“ఈనస్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
“ఈనస్,” మోర్మన్ గ్రంథ కథలు
ఈనస్
ప్రభువుకు బలమైన ప్రార్థన
జేకబ్ పలకలను తను కొడుకు ఈనస్‌కు ఇచ్చాడు. జేకబ్ చేసినట్లుగా ఈనస్ వాటిపైన వ్రాసాడు. ఒకరోజు, ఈనస్ వేటాడటానికి అడవిగి వెళ్లాడు. ప్రభువు గురించి తన తండ్రి బోధించిన దానిని అతడు గుర్తు చేసుకున్నాడు. ప్రభువును అనుసరించుట అతడికి సంతోషాన్ని తెస్తుందని జేకబ్ ఈనస్‌కు బోధించాడు.
తన తండ్రి మాట్లాడిన సంతోషాన్ని అనుభవించాలని ఈనస్ ప్రార్థించాడు. ప్రభువుకు ప్రార్థించాలని అతడు నిర్ణయించుకున్నాడు. అతడు దినమంతా, రాత్రి వరకు ప్రార్ధన చేసాడు.
అతని పాపములు క్షమించబడినవని ఈనస్‌తో ప్రభువు చెప్పారు. ఈనస్ చాలా సంతోషించాడు. యేసు క్రీస్తునందు తనకున్న విశ్వాసము వలన ఈనస్ దీవించబడ్డాడు.
ఈ సంతోషాన్ని నీఫైయులు కూడా అనుభవించాలని ఈనస్ కోరాడు. ఈనస్ ప్రార్థించుట కొనసాగించాడు. నీఫైయులు అదే సంతోషాన్ని అనుభవించాలని అతడు ప్రభువును అడిగాడు.
ఆయన ఆజ్ఞలు వారు పాటిస్తే నీఫైయులతో తాను ఉంటానని ప్రభువు ఈనస్‌తో చెప్పారు. ఈనస్ దీనిని విన్నప్పుడు, ప్రభువునందు అతడి విశ్వాసము ఇంకా బలమైనదిగా మారింది.
ఈనస్ మరలా ప్రార్థించాడు. లేమనీయులను దీవించమని, పలకలపై వ్రాయబడినవి భద్రంగా కాపాడమని అతడు ప్రభువును అడిగాడు. లేమనీయులు పలకలను చదివి, ప్రభువునందు విశ్వసించాలని అతడు కోరుకున్నాడు. ఒకరోజు లేమనీయులు వ్రాయబడిన దానిని చదువుతారని ప్రభువు ఈనస్‌కు వాగ్దానమిచ్చారు.