“యేసు క్రీస్తు జనులను సందర్శించును,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
యేసు క్రీస్తు ప్రజలను సందర్శించును
ఆయనను విశ్వసించడానికి ప్రతి వ్యక్తికి సహాయపడుట
అనేకమంది జనులు దేవుని ప్రవక్తలను వినలేదు. కాని, కొందరు జనులు ప్రవక్తలు బోధించిన దానిని నమ్మారు. యేసు క్రీస్తు మరణము యొక్క సూచనల కొరకు ఈ విశ్వాసులు ఎదురుచూసారు.
యెరూషలేములో యేసు మరణించిన తరువాత, సూచనలు ప్రారంభమవుతాయి. అమెరికాలో, మూడు గంటల సేపు తుఫానులు, భూకంపాలు, మరియు మంటలు వచ్చాయి. పట్టణాలు నాశనం చేయబడినవి, మరియు అనేకమంది జనులు చనిపోయారు. తరువాత మూడు రోజులుపాటు చీకటి నెలకొన్నది.
జనులు సూర్యుడు, చంద్రుడు, లేదా నక్షత్రాలను చూడలేనంత దట్టమైన చీకటి ఉన్నది. వారు మంటలను లేదా కొవ్వొత్తులను వెలిగించలేకపోయారు.
ఇంకా బ్రతికియున్న అనేకమంది జనులు చాలా విచారంగా, భయంగా ఉన్నారు. వారు దుఃఖించారు మరియు వారు త్వరగా పశ్చాత్తాపపడనందుకు విచారించారు.
హఠాత్తుగా, వారు ఒక స్వరము విన్నారు. వారితో మాట్లాడుతున్నది యేసు. ఆయన పశ్చాత్తాపపడిన వారందరిని బాగు చేస్తానని వాగ్దానమిచ్చారు. యేసు తాను చనిపోయానని, జనులందరికి సహాయపడటానికి మరలా బ్రతికి వచ్చానని వారితో చెప్పారు. జనులు ఎంతగానో ఆశ్చర్యపడి, ఏడ్వడటం ఆపేసారు. దేశంలో అనేక గంటలు నిశ్శబ్దమున్నది.
యేసు మరలా మాట్లాడారు. వారు ఆయనను అనుసరించడానికి ఎంపిక చేస్తే తాను వారికి సహాయపడతానని ఆయన జనులకు చెప్పారు. చీకటి విడిచిపోయింది, భూమి కంపించడం ఆగిపోయింది. జనులు సంతోషంగా ఉన్నారు మరియు యేసును స్తుతించారు.
ఒక సంవత్సరం తరువాత, అనేకమంది జనులు సమృద్ధి దేశములో దేవాలయం వద్దకు వస్తారు. వారు యేసును గురించి, ఆయన మరణము యొక్క సూచనల గురించి మాట్లాడారు. వారు మాట్లాడినప్పుడు, వారు పరలోకం నుండి ఒక మెల్లని స్వరాన్ని విన్నారు. మొదట, వారు దానిని గ్రహించలేదు. తరువాత వారు దానిని మరలా విన్నారు.
వారు మూడవసారి ఆ స్వరాన్ని విన్నప్పుడు, వారు పరలోకం వైపు చూసారు. మాట్లాడుతున్నది పరలోక తండ్రి. తన కుమారుడిని చూచి ఆలకించమని ఆయన జనులకు చెప్పారు. తరువాత తెల్లని వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తి పరలోకము నుండి దిగి రావడం జనులు చూసారు.
ఆ వ్యక్తి జనుల మధ్య నిలబడి “నేను యేసు క్రీస్తును,” అని చెప్పారు. జనులు నేలమీద పడ్డారు. ఆయన ప్రతిఒక్కరి కోసం బాధపడి, చనిపోయానని యేసు వారితో చెప్పారు. ఆయన తన చేతులు, పాదములు, ప్రక్కన గుర్తులను తాకమని జనులను అడిగారు, మరియు ఆవిధంగా వారు ఆయన లోక రక్షకుడని తెలుసుకుంటారు.
జనులు యేసు వద్దకు ఒకరి తరువాత ఒకరు వచ్చారు. వారు తమ స్వంత కన్నులతో చూసారు, ఆయన చేతులు, కాళ్ళు మరియు ప్రక్కలో గుర్తులను తాకి చూసారు. వస్తారని ప్రవక్తలు చెప్పినది ఆయన గురించేనని వారందరికి తెలుసు. ఆయన లోక రక్షకుడని వారికి తెలుసు. జనులు యేసు పాదాలపై పడి ఆయనను ఆరాధించారు.