లేఖన కథలు
చిన్నవాడగు ఆల్మా


“చిన్నవాడగు ఆల్మా,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

“చిన్నవాడగు ఆల్మా,” మోర్మన్ గ్రంథ కథలు

మోషైయ 25–28; ఆల్మా 36

చిన్నవాడగు ఆల్మా

ఒక గొప్ప మార్పు

మోషైయ మరియు పెద్ద వాడైన ఆల్మా

రాజైన మోషైయ జరహేమ్లలో సంఘాన్ని నడిపించే అధికారాన్ని ఆల్మాకు ఇచ్చాడు. జనులను పశ్చాత్తాపపడమని మరియు ప్రభువునందు విశ్వాసం కలిగియుండమని ఆల్మా బోధించాడు.

మోషైయ 25:19–24; 26

చిన్నవాడగు ఆల్మా

ఆల్మాకు ఒక కొడుకు ఉన్నాడు అతడు కూడ ఆల్మా అని పేరు పెట్టబడ్డాడు. చిన్నవాడగు ఆల్మా తన తండ్రి చెప్పిన దానిని నమ్మలేదు.

మోషైయ 27:8

జనులతో మాట్లాడుతున్న చిన్నవాడగు ఆల్మా మరియు మోషైయ కుమారులు

మోషైయకు కుమారులు కలిగారు వారు కూడ ప్రభువును నమ్మలేదు. చిన్నవాడగు ఆల్మాతో వారు స్నేహితులు. వారందరు జనులు సంఘాన్ని విడిచి పెట్టాలని కోరుకున్నారు. ఆల్మా మరియు మోషైయ కుమారులు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన పనులు చేసేలా అనేకమంది జనులను నడిపించారు.

మోషైయ 27:9–10; ఆల్మా 36:6

చిన్నవాడగు ఆల్మా మరియు మోషైయ కుమారులు దేవదూతకు భయపడ్డారు

ఒకరోజు, వారిని ఆపడానికి ప్రభువు ఒక దేవదూతను పంపారు. సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడాన్ని ఆపమని దేవదూత వారికి చెప్పింది. ఆల్మా మరియు మోషైయ కుమారులు చాల భయపడి నేలపై పడిపోయారు.

మోషైయ 27:11–18; ఆల్మా 36:6–9

బాధలో ఉన్న చిన్నవాడగు ఆల్మా

ఆల్మా మూడు రోజులు మరియు మూడు రాత్రులు మాట్లాడలేకపోయాడు లేదా కదలలేకపోయాడు. అతడు తాను చేసిన తప్పు విషయాలను అన్నిటిని బట్టి చాలా విచారించాడు. అతడు అనేకమందిని ప్రభువుకు దూరంగా నడిపించాడు కనుక అతడు చాలా ఆందోళన చెందాడు.

మోషైయ 27:19–27; ఆల్మా 36:10–16

మోకరిస్తున్న చిన్నవాడగు ఆల్మా

అతని పాపాల కారణంగా ఆల్మా చాలా బాధను అనుభవించాడు. అప్పుడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు గురించి తన తండ్రి మాట్లాడినది అతడు జ్ఞాపకం చేసుకున్నాడు.

ఆల్మా 36:17

చిన్నవాడగు ఆల్మా సంతోషించాడు

తనను క్షమించమని ఆల్మా యేసును ప్రార్థించాడు. అతడు ప్రార్థించిన తరువాత, అతడికి తన బాధ ఇక గుర్తుకురాలేదు. ప్రభువు అతడిని క్షమించాడని అతడికి తెలుసు. అతడు తన పాపములు గురించి ఇక బాధపడలేదు. బదులుగా, ఆల్మా చాలా సంతోషించాడు.

మోషైయ 27:24, 28–29; ఆల్మా 36:18–22

వేరొకరికి సహాయపడుతున్న చిన్నవాడగు ఆల్మా మరియు మోషైయ కుమారులు

ఆల్మా తిరిగి తన బలాన్ని పొందాడు. అతడు, మోషైయ కుమారులు పశ్చాత్తాపపడాలని, వారు కలిగించిన బాధ అంతటిని సరిచేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. ఆ సమయం నుండి ఇతరులు పశ్చాత్తాపపడటానికి సహాయపడుట ద్వారా వారు ప్రభువుకు సేవ చేసారు. వారు మోషైయ పరిపాలించిన దేశముగుండా ప్రయాణించారు మరియు యేసు గురించి జనులకు బోధించారు.

మోషైయ 27:20–24, 32–37; ఆల్మా 36:23–26

విడిచివెళ్ళిన మోషైయ కుమారులు

ఆల్మా మరియు మోషైయ కుమారులు వారి జీవితాలలోనికి యేసు బోధనలు తెచ్చిన సంతోషాన్ని పంచుకోవాలని కోరుకున్నారు. ప్రభువుకు, జనులకు సేవ చేయడానికి వారు చాలా కష్టపడి పనిచేసారు. మోషైయ కుమారులు వెళ్ళి లేమనీయులకు యేసు గురించి బోధించాలనుకున్నారు. ఆల్మా ఉండి, నీఫైయులకు బోధించుట కొనసాగించాలని ఎన్నుకున్నాడు.

మోషైయ 27:32–37; 28:1–10; 29:42–43