందే అతడు అమలిక్యాను చంపాడు. అప్పుడు టియాంకమ్ తన శిబిరానికి తిరిగి వెళ్లి పోరాడటానికి సిద్ధంగా ఉండమని తన సైనికులకు చెప్పాడు.
లేమనీయులు మేల్కొన్నప్పుడు, అమలిక్యా చనిపోయాడని వారు కనుగొనిరి. టియాంకమ్ మరియు అతని సైన్యం వారితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు చూశారు.
లేమనీయులు భయపడి పారిపోయారు. టియాంకమ్ యొక్క ప్రణాళిక, లేమనీయులు మరికొన్ని నీఫైయుల నగరాలపై దాడి చేయడానికి చాలా భయపడేలా చేసింది. ఇప్పుడు టియాంకమ్కు నీఫైయుల నగరాలను సురక్షితంగా చేయడానికి సమయం దొరికింది. అతడు తన ప్రజలను రక్షించడానికి చాలా కష్టపడ్డాడు. అతడు అనేక నీఫైయుల నగరాలను సురక్షితంగా ఉంచగలిగాడు.