“సోదరులు నీఫై మరియు లీహై,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
సోదరులు నీఫై మరియు లీహై
పరలోకము నుండి ఒక స్వరం వినడం
నీఫై మరియు లీహైలు సోదరులు, వారు యేసు క్రీస్తు సువార్త గురించి అందరూ తెలుసుకోవాలని కోరుకున్నారు. నీఫైయులు మరియు లేమనీయులు యుద్ధంలో ఉన్నారు, అయితే సోదరులు అప్పటికి కూడా రెండు వర్గాల ప్రజలకు బోధించారు. ఒకరోజు వారు ప్రజలకు బోధించడానికి ప్రయాణిస్తుండగా, లేమనీయుల సైన్యం వారిని చెరసాలలో వేసింది.
హీలమన్ 3:20–21, 37; 4:4–5, 14; 5:4–21
చాలా రోజుల తర్వాత, నీఫై మరియు లీహైలను చంపడానికి సైన్యం చెరసాలకు వచ్చింది.
నీఫై మరియు లీహైలను ఎవరైనా గాయపరచకముందే, వారి చుట్టూ అగ్ని వలయం కనిపించింది. అగ్ని వారిని కాల్చలేదు. బదులుగా, దేవుడు వారిని సురక్షితంగా ఉంచారు. అప్పుడు భూమి కంపించింది. చెరసాల గోడలు కూలిపోతున్నట్లు అనిపించింది. కాసేపటికే, ఒక చీకటి మేఘం చెరసాలలో ఉన్న అందరినీ కప్పివేసింది. జనం చాలా భయపడ్డారు.
చీకటి మేఘం నుండి ఒక స్వరం వినిపించింది. అది గుసగుసలాడినట్లు నిశ్శబ్దంగా ఉంది, కానీ ప్రజలు దానిని తమ హృదయాలలో భావించారు. అది దేవుని యొక్క స్వరం. దేవుడు వారిని పశ్చాత్తాపపడమని చెప్పారు.
నేల, చెరసాల మరింత కంపించాయి. స్వరం మళ్లీ వచ్చి ప్రజలను పశ్చాత్తాపపడమని చెప్పింది. మేఘం మరియు వారి భయం కారణంగా ప్రజలు కదలలేరు.
గుంపులో ఉన్న ఒక వ్యక్తి పేరు అమినాదాబ్. అతడు ఒకప్పుడు దేవుని సంఘమునకు చెందినవాడు. నీఫై మరియు లీహైల ముఖాలు ప్రకాశవంతంగా ప్రకాశించడాన్ని అతడు చూశాడు. వారు దేవదూతల వలె కనిపించారు. వారు పరలోకములో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అమినాదాబ్ నీఫై మరియు లీహైల వైపు చూడమని అందరికీ చెప్పాడు.
చీకటి మేఘాన్ని వదిలించుకోవడానికి వారేమి చేయగలరని ప్రజలు అమినాదాబ్ను అడిగారు. దేవుడు మరియు యేసు గురించి తనకు తెలిసిన వాటిని అమినాదాబ్ పంచుకున్నాడు. పశ్చాత్తాపపడాలని, యేసుపై విశ్వాసం కలిగియుండాలని, దేవునికి ప్రార్థించమని ప్రజలకు చెప్పాడు. ప్రజలు అమినాదాబ్ మాట విన్నారు. చీకటి తొలగిపోయే వరకు వారు ప్రార్థించారు.
దేవుని నుండి వచ్చిన అగ్ని ప్రజలందరినీ చుట్టుముట్టింది మరియు వారిని కాల్చలేదు. ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడి చాలా సంతోషంగా ఉన్నారు. వారు అద్భుతమైన విషయాలు చెప్పారు. స్వరం మళ్లీ వచ్చింది. యేసుపై వారికి ఉన్న విశ్వాసం వల్ల శాంతిని కలిగి ఉండమని ఆ స్వరం వారికి చెప్పింది. దేవదూతలు వచ్చి ప్రజలను సందర్శించారు.
నీఫై, లీహై మరియు ప్రజలందరూ చెరసాలలో నుండి వెళ్లిపోయారు. వారు ఆ రోజు తాము చూసిన మరియు విన్న వాటిని దేశంలోని చాలా మందికి చెప్పారు. చాలా మంది లేమనీయులు యేసును విశ్వసించారు మరియు అయనను అనుసరించడానికి ఎంచుకున్నారు. వారు యుద్ధంలో పోరాడటం మానేశారు. బదులుగా, వారు యేసుపై విశ్వాసం కలిగియుండి పశ్చాత్తాపపడేందుకు ప్రజలకు సహాయం చేశారు.