లేఖన కథలు
యువ సైన్యము


“యువ సైన్యము,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 53; 56–57

యువ సైన్యము

దేవుణ్ణి నమ్మిన కుమారులు

యువ సైనికులు కవచాలు, ఈటెలు మరియు కత్తులు తీసుకొనియున్నారు.

నీఫైయులు లేమనీయులతో యుద్ధంలో ఉన్నారు మరియు వారికి సహాయం కావాలి. ఆంటై-నీఫై-లీహైయులు సహాయం చేయాలనుకున్నారు. కానీ వారు యుద్ధం చేయకూడదని ప్రభువుకు వాగ్దానం చేసారు. వారి చిన్న కుమారులలో రెండు వేల మంది ఆ వాగ్దానం చేయలేదు. బదులుగా, కుమారులు తమ కుటుంబాలను రక్షించడానికి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ కుమారులను యువ సైనికులు అని పిలుస్తారు.

ఆల్మా 53:8, 13–18, 22; 56:1–8

హీలమన్ యువ సైనికులను నగరం వైపు నడిపించాడు.

యువ సైనికులు తమకు నాయకత్వం వహించడానికి ప్రవక్త హీలమన్‌ను ఎన్నుకున్నారు. లేమనీయుల పెద్ద సైన్యంతో పోలిస్తే వారు ఒక చిన్న సమూహం. కానీ హీలమన్‌కు తెలుసు, యువ సైనికులు నిజాయితీపరులు, ధైర్యవంతులు మరియు విశ్వాసులు. హీలమన్ వారికి నాయకత్వం వహించడంతో, వారు నీఫైయులకు సహాయం చేయడానికి వెళ్ళారు.

ఆల్మా 53:19–22; 56:9–10, 17, 19

యువ సైనికులు నీఫైయుల సైనికులతో కలసి కోటను నిర్మించారు, మరియు తల్లిదండ్రులు ఆహారం తీసుకువచ్చారు

నీఫైయుల సైనికులు అలసిపోయారు. కానీ యువ సైనికులు వచ్చినప్పుడు, నీఫైయులు సంతోషించారు. యువ సైన్యం వారికి ఆశను మరియు శక్తిని ఇచ్చింది. వారు కలిసి, లేమనీయులతో పోరాడటానికి సిద్ధమయ్యారు. యువ సైనికుల తల్లిదండ్రులు కూడా వారికి ఆహారం మరియు సామాగ్రిని తీసుకురావడం ద్వారా సహాయం చేశారు.

ఆల్మా 56:16–17, 19–20, 22, 27

నీఫైయుల నాయకులు మరియు యువ సైనికులు ఒక గుడారంలో కలుసుకుంటారు

లేమనీయులు అనేక నగరాలను స్వాధీనం చేసుకున్నారు మరియు వారి సైన్యాలను వాటిలో ఉంచారు. నీఫైయుల నాయకులు లేమనీయులను నగరాలలో ఒక దానిని విడిచిపెట్టేలా చేయాలని కోరుకున్నారు. వారు ఒక ప్రణాళికను రూపొందించారు మరియు సహాయం కోసం యువ సైనికులను అడిగారు.

ఆల్మా 56:18–30

లేమనీయుల సైన్యం ఆయుధాలతో యువ సైనికుల వైపు పరుగులు తీస్తుంది

యువ సైనికులు సమీప నగరంలో నివసిస్తున్న నీఫైయులకు ఆహారాన్ని తీసుకువెళుతున్నట్లు నటించారు. లేమనీయులు చిన్న గుంపును చూసినప్పుడు, వారు తమ నగరాన్ని విడిచిపెట్టి, యువ సైనికులను వెంబడించారు. వారిని పట్టుకోవడం సులభమని లేమనీయులు భావించారు.

ఆల్మా 56:30–36

యువ సైనికులు సుదీర్ఘ వరుసలో కవాతు చేస్తారు, ఒక లేమనీయుల సైన్యం వారిని అనుసరిస్తుంది మరియు నీఫైయుల సైన్యం లేమనీయుల సైన్యాన్ని అనుసరిస్తుంది

యువ సైనికులు లేమనీయుల నుండి దూరంగా పారిపోయారు. అప్పుడు నీఫైయుల సైన్యం లేమనీయులను వెంబడించడం ప్రారంభించింది. నీఫైయులు తమను చేరుకోకముందే లేమనీయులు యువ సైనికులను పట్టుకోవాలనుకున్నారు. నీఫైయులు యువ సైనికులు ఇబ్బందుల్లో ఉన్నారని చూశారు మరియు వారికి సహాయం చేయడానికి వేగంగా కవాతు చేశారు.

ఆల్మా 56:36–41

ఒక యువ సైనికుడు ఇతర సైన్యాల కోసం వెతుకుతున్నాడు మరియు ఆందోళన చెందుతాడు

కొంత సమయం తరువాత, యువ సైనికులు లేమనీయులను చూడలేకపోయారు. నీఫైయులు లేమనీయుల వద్దకు చేరుకుని పోరాడుతున్నారా అని వారు ఆశ్చర్యపోవడం ప్రారంభించారు.

ఆల్మా 56:42-43

హీలమన్ తన కత్తిని పట్టుకున్నాడు

హీలమన్ ఆందోళన చెందాడు. లేమనీయులు తమను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని అతను భావించాడు. అతడు తన యువ సైనికులను లేమనీయులతో పోరాడటానికి వెళతారా అని అడిగాడు

ఆల్మా 56:43–44

యువ సైనికులు తమ కత్తులను పైకి లేపారు.

యువ సైనికులు తమ తల్లులు తమకు నేర్పించిన వాటిని గుర్తు చేసుకున్నారు. వారి తల్లులు దేవుణ్ణి విశ్వసించాలని మరియు సందేహించకూడదని వారికి నేర్పించారు, ఎందుకంటే ఆయన వారిని సురక్షితంగా ఉంచుతారు. ఈ కుమారులు దేవుణ్ణి విశ్వసించారు మరియు వారి కుటుంబాలను రక్షించడానికి వారి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరుకున్నారు. తాము వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని హీలమన్‌తో చెప్పారు.

ఆల్మా 56:46–48

హీలమన్ యువ సైనికులతో కలిసి కవాతు చేస్తున్నాడు

వారి ధైర్యానికి హీలమన్ ఆశ్చర్యపోయాడు. అతను లేమనీయులతో పోరాడటానికి వారిని తిరిగి నడిపించాడు.

ఆల్మా 56:45, 49

హీలమన్ మరియు యువ సైనికులు ఆయుధాలతో కొండపై నిలబడి ఉన్నారు

లేమనీయులు మరియు నీఫైయు‌లు పోరాడడం యువ సైనికులు చూశారు. నీఫైయులు అలసిపోయారు. యువ సైనికులు వచ్చేసరికి వారు ఓడిపోబోతున్నారు.

ఆల్మా 56:49–52

లేమనీయులు సైనికులు భయంగా కనబడ్డారు

యువ సైనికులు దేవుని యొక్క బలంతో పోరాడారు. లేమనీయులు వారికి భయపడి, పోరాటాన్ని ఆపారు. యుద్ధంలో గెలవడానికి యువ సైనికులు సహాయం చేసారు!

ఆల్మా 56:52–54, 56

హీలమన్ యువ సైనికులను తన చేతితో పట్టుకున్నాడు

యుద్ధంలో, చాలా మంది నీఫైయు‌లు మరియు లేమనీయులు మరణించారు. తన యువ సైనికుల్లో కూడా కొందరు చనిపోయివుంటారేమోనని హెలమన్ ఆందోళన చెందాడు. కానీ యుద్ధం తర్వాత, హీలమన్ ప్రతి ఒక్కరినీ లెక్కించాడు. యువ సైనికులు ఎవరూ చంపబడలేదని చూచి అతను చాలా సంతోషించాడు. దేవుడు వారిని రక్షించారు.

ఆల్మా 56:55–56

యువ సైనికులు గాయపడ్డారు మరియు అందరూ కలిసి నిలబడి ఉన్నారు.

మరికొంతమంది కుమారులు యువ సైనికులలో చేరారు. వారు నీఫైయుల పోరాటానికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఈ ఇతర యుద్ధాలలో, యువ సైనికులు అందరూ గాయపడ్డారు, కానీ వారిలో ఎవరూ మరణించలేదు. తమ తల్లులు తమకు నేర్పించిన వాటిని గుర్తు చేసుకున్నారు. వారు దేవుణ్ణి విశ్వసించారు, ఆయన వారిని కాపాడారు.

ఆల్మా 57:6, 19–27; 58:39–40