“లేమనీయులందరి యొక్క రాజు,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
“లేమనీయులందరి యొక్క రాజు,” మోర్మన్ గ్రంథ కథలు
లేమనీయులందరి యొక్క రాజు
ప్రభువు గురించి నేర్చుకోవాలని కోరుట
లేమనీయులకు ఒక రాజు ఉన్నాడు అతడు వారి ఇతర రాజులందరినీ పరిపాలించాడు. అతడు రాజైన లమోనై తండ్రి. నీఫైయులు శత్రువులని అతడు అనుకున్నాడు. ఒకరోజు, అతడు అమ్మోన్‌తో లమోనైను చూసాడు. అతడు ఒక నీఫైయునితో ఏమి చేస్తున్నాడని రాజు లమోనైను అడిగాడు. వారు అమ్మోన్ సోదరులను చెరసాల నుండి విడిపించడానికి వెళుతున్నామని లమోనై రాజుతో చెప్పాడు.
రాజుకు కోపం వచ్చింది. లేమనీయుల నుండి దొంగిలించడానికి నీఫైయులు ప్రయత్నిస్తున్నారని అతడు అనుకున్నాడు. అమ్మోన్‌ను చంపి, తనతో రమ్మని అతడు లమోనైతో చెప్పాడు.
లమోనై అమ్మోన్‌ను చంపడు. అమ్మోన్ మరియు అతని సోదరులు దేవుని ప్రవక్తలని అతడు రాజుతో చెప్పాడు. తాను అమ్మోన్ సోదరులకు సహాయపడతానని అతడు చెప్పాడు.
రాజు లమోనైను గాయపరచడానికి తన కత్తిని తీసాడు, కానీ అమ్మోన్ అతడిని ఆపాడు. బదులుగా రాజు అమ్మోన్‌పై దాడి చేసాడు. అమ్మోన్ తనను తాను కాపాడుకున్నాడు. అతడు రాజు చేతిని గాయపరిచాడు, ఆవిధంగా రాజు దాడి చేయలేడు. అమ్మోన్ చాలా బలంగా ఉండటం చూసి రాజు భయపడ్డాడు. అమ్మోన్ తనను బ్రతకనిస్తే తన రాజ్యములో సగం అమ్మోన్‌కు ఇస్తానని అతడు మాట ఇచ్చాడు.
అమ్మోన్ రాజ్యమును ఇష్టపడలేదు. బదులుగా, తన సోదరులను చెర నుండి విడిపించి స్వేచ్ఛగా చేయమని అతడు అడిగాడు. లమోనైతో కోపంగా ఉండవద్దని కూడ అతడు రాజును అడిగాడు. లమోనైకు చాలా మంచిదని అనుకున్న విధంగా పరిపాలించనిమ్మని అమ్మోన్ రాజును అడిగాడు.
లమోనైను అమ్మోన్ ఎంతగా ప్రేమించాడో రాజు ఆశ్చర్యపడ్డాడు. అమ్మోన్ అడిగినదంతా చేయడానికి అతడు అంగీకరించాడు.
అమ్మోన్ మరియు లమోనై దేవుని గురించి తనతో చెప్పిన దానిగురించి ఎక్కువగా నేర్చుకోవాలని రాజు కోరాడు. అమ్మోన్ మరియు అతని సోదరులు వచ్చి అతనికి బోధించాలని అతడు అడిగాడు.
అమ్మోన్ మరియు లమోనైలు మిద్దొనై దేశమునకు వెళతారు. అక్కడ అమ్మోన్ సోదరులు చెరసాలలో ఉన్నారు. వారు తాళ్ళతో కట్టబడ్డారు మరియు ఆహారము లేదా నీళ్ళు ఇవ్వబడలేదు. అమ్మోన్ సోదరులను విడిపించడానికి మిద్దొనై పాలకుని లమోనై ఒప్పించాడు.
వారు విడిపించబడిన తరువాత, అమ్మోన్ సోదరులు లమోనై తండ్రి వద్దకు వెళ్ళారు. వారు రాజుకు నమస్కరించి అతని సేవకులుగా ఉండనిమ్మని అడిగారు. రాజు వద్దని చెప్పాడు. బదులుగా, సువార్త గురించి తనకు బోధించమని అతడు వారిని కోరాడు. సోదరులలో ఒకరి పేరు అహరోను. అతడు రాజుకు లేఖనాలను చదివాడు మరియు దేవుడు, యేసు క్రీస్తు గురించి అతనికి బోధించాడు.
రాజు అహరోనును నమ్మాడు. అతడు దేవుని గురించి తెలుసుకోవడానికి తన రాజ్యమంతా ఇచ్చివేస్తానని అతడు చెప్పాడు. తానేమి చేయాలని అతడు అహరోనును అడిగాడు. పశ్చాత్తాపపడమని, విశ్వాసముతో దేవునికి ప్రార్థించమని అహరోను రాజుతో చెప్పాడు. రాజు తన పాపములు అన్నిటిని బట్టి పశ్చాత్తాపపడ్డాడు మరియు ప్రార్థించాడు.
రాజు నేల మీద పడిపోయాడు. రాజు సేవకులు చెప్పడానికి రాణి వద్దకు వెళ్ళారు.
రాణి వచ్చి నేలమీద ఉన్న రాజును చూసింది. అహరోను, అతని సోదరులు రాజును చంపేసారని ఆమె అనుకున్నది. రాణికి కోపం వచ్చింది.
అహరోను, అతని సోదరులను చంపమని రాణి సేవకులతో చెప్పింది. కాని సేవకులు భయపడ్డారు. అహరోను, అతని సోదరులు చాలా బలమైనవారని వారు చెప్పారు. ఇప్పుడు రాణి భయపడింది. పట్టణంలో జరిగిన దానిని జనులకు చెప్పడానికి ఆమె సేవకులను పంపింది. అహరోను, అతని సోదరులను జనులు చంపుతారని ఆమె ఆశించింది.
జనులు కోపంగా ఉంటారని అహరోనుకు తెలుసు. రాజు చనిపోలేదని కూడ అతనికి తెలుసు. రాజు నిలబడటానికి అతడు సహాయపడ్డాడు. రాజు తన బలమును తిరిగి పొంది నిలబడ్డాడు. రాణి, సేవకులు ఆశ్చర్యపడ్డారు.
రాణి, సేవకులకు యేసు గురించి రాజు బోధించాడు. వారందరు యేసునందు నమ్మకముంచారు. తన జనులందరు యేసు గురించి నేర్చుకోవాలని రాజు కోరాడు అహరోను మరియు అతని సోదరులు తన రాజ్యంలో ఎక్కడైనా సువార్త బోధించవచ్చని అతను ఒక చట్టాన్ని చేసాడు. వారు జనులకు బోధించారు మరియు దేశములో యాజకులను, బోధకులను పిలిచారు.