“ఏబిష్,” మోర్మన్ గ్రంథ కథలు (2023)
ఏబిష్
ఆమె ప్రజలకు యేసును విశ్వసించడంలో సహాయం చేసేది
లేమనీయురాలైన ఏబిష్ ఒక రాణి దగ్గర పనిచేసేది. ఏబిష్ తన తండ్రి దర్శనం నుండి యేసు క్రీస్తు గురించి తెలుసుకుంది. చాలా సంవత్సరాలు నుండి, ఆమె యేసును విశ్వసించింది మరియు ఆయనను అనుసరించాలని కోరుకుంది. కానీ ఆమె ఇంకా ఇతర లేమనీయులకు చెప్పలేదు.
ఒకరోజు, అమ్మోన్ అనే నీఫైయుడు లేమనీయులకు యేసు మరియు దేవుని గురించి బోధించడానికి రాజ్యానికి వచ్చాడు. అమ్మోన్ బోధించిన దానిని రాణి మరియు రాజు విశ్వసించారు. యేసు భూమిపైకి వస్తారని మరియు ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ క్షమించబడతారని రాణి మరియు రాజు తెలుసుకున్నారు.
ఆల్మా 17:12–13; 18:33–36, 39–40; 19:9, 13
రాణి మరియు రాజు పరిశుద్ధాత్మను అనుభూతిచెందారు మరియు వారు నేలపై పడిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మోన్ మరియు సేవకులు కూడా పడిపోయారు. ఏబిష్ ఒకతే నిలబడి ఉంది.
ఏబిష్ ఈ అద్భుతం గురించి ప్రజలకు చెప్పాలనుకుంది. ఏమి జరిగిందో చూస్తే ప్రజలు దేవుని శక్తిని నమ్ముతారని ఆమె ఆశించింది. దాంతో ఏబిష్ ఇంటింటికీ పరుగుతీసింది. రాణి మరియు రాజు కోసం దేవుడు ఏమి చేసాడో చూడమని ఆమె ప్రజలకు చెప్పింది.
రాణి మరియు రాజు ఇంటికి చాలా మంది ప్రజలు వచ్చారు. రాణి, రాజు మరియు వారి సేవకులందరూ చనిపోయినట్లు కనిపించినందున వారు ఆశ్చర్యపోయారు.
జనులు అయోమయంలో పడ్డారు. రాణి మరియు రాజుకు ఏమి జరిగిందనే దాని గురించి వారు వాదించారు.
ఏబిష్ తిరిగి వచ్చినప్పుడు, ఆమె ప్రజలు వాదించుకోవడం చూసింది. వారు దేవుని శక్తిని చూడనందుకు ఆమె బాధపడింది. అప్పుడు ఆమె రాణి చేతిని పట్టుకుంది, మరియు రాణి లేచి నిలబడి యేసును స్తుతించింది.
రాణి తన భర్త చేతిని తన చేతితో పట్టుకుంది, మరియు అతడు లేచి నిలబడ్డాడు. రాజు యేసు గురించి ప్రజలకు చెప్పాడు. తరువాత అమ్మోన్, ఇతర సేవకులు లేచి నిలబడ్డారు. యేసు వారిని మార్చారని వాళ్లందరూ ప్రజలకు చెప్పారు. వారు ఇప్పుడు మంచి పనులు మాత్రమే చేయాలని కోరుకున్నారు. చాలా మంది వారిని నమ్మారు.
ఏబిష్ ఆశించినట్లుగానే, ప్రజలు దేవుని శక్తిని చూశారు. చాలా మంది ప్రజలు యేసును నమ్మి బాప్తిస్మము తీసుకున్నారు. వాపు దేవుని ఆత్మను తమతో కలిగియున్నారు. వారు తమ దేశంలో సంఘాన్ని కూడా స్థాపించారు. పశ్చాత్తాపపడి ఆయనను విశ్వసించే ఎవరికైనా యేసు సహాయం చేస్తారని వారు చూశారు.