లేఖన కథలు
జోరమీయులు


“జోరమీయులు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఆల్మా 31–35

3:26

జోరమీయులు

యేసు క్రీస్తులో వారి విశ్వాసాన్ని పెంపొందించుట

అమ్యులెక్, ఆల్మా, కొరియాంటన్, మరియు ఇతర నీఫైయులు ఒక పట్టణానికి ప్రయాణించారు.

జోరమీయులని పిలవబడిన ఒక నీఫైయుల గుంపు దేవుని ఆజ్ఞలను పాటించుట లేదు. ఇది ప్రవక్త ఆల్మాకు విచారం కలిగించింది. వారికి సహాయపడటానికి శ్రేష్ఠమైన విధానము వారికి దేవుని వాక్యాన్ని బోధించడమని అతనికి తెలుసు. వారికి బోధించడానికి అతడు అమ్యులెక్‌ మరియు ఇతరులతో పాటు వెళ్ళాడు.

ఆల్మా 31:2–11

ఆల్మా, అమ్యులెక్ విచారంగా కనబడ్డారు, మరియు మంచి దుస్తులు ధరించిన జనులు అవసరతలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేసారు.

జోరమీయులకు దేవుని గురించి తెలుసు కానీ వారు ఆయన బోధనలను మార్చేసారు. వారు విగ్రహాలను పూజించారు. వారు మిగిలిన జనులకంటె మంచివారమని అనుకున్నారు. డబ్బు లేని జనులను వారు హీనముగా చూసేవారు.

ఆల్మా 31:1, 8–12, 24–25; 32:2–3

మంచి దుస్తులు ధరించిన జోరమీయులు, గుంపు మధ్యలో ఒక ఎత్తైన వేదికపై నిలబడి ఆకాశం వైపు చేతులు ఎత్తారు

వారి సంఘాల మధ్యలో నిలబడటానికి ఒక ఎత్తైన స్థలాన్ని జోరమీయులు నిర్మించారు. ఒకరి తరువాత ఒకరు దానిపై నిలబడి ప్రార్థించారు. ప్రతిసారి అదే మాటలను ఉపయోగిస్తూ వారు ప్రార్థించేవారు. ప్రార్థనలో, వారు దేవునికి శరీరం లేదని, యేసు క్రీస్తు నిజము కాదని వారు చెప్పారు. దేవునిచే రక్షించబడే జనులు వారు మాత్రమేనని వారు చెప్పారు.

ఆల్మా 31:12–23

ఆల్మా మరియు అమ్యులెక్ పేద జోరమీయులతో మాట్లాడారు.

ఆల్మా జోరమీయులను ప్రేమించాడు మరియు వారు దేవుడిని మరియు యేసును అనుసరించాలని కోరాడు. అతడు ప్రార్థించి, తనకు మరియు జోరమీయులకు బోధించడానికి తనతోపాటు వచ్చిన ఇతరులకు సహాయపడమని దేవుడిని అడిగాడు. ఆల్మా మరియు అతనితో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు వెళ్ళి, దేవుని శక్తితో బోధించారు.

ఆల్మా 31:24–38; 32:1

అనేకమంది పేద జోరమీయులు ఆల్మా, అమ్యులెక్, మరియు జీజ్రోమ్ బోధించిన దానిని విన్నారు.

కొందరు జోరమీయులు విచారంగా ఉన్నారు. వారు మంచి దుస్తులు ధరించలేదు కనుక వారు సంఘాలలో అనుమతించబడలేదు. వారు దేవుడిని ఆరాధించాలని కోరారు కానీ వారు సంఘాలలోనికి వెళ్ళలేకపోతే ఎలా ఆరాధించాలో వారికి తెలియలేదు. వారేమి చేయాలని వారు ఆల్మాను అడిగారు. వారు ఎక్కడ ఉన్నప్పటికినీ దేవుడు వారి ప్రార్థనలను వింటారని ఆల్మా వారికి బోధించాడు.

ఆల్మా 32:2–12; 33:2–11

ఆల్మా ఒక చిన్న విత్తనాన్ని పట్టుకొని తన మరొక చేతితో పొడవాటి అందమైన పువ్వు వైపు చూపిస్తాడు.

జనులు విశ్వాసాన్ని కలిగియుండాలని దేవుడు కోరుతున్నాడని ఆల్మా చెప్పాడు. అతడు దేవుని బోధనలను ఒక విత్తనంతో కూడా పోల్చాడు. జనులు తమ హృదయాలలో దేవుని బోధనలను నాటితే, ఆ విత్తనం ఎదుగుతుంది మరియు ఆ దేవుని బోధనలు సత్యమని వారు తెలుసుకుంటారు. వారి విశ్వాసాన్ని సాధన చేయడం ప్రారంభించడానికి విశ్వసించడానికి వారు ఒక కోరిక కలిగియుండుట మాత్రమే అవసరమని అతడు చెప్పాడు.

ఆల్మా 32:12–43

అమ్యులెక్ మాట్లాడతాడు, మరియు అతని ప్రక్కన యేసు క్రీస్తు జనులకు బోధిస్తున్న చిత్రము ఉన్నది

తరువాత అమ్యులెక్ ఆయన పిల్లల కోసం దేవుని ప్రణాళిక గురించి జనులకు బోధించాడు. యేసు ద్వారా వారందరి పాపములు క్షమించబడగలవని అతడు వారితో చెప్పాడు. దేవునికి ప్రార్థించమని, దేవుడు వారికి సహాయపడి, వారిని కాపాడతాడని కూడ అతడు వారికి బోధించాడు.

ఆల్మా 34

కావలివారు అనేకమంది జోరమీయులు నగరం విడిచి వెళ్ళడాన్ని గమనించారు.

జోరమీయులలో పేదవారైన అనేకమంది ఆల్మా, అమ్యులెక్ బోధించిన దానిని నమ్మారు. కానీ జోరమీయుల నాయకులు కోపగించారు. వారు విశ్వాసులందరిని పట్టణము నుండి బలవంతంగా బయటకు పంపేసారు.

ఆల్మా 35:1–6

ఆంటై-నీఫై-లీహైయులు పేద జోరమీయులను స్వాగతించారు.

విశ్వాసులు ఆంటై-నీఫై-లీహైయులతో నివసించడానికి వెళ్ళారు. ఆంటై-నీఫై-లీహైయులు వారికి ఆహారం, దుస్తులు, మరియు స్థలాన్ని ఇవ్వడం ద్వారా వారికి పరిచర్య చేసారు లేదా వారికి సేవ చేసారు.

ఆల్మా 35:9