“సైన్యాధికారియైన మొరోనై మరియు పహోరన్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
సైన్యాధికారియైన మొరోనై మరియు పహోరన్
దేవుని నుండి బలము
నీఫైయులు, లేమనీయులు యుద్ధంలో ఉన్నారు. మొరోనై నీఫైయుల సైన్యాలకు సైన్యాధికారిగా ఉన్నాడు. నీఫైయుల నాయకులు తగినంత మంది సైనికులు లేక ఆహారాన్ని పంపలేదు. మొరోనై కోపగించాడు మరియు నీపైయుల నాయకుడైన పహోరన్‌కు ఒక లేఖ వ్రాసాడు.
తన లేఖలో, అతను సహాయం ఎందుకు పంపలేదని మొరోనై పహోరన్‌ను అడిగాడు. పహోరన్ జనులు గురించి పట్టించుకోలేదని, కేవలం అధికారాన్ని కోరాడని మొరోనై అనుకున్నాడు. మొరోనై తన జనులు స్వేచ్ఛగా ఉండాలని కోరాడు.
సైన్యాలకు సహాయము లేదని పహరోన్ విచారంగా ఉన్నాడు. అతడు మొరోనైకు సహాయపడాలని కోరాడు, కానీ అతడు అలా చేయలేకపోయాడు. నీఫైయులలో కొందరు అతనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఆ నీఫైయులు, రాజు-మనుష్యులని పిలవబడ్డారు. వారు తమకే అధికారం కావాలని, జనులను పరిపాలించాలని కోరారు. వారు పహోరన్ నుండి ప్రభుత్వాన్ని తీసుకున్నారు.
అతడు నీఫైయులను నడిపించుట కొనసాగించాలని కోరాడు ఆవిధంగా అతడు వారికి సహాయపడగలడు. మొరోనై వలే, అతడు కూడా నీఫైయులు దేవుడిని అనుసరించాలని, వారి స్వేచ్ఛను కాపాడుకోవాలని కోరాడు. వారు ఎవరితోను పోరాడాల్సిన అవసరం లేకుండా ఉండాలని అతడు ఆశించాడు. కానీ అతని జనులు క్షేమంగా ఉండటానికి పోరాటం సహాయపడితే, పోరాడటానికి అతడు సుముఖంగా ఉన్నాడు.
వారి కుటుంబాలను, వారి స్వేచ్ఛను, మరియు దేవుడిని ఆరాధించడానికి వారి హక్కును కాపాడేందుకు పోరాడటానికి అతనికి సహాయపడమని నీఫైయులను పహోరన్ అడిగాడు. సరైన దాని కోసం పోరాడటానికి వారు ఎంపిక చేసినప్పుడు దేవుని ఆత్మ వారితో ఉంటుందని అతనికి తెలుసు. వారి దేశాన్ని కాపాడటానికి పహోరన్‌కు సహాయపడటానికి అనేకమంది నీఫైయులు వచ్చారు.
పహోరన్ మొరోనైకు ఒక లేఖ రాసాడు. అతడు మొరోనై పట్ల కోపగించలేదు. జరుగుతున్నదంతా అతడు మొరోనైకు చెప్పాడు. మొరోనై వచ్చి, రాజు-మనుష్యులతో పోరాడటానికి తనకు సహాయపడమని అతడు అడిగాడు. వారు దేవుడిని అనుసరించిన యెడల, వారు భయపడనవసరం లేదని పహోరన్‌కు తెలుసు. దేవుడు వారిని కాపాడతాడు మరియు వారికి సహాయపడతాడు.
పహోరన్ విశ్వాసము వలన అతడు ఆశతో నింపబడ్డాడు. కానీ కొందరు నీఫైయులు వారి స్వంత జనులతో పోరాడుతూ, దేవునికి విధేయులుగా లేరని అతడు విచారించాడు. మొరోనై ఒక సైన్యాన్ని తీసుకొని, పహోరన్‌కు సహాయపడటానికి వెళ్ళాడు. సేనాధిపతి అయిన మొరోనై స్వేచ్ఛాపతాకమును పట్టుకొని, నీఫైయుల మధ్య కవాతు చేస్తున్నాడు. వేలమంది నీఫైయులు తమ స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాడాలని నిర్ణయించుకున్నారు.
మొరోనై మరియు పహోరన్ తమ సైన్యాలతో రాజు-మనుష్యులను ఓడిస్తారు. పహోరన్ మరలా నీఫైయుల నాయకుడు అవుతాడు. మొరోనై నీఫైయుల సైన్యాలకు సహాయపడటానికి అనేకమంది వ్యక్తులను పంపాడు. అతడు సైన్యాలకు ఆహారాన్ని కూడా పంపాడు. ఇప్పుడు నీఫైయులు ఏకము చేయబడ్డారు కనుక, వారు అనేక యుద్ధాలను గెలిచారు. వారు లేమనీయుల నుండి అనేక నీఫైయుల పట్టణాలను వెనుకకు తీసుకున్నారు.