Scripture Stories
మోషైయ మరియు జెనిఫ్


“మోషైయ మరియు జెనిఫ్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)

ఓంనై 1; మోషైయ 9

మోషైయ మరియు జెనిఫ్

ప్రభువు చేత కాపాడబడెను

చిత్రం
మోషైయ జనులను నడిపించుట

నీఫైయులకు, లేమనీయులకు అనేక యుద్ధాలు జరిగాయి. ఒకరోజు, ప్రభువును అనుసరించాలనుకునే వారితో నీఫై దేశమును విడిచి వెళ్ళమని మోషైయ అనే పేరుగల నీఫైయునితో ప్రభువు చెప్పారు.

ఓంనై 1:10, 12

చిత్రం
నగరం వైపు చూస్తున్న మోషైయ

అనేమంది నీఫైయులు ప్రభువుకు విధేయులయ్యారు మరియు మోషైయాతో వెళ్ళారు. ప్రభువు వారిని ఒక దేశానికి నడిపించారు దానిలో జనులు నివసిస్తున్నారు వారు జరహేమ్ల యొక్క జనులని పిలవబడ్డారు.

ఓంనై 1:13–14

చిత్రం
జనులతో మాట్లాడుతున్న మోషైయ

జరహేమ్ల యొక్క జనులు కూడా చాలాకాలం క్రితం యెరూషలేము నుండి వచ్చారు. ప్రభువు కంచు పలకలతో నీఫైయులను పంపినందుకు వారు సంతోషించారు. జరహేమ్ల జనులతో మోషైయ జనులు చేరారు. మోషైయను వారి రాజుగా జనులందరు ఎంపిక చేసారు. అతడు వారికి ప్రభువు గురించి బోధించాడు.

ఓంనై 1:14–19

చిత్రం
జెనిఫ్ జనులను నడిపించుట

ఒక పెద్ద గుంపు నీఫై దేశానికి తిరిగి వెళ్ళినప్పుడు నీఫైయులు కొంతకాలంగా జరహేమ్లలో నివసిస్తున్నారు వారు జెనిఫ్ అని పేరుగల నీఫైయుని చేత నడిపించబడ్డారు.

ఓంనై 1:27–29; మోషయ 9:3–5.

చిత్రం
మాట్లాడుతున్న లేమనీయ రాజు

ఇప్పుడు లేమనీయులు నీఫై దేశములో నివసించారు, కనుక తన జనులు కూడ అక్కడ నివసించవచ్చా అని వారి రాజును జెనిఫ్ అడిగాడు. రాజు అంగీకరించాడు.

మోషైయ 9:6–10

చిత్రం
ముట్టడి చేస్తున్న లేమనీయులు

రాజు జెనిఫ్ మరియు అతని జనులను మోసగించాడు. అతడు వారిని నీఫై దేశములో నివసించనిచ్చాడు ఆవిధంగా అతడు తరువాత వారి ఆహారము మరియు జంతువులలో కొన్నిటిని తీసుకోవచ్చు. జెనిఫ్ ప్రజలు సంవత్సరాలు తరబడి అక్కడ ప్రశాంతంగా జీవించారు. వారు ఎక్కువ ఆహారాన్ని పండించారు మరియు అనేక జంతువులను కలిగియున్నారు. అప్పుడు, లేమనీయులు దాడిచేసి వారి ఆహారము మరియు జంతువులను తీసుకోవడానికి ప్రయత్నించారు.

మోషైయ 9:10–14

చిత్రం
జెనిఫ్ యొక్క జనులు పోరాటంలో విజయం సాధించారు.

ప్రభువును నమ్మమని జెనిఫ్ తన జనులకు బోధించాడు. లేమనీయులు వారితో పోరాడటానికి వచ్చినప్పుడు, జెనిఫ్ మరియు అతని జనులు ప్రభువుకు ప్రార్థించారు. ప్రభువు వారికి బలమును ఇచ్చి, వారిని కాపాడటానికి సహాయపడ్డాడు. వారు లేమనీయులను తరిమి కొట్టగలిగారు. ప్రభువు జెనిఫ్‌ను అతని జనులను వారి విశ్వాసమును బట్టి దీవించారు.

మోషైయ 9:15–18

ముద్రించు