లేఖన కథలు
జనులకు బోధిస్తున్న యేసు


“జనులకు బోధిస్తున్న యేసు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

3 నీఫై 11–27; 4 నీఫై 1

2:41

జనులకు బోధిస్తున్న యేసు

ఆయన సువార్తను నేర్చుకోవడానికి వారికి సహాయపడుతున్నారు

యేసు క్రీస్తు మోకరించి, సంతోషంగా ఉన్న పిల్లలతో మాట్లాడును, మరియు అనేకమంది సంతోషంగా ఉన్న జనులు వారి చుట్టూ మోకరించి వింటారు

అమెరికాలోని జనులు యేసు క్రీస్తును చూడటానికి మరియు ఆయన బోధనలను వినడానికి ఆనందించారు. రక్షకుని రాక కోసం వారు అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు.

3 నీఫై 11:10, 17

యేసు క్రీస్తు సంతోషంగా ఉన్న జనుల మధ్య కూర్చోని వారికి బోధిస్తున్నారు

యెరూషలేము సమీపంలోని జనులకు ఆయన బోధించిన అనేక విషయాలను యేసు వారికి బోధించారు. విశ్వాసము కలిగియుండమని, పశ్చాత్తాప పడమని మరియు బాప్తీస్మము పొందమని ఆయన వారికి బోధించారు. జనులు ఈ విషయాలను పాటించిన యెడల, దేవుడు వారికి పరిశుద్ధాత్మను పంపుతారు. ఎలా ప్రార్థించాలో యేసు వారికి బోధించారు. ఇతరులను క్షమించమని ఆయన వారిని అడిగారు. ఇతరులకు మాదిరిగా ఉండమని ఆయన వారిని కోరారు.

3 నీఫై 11:31–39; 12:22–24, 44; 13:5–14; 17:8; 18:15–24

యేసు క్రీస్తు చిరునవ్వు నవ్వుతారు

ఆయన వారికి బోధించిన దానిని అర్ధం చేసుకోవడానికి వారికి సహాయపడేలా ఇంటికి వెళ్ళి దేవునికి ప్రార్థించమని యేసు జనులకు చెప్పారు. ఆయన మరుసటి రోజు తిరిగి వస్తానని చెప్పారు.

3 నీఫై 17:1–3

జనులు మంట చుట్టూ కూర్చోని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు.

ఆ రాత్రి, వారు యేసును చూసారని ఆ జనులు ఇతరులకు చెప్పారు. ఆయన చెప్పిన దాని గురించి మరియు చేసిన దాని గురించి వారు మాట్లాడారు. యేసును చూడటానికి అనేకమంది జనులు ప్రయాణించారు.

3 నీఫై 19:1–3

శిష్యులు పెద్ద జన సమూహానికి బోధిస్తారు

మరుసటి రోజు, జనులు యేసు యొక్క పన్నెండుమంది శిష్యులతో సమావేశమవుతారు. యేసు బోధించిన సమస్తమును శిష్యులు జనులకు బోధించారు. వారు నేలపై మోకరించి, ప్రార్థించారు.

3 నీఫై 19:4–8

యేసు క్రీస్తు మోకరించి, ప్రార్థించును, మరియు ఆయన చుట్టూ ఉన్న మిగిలిన జనులు కూడ మోకరించి ప్రార్థిస్తారు.

అప్పుడు యేసు వచ్చారు. ఆయన తన శిష్యుల కోసం, జనుల కోసం ప్రార్థించారు. శిష్యులు కూడా ప్రార్థించారు. వారు రక్షకుని వలె ప్రకాశవంతంగా ప్రకాశించడం మొదలుపెట్టారు. యేసు సంతోషంగా ఉన్నారు. ఆయనయందు వారి విశ్వాసం కారణంగా శిష్యులు శుద్ధిగా మారారు. యేసు మరలా ప్రార్థించారు, మరియు ఆయన అద్భుతమైన విషయాలను చెప్పుట జనులు విన్నారు.

3 నీఫై 19:15–36

సంతోషంగా ఉన్న పిల్లవాడు యేసు క్రీస్తును వింటున్న జనుల వద్దకు వచ్చి చేరమని ఒకరిని ఆహ్వానిస్తాడు

తరువాత కొన్ని రోజులు, పరలోక తండ్రి యొక్క ప్రణాళిక గురించి అనేక విషయాలను యేసు బోధించారు. ఆయన వారితో సంస్కారమును కూడా పంచుకున్నాడు. దేశములో జనులందరూ యేసు క్రీస్తునందు విశ్వసించారు మరియు బాప్తీస్మము పొందారు. పరిశుద్ధాత్మ వరమును వారు పొందారు.

3 నీఫై 20–27; 4 నీఫై 1:1–2

యేసు క్రీస్తు వద్దకు రావడానికి జనులు ఒకరికొకరు సహాయపడుతున్నారు, మరియు యేసు క్రీస్తు వారితో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు

జనులు ఒకరికొకరు సహాయపడ్డారు మరియు వారికి కలిగినదంతా పంచుకున్నారు. యేసు వారిని చేయమని ఆజ్ఞాపించినవన్నీ వారు చేసారు. వారు క్రీస్తు యొక్క సంఘమని పిలవబడ్డారు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు, జనులతో చాలా సంతోషించారు.

3 నీఫై 26:17–21, 31–41; 27:30–31; 4 నీఫై 1:3–18